Eicher
-
కొత్త వాహనాలపై రాయితీ.. ఇలా చేయండి
కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ఇటీవల దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థల సీఈఓలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్క్రాపేజ్ పాలసీ కింద డిస్కౌంట్స్ అందించాలని ఈ సమావేశంలో పేర్కొన్నారు. దీనిని 'ఐషర్' కంపెనీ ఎట్టకేలకు అమలుపరుస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పుడు ఎవరైన మినీ ట్రక్కు, బస్సులను కొనుగోలు చేయాలనుకుంటే డిస్కౌంట్ పొందవచ్చు. ఎలా అంటే.. మీ దగ్గరున్న పాత వాహనాలను స్క్రాపేజ్ (తుక్కు) కింద మార్చి, దానికి సంబంధించిన సెర్టిఫికేట్ పొందాలి. ఆ తరువాత సర్టిఫికేట్‌ను కొత్త వాహనం కొనే సమయంలో కంపెనీలో (ఐషర్ కంపెనీ) చూపిస్తే.. 1.25 శాతం నుంచి 3 శాతం వరకు కొత్త వెహికల్ కొనుగోలుపైన రాయితీ పొందవచ్చు.స్క్రాపేజ్ పాలసీ కింద పొందే రాయితీలను.. 2024 సెప్టెంబర్ 1 నుంచి చెల్లుబాటు అవుతుంది. ఇది వచ్చే రెండేళ్ళు లేదా తరువాత నోటీస్ వచ్చేవరకు అమలులో ఉంటుందని ఐషర్ కంపెనీ పేర్కొంది.వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, రోడ్డుపై పాతవాహనాల సంఖ్యను తగ్గించడానికి ఇది ఒక పరివర్తనాత్మక దశ అని వీఈ కమర్షియల్ వెహికల్స్ ఎండీ అండ్ సీఈఓ 'వినోద్ అగర్వాల్' పేర్కొన్నారు. కంపెనీ కూడా కస్టమర్లకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. -
వోల్వో-ఐషర్ కొత్త ఇంటర్ సిటీ బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ కొత్త శ్రేణిని ప్రవేశపెట్టింది. తదుపరితరం ఇంటర్సిటీ బస్‌లను శుక్రవారమిక్కడ ప్రదర్శించింది. వీటిలో వోల్వో నుంచి 15, 13.5 మీటర్ల కోచ్‌లు, ఐషర్ నుంచి 13.5 మీటర్ల కోచ్ ఉన్నాయి. బస్ మార్కెట్ తిరిగి పుంజుకుందని, త్వరలోనే కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంటుందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ ఎండీ, సీఈవో వినోద్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. సుదూర ప్రయాణాల విషయంలో ఈ వాహనాలు పరిశ్రమలో నూతన ప్రమాణాలను సృష్టిస్తాయని అన్నారు. -
పెన్నా నదిలో 25 మంది కూలీలు.. గంటపాటు శ్రమించి..
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నానదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. వరద ఉధృతికి కాజ్‌వేపై ఐచర్ వాహనం చిక్కుకు పోయింది. పెద్దపప్పూరు మండలం జోడిధర్మాపురం దగ్గర ఈ ఘటన జరిగింది. నదిలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. అయితే రెస్య్కూ సిబ్బంది అక్కడకు చేరుకుని కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెంచలపాడు నుంచి జూటూరు గ్రామానికి వెళ్తుండగా ఐచర్ వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో వరద ఉధృతి పెరగడంతో 25 మంది కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తనే గ్రామస్థులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు గంటపాటు శ్రమించి జేసీబీ, ఇటాచీల సాయంతో కూలీలను సురక్షితంగా బయటకు చేర్చారు. -
బీఎన్‌రెడ్డి నగర్లో ప్రమాదం..ఇద్దరి మృతి
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చర్లపల్లి బీఎన్‌రెడ్డి నగర్లో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నెహ్రూనగర్‌కు చెందిన చెరుకు రవి(50), రవళి(20)గా గుర్తించారు. మృతులిద్దరూ తండ్రీకూతుళ్లు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నిద్రమత్తుకు నిండు ప్రాణం బలి
– మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొన్న ఐషర్ –అక్కడికక్కడే అతను మృతి డోన్: డ్రై వర్ నిద్రమత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బుధవారం గుత్తి–కర్నూలు హైవేలో డోన్‌పట్టణంలోని కంబాలపాడు క్రాస్ వద్ద మార్నింగ్‌వాకింగ్ చేస్తున్న సీనియర్ ఎల్ఐసీ ఏజెంట్ రామచంద్రారెడ్డి (54)ని సీజీ–07, ఏఎక్స్ 5575 నెంబర్‌గల ఐషర్ వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి వచ్చి ఢీ కొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, లారీ ముందుకు దూసుకెళ్లి గుంతలో పడింది. మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చిన పలువురు ఈ ఘటనను చూసి భీతిల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి రామచంద్రారెడ్డిదిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న స్నేహితులు, ఎల్ఐసీ ఏజెంట్లు, బంధువులు డోన్ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కన్నీటి పర్యంతం ఎల్ఐసీ ఏజెంటుగా రామచంద్రారెడ్డి పట్టణంలో పలువురు ప్రముఖులతో పాటు ప్రజల్లో కూడా మంచి గుర్తింపు వుంది. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం తో వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హుటాహుటిన డోన్ చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. బాధితులను ఓదార్చేక్రమంలో ఆయన కూడా కన్నీటి పర్యంతమై తన ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోట్లసుజాతమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి ప్రగాఢసంతాపాన్ని తెలిపారు. హైవేపై భయంభయం..: జాతీయ రహదారిపై నడకను సాగించాలంటే పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో అండర్‌పాస్‌లు లేకపోవడం, సెంట్రల్ లైటింగ్‌తో పాటు హెచ్చరికలు లేకపోవడంతో రహదారిపై నడవాలంటేనే పలువురు హడలెత్తిపోతున్నారు. -
మలుపు మింగేసింది
– నన్నూరు సమీపంలో రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, నలుగురికి గాయాలు ఓర్వకల్లు : కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై నన్నూరు సమీపంలోని రబ్బాని గోడౌన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. కాల్వ గ్రామానికి చెందిన గోవిందరాజులు(40) హుసేనాపురానికి చెందిన రాముడు కారులో కర్నూలుకు బయలుదేరారు. మార్గమధ్యలో రబ్బాని గోడౌన్ వద్దకు చేరుకోగానే కర్నూలు వైపు నుంచి రబ్బాని గోడౌన్‌కు ధాన్యం బస్తాలు తరలిస్తున్న ‘ఐచర్’ వాహనం మలుపు తిరిగే క్రమంలో కారును బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న గోవిందరాజులు అక్కడికక్కడే మతిచెందాడు. రాముడు స్వల్పంగా గాయపడ్డాడు. అదే సమయంలో కారు వెనుక వేగంతో వస్తున్న బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న లొద్దిపల్లె గ్రామానికి చెందిన విజయ్, నాగలక్ష్మి, రామలింగమ్మ గాయపడ్డారు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందరాజులు మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మతునికి భార్య అనుపమ, ముగ్గురు కుమార్తెలున్నారు. -
ఐషర్ 5 టన్నులలోపు వాహనాలు వస్తున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన దిగ్గజాలు వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్‌ల అనుబంధ కంపెనీ వీఈ కమర్షియల్ వెహికిల్స్(వీఈసీవీ) సరికొత్త సంచలనాలకు రెడీ అవుతోంది. ఐషర్ బ్రాండ్‌లో తేలికపాటి రవాణా వాహనాలను పరిచయం చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం వీఈ కమర్షియల్ బస్‌లతోపాటు 5 నుంచి 49 టన్నుల సామర్థ్యం గల హాలేజ్, టిప్పర్, ఆర్టిక్యులేటెడ్ ట్రాక్టర్లను భారత్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తోంది. 5 టన్నుల లోపుండే తేలికపాటి వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తామని వీఈసీవీ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మాలర్ సోమవారం తెలిపారు. ఐషర్ ప్రో సిరీస్ ట్రక్‌లను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. మూడేళ్లలో కొత్త విభాగంలోకి.. 5-49 టన్నుల విభాగంలో ఐషర్ తన బ్రాండ్ హవా కొనసాగిస్తోందని శ్యామ్ మాలర్ చెప్పారు. అన్ని రకాల రవాణా వాహనాలను తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో 5 టన్నుల లోపు విభాగంలోని ప్రవేశించేందుకు కసరత్తు ప్రారంభించామని పేర్కొన్నారు. తేలికపాటి రవాణా వాహనాలకు(ఎల్సీవీ) భారత్‌లో విపరీత డిమాండ్ ఉందని తెలిపారు. వాహనాల అభివృద్ధి, ఉత్పత్తికి మూడేళ్ల సమయం పడుతుందని వివరించారు. పాతవాటి స్థానంలో.. ఐషర్ బ్రాండ్‌లో ఇప్పటి వరకు విక్రయిస్తున్న మోడళ్ల స్థానంలో ‘ప్రో’ పేరుతో కొత్తవాటిని పరిచయం చేస్తోంది. ఈ ఏడాది 40 వేరియంట్ల దాకా రానున్నాయి. ప్రస్తుతం ఐషర్ ప్రో 1000లో 5-14 టన్నుల్లో లైట్, మీడియం డ్యూటీ, ప్రో 3000 సిరీస్‌లో 9-14 టన్నుల సామర్థ్యం గల మీడియం డ్యూటీ వాహనాలను తయారు చేస్తున్నారు. ప్రో 6000లో 16-40 టన్నులు, ప్రో 8000లో 25-49 టన్నుల హెవీడ్యూటీ ట్రక్కులు కొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. స్కైలైన్ ప్రో బస్‌లు కూడా భారతీయ రోడ్లెక్కనున్నాయి. మెరుగైన పనితీరు కనబరిచేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్టు కంపెనీ తెలిపింది. మార్కెట్ వాటా 15 శాతం.. భారత వాణిజ్య రవాణా వాహనాల రంగం 27 నెలలుగా తిరోగమనంలో ఉందని శ్యామ్ మాలర్ తెలిపారు. ఎన్నికల తర్వాత మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాతోపాటు ఉత్తర కర్నాటక, ఒరిస్సాలో మైనింగ్ అనుమతులతో కొంతైనా మార్పు వస్తుందన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య, ఇండోనేషియా మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటామని వివరించారు. 2013లో అన్ని విభాగాల్లో కలిపి 44 వేల ఐషర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మార్కెట్ వాటా 13.8 శాతం ఉంది. 2014లో ఇది 15 శాతానికి చేరొచ్చని పేర్కొన్నారు. గతేడాది 2 వేల ఐషర్ వాహనాలను ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించామని తల్వార్ గ్రూప్ ఎండీ సునీల్ తల్వార్ తెలిపారు. అమ్మకాల పరంగా భారత్‌లో టాప్-1 డీలర్‌గా కొనసాగుతున్నామని అన్నారు.