సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నానదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. వరద ఉధృతికి కాజ్‌వేపై ఐచర్ వాహనం చిక్కుకు పోయింది. పెద్దపప్పూరు మండలం జోడిధర్మాపురం దగ్గర ఈ ఘటన జరిగింది. నదిలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. అయితే రెస్య్కూ సిబ్బంది అక్కడకు చేరుకుని కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెంచలపాడు నుంచి జూటూరు గ్రామానికి వెళ్తుండగా ఐచర్ వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో వరద ఉధృతి పెరగడంతో 25 మంది కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తనే గ్రామస్థులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు గంటపాటు శ్రమించి జేసీబీ, ఇటాచీల సాయంతో కూలీలను సురక్షితంగా బయటకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment