daily wagers
-
దేశంలో ప్రతి రోజు ఎంత మంది కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుసా?
ఢిల్లీ: రైతులు, రోజువారి కూలీల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) సంచలన విషయాలను బయటపెట్టింది. దేశంలో ప్రతి రోజు 154 మంది రైతులు, రోజువారి కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో కుటుంబ సమస్యలు, అనారోగ్యం వల్లే అత్యధికంగా మరణిస్తున్నారని వెల్లడించింది. 2021లో ఈ సంఖ్య 144గా ఉంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో పనిచేసేవారు 6.6 శాతం కాగా.. రోజువారి కూలీలు 26.4 శాతం మేర ఉన్నారు. అంటే 2022 ఏడాదికి మొత్తం 1,70,924 మంది ఆత్మహత్య చేసుకోగా.. అందులో రోజువారి కూలీలే 44,713 మంది ఉన్నారు. ఇందులో మగవారి సంఖ్య 41,433 కాగా స్త్రీల సంఖ్య 3,752గా ఉంది. 2021లో ఆత్మహత్య చేసుకున్న రోజువారి కూలీలు 25.6 శాతంగా ఉన్నారు. 2022 నివేదిక ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న స్వయం ఉపాధి, వృత్తి నిపుణులు 9.6 శాతంగా ఉన్నారు. ఇందులో 14,395 మంది ఉద్యోగులు కాగా , 18,357 మంది స్వయం ఉపాధి వ్యక్తులు బాధితులుగా నమోదయ్యారు. 2022 ఏడాదికి మొత్తం ఆత్మహత్యల్లో నిరుద్యోగులు 9.2 శాతంగా ఉన్నారు. ఇందులో 12000 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2022 సంవత్సరానికి దేశంలో మొత్తం 1,70,924 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1,64,033గా ఉంది. 2021తో పోల్చితే 2022లో దాదాపు 4% మేరకు ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు(7,8776) మహారాష్ట్ర(6,275), మధ్యప్రదేశ్(5,371) తెలంగాణ(4,513) ముందు వరుసలో నిలిచాయి. ఇదీ చదవండి: National Crime Records Bureau: అయినా భర్త మారలేదు -
నాపరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ముగ్గురు కూలీలు దుర్మరణం
సాక్షి,పల్నాడు: జిల్లాలోని నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద ఘోర ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాళ్లతో మాచర్ల నుంచి భీమవరం వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నాపరాళ్ళు మీద పడి లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. వీరిని మాచర్ల పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్ గా గుర్తించారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: బైక్‌ను తాకాడని దళిత విద్యార్థి గొంతు పిసికిన టీచర్ -
పెన్నా నదిలో 25 మంది కూలీలు.. గంటపాటు శ్రమించి..
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నానదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. వరద ఉధృతికి కాజ్‌వేపై ఐచర్ వాహనం చిక్కుకు పోయింది. పెద్దపప్పూరు మండలం జోడిధర్మాపురం దగ్గర ఈ ఘటన జరిగింది. నదిలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. అయితే రెస్య్కూ సిబ్బంది అక్కడకు చేరుకుని కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెంచలపాడు నుంచి జూటూరు గ్రామానికి వెళ్తుండగా ఐచర్ వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో వరద ఉధృతి పెరగడంతో 25 మంది కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తనే గ్రామస్థులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు గంటపాటు శ్రమించి జేసీబీ, ఇటాచీల సాయంతో కూలీలను సురక్షితంగా బయటకు చేర్చారు. -
నిర్మానుష్యంగా స్టూడియోలు,ఆర్టిస్టుల ఆఫీస్‌లు
-
కార్మికుల కడుపుకొడుతున్న కరోనా
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి వాణిజ్య రాజధానిగా ప్రసిద్ధి చెందిన ముంబై నగరం కరోనా ప్రభావంతో పూర్తిగా బోసిపోయింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వలస కార్మికులకు అక్షయ పాత్రగా ఆదుకున్న నగరం ఇప్పుడు వారి పొట్టలను కొట్టి నగరం నుంచి తరిమేస్తోంది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో ముంబై సబర్బన్‌లోని బాండ్ర టెర్మినస్ వలస కార్మికులతో కిక్కిర్సి పోయింది. తిరుగు ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందరి ముఖాలకు మాస్క్‌లు కనిపిస్తున్నాయి. కొందరు నిర్మాణ పనుల్లో ధరించే ధూళి నిరోధక మాస్క్‌లు ధరించగా, మరికొందరు క్లినికల్ మాస్క్‌లు, ఇంకొందరు రంగు రంగుల కర్చీఫ్‌లు ధరించారు. (271కి చేరిన కరోనా బాధితుల సంఖ్య) కరోనా వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా ముంబైతోపాటు పుణే, పింప్రీ, చించ్వాడ్, నాగపూర్ ప్రాంతాల్లో అన్ని రకాల పనులను ప్రభుత్వ అధికారులు నిలిపి వేయడం, కూలీల అడ్డాల్లో కూలీలు గుమికూడదంటూ పోలీసులు అడ్డుకోవడం, ఫలితంగా పనులు దొరక్కా పస్తులుండాల్సి రావడంతో రోజువారి కూలీలు తిరుగుముఖం పట్టారు. ‘ఆరు నెలల క్రితం ముంబై వచ్చాను. అంధేరి ప్రాంతంలో ప్లంబర్‌గా పని చేస్తున్నాను. అడ్డాలో నిలబడితే రోజూ ఎవరో ఒక కాంట్రాక్టర్ తీసుకెళ్లేవారు. రోజుకు 500 రూపాయల నుంచి 600 రూపాయలు వరకు వచ్చేవి. గత మంగళవారం నుంచి ఒక్క పైసా సంపాదన లేదు. అందుకని సొంత నగరమైన ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు వెళుతున్నాను’ అని 17 ఏళ్ల విశాల్ కుమార్ మౌర్య మీడియాకు తెలిపారు. (11 వేలు దాటిన కరోనా మృతులు) ‘వైరస్‌తోనైనా యుద్ధం చేయవచ్చుగానీ ఆకలితో యుద్ధం చేయలేము’ అని ముఖానికి నల్లటి గుడ్డను ధరించిన ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి ముంబైకి బతుకుతెరువు కోసం వచ్చి ఆటో నడుపుకుంటోన్న 35 ఏళ్ల లలిత్ చౌహాన్ తెలిపారు తనకు రోజుకు 450 రూపాయలు వచ్చేవని, వాటితో తన జీవితం గడచిపోయేదని చెప్పారు. గత వారం రోజులుగా రోజుకు రెండు వందల రూపాయలు కూడా రావడం లేదని, అందుకనే ముంబై విడిచి వెనక్కి వెళిపోతున్నానని ఆయన చెప్పారు. దాదాపు ముంబైకి వీడ్కోలు చెబుతున్న అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క ముంబైలోనే కాకుండా కరోనా బారిన పడిన ప్రతి నగరంలోనూ దినసరి కూలీల పరిస్థితి ఇలా దారుణంగానే ఉంది. -
అడిగినంత ‘ఉపాధి’!
ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో పని కావాలని కోరిన అన్ని కుటుంబాలకు పరిమితి లేని విధంగా పనులను కల్పించవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జూపల్లి అధ్యక్షతన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కౌన్సిల్లో చర్చించిన పలు అంశాలను జూపల్లి విలేకరులకు వివరించారు. ఉపాధిహామీ పనుల్లో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలి పేలా అందరి భాగస్వామ్యంతో ముందుకు పోవాలని కౌన్సిల్ తొలి సమావేశం నిర్ణయించిందని తెలిపారు. జాబ్‌కార్డు కలిగిన 54 లక్షల కుటుంబాల్లో కనీసం 60 శాతం మందికి ఈ ఏడాది మార్చి 31లోగా 100 రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. జిల్లా స్థాయిలోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధి పనుల్లో వేగం పెంచాలని, నిధులకు కొరత లేదని పేర్కొన్నారు. నర్సరీల్లో 100 రోజుల నిబంధన సడలింపు ఉపాధి హామీ పథకం కింద నర్సరీల్లో 100 రోజులు మాత్రమే పనిచేసే నిబంధనను సడలిస్తున్నట్లు జూపల్లి పేర్కొన్నారు. దివ్యాంగులైన కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించామని వెల్లడించారు. 100 రోజుల వేతనానికి అయ్యే సొమ్మును కేంద్రం చెల్లించనుండగా, మిగిలిన 50 రోజుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఈ ఏడాదికి మంజూరైన 10 కోట్ల పనిదినాలకు అదనంగా మరో 6 కోట్ల పని దినాలు కావాలని కోరగా, కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. లక్ష్యానికి మించి పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమం, నీటిపారుదల శాఖల కార్య దర్శులు సోమేశ్ కుమార్, వికాస్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ వరంగల్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్లు పద్మ, తుల ఉమ పాల్గొన్నారు. -
దేవుడి గదిలో తేనె ఊట
తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా): తాండూరు పట్టణంలోని గుమస్తానగర్‌లో అద్భుతం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని దేవుడిగది నేలలోంచి తేనె ఊరింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గుమస్తానగర్కు చెందిన సొనీబాయి స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం ఉగాది పండుగ సందర్భంగా ఆమె ఓ కుండలో పచ్చడి తయారుచేసి దేవుడి గదిలో ఉంచింది. ఆదివారం సాయంత్రం పచ్చడికుండ దగ్గర నేల నుంచి ఊటలాగ కనిపించింది. కుండలోంచి పచ్చడి కారుతోందేమోనని ఆమె మొదట భావించింది. ఊట ఎక్కువ కావడంతో పరిశీలించగా తేనె ఊరుతోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని తిలకించారు. దేవుడి మహిమ అని పూజలు నిర్వహించారు.