తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా): తాండూరు పట్టణంలోని గుమస్తానగర్‌లో అద్భుతం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని దేవుడిగది నేలలోంచి తేనె ఊరింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గుమస్తానగర్‌కు చెందిన సొనీబాయి స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం ఉగాది పండుగ సందర్భంగా ఆమె ఓ కుండలో పచ్చడి తయారుచేసి దేవుడి గదిలో ఉంచింది.
ఆదివారం సాయంత్రం పచ్చడికుండ దగ్గర నేల నుంచి ఊటలాగ కనిపించింది. కుండలోంచి పచ్చడి కారుతోందేమోనని ఆమె మొదట భావించింది. ఊట ఎక్కువ కావడంతో పరిశీలించగా తేనె ఊరుతోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని తిలకించారు. దేవుడి మహిమ అని పూజలు నిర్వహించారు.
దేవుడి గదిలో తేనె ఊట
Published Sun, Mar 22 2015 11:07 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement