incentivise
-
కొత్త వాహనాలపై రాయితీ.. ఇలా చేయండి
కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ఇటీవల దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థల సీఈఓలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్క్రాపేజ్ పాలసీ కింద డిస్కౌంట్స్ అందించాలని ఈ సమావేశంలో పేర్కొన్నారు. దీనిని 'ఐషర్' కంపెనీ ఎట్టకేలకు అమలుపరుస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పుడు ఎవరైన మినీ ట్రక్కు, బస్సులను కొనుగోలు చేయాలనుకుంటే డిస్కౌంట్ పొందవచ్చు. ఎలా అంటే.. మీ దగ్గరున్న పాత వాహనాలను స్క్రాపేజ్ (తుక్కు) కింద మార్చి, దానికి సంబంధించిన సెర్టిఫికేట్ పొందాలి. ఆ తరువాత సర్టిఫికేట్ను కొత్త వాహనం కొనే సమయంలో కంపెనీలో (ఐషర్ కంపెనీ) చూపిస్తే.. 1.25 శాతం నుంచి 3 శాతం వరకు కొత్త వెహికల్ కొనుగోలుపైన రాయితీ పొందవచ్చు.స్క్రాపేజ్ పాలసీ కింద పొందే రాయితీలను.. 2024 సెప్టెంబర్ 1 నుంచి చెల్లుబాటు అవుతుంది. ఇది వచ్చే రెండేళ్ళు లేదా తరువాత నోటీస్ వచ్చేవరకు అమలులో ఉంటుందని ఐషర్ కంపెనీ పేర్కొంది.వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, రోడ్డుపై పాతవాహనాల సంఖ్యను తగ్గించడానికి ఇది ఒక పరివర్తనాత్మక దశ అని వీఈ కమర్షియల్ వెహికల్స్ ఎండీ అండ్ సీఈఓ 'వినోద్ అగర్వాల్' పేర్కొన్నారు. కంపెనీ కూడా కస్టమర్లకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. -
నీతి ఆయోగ్ బంపర్ బహుమతులు
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ సంస్థ భారీ ప్రోత్సాహకాలను, అవార్డులను ప్రకటించింది. రెండు పథకాలు ప్రవేశపెట్టనుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గురువారం ప్రకటించారు. వినియోగదారులకు, వ్యాపారస్తులను ఈ ప్రత్యేక బహుమతులను అందించనుంది. లక్కీ గ్రాహక్ యోజన , డిజిధన్ వ్యాపారి యోజన అనే రెండు కొత్త పథకాలను ప్రకటించింది. ఈ డిజిటల్ చెల్లింపులు ప్రచారం కోసం రూ 340 కోట్ల రూపాయలను కేటాయించినట్టు వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమితాబ్ కాంత్ నగదురహిత లావాదేవీల ప్రోత్సాహకానికి గాను ఈ రెండు పథకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ నెల 25నుంచే ఈ రెండు పథకాలు అమల్లోకి తీసుకు రానున్నామన్నారు. లక్కీ గ్రాహక్ యోజన కింద రోజూ 15 వేల మంది వినియోగదారులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని చెప్పారు. డిజిధన్ వ్యాపారి యోజన కింద వారానికి 7వేల మంది వ్యాపారస్తులని ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తామని వెల్లడించారు. అయితే ప్రయివేట్ వాలెట్ల చెల్లింపులకు ఈ ప్రోత్సాహకాలు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. 50 వేలనుంచి మూడు వేల లోపు ఆన్ లైన్ లావాదేవీలకు ఈ బహుమతులు వర్తిస్తాయి. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన విజేతలకు ఏప్రిల్ 14, 2017న ఈ మెగా బహుమతులను ప్రదానం చేయనున్నారు. వినియోగదారులకు బంపర్ బహుమతులు మొదటి బహుమతి కోటిరూపాయలు రెండవ బహుమతి రూ.50 లక్షలు మూడవ బహుమతి రూ.25 లక్షలు వ్యాపారస్తుల బంపర్ బహుమతులు మొదటి బహుమతి రూ.50 లక్షలు రెండవ బహుమతి రూ.25 లక్షలు మూడవ బహుమతి రూ.5 లక్షలు