దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్‌ఫిట్‌గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవరైనా తమ వాహనాలను తుక్కుకు ఇస్తే.. వారికి ప్రోత్సహాకాలు ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రకటించినట్లుగా ఈ ఏడాది నుంచి కేంద్రం స్క్రాపింగ్ పాలసీ సైతం అమల్లోకి తెచ్చింది. మరి దీనివల్ల కలిగే లాభాలేంటి?
పాత వాహనాల్ని తుక్కుగా మార్చేందుకు కేంద్రం 72 కంపెనీలకు అనుమతి ఇస్తే వాటిల్లో 38 సంస్థలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. స్క్రాపింగ్ పాలసీతో పాత వాహనాల్ని తుక్కుగా మార్చి.. వాటి నుంచి వచ్చే ఇనుము, అల్యూమినియం, రబ్బర్, ప్లాస్టిక్ కేబుల్స్‌తో మళ్లీ వినియోగించగలిగితే .. కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.
ఆటోమొబైల్ సంస్థలు గతంలో ఒక కారును తయారు చేసేందుకు రోజులు పాటు శ్రమించేవి. టెక్నాలజీ కారణంగా ఆ సమయం కాస్త గంటలకు (35) తగ్గింది. ఇప్పుడీ ఈ స్క్రాపింగ్ పాలసీలో పాత కారుని తుక్కుగా మార్చేందుకు 3గంటల సమయం పడుతుంది.
అయితే, యజమానులు తమ వద్ద ఉన్న పాత వాహనాల్ని ఈ స్క్రాపింగ్‌కి ఇస్తారా? అనేదే ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే ఆటోమొబైల్ పరిశ్రమ నివేదికల ప్రకారం.. అనధికారికంగా దేశంలో 90కి పైగా పాత వాహనాలున్నాయి. ఇవి కాకుండా ఇళ్లల్లో, గ్యారేజీలలో మూలుగుతున్న వాహనాల సంఖ్య లక్ష నుంచి కోట్లలో ఉండొచ్చనేది అంచనా.
Comments
Please login to add a commentAdd a comment