
లగ్జరీ కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన బీఎండబ్ల్యూ రెండు ప్రీమియం బైకుల 2019 మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. బీఎండబ్ల్యూ కు చెందిన మోటార్ సైకిళ్ళ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్ భారత మార్కెట్లలో నిన్న (జనవరి 18 శుక్రవారం) ఆర్1250జీఎస్, ఆర్1250జీఎస్ అడ్వెంచర్ పేరుతో రెండు బైకులను విడుదల చేసింది.
ఈ సూపర్ బైక్‌లు బ్లాక్ , బ్రీజ్ , సిల్వర్ మెటాలిక్ రంగుల్లో ,రెండు వేరియంట్లలో లభించనున్నాయి. దేశీయ డీలర్ల వద్ద బుక్కింగ్స్ అందుబాటులో ఉన్నాయి. 1,254 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్,136హెచ్‌పీ పవర్,143 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటి ధరల శ్రేణి రూ. 16.5 లక్షల నుండి 21.95 లక్షలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment