సాక్షి,న్యూఢిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన మినీ కంట్రీమన్ మోడల్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం వద్ద ప్రారంభ ధరను రూ.39.5 లక్షలుగా నిర్ణయించింది. (కొత్త బజాజ్ ప్లాటినా బైక్ : ధర ఎంతంటే?)
స్థానికంగా చెన్నై ప్లాంట్‌లో తయారయ్యే కొత్త మినీ కంట్రీమన్‌రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో కూపర్ ఎస్ వేరియంట్ ధర రూ.39.5 లక్షలు, కూపర్ ఎస్ జేసీడబ్ల్యూ వేరియంట్ ధర రూ.43.5 లక్షలుగా ఉన్నాయి. రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ మోడల్ కేవలం 7.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్(ఎస్‌ఏవీ) మినీ కంట్రీమన్ కస్టమర్లకు కొత్త అనుభూతినిస్తుందని భారత బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. (టియాగో.. కొత్త వేరియంట్)
Comments
Please login to add a commentAdd a comment