Triumph
-
ట్రయంఫ్ లిమిటెడ్ ఎడిషన్ బైక్ (ఫోటోలు)
-
రూ.19.39 లక్షల సరికొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తుంటే.. ట్రయంఫ్ కంపెనీ మాత్రం రూ. 19.39 లక్షల ఖరీదైన '2025 టైగర్ 1200' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.ట్రయంఫ్ లాంచ్ చేసిన 2025 టైగర్ 1200 బైక్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైకులోని 1160 సీసీ 3 సిలిండర్ ఇంజిన్ 9000 rpm వద్ద 150 Bhp పవర్, 7000 rpm వద్ద 130 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 బైక్ ముందు భాగంలో 19 ఇంచెస్ వీల్స్, వెనుక 18 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్లు కావడం గమనార్హం. ఈ బైక్ కఠిననమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు. కాబట్టి ఈ బైక్ ద్వారా రైడర్ ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని కూడా పొందవచ్చు.రైడర్ సీటు ఫ్లాటర్ ప్రొఫైల్‌తో రీడిజైన్ చేయబడి ఉండటం వల్ల.. సీటు ఎత్తు 20 మిమీ తగ్గింది. వెనుక సస్పెన్షన్ ప్రీలోడ్ కూడా 20 మిమీ వరకు తగ్గుతుంది. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 7 ఇంచెస్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కీలెస్ ఇగ్నిషన్, అడాప్టివ్ కార్నరింగ్ లైట్లు, షిఫ్ట్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందింది. -
గేమ్ డెవలపర్ల కోసం భారత్ టెక్ ట్రయంఫ్ చాలెంజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ భాషల్లో ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాం విన్జో తాజాగా తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ)తో చేతులు కలిపింది. గేమింగ్ టెక్నాలజీని ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన భారత్ టెక్ ట్రయంఫ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దేశీ స్టార్టప్‌ల అభివృద్ధికి అవసరమైన కీలక వనరులు సమకూర్చేందుకు, వినోద రంగంలో మేథో సంపత్తిని పెంపొందించేందుకు ఇది సహాయకరంగా ఉండనుంది. ఈ ప్రోగ్రాం కింద సోషల్ గేమింగ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి డీప్ టెక్‌పై పరిశోధనలకు సహాయం లభిస్తుంది. తదుపరి అభివృద్ధి చేసేందుకు అత్యధిక అవకాశాలున్న టెక్నాలజీలను గుర్తించడంలో టీవీఏజీఏతో పాటు పరిశ్రమ దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తారు. ఎంపికైన కంపెనీలకు ఈ ఏడాది మార్చ్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఇండియా పెవిలియన్‌లో చోటు కలి్పంచేందుకు విన్జో సహాయ సహకారాలు అందిస్తుంది. ఆసక్తి గల డెవలపర్లు జనవరి 24లోగా https:// bharattech. winzogames. com పోర్టల్‌లో తమ ప్రాజెక్టులను సమరి్పంచవచ్చు. -
భారత్ మార్కెట్లోకి ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. విడుదల ఎప్పుడంటే
ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ ‘డేటోనా 660’ స్పోర్ట్ టూరర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. యమహా ఆర్7, కవాసాకి నింజా 650, హోండా సీబీఆర్ 650ఆర్ మోటారు సైకిళ్లతో ట్రయంఫ్ డేటోనా 660 బైక్ పోటీ పడనున్న ఈ బైక్ భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లో వచ్చేనెల 9న ఆవిష్కరించేందుకు ట్రయంఫ్ యాజమాన్యం సిద్ధమైంది. భారత్ మార్కెట్లో డేటోనా ఎక్స్ షోరూమ్ ధర రూ.9.50 లక్షలుగా నిర్ణయించారు. టైగర్ స్పోర్ట్ 660, ట్రైడెంట్ 660 మోటారు సైకిళ్లలో వాడిన ఇంజిన్, 660సీసీ ట్రయంఫ్ ఇంజిన్ త్రీ-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ యూనిట్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 81 హెచ్‌పీ విద్యుత్, 64 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్, 2-వే క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. 2-రైడింగ్ మోడ్స్- రెయిన్, రోడ్ మోడ్స్‌లో లభిస్తుంది. డ్యుయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్, క్లిప్ హ్యాండిల్ బార్, ట్రైడెంట్, టైగర్ స్పోర్ట్ మోటారు సైకిళ్లలో మాదిరిగా స్విచ్ గేర్స్, లీవర్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ఉంటాయి. ఫ్రంట్‌లో నాన్ అడ్జస్టబుల్ అప్‌సైడ్ యూఎస్డీ డౌన్ఫోర్క్, రేర్‌లో మోనో షాక్ యూనిట్, రెండు వీల్స్‌పై డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. -
మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ బైక్‌లు.. ధరలు, ఫీచర్లు ఇవే..
ట్రయంఫ్ (Triumph) మోటార్‌సైకిల్స్ ఇండియా కొత్త ప్రీమియం బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. 2023 స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ఎస్, స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ మోడళ్లను పరిచయం చేసింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధర రూ. 10.17 లక్షలు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 11.81 లక్షలు. (ఎక్స్ షోరూమ్) కలర్స్ ఇవే.. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ సిల్వర్ ఐస్, కార్నివాల్ రెడ్, కాస్మిక్ ఎల్లో అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. స్పెసిఫికేషన్లు 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో లిక్విడ్-కూల్డ్, 765 సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఇంజిన్ 11,500 ఆర్పీఎం వద్ద 118.4 బీహెచ్పీ, 9,500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 80 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇక స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ 12,000 ఆర్పీఎం వద్ద 128.2 బీహెచ్పీ అధిక అవుట్‌పుట్‌ను 9,500 ఆర్పీఎం వద్ద 80 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఫీచర్స్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో కార్నరింగ్ ఏబీఎస్, లీన్-యాంగిల్ సెన్సిటివిటీతో ట్రాక్షన్ కంట్రోల్, లింక్డ్ బ్రేకింగ్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. మరోవైపు 2023 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ నాలుగు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లో ఎల్సీడీ డిస్ప్లే, ఆర్ఎస్ మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీతో టీఎఫ్టీ స్క్రీన్ ఉన్నాయి. ల్యాప్ టైమర్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ట్రాక్ ఉపయోగం కోసం ఆర్ఎస్ వేరియంట్‌ను మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించారు. StreetTriple 765 R-the new definitive street fighter-is priced from INR 10,17,000 Ex-Showroom, and StreetTriple 765 RS-the most powerful #StreetTriple ever-is priced from INR 11,81,000 Ex-Showroom.#StreetTriple765R #StreetTriple765RS #RacePowered #StreetTriple765 #TriumphIndia pic.twitter.com/2sOfixWOSc — TriumphIndiaOfficial (@IndiaTriumph) June 16, 2023 -
ట్రయంఫ్ టైగర్ 1200 అడ్వెంచర్ బైక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం మోటార్‌సైకిల్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ బ్రాండ్ ట్రయంఫ్ తాజాగా భారత్‌లో సరికొత్త టైగర్ 1200 అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, అలాగే సుదూర ప్రయాణాల కోసం జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.19.19 లక్షల నుంచి ప్రారంభం. టైగర్ 1200 చేరికతో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో 660 నుంచి 1200 సీసీ శ్రేణిలో తొమ్మిది మోడళ్లను కంపెనీ పరిచయం చేసినట్టు అయింది. -
కళ్లు చెదిరే సూపర్ బైక్‌లు , అదిరిపోయే ధర
ముంబై: బ్రిటీష్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్, తన ఫ్లాగ్షిప్ అడ్వెంచర్ (ADV) బైక్ 'టైగర్ 1200' 2022 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది, 2021 చివరిలో గ్లోబల్‌గా లాంచ్ చేసిన ‘ట్రయంఫ్ టైగర్ 1200 ’ సూపర్ బైక్‌లను ఇండియన్ మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ అనే నాలుగు వేరియంట్లలో ఈ బైక్స్ అందుబాటులో ఉంటాయి. బేస్ వేరియంట్ ధర రూ. 19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) టాప్ వేరియంట్ ధర రూ. 21.69 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఇవి హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా, డుకాటీ మల్టీ స్ట్రాడాతో పోటీగా నిలవనున్నాయి. కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 ADVని స్పోక్డ్ వీల్స్ , లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఫీచర్లతో రెండు కేటగిరీలుగా తీసుకొచ్చింది. బ్రెంబో కాలిపర్లతో పాటు ముందు వైపున ట్విన్ 320ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్‌లు , వెనుక వైపున ఒక సింగిల్ 280ఎమ్ఎమ్ డిస్క్‌లు, డ్యూయల్-ఛానల్ ABS కూడా అమర్చింది. ఇక ప్రో, ఎక్స్‌ప్లోరర్ వేరియంట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ప్రో ట్రిమ్‌లలో అందించే 20-లీటర్‌తో పోలిస్తే ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లు 30-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లభిస్తాయి. ట్రయంఫ్ టైగర్ 1200 స్పెక్స్ T-ప్లేన్ క్రాంక్ షాఫ్ట్‌తో 1,160cc ఇన్లైన్-ట్రిపుల్ సిలిండర్ ఇంజన్. 148 బీహెచ్పీ , 130 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. బైక్ స్లిప్ ,అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా అమర్చింది. పాత బైక్‌లతో పోలిస్తే 25 కిలోల బరువు కూడా తక్కువ. కొత్త ఫ్రేమ్, డబుల్ సైడెడ్ స్వింగ్ఆర్మ్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్‌ని ఉపయోగించడం ద్వారా బైక్ బరువును తగ్గించింది. సేఫ్టీ ఫీచర్లు బ్లైండ్ స్పాట్ , లేన్ చేంజ్ వార్నింగ్ సిస్టమ్, లీన్-సెన్సిటివ్ కార్నరింగ్ లైట్లు, బ్లూటూత్ సపోర్ట్‌తో కూడిన 7-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ఆరు రైడింగ్ మోడ్ల వరకు, ఒక రాడార్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. డౌన్ క్విక్‌షిఫ్టర్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ , కీలెస్ ఆపరేషన్. ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లలో టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హీటెడ్ రైడర్, పిలియన్ సీట్లు అదనం. -
లైగర్ హీరోయిన్‌తో బ్రేకప్ తర్వాత కొత్త బైక్ కొన్న హీరో!
స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కొత్త బైక్ కొన్నాడు. ట్రయంఫ్ బోన్విల్లె స్పీడ్ ట్విన్ అనే స్టైలిష్ బైక్‌ను తన సొంతం చేసుకున్నాడీ హీరో. దీని ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా రూ.13 లక్షలని తెలుస్తోంది. తన కొత్త బైక్‌కు సంబంధించిన ఫొటోలను ఇషాన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీనికి షాహిద్ కపూర్ స్పందిస్తూ 'నగరంలో ఈ కొత్త బైకర్ బాయ్‌ను చూడండి' అని కామెంట్ చేశాడు. దీనికి ఇషాన్ రిప్లై ఇస్తూ 'నాకు కొత్త హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చాడు. కాగా ఇషాన్ లైగర్ హీరోయిన్ అనన్య పాండే విడిపోయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అటు ఇషాన్ కానీ, ఇటు అనన్య కానీ స్పందించనేలేదు. ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ 'ఖాలీ పీలీ' సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఇషాన్ 'ఫోన్ బూత్', 'పిప్ప' చిత్రాలు చేస్తున్నాడు. జెర్సీలో షాహిద్ కపూర్‌కు జోడీగా నటించిన మృణాల్ ఠాకూర్ 'పిప్ప'లో ఇషాన్‌తో జోడీ కడుతోంది. View this post on Instagram A post shared by Ishaan (@ishaankhatter) చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి -
భారత మార్కెట్లోకి బోన్‌విల్ బాబర్ కొత్త బైక్
ముంబై: బ్రిటన్ ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్ మంగళవారం తన బోన్‌విల్ బాబర్ మోడల్ అప్డేట్ వెర్ష్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్ షోరూం వద్ద రూ.11.75 లక్షలుగా ఉంది. ఇందులో ఇంజిన్‌తో పాటు సాంకేతికతను, ఎక్విప్మెంట్ను ఆధునీకరించారు. ఈ బైక్‌లో 1200 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 6100 ఆర్పీఎమ్ వద్ద 78 పీస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ యూరో 5 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఉద్గారాలను, ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌కి బ్లాక్ కలర్ అవుట్‌లుక్ ఇవ్వబడింది. 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. రోడ్, రైన్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. బాబర్ బ్రాండ్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉందని, అందుకే ఏడాది విరామం తర్వాత దేశీయ మార్కెట్లోకి తీసుకున్నామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ సోహెబ్ ఫారూక్ తెలిపారు. చదవండి: ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు -
23, 24 తేదీల్లో విజయోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: గురువారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌బూత్, మండల, జిల్లాస్థాయిల్లో పెద్దఎత్తున విజయోత్సవాలు నిర్వ హించాలని బీజేపీ నిర్ణయించింది. శుక్రవారం (24న) ఉదయం 10కి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో భారీస్థాయిలో గెలుపు ఉత్సవాలను నిర్వహించాలని భావిస్తోంది. మంగళ వారం పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి. గురువారం ఓట్ల లెక్కింపులో ఆలస్యం జరిగే అవకాశాలున్నందున, తదనుగుణంగా బూత్‌స్థాయి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా పార్టీలకు సూచించినట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో... స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ఎంపీటీసీ, ఇతర స్థానిక సంస్థల సభ్యులంతా ఏవైపూ మొగ్గుచూపకుండా తటస్థంగా వ్యవహరించేలా చూడాలని పార్టీ భావిస్తోంది. మంగళవారం జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమావేశంలో, జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పార్టీపరంగా ఎలాంటి చర్యలు చేపడితే బావుం టుందనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కొత్తగా పార్టీ తరఫున ఎన్నికయ్యే పరిషత్ సభ్యులు, పార్టీపరంగా ఎంపీపీ అధ్యక్ష స్థానాలు గెలిచే అవకాశమున్న చోట ఇతర పార్టీలు అందించే సహకారాన్ని బట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి మద్దతి వ్వాలనే ఆలోచనతో పార్టీ నాయకులున్నట్టు సమాచారం. జూలై మొదటివారంతో పదవీకాలం ముగుస్తు న్న రంగారెడ్డి జిల్లాలో బీజేపీకి 51 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు పలువురు కౌన్సిలర్లున్నారు. -
ట్రయంఫ్ ‘స్ట్రీట్ ట్రిపుల్ ఎస్’ @ రూ.8.5 లక్షలు
దిగ్గజ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ‘ట్రయంఫ్’ తాజాగా స్ట్రీట్ ట్రిపుల్ ఎస్–2017 బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). నలుపు, ఎరుపు రంగుల్లో లభ్యంకానున్న ఈ బైక్‌లో 765 సీసీ ఇంజిన్, 6–స్పీడ్ గేర్‌బాక్స్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డీఆర్ఎల్ హెడ్‌లైట్స్, ఏబీఎస్, ఎల్సీడీ ఇన్స్ట్రూమెంట్ ప్యాక్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది 250–300 బైక్స్‌ను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది. కంపెనీ ప్రసుత్తం 16 మోడళ్లను భారత్‌లో విక్రయిస్తోంది. 2018 నాటికి భారత్‌లో విక్రయించే ప్రొడక్ట్స్‌లో 90 శాతం వరకు దేశీయంగా తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ సంబ్లీ తెలిపారు. -
విజయోత్సవం
► 18న కొవ్వొత్తులతో ప్రదర్శన ► నటుడు రాఘవ లారెన్స్ పిలుపు ► వీరోచితంగా అలంగానల్లూరు జల్లికట్టు టీనగర్: ఈనెల 18వ తేదీన జల్లికట్టు విజయోత్సవాలను జరుపుకునేందుకు నటుడు రాఘవ లారెన్స్ తమిళ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఇళ్ల ముందు కొవ్వొత్తులు, టార్చిలైట్లు వెలిగించి ప్రదర్శన నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఇలా తెలిపారు. తమిళుల సంప్రదాయక్రీడగా పేరొందిన జల్లికట్టుపై నిషేధం తొలగించడంతో ఈ ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకోవడానికి అందరికీ ఆసక్తిగా ఉందన్నారు. అలంగానల్లూరులో జల్లికట్టు పోటీని తిలకించేందుకు స్థానిక ప్రజల పిలుపుతో మెరీనా ఆందోళనలో పాల్గొన్న యువకులు 300 మందితో వెళ్లేందుకు నిర్ణయించామని, అనేక ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉత్సవం కావడంతో జనరద్దీని దృష్టిలో ఉంచుకుని కేవలం నలభై మందితో అలంగానల్లూరు చేరుకున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల ఆహ్వానానికి కృతజ్ఞతలని తెలుపుకుంటున్నానని అన్నారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వీలుకానందున తనకు బాధ కలిగిందన్నారు. వారి అసంతప్తిని పోగొట్టే విధంగా ఈ జల్లికట్టు విజయోత్సవాన్ని ఫిబ్రవరి 18వ తేదీన జరుపుకుందామని తెలిపానని, అందుకు వారు సమ్మతించినట్లు తెలిపారు. ఈ సంతోషంలో ప్రజలందరూ పాల్గొనాలని నిర్ణయించామని, ఇందుకు వేదికగా మెరీనాబీచ్‌ను అనుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దష్ట్యా అది వీలుకాదని తెలిసినందున వేరొక చోట జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రపంచ తమిళులందరూ ఈ ఉత్సవాలను వారున్న ప్రాంతాల్లో జరుపుకునేందుకు పిలుపునిచ్చారు. కూలి కార్మికుల నుంచి సాంకేతిక సమాచార స్నేహితులతో కలిపి జల్లికట్టు కోసం గళం విప్పిన అందరూ ఈ విజయోత్సవాలలో భాగం పంచుకోవాలని కోరారు. అనుకున్నది సాధిస్తామని, సాధించిన దాన్ని చారిత్రక విజయంగా వేడుక చేసుకుందామన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన: ఈనెల 18వ తేదీన సాయింత్రం ఏడు గంటల నుంచి 7.15 గంటల వరకు ఎవరికీ ఎటువంటి అభ్యంతరం కలగని విధంగా ప్రపంచ తమిళులందరం కలిసి ఇళ్ల డాబాలపై లేదా ఇళ్ల ముంగిళ్లలో కొవ్వొత్తులు, లేదా సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి ప్రశాంతంగా వేడుకలు జరుపుకుందామన్నారు. వీరోచితంగా అలంగానల్లూరు జల్లికట్టు: నామక్కల్ సమీపంలోగల అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు ఆదివారం వీరోచితంగా జరిగాయి. ఇందులో 200లకు పైగా ఆంబోతులు రంకెలేస్తూ కదనరంగంలోకి దూకాయి. 150 మంది క్రీడాకారులు పాల్గొని ఆంబోతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ పోటీలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో జల్టికట్టు బందాలు ఏర్పాటయ్యాయి. ఈ బందాల్లో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ఎస్పీ, నామక్కల్ అసిస్టెంట్ కలెక్టర్ ఇతర అధికారులు ఉన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇలావుండగా పుదుచ్చేరి లాస్పేట్టై ఠాకూర్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లా కలెక్టర్ సత్యేంద్ర సింగ్ ఇందుకు అనుమతి నిరాకరించారు. ఇలావుండగా అలంగానల్లూరు జల్లికట్టులో రంకెలేసిన ఎద్దులు, క్రీడాకారులను చూసి పరవశం చెందినట్లు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కార్యకర్తలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
ట్రయంఫ్ థ్రక్స్టన్ ఆర్ @10.90 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఖరీదైన బైక్‌ల తయారీ దిగ్గజం ట్రయంఫ్ తాజాగా బోనెవిల్లే థ్రక్స్టన్ ఆర్ మోడల్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదల చేసింది. 1,200 సీసీ, హై పవర్, 8 వాల్వ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్, ఆరు గేర్లు, ఏబీఎస్, అడ్జెస్టబుల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లున్నాయి. ఇంధనం, శక్తి నియంత్రణకు ట్రయంఫ్ తదుపరి తరం ఎలక్ట్రానిక్ రైడ్ బై వైర్ సిస్టమ్‌ను వాడారు. మొత్తంగా మోడర్న్ క్లాసిక్ స్పోర్ట్స్ స్టైల్‌తో వాహనాన్ని రూపొందించారు. కంపెనీకి చెందిన కొత్త బోనెవిల్లే ఫ్యామిలీ నుంచి ఇది మూడవ బైక్ కావడం విశేషం. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో బైక్ ధర రూ.10.90 లక్షలు. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా ప్రస్తుతం 15 మోడళ్లను దేశీయంగా విక్రయిస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ రెండేళ్లలో 3,000లకు పైగా బైక్‌లను అమ్మింది. హైదరాబాద్‌తోసహా దేశవ్యాప్తంగా 12 డీలర్షిప్ కేంద్రాలను నిర్వహిస్తోంది. -
ట్రంప్ సరికొత్త బైక్ లాంచింగ్
న్యూఢిల్లీ: బ్రిటిష్ కు చెందిన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రంప్ తన సరికొత్త మోటార్ బైక్ ను శుక్రవారం మార్కెట్లో రిలీజ్ చేసింది. 2016 ఫిబ్రవరి ఆటో ఎక్స్ పో లో థ్రక్స్టన్ -ఆర్ పరిచయం చేసిన సంస్థ ఈ రోజు భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. 1200సీసీ బైక్ ధరను రూ 10.9 లక్షలుగా (ఎక్స్ - షోరూమ్ , ఢిల్లీ) కంపెనీ ప్రకటించింది. 1200సీసీ పార్లల్ ట్విన్ ఇంజీన్ సామర్ధ్యం, 96.5 బీహెచ్పీ విత్ 6750 ఆర్పీఎం, 112ఎన్ఎం టార్క్ విత్ 4950 ఆర్పీఎం, సిక్స్ స్పీడ్ ట్రాన్సిమిషన్ 17 ఇంచ్ ఫ్రంట్ వీల్, టార్క్ అసిస్ట్ క్లచ్ తదితరాలు దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి. డయా బ్లోరెడ్, సిల్వర్ ఐస్, యాబ్లో రెడ్, సిల్వర్ ఐస్ మాట్ బ్లాక్ మూడురంగుల్లో ఈ బైక్ అందుబాటులోఉంది. కాంటెంపరరీ టెక్నాలజీతో పవర్, పెర్ ఫామెన్స్ తో కెఫే రేసర్లను తమ బైక్ ఆకట్టుకుంటుదని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల ద్వారా గత రెండు సంవత్సరాల్లో 3,000 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. న్యూ ఢిల్లీ, ముంబై , పూనే , చండీగఢ్, జైపూర్ , ఇండోర్, అహమ్మదాబాద్, కోలకతా , బెంగళూరు, చెన్నై , హైదరాబాద్, కొచీ 12 డీలర్షిప్ లు ఉన్నాయి. -
లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్, హ్యోసంగ్, కవాసాకి నింజా, డ్యుకాటీ... ఈ పేర్లు వినగానే లగ్జరీ బైకులని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఇప్పుడివి మగవారికి మాత్రమే సొంతం కాదండోయ్!!. ‘మేము కూడా దూసుకుపోతాం’ అంటున్నారు మహిళలు. అవును.. లగ్జరీ, సూపర్ బైకుల రైడింగ్‌పై మహిళల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. వీరి ఆసక్తి తగ్గట్టే మహిళల కోసం ప్రత్యేకమైన లగ్జరీ బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి వాహన సంస్థలు. దేశవ్యాప్తంగా ఏటా 10 వేల లగ్జరీ బైకులు అమ్ముడవుతుండగా ఇందులో మహిళ వాటా 10 శాతంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. మెట్రో నగరాల్లో మహిళల జీవన శైలి, ఆలోచన విధానాల్లో అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. దీంతో మగవారితో సమానంగా వారు కూడా లగ్జరీ, సూపర్ బైకులను నడపాలని కోరుకుంటున్నారు. అయితే మనదేశంలో మహిళా బైక్ రైడింగ్ విభాగం చాలా చిన్నది. అందుకే మహిళా కస్టమర్లను ఆకర్షించడం ఇక్కడ సులువైన పని కాదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ‘‘ప్రతి నెలా లగ్జరీ బైక్స్ కొనేందుకు మా షోరూమ్‌కు వచ్చే 15 మంది కస్టమర్లలో ఇద్దరు మహిళా కస్టమర్లు ఉంటున్నారు’’ అని హార్లీ డేవిడ్సన్ ఏపీ డీలర్ జయ్‌రామ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ‘స్ట్రీట్ 750’ ‘సూపర్’లో లగ్జరీ బైకులు మహిళలకు సరిగ్గా సరిపోతాయన్నారు. ‘‘ఎందుకంటే వీటి ఎత్తు, బరువు మిగతా లగ్జరీ బైకులకంటే తక్కువగా ఉంటాయి. దీంతో నాలుగు ఫీట్లుండే మహిళలు ఈ బైకులపై కూర్చున్నా కూడా వారికి బ్రేకులు, గేర్లు అందుతాయి’’ అని వివరించారు. దేశ వ్యాప్తంగా హార్లీ డేవిడ్సన్ బైకులకు 2 వేల మంది మహిళా కస్టమర్లున్నారని ఆయన చెప్పారు. ‘‘లాంగ్ డ్రైవ్ కోసమే లగ్జరీ బైకులు. ఇతర బైకులు గనక 80 కి.మీ. వేగాన్ని దాటితే నియంత్రించలేం. కానీ, లగ్జరీ బైకులు 150 కి.మీ. దాటినా సులువుగా నియంత్రించొచ్చు. అందుకే హ్యోసంగ్ నుంచి 250 సీసీ క్రూజర్ బైకును ప్రత్యేకంగా మహిళల కోసమే మార్కెట్లోకి విడుదల చేశాం’’ అని చెప్పారు హోయోసంగ్ ఏపీ డీలర్ వంశీ కృష్ణ. 170 కిలోల బరువుండే ఈ బైకుపై ఆగకుండా వెయ్యి కి.మీ ప్రయాణించినా నడుం నొప్పి రాదని వంశీ కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే మగవారిని ఆకర్షించినంత సులువుగా మహిళా కస్టమర్లను ఆకర్షించలేమని ఆయనన్నారు. కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, సమాజ కోణం వంటి ఎన్నో కారణాలున్నాయన్నారు. 250 సీసీ నుంచి 1,800 సీసీ గల లగ్జరీ, సూపర్ బైకులు దేశవ్యాప్తంగా ఏటా 10 వేలు అమ్ముడవుతుండగా... వీటిలో మహిళల వాటా 10 శాతం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లలో లగ్జరీ బైకుల కొనుగోళ్లలో మహిళల వాటా 20-30% పెరిగే అవకాశముందన్నది వారి అంచనా. ఎత్తు, బరువు తక్కువుంటేనే..: సాధారణంగా మహిళలు నడిపే స్కూటీ పెప్ వాహనాల పొడవు 1,735 ఎంఎం, వెడల్పు 590 ఎంఎం, సీటు ఎత్తు 740 ఎంఎం ఉంటుంది. కానీ లగ్జరీ, సూపర్ బైక్స్ భిన్నమైనవి. మహిళలు వీటి ని నియంత్రించడం కొంచెం కష్టం. అందుకే మహిళల కోసం లగ్జరీ బైకుల తయారీలో బండి బరువు, ఎత్తు తగ్గింపు వంటి చిన్న మా ర్పులు చేస్తున్నారు. దీంతో మగాళ్లతో సమానంగా మహిళలూ లగ్జరీ, సూపర్ బైక్స్‌పై దూసుకుపోతున్నారు. సర్వేలు శిక్షణ కూడా... కోట్లు వెచ్చించి తయారు చేసిన వాహనాలు తీరా మార్కెట్లోకి విడుదలయ్యాక మహిళలు స్వాగతించకపోతే కంపెనీలకు నష్టమే. అందుకే మహిళలు ఎలాంటి బైకులు ఇష్టపడతారో సర్వేలు చేసి మరీ విడుదల చేస్తున్నాయి. హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ముందు మహిళలు, మగవారు ఇద్దరిలో ఈ బైక్ ఎవరికి కరెక్ట్‌గా సరిపోతుందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేశాకే ప్రవేశపెట్టింది. బరువెక్కువగా ఉండే లగ్జరీ, సూపర్ బైకులను ఎలా నియంత్రించాలో మహిళల కోసం ప్రత్యేకమైన శిక్షణ తరగతులూ నిర్వహిస్తున్నాయి ట్రయంఫ్ వంటి కొన్నికంపెనీలు. -
ట్రయంఫ్ బైక్‌లు వచ్చేశాయ్..
న్యూఢిల్లీ: భారత లగ్జరీ బైక్ మార్కెట్లోకి మరో కొత్త కంపెనీ రంగప్రవేశం చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ 10 బైక్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు రూ. 5.7 లక్షలు-రూ.20 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. వచ్చే నెల చివరికల్లా హైదరాబాద్, బెంగళూరుల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత ఢిల్లీ, ముంబైల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని కంపెనీ డెరైక్టర్(సేల్స్ అండ్ మార్కెటింగ్-గ్లోబల్) పాల్ స్ట్రాడ్ చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని, జనవరిలో డెలివరీలు ఇస్తామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లి తెలిపారు. రుణాలు రెడీ: భారత్‌లో ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్ మంచి వృద్ధి సాధిస్తోందని పాల్ స్ట్రాడ్ చెప్పారు. తమ బైక్‌ల కొనుగోళ్ల కోసం రుణాలందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలి పారు. కంపెనీ విడుదల చేసిన పది మోడళ్లలో కొన్నిం టిని మానేసర్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తామని, మిగిలిన వాటిని పూర్తిగా తయారైన బైక్‌ల రూపంలో దిగుమతి చేసుకుంటామని చెప్పారు. వీటిలో బొనెవిల్లె (రూ.5.7 లక్షలు,) తక్కువ ధర బైక్ కాగా. ఎక్కువ ధర ఉన్నది రాకెట్ త్రి రోడ్‌స్టర్ బైక్ (రూ.20 లక్షలు). మానేసర్ ప్లాంట్‌లో బొనెవిల్లె టీ100, డైటోన 675ఆర్, స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్, థ్రక్స్టన్ బైక్‌లను అసెంబుల్ చేస్తామని చెప్పారు. మిగిలిన బైక్‌లు-రాకెట్ త్రి రోడ్‌స్టర్, టైగర్ ఎక్స్‌ప్లోరర్, టైగర్ 800 ఎక్స్‌సీ, థండర్బర్డ్ స్టార్మ్‌లను దిగుమతి చేసుకుంటామని వివరించారు. మొదటి ఆర్నెల్లలో 400-500 బైక్‌లు విక్రయించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పాల్ పేర్కొన్నారు. భారత్‌లో ఏడాదికి 2,500 వరకూ ప్రీమియం బైక్‌లు అమ్ముడవుతాయని అంచనా.