రూ.19.39 లక్షల సరికొత్త ట్రయంఫ్ బైక్ ఇదే.. | 2025 Triumph Tiger 1200 launched in India | Sakshi
Sakshi News home page

రూ.19.39 లక్షల సరికొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..

Published Tue, Oct 29 2024 1:23 PM | Last Updated on Tue, Oct 29 2024 3:30 PM

2025 Triumph Tiger 1200 launched in India

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తుంటే.. ట్రయంఫ్ కంపెనీ మాత్రం రూ. 19.39 లక్షల ఖరీదైన '2025 టైగర్ 1200' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

ట్రయంఫ్ లాంచ్ చేసిన 2025 టైగర్ 1200 బైక్  నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైకులోని 1160 సీసీ 3 సిలిండర్ ఇంజిన్ 9000 rpm వద్ద 150 Bhp పవర్, 7000 rpm వద్ద 130 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 బైక్ ముందు భాగంలో 19 ఇంచెస్ వీల్స్, వెనుక 18 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్లు కావడం గమనార్హం. ఈ బైక్ కఠిననమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు. కాబట్టి ఈ బైక్ ద్వారా రైడర్ ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని కూడా పొందవచ్చు.

రైడర్ సీటు ఫ్లాటర్ ప్రొఫైల్‌తో రీడిజైన్ చేయబడి ఉండటం వల్ల.. సీటు ఎత్తు 20 మిమీ తగ్గింది. వెనుక సస్పెన్షన్ ప్రీలోడ్‌ కూడా 20 మిమీ వరకు తగ్గుతుంది. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 7 ఇంచెస్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కీలెస్ ఇగ్నిషన్, అడాప్టివ్ కార్నరింగ్ లైట్లు, షిఫ్ట్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement