
స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కొత్త బైక్ కొన్నాడు. ట్రయంఫ్ బోన్‌విల్లె స్పీడ్ ట్విన్ అనే స్టైలిష్ బైక్‌ను తన సొంతం చేసుకున్నాడీ హీరో. దీని ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా రూ.13 లక్షలని తెలుస్తోంది. తన కొత్త బైక్‌కు సంబంధించిన ఫొటోలను ఇషాన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీనికి షాహిద్ కపూర్ స్పందిస్తూ 'నగరంలో ఈ కొత్త బైకర్ బాయ్‌ను చూడండి' అని కామెంట్ చేశాడు. దీనికి ఇషాన్ రిప్లై ఇస్తూ 'నాకు కొత్త హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చాడు.
కాగా ఇషాన్ లైగర్ హీరోయిన్ అనన్య పాండే విడిపోయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అటు ఇషాన్ కానీ, ఇటు అనన్య కానీ స్పందించనేలేదు. ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ 'ఖాలీ పీలీ' సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఇషాన్ 'ఫోన్ బూత్', 'పిప్ప' చిత్రాలు చేస్తున్నాడు. జెర్సీలో షాహిద్ కపూర్‌కు జోడీగా నటించిన మృణాల్ ఠాకూర్ 'పిప్ప'లో ఇషాన్‌తో జోడీ కడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment