
షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్, బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘ఖాలీపీలీ’. మక్భూల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. `సుల్తాన్` ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. సినిమా ఆలస్యమైనా, షూటింగ్ వాయిదా పడినా హీరోహీరోయిన్ల కారణంగా ‘ఖాలీపీలి’కి కావాల్సిన ప్రచారం లభిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనన్య, ఇషాన్‌లపై బాలీవుడ్ ఫోకస్ పడింది. దీంతో వీరిద్దరికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే తాజాగా ఇషాన్ కట్టర్ శుక్రవారం అర్దరాత్రి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చాడు. అయితే ఇషాన్ లైవ్ చాట్‌కు తొలి కామెంట్ చేసిన అనన్య.. ‘ఈ సమయంలో లైవ్‌లోకి ఎందుకు వచ్చావ్ అసలు ఇప్పటివరకు ఎందుకు మేల్కొని ఉన్నావ్.. పోయి పడుకో’అంటూ కామెంట్ చేసింది. అయితే ప్రస్తుత రోజుల్లో త్వరగా ఎవరు పడుకోవడం లేదని అందుకే ఈ సమయంలో లైవ్‌లోకి వచ్చానని ఇషాన్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
చదవండి:
మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే?
‘మనం’ డైరెక్టర్‌తో చైతూ హారర్ చిత్రం
Comments
Please login to add a commentAdd a comment