Ananya Panday And Ishaan Khatter Break Up: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన విషయం తెలిసిందే కదా! ఇటీవలే ఇషాన్ తల్లి నీలిమా సైతం అనన్య తమ ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటూ ఎక్కడలేని ప్రేమను కురిపించింది. తన కొడుకు జీవితంలో అనన్యకు ఎంతో ప్రాధాన్యముందంటూ వాళ్లు లవ్‌లో ఉన్నారని చెప్పకనే చెప్పింది. కానీ ఇంతలోనే ఫ్యాన్స్ నెత్తిన పిడుగులాంటి వార్త పడింది.
మూడేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న అనన్య, ఇషాన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి ప్రయాణానికి లవ్ బర్డ్స్ ముగింపు పలికినట్లు తెలుస్తోంది. పార్టీలకు, ఫంక్షన్‌లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట చివరకు తమ దారులు వేరంటూ విడిపోయినట్లు కనిపిస్తోంది. కాగా అనన్య పాండే 2019లో హిందీలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న లైగర్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కానుంది.
చదవండి: తెలుగులో పరిచయం కానున్న పర భాష హీరోయిన్లు, అనన్య పాండేతో సహా మరికొందరు
Comments
Please login to add a commentAdd a comment