Ishaan Khatter's Spotted With New Girlfriend on Bike, Pic Viral - Sakshi
Sakshi News home page

Ishaan Khatter: అనన్యకి కౌంటర్.. ఆమెతో బైక్‌పై ఇషాన్!?

Published Tue, Jul 25 2023 3:40 PM | Last Updated on Tue, Jul 25 2023 4:02 PM

Ishaan Khatter New Girlfriend Bike Pic Viral - Sakshi

టాలీవుడ్‌లో తక్కువ గానీ బాలీవుడ్‌లో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కల్చర్ చాలా ఎక్కువ. పార్టీలు, పబ్బులు అంటూ యంగ్ యాక్టర్స్ తెగ తిరిగేస్తుంటారు. ఇలా ఈ మధ్య 'లైగర్' భామ అనన్య పాండే వార్తల్లో నిలిచింది. హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఈమె విదేశాల్లో ఉంది. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీళ్ల విషయం లీక్ అయింది. ఇప్పుడు ఈమె మాజీ బాయ్ ఫ్రెండ్ కౌంటర్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)

హిందీ సినిమాలు అడపాదడపా చూసేవాళ్లకు ఇషాన్ కట్టర్ గురించి తెలిసే ఉంటుంది. 'బియాండ్ ద క్లౌడ్స్' మూవీతో హీరోగా పరిచయమైన ఇతడు.. 'దఢక్'తో గుర్తింపు తెచ్చుకున్నాడు. కాలీ పీలీ, ఫోన్ బూత్, ఫర్సాత్ చిత్రాలు చేశాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు. అయితే 'కాలీ పీలీ' షూటింగ్ టైంలో అందులో నటించిన ఇషాన్-అనన్య లవ్‌లో పడ్డారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత కలిసి చాలాచోట్ల కనిపించారు.

మరి ఏమైందో ఏమో గానీ వీళ్లిద్దరూ విడిపోయారు. పలు షోల్లో ఈ విషయం గురించి ఇద్దరు ఓపెన్‌గా చెప్పారు కూడా. మొన్నటివరకు సింగిల్‌గానే ఉన్న అనన్య.. కొన్నాళ్ల ముందు ఆదిత్య రాయ్ కపూర్ తో రిలేషన్ ఉందనే వార్తలొచ్చాయి. అవి నిజమే అన్నట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమెకు రివేంజ్ అన్నట్లు ఇషాన్ కట్టర్ ఓ అమ్మాయితో బైక్‌పై కనిపించాడు. దీంతో నెటిజన్స్ అనన్య ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement