
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ ప్రేమ వ్యవహారం ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్‌తో అనన్య పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖలీపిలీ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు అప్పటి నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
దీనికి తగ్గట్లు గానూ పార్టీలు, పబ్‌లు అంటూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలాసార్లు మీడియాకు కనిపించారు. ఇదిలా ఉండగా తాజాగా వీరి ప్రేమ విషయంపై ఇషాన్ తల్లి నీలిమా అజీమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనన్య మా కుటుంబంలో ఒక మెంబర్. ఆమె నా కొడుకికి మంచి స్నేహితురాలు. అతని జీవితంలో అనన్య ముఖ్యమైన భాగమైపోయింది.
షాహిద్, మీరాతోనూ అనన్య చాలా బాగా మాట్లాడుతుంది. ఇక ఇషాన్ ఫ్రెండ్స్‌తోనూ ఇట్టే కలిసిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్‌ని బట్టి ఇషాన్-అనన్యల ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లే అని, ఆమె మాటల్ని బట్టి అనన్య-ఇషాన్‌ల ప్రేమాయణం ఏ లెవల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment