హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ భాషల్లో ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం విన్‌జో తాజాగా తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ)తో చేతులు కలిపింది. గేమింగ్ టెక్నాలజీని ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన భారత్ టెక్ ట్రయంఫ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దేశీ స్టార్టప్‌ల అభివృద్ధికి అవసరమైన కీలక వనరులు సమకూర్చేందుకు, వినోద రంగంలో మేథో సంపత్తిని పెంపొందించేందుకు ఇది సహాయకరంగా ఉండనుంది.
ఈ ప్రోగ్రాం కింద సోషల్ గేమింగ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి డీప్ టెక్‌పై పరిశోధనలకు సహాయం లభిస్తుంది. తదుపరి అభివృద్ధి చేసేందుకు అత్యధిక అవకాశాలున్న టెక్నాలజీలను గుర్తించడంలో టీవీఏజీఏతో పాటు పరిశ్రమ దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తారు. ఎంపికైన కంపెనీలకు ఈ ఏడాది మార్చ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఇండియా పెవిలియన్‌లో చోటు కలి్పంచేందుకు విన్‌జో సహాయ సహకారాలు అందిస్తుంది. ఆసక్తి గల డెవలపర్లు జనవరి 24లోగా https:// bharattech. winzogames. com పోర్టల్‌లో తమ ప్రాజెక్టులను సమరి్పంచవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment