ట్రంప్ సరికొత్త బైక్ లాంచింగ్
న్యూఢిల్లీ: బ్రిటిష్ కు చెందిన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రంప్ తన సరికొత్త మోటార్ బైక్ ను శుక్రవారం మార్కెట్లో రిలీజ్ చేసింది. 2016 ఫిబ్రవరి ఆటో ఎక్స్ పో లో థ్రక్స్టన్ -ఆర్ పరిచయం చేసిన సంస్థ ఈ రోజు భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. 1200సీసీ బైక్ ధరను రూ 10.9 లక్షలుగా (ఎక్స్ - షోరూమ్ , ఢిల్లీ) కంపెనీ ప్రకటించింది.
1200సీసీ పార్లల్ ట్విన్ ఇంజీన్ సామర్ధ్యం, 96.5 బీహెచ్పీ విత్ 6750 ఆర్పీఎం, 112ఎన్ఎం టార్క్ విత్ 4950 ఆర్పీఎం, సిక్స్ స్పీడ్ ట్రాన్సిమిషన్ 17 ఇంచ్ ఫ్రంట్ వీల్, టార్క్ అసిస్ట్ క్లచ్ తదితరాలు దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి. డయా బ్లోరెడ్, సిల్వర్ ఐస్, యాబ్లో రెడ్, సిల్వర్ ఐస్ మాట్ బ్లాక్ మూడురంగుల్లో ఈ బైక్ అందుబాటులోఉంది. కాంటెంపరరీ టెక్నాలజీతో పవర్, పెర్ ఫామెన్స్ తో కెఫే రేసర్లను తమ బైక్ ఆకట్టుకుంటుదని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల ద్వారా గత రెండు సంవత్సరాల్లో 3,000 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. న్యూ ఢిల్లీ, ముంబై , పూనే , చండీగఢ్, జైపూర్ , ఇండోర్, అహమ్మదాబాద్, కోలకతా , బెంగళూరు, చెన్నై , హైదరాబాద్, కొచీ 12 డీలర్షిప్ లు ఉన్నాయి.