
ప్రముఖ ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ మధుమేహ రోగుల కోసం కొత్త మెడిషన్ విడుదల చేసింది. గ్లైసెమిక్ నియంత్రణ, బరువు తగ్గించే ఔషధాన్ని ప్రారంభించినట్లు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ముంబైకి చెందిన ఈ ఔషధ సంస్థ గ్లెంపా (ఎంపాగ్లిఫ్లోజిన్ 10/25 ఎంజీ) బ్రాండ్ పేరుతో విస్తృతంగా గుర్తింపు పొందిన ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్ ఎంపాగ్లిఫ్లోజిన్‌ను తన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)'తో కలిపి విడుదల చేసింది.
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వారిలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడానికి ఈ మందులను రూపొందించారు. అదే సమయంలో కార్డియోవ్యాస్కులర్ ముప్పు ఉన్న రోగులకు కూడా మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ (టీ2డీఎం) పేషంట్లలో గ్లైసెమిక్ నియంత్రణని మెరుగుపర్చడం, బరువు తగ్గడానికి మద్దతునివ్వడం, కార్డియోవాస్కులర్-రీనల్ రిస్కులను తగ్గించడంతో పాటు ఎంపాగ్లిఫ్లోజిన్ పలు ప్రయోజనాలు చేకూరుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
“భారత్‌లో కార్డియోమెటబోలిక్ సంరక్షణకు సంబంధించి వినూత్నమైన చికిత్సలను అందుబాటు స్థాయిలో ఆవిష్కరించడంలో గ్లెన్‌మార్క్‌కు ఘన చరిత్ర ఉంది. సీవీడీతో పాటు టీ2డీఎంను సమర్ధంగా ఎదుర్కొనడంలో పేషంట్లకు, హెల్త్‌కేర్ నిపుణులకు సాధికారత కల్పించేందుకు సమగ్రమైన, చౌకైన సొల్యూషన్‌ను అందించాలన్న మా నిబద్ధతకు గ్లెంపా శ్రేణి ఆవిష్కరణ నిదర్శనంగా నిలుస్తుంది” అని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ఇండియా ఫార్ములేషన్స్ బిజినెస్ అలోక్ మాలిక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment