Glenmark
-
కోవిడ్‌కి నాజల్ స్ప్రే చికిత్స
ముంబై: కోవిడ్–19 మహమ్మారితో బాధపడేవారికి చికిత్స అందించడానికి తొలిసారిగా భారత్‌లో నాజల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ బుధవారం ముక్కు ద్వారా చికిత్స చేసే నిట్రిక్ ఆక్సైడ్ స్ప్రే విడుదల చేసింది. ఫ్యాబీ స్ప్రే అనే బ్రాండ్ నేమ్‌తో విడుదల చేసిన ఈ స్ప్రేని కరోనా సోకిన వయోజనుల్లో వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇది అత్యంత సురక్షితమైనదని కంపెనీ స్పష్టం చేసింది. కోవిడ్–19పై పోరాటంలో ఇప్పటికే ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసిన సానోటైజ్ కంపెనీతో కలిసి సంయుక్తంగా గ్లెన్‌మార్క్ ఈ స్ప్రేను తయారు చేసింది. కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ నాజల్ స్ప్రేని రూపొందించారు. కరోనాలో ఎన్నో కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముక్కు ద్వారా చేసే ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుందని గ్లెన్‌మార్క్ సీఓఓ రాబర్ట్ క్రోకర్ట్ చెప్పారు. ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు కూడా లభించాయని ఆయన చెప్పారు. ఇప్పటికే పలు దశాల్లో చేసిన ప్రయోగాలతో ఈ స్ప్రే సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది. ► ఈ స్ప్రే వాడడం వల్ల 24 గంటల్లో 94% వైరస్ లోడు తగ్గుతోంది ► 48 గంటల్లో ఏకంగా 99% వైరస్ తగ్గిపోతుంది. ► కరోనా వైరస్‌ని భౌతిక, రసాయన చర్యల ద్వారా ఈ వైరస్ ఎదుర్కొంటుంది. ► వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నిరోధిస్తుంది ► అమెరికాలో ఉటా యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ స్ప్రే కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి అన్ని వేరియెంట్లపై రెండు నిముషాల్లోనే పని చేస్తుందని తేలింది. 99.9% సమర్థంగా పని చేస్తున్నట్టుగా వెల్లడైంది. ► కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు వైరస్ వ్యాప్తిని కూడా ఈ స్ప్రే నిరోధిస్తుంది. వైరస్ సోకినట్టుగా వెంటనే గుర్తించగలిగితే, వ్యాప్తిని కూడా అరికట్టే అవకాశాలుంటాయి. ఈ స్ప్రే వాడిన రెండు రోజుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కూడా నెగిటివ్ వస్తుంది. -
కోవిడ్-19 చికిత్సకు భారత్‌లో తొలి నాజల్ స్ప్రేను లాంచ్ చేసిన గ్లెన్‌మార్క్..!
భారత్‌లో కరోనావైరస్ చికిత్సకు తొలి నాజల్ స్ప్రే‘ ఫాబిస్ప్రే’ అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్, కెనడాకు చెందిన శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంపెనీలు సంయుక్తంగా భారత్‌లో విడుదల చేశాయి. పెద్దవారికి నాజల్‌స్ప్రే చికిత్స..! పెద్దవారిలో కరోనా(Coronavirus)ను ట్రీట్ చేయడానికి ఈ నాజల్ స్ప్రే సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేను తయారుచేయడానికి, మార్కెటింగ్ చేయడానికి గ్లెన్‌మార్క్ ఫార్మా కంపెనీకి భారత డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ(DCGI) అనుమతులు ఇచ్చింది.మన దేశంలో ఫేజ్ 3 ట్రయల్ పరీక్షల్లో ఈ నాజల్ స్ప్రే అద్భుతంగా పని చేసినట్టు తేలిందని కంపెనీ అధికారిక ప్రకటన తెలిపింది. 24 గంటల్లో 94 శాతం వైరల్ లోడ్‌ను తగ్గిస్తుందని, 48 గంటల్లో 99 శాతం వైరల్ లోడ్‌ను ఈ నాజల్ స్ప్రే తగ్గిస్తున్నట్టు తేలిందని వివరించింది. నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే సేఫ్ అని, కొవిడ్ పేషెంట్లూ ఈ స్ప్రే ద్వారా ఇబ్బంది పడరని పేర్కొంది. గ్లెన్‌మార్క్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేను ఫాబిస్ప్రే బ్రాండ్ నేమ్‌తో భారత్‌లో విక్రయిస్తుందని వివరించింది. రెండు నిమిషాల్లో నాశనం..! క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ క్లినికల్ డెవలప్మెంట్ హెడ్, సీనియర్ వీపీ డాక్టర్ మోనికా టాండన్ మాట్లాడారు. పేషెంట్‌లోని వైరల్ లోడ్‌ను ఈ నాజల్ స్ప్రే గణనీయంగా తగ్గిస్తున్నదని వివరించారు. కొత్త వేరియంట్లతో కరోనా పంజా విసురుతున్న ఈ సమయంలో నాజల్ స్ప్రే భారత ప్రజలకు మరో ఉపయోగకరమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. అమెరికాలోని ఉటా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం, నాజల్ స్ప్రేలు 99.9 శాతం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ వేరియంట్లను రెండు నిమిషాల్లో నాశనం చేస్తాయని తేలిందని పేర్కొన్నారు. చదవండి: కేవలం రూ. 197తో 150 రోజుల వ్యాలిడిటీ..! ఇంకా ఎన్నో ప్రయోజనాలు..! -
గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఐపీఓకు సూపర్ స్పందన
ముంబై: గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికం గా సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 15 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టగా.., మొత్తం 66 కోట్ల బిడ్లు ధాఖలైనట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు తెలిపాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు (క్విబ్) విభాగంలో 36.97 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలోనూ 122.54 రెట్ల అధిక స్పందన నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 14.63 రెట్లు దరఖాస్తులు లభించాయి. ఈ ఐపీఓ జూలై 27న ప్రారంభమై 29వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ.695–720 గా నిర్ణయిం చి కంపెనీ రూ.1,514 కోట్లు సమకూర్చుకుంది. -
ఐపీవో జోష్... రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు బుల్జోష్లో సాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పడుతున్నాయి. తాజాగా శ్యామ్ మెటాలిక్స్ ఈ నెల 14 నుంచీ ఐపీవో చేపడుతుండగా.. మరో రెండు కంపెనీలు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్ కంపెనీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూకి అనుమతించమంటూ సెబీకి.. ఉత్కర్ష్ స్మాల్ బ్యాంక్ మార్చిలో ప్రాథమిక పత్రాలతో దరఖాస్తు చేయగా.. గ్లెన్‌మార్క్ లైఫ్ ఏప్రిల్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఉత్కర్ష్ బ్యాక్‌గ్రౌండ్ ఐపీవోలో భాగంగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 600 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ఉత్కర్ష్ కోర్ఇన్వెస్ట్ విక్రయానికి ఉంచనుంది. వారణాసి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉత్కర్ష్ ఐపీవో(ఈక్విటీ జారీ) నిధులను టైర్-1 పెట్టుబడుల పటిష్టతకు, భవిష్యత్ పెట్టుబడులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 2009 నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థగా కార్యకలాపాలు కొనసాగించిన ఉత్కర్ష్ తదుపరి 2017లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్ నాటికి 528 బ్యాంకింగ్ ఔట్లెట్లతో 2.74 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. మైక్రోఫైనాన్స్ ద్వారానే అధిక మొత్తంలో రుణాలను విడుదల చేస్తోంది. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో కార్యకలాపాలు విస్తరించింది. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఇష్యూ సైజ్: రూ. 1,160. 1,160 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను, రూ .2 చొప్పున 73.05 లక్షల షేర్లకు ఆఫర్ ఫర్ సేల్ జారీ చేయాలని గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ యోచిస్తోంది. వాటా విధానం ప్రకారం, ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సమిష్టిగా 13.15 కోట్ల షేర్లు ఉన్నాయి. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ .43 లక్షల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 313 కోట్ల రూపాయలు. చదవండి : Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర -
కోవిడ్‌కు మరో ఔషధం..
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ అనే తమ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని తెలిపింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసుల చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసిందని హైదరాబాద్ సంస్థ హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఆదివారం వెల్లడించారు. ‘కోవిఫర్’తో కోవిడ్–19 చికిత్సకు కీలక మలుపు కానుందన్నారు. రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్ ‘కోవిఫర్’ అనే పేరుతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. కోవిఫర్ ఔషధం 100 మిల్లీగ్రాముల వయల్‌లో ప్రవేశపెడుతున్నామనీ, ఈ ఇంజెక్షన్‌ను ఆస్పత్రిలో వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ధర రూ.5–6 వేల మధ్య..: ఒక్కో డోస్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటుందని వంశీ కృష్ణ అన్నారు. ప్రస్తుతం రిటైల్‌గా దీనిని విక్రయించడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారానే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా వెంటనే అందుబాటులోకి తెస్తున్నట్లు హెటిరో చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్సెస్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లో దీనిని కోవిడ్ చికిత్సలో వాడేందుకు అనుమతి పొందినట్లు హెటిరో వెల్లడించింది. ఈ ఔషధానికి అమెరికాలో కోవిడ్–19 రోగులకు అత్యవసర ఉపయోగం (ఎమర్జెన్సీ యూజ్) కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డీఏ) అనుమతినిచ్చింది. కాగా, భారత్‌కు చెందిన మరో ఫార్మా కంపెనీ సిప్లా సైతం రెమ్‌డెసివిర్ ఔషధం తయారీ, విక్రయానికి డీసీజీఐ అనుమతి పొందింది. సిప్లా ఈ ఔషధాన్ని సిప్రెమి పేరుతో ప్రవేశపెట్టనుంది. -
గ్లెన్‌మార్క్ నుంచి మధుమేహ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఔషధ రంగ దిగ్గజం గ్లెన్‌మార్క్ తాజాగా మధుమేహ వ్యాధి చికిత్సకి సంబంధించి మరో ఔషధాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెమో, రెమోజెన్ బ్రాండ్స్ (రెమోగ్లిఫ్లోజిన్) పేరిట వీటిని విక్రయించనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (ఇండియా ఫార్ములేషన్స్ విభాగం) సుజేష్ వాసుదేవన్ తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో ఇది ఉపయోగపడుతుందని గురువారమిక్కడ ఔషధ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు తెలిపారు. మరింత ప్రభావవంతంగా పనిచేసే ఎస్జీఎల్టీ2 కోవకి చెందిన ఇతర ఔషధాలతో పోలిస్తే రెమోను 50 శాతం తక్కువ రేటుకే అందిస్తున్నట్లు ఆయన వివరించారు. రోజుకు రెండు సార్లు వేసుకోవాల్సిన ఈ ట్యాబ్లెట్ ధర రూ. 12.50గా ఉంటుంది. జపాన్ సంస్థ కిసై ఫార్మా దీన్ని రూపొందించగా, గ్లాక్సోస్మిత్‌క్లైన్.. బీహెచ్‌వీ ఫార్మా అభివృద్ధి చేసినట్లు సుజేష్ చెప్పారు. దేశీయంగా ఎస్జీఎల్టీ2 ఔషధ మార్కెట్ దాదాపు రూ.574 కోట్ల స్థాయిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీన్ని మొట్టమొదటిగా భారత్‌లోనే ప్రవేశపెట్టామని, పూర్తి దేశీయంగా ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా గతంలో లాగే భారత విభాగం ఆదాయాలు సుమారు 12–14% మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు సుజేష్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయాలు 10% వృద్ధితో రూ. 2,514 కోట్లుగా నమోదయ్యాయి. -
జపాన్ వైపు ఫార్మా చూపు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్ జపాన్‌ది. వార్షిక మార్కెట్ పరిమాణం 65 బిలియన్ డాలర్లు( రూ.3, 90,000 కోట్లు).ఇందులో జనరిక్స్ ఔషధాల వాటా కేవలం 6.6 శాతం. ఈ అవకాశమే రాష్ట్రానికి చెందిన ప్రధాన ఔషధ కంపెనీలయిన డాక్టర్ రెడ్డీస్, సువెన్, మైలాన్, అరబిందో ఫార్మా లాంటి సంస్థలను జపాన్ మార్కెట్ ఆకర్షిస్తోంది. జపాన్ జనరిక్స్ మార్కెట్లో పాగా వేసేందుకు డాక్టర్ రెడ్డీస్ రెండేళ్ల క్రితం ఫ్యూజీఫిల్మ్స్ సంస్థతో ఒక జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో ఆ భాగస్వామ్యం విజయవంతం కాలేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన అనంతంరం జనరిక్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రధాన ఫార్మా కంపెనీలుప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ‘మేం ఇప్పటికీ జపాన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఆసక్తితోనే ఉన్నాం. దీనికి సంబంధించిన అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం..సరైన ప్రణాళికతో జపాన్ మార్కెట్లో ప్రవేశించాలన్నదే మా ప్రాధాన్యత. ప్రస్తుతం మా ముందున్న ఆప్షన్లు మూడు...ఒకటి.. మంచి పార్ట్నర్ను వెతకటం. రెండు..ఏదైనా ఓ కంపెనీని కొనుగోలు చేయటం.. ఇక చివరిగా మేమే స్వంతంగా ఆ మార్కెట్లో ప్రవేశించటం (ఆర్గానిక్ వృద్ధి). మేం ఈ మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. అయితే ఇంతవరకూ ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకోలేదు’ అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ సాక్షి ప్రతినిధికి ఈ మెయిల్ ద్వారా తెలిపింది. జపాన్ ఆకర్షణ ఇదీ..: జపాన్ ఆరోగ్య శాఖ 2002 జూన్‌లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్ని హాస్పిటల్స్ జనరిక్స్ ఔషధాలనే వినియోగించాలి. ప్రభుత్వం చేపట్టిన డయాగ్నాస్టిక్ ప్రొసీజర్ కాంబినేషన్ ప్రోగ్రాం ద్వారా హాస్పిటల్స్ వినియోగదారులకు అందించే ఆరోగ్య సేవలకు విడివిడిగా కాకుండా ఒకే స్థిరమైన ఛార్జీలను చెల్లించేలా పథకాన్ని రూపొం దించింది. నోవార్టిస్, గ్లాక్సోస్మిత్‌క్లైన్, నోవో నోర్డిస్క్, ఐసాయి, నిప్పో, టకేడా లాంటి సంస్థల ఔషధాలు గత రెండు సంవత్సరాల కాలంలో పేటెంట్స్ కోల్పోవడంతో జనరిక్స్ మార్కెట్లో విదేశీ కంపెనీలకు అవకాశాలు లభించినట్లయింది. జీవన ప్రమాణాలు పెరగటంతో అదే నిష్పత్తిలో వృద్ధుల జనాభా పెరగటం కూడా హెల్త్‌కేర్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. బల్క్ డ్రగ్స్‌కూ పెద్ద మార్కెట్టే.. బల్క్‌డ్రగ్స్ వినియోగంలో జపాన్ పెద్ద మార్కెట్టేనని విర్చో లేబరేటరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. విర్చో సంస్థ గత 15 సంవత్సరాలుగా బల్క్‌డ్రగ్స్‌ను జపాన్‌కు ఎగుమతి చేస్తోందన్నారు. అయితే మిగతా దేశాలకన్నా జపాన్‌తో వ్యాపారం చేయటం అంత ఆశామాషీ కాదన్నారు.నాణ్యత విషయంలో ఎంతో జాగరూకత అవసరమన్నారు. బల్క్‌డ్రగ్ కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన హైదరాబాద్ సంస్థలు జపాన్ మార్కెట్‌పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎదురయ్యే సవాళ్లు.. జపాన్ సంపన్న దేశం కావటంతో వినియోగదారులు నాణ్యమైన ఔషధాలనే కోరుతున్నారు. ధర కన్నా నాణ్యతకు అక్కడ పెద్ద పీట వేస్తున్నారు. కొత్తగా మార్కెట్లో ప్రవేశించే బ్రాండ్లకు అంత త్వరగా ఆకర్శితులు కారన్నది పలు సంస్థల అనుభవం. మరీ ముఖ్యంగా చైనా, ఇండియా ఉత్పత్తులంటే వారికి నాణ్యమైనవి కావన్న అభిప్రాయం నాటుకుపోవడం కూడా మన దేశ కంపెనీలకు మైనస్ పాయింటే అని ఇండో-జపనీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అతుల్ సక్సేనా తెలిపారు.