ముంబై: గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికం గా సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 15 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టగా.., మొత్తం 66 కోట్ల బిడ్లు ధాఖలైనట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు తెలిపాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు (క్విబ్) విభాగంలో 36.97 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలోనూ 122.54 రెట్ల అధిక స్పందన నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 14.63 రెట్లు దరఖాస్తులు లభించాయి. ఈ ఐపీఓ జూలై 27న ప్రారంభమై 29వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ.695–720 గా నిర్ణయిం చి కంపెనీ రూ.1,514 కోట్లు సమకూర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment