Glenmark Pharma
-
మధుమేహానికి గ్లెన్‌మార్క్ కాంబినేషన్ డ్రగ్
హైదరాబాద్: టైప్–2 మధుమేహానికి గ్లెన్ మార్క్ ఫార్మా తొలి ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్‌ను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టైప్–2 మధుమేహం చికిత్సలో వినియోగించే టెనేలిగ్లిప్టిన్, డాపాగ్లిఫ్లోజిన్, మెట్ఫారి్మన్ కలయికతో కూడిన ఫిక్స్డ్ డోసేజ్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాన్ని ‘జిటా’ పేరుతో విడుదల చేసింది. మధుమేహంతోపాటు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచి్చంది. ఇందులో టెనేలిగ్లిప్టిన్ 20 ఎంజీ, డాపాగ్లిఫ్లోజిన్ 10ఎంజీ, మెట్ఫార్మిన్ ఎస్ఆర్ (500/1000ఎంజీ) రూపంలో ఉంటాయి. వైద్యుల సిఫారసు మేరకు ఈ ఔషధాన్ని రోజుకు ఒక్కసారి తీసుకోవాల్సి ఉంటుందని గ్లెన్‌మార్క్ ఫార్మా తెలిపింది. హెచ్‌బీఏ1సీ అధికంగా ఉండి, బరువు పెరగడం తదితర ఇతర సమస్యలతో బాధపడే వారిలో ఈ ఔషధం గ్లైసిమిక్ కంట్రోల్‌ను మెరుగుపరుస్తుందని గ్లెన్‌మార్క్ ఫార్మా ఇండియా ఫార్ములేషన్స్ హెడ్ అలోక్ మాలిక్ తెలిపారు. -
గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఐపీఓకు సూపర్ స్పందన
ముంబై: గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికం గా సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 15 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టగా.., మొత్తం 66 కోట్ల బిడ్లు ధాఖలైనట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు తెలిపాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు (క్విబ్) విభాగంలో 36.97 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలోనూ 122.54 రెట్ల అధిక స్పందన నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 14.63 రెట్లు దరఖాస్తులు లభించాయి. ఈ ఐపీఓ జూలై 27న ప్రారంభమై 29వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ.695–720 గా నిర్ణయిం చి కంపెనీ రూ.1,514 కోట్లు సమకూర్చుకుంది. -
దివీస్ జూమ్- గ్లెన్ మార్క్ బోర్లా
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో హెల్త్ కేర్ రంగ దిగ్గజాలు దివీస్ ల్యాబొరేటరీస్, గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ సాధించిన ఫలితాలు ఈ కౌంటర్లపై విభిన్న ప్రభావాన్ని చూపుతున్నాయ. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించగా.. గ్లెన్ మార్క్ పనితీరు నిరాశపరచింది. దీంతో దివీస్ కౌంటర్ కు డిమాండ్ నెలకొనగా.. గ్లెన్ మార్క్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. వెరసి దివీస్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. గ్లెన్ మార్క్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబ్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 4.6 శాతం జంప్ చేసి రూ. 3,386 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పురోగమించి రూ. 3,435ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం. గ్లెన్ మార్క్ ఫార్మా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ నికర లాభం 8.4 శాతం క్షీణించి రూ. 234 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు మాత్రం 5.2 శాతం పెరిగి రూ. 2,908 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 2 శాతం నీరసించి రూ. 339 కోట్లను తాకింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 137 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 486 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6.5 శాతం వెనకడుగుతో రూ. 479ను తాకింది. -
కోవిడ్‌కు అత్యంత చవకైన ట్యాబ్లెట్ ఇదే!
న్యూఢిల్లీ: కరోనా బాధితులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులన్నింటిలో ఫాబిఫ్లూ మెడిసిన్ అత్యంత చవకైందని ముంబై కేంద్రంగా పనిచేసే గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కేంద్రానికి తెలిపింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో సైతం మిగతా కోవిడ్ మందులతో పోల్చుకుంటే ఫాబిఫ్లూ తక్కు ధర అని గ్లెన్‌మార్క్ కేంద్రానికి వివరించింది. ఇతర కోవిడ్ మందులు రెమ్‌డెసివిర్, టాసిలీజుమాబ్, ఇతోలిజుమాబ్ ధరలు ఫాబిఫ్లూ కంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికమని కంపెనీ వాదించింది. ఫాబిఫ్లూ ధరలు, దాని పనితీరుపై కొన్ని విమర్శలు రావడంతో కేంద్రం గ్లెన్‌మార్క్‌ను వివరణ కోరగా ఈ మేరకు సదరు ఫార్మాస్యూటికల్ స్పందించింది. ఫాబిఫ్లూ ధర సామాన్యులకు సైతం అందుబాటులో ఉందని వివరణ ఇచ్చింది. (చదవండి: ప్లాస్మా థెరఫీతో కోలుకున్న జైన్) కాగా, గత నెలలో గ్లెన్‌మార్క్ కోవిడ్ చికిత్సలో పనిచేసే యాంటి వైరల్ ఔషదం ఫవిపిరవిర్‌ను ఫాబిఫ్లూ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. రూ.103 కు ఒక ట్యాబ్లెట్ చొప్పున ధర నిర్ణయించింది. కోవిడ్ నుంచి కోలుకునేందుకు రెండు వారాలపాటు ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే కోర్సు పూర్తయ్యే సరికి రూ.12,500 వ్యయం అవుతుంది. అయితే, ఫవిపిరవిర్ శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న కోవిడ్ బాధితులపై సరిగా పనిచేయడం లేదనే వార్తలు వెలువడ్డాయి. దాంతోపాటు ధరలు కూడా అధికంగా ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వివరణ ఇవ్వాలని కేంద్రం గ్లెన్ మార్క్‌కు నోటీసులు పంపింది. ఇదిలాఉండగా.. గత వారం గ్లెన్‌మార్క్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాబ్లెట్లపై ధరను 27 శాతం ధర తగ్గించింది. దాంతో ఒక్కో ట్యాబ్లెట ధర రూ.75 కు చేరింది. (గ్లెన్‌మార్క్ ఫార్మా- జిందాల్ స్టీల్.. బోర్లా) -
గుడ్‌న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది
సాక్షి, ముంబై : కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న తరుణంలో గ్లెన్‌మార్క్ కాస్త ఊరట నిచ్చింది. తన యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను 27శాతం తగ్గించింది. ఫాబిఫ్లూ టాబ్లెట్ ధరను తగ్గించి 75 రూపాయలకు అందిస్తున్నట్టు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కొత్త గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్పి) ప్రతి మాత్రకు 75 రూపాయలుగా ఉంటుందని తెలిపింది. గత నెలలో టాబ్లెట్‌కు 103 రూపాయల చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇతర దేశాలలో ఫావిపిరవిర్ ఖర్చుతో పోల్చితే భారతదేశంలో ఫాబిఫ్లూను అతి తక్కువ మార్కెట్ ఖర్చుతో ప్రారంభించామని, ఇపుడు ఇండియాలో తయారు కావడం, అధిక ఉత్పత్తి కారణంగా తక్కువ ధరతో అందుబాటులోకి తెచ్చామని సంస్థ ఇండియా బిజినెస్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ వెల్లడించారు. తద్వారా కరోనా రోగులకు తమ ఔషధం మరింత చేరువ వుందని తాము ఆశిస్తున్నామన్నారు. అలాగే ఇండియాలో కోవిడ్-19 రోగుల్లో కాంబినేషన్ థెరపీగా రెండు యాంటీవైరల్స్ డ్రగ్స్ షావిపిరవిర్, ఉమిఫెనోవిర్ సామర్థ్యాన్ని అంచనా వేసే మరో దశ 3 క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. (సోనూ సూద్ మరోసారి ఉదారత) చదవండి : ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు -
గ్లెన్‌మార్క్ ఫార్మా- జిందాల్ స్టీల్.. బోర్లా
జనరిక్ ఔషధాల ధరలను కృత్రిమంగా పెంచిన ఆరోపణలతో యూఎస్ జిల్లా కోర్టులో దేశీ హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌పై కేసు దాఖలైంది. కొలెస్టరాల్ చికిత్సతోపాటు ఇతర వ్యాధులకు వినియోగించే జనరిక్ ఔషధాల ధరల నిర్ణయంలో అపోటెక్స్ కార్ప్‌తో గ్లెన్‌మార్క్ చేతులు కలిపిన ఆరోపణలపై కేసు దాఖలైనట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనంటూ గ్లెన్‌మార్క్ ఫార్మా తాజాగా పేర్కొంది. ఇవి తప్పని నిరూపించే ఆధారాలు తమవద్ద ఉన్నట్లు తెలియజేసింది. 2013-15 మధ్య కాలంలో కొన్ని ఔషధాల ధరలను జనరిక్ కంపెనీలు అధికంగా నిర్ణయించిన ఆరోపణలతో ఫిలడెల్ఫియా జిల్లా కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్లెన్‌మార్క్ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.5 శాతం పతనమై రూ. 430 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 424 దిగువకు చేరింది. గత రెండు రోజుల్లో ఈ షేరు 8 శాతం నీరసించింది. జూన్ 22న సాధించిన ఏడాది గరిష్టం రూ. 573 నుంచి 25 శాతం క్షీణించింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఒమన్‌లోని ప్లాంటును విక్రయించేందుకు పశ్చిమాసియా బ్యాంక్ ఆల్పెన్ క్యాపిటల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) తాజాగా పేర్కొంది. బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువతో విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆల్పెన్ క్యాపిటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలియజేసింది. ఒమన్ ప్లాంటు 2.4 ఎంటీ వార్షిక సామర్థ్యంతో ఏర్పాటైంది. రూ. 5600 కోట్లమేర రుణ భారాన్ని కలిగి ఉంది. కీలకంకాని ఆస్తుల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా జేఎస్పీఎల్ వివరించింది. ఈ నేపథ్యంలో జిందాల్ స్టీల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 153 వద్ద ట్రేడవుతోంది. -
గ్లెన్‌మార్క్ ఫార్మా కొత్త రికార్డ్
కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల యాంటీవైరల్ ఔషధం ఫావిపిరవిర్‌ను దేశీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 30 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికం కావడంతో రూ. 123 ఎగసి రూ. 532 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.9 లక్షల షేర్లుకాగా.. తొలి గంటలోనే 11.46 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం! 200 ఎంజీ డోసేజీలో ఫబిఫ్లూ బ్రాండుతో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా వెల్లడించింది. ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. 200 ఎంజీ డోసేజీలో లభించే ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 103కాగా.. కరోనా బారినపడి స్వల్ప సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వీటిని వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలియజేసింది. తొలి రోజు 1800 ఎంజీ డోసేజీ రెండుసార్లు వేసుకోవలసి ఉంటుందని వివరించింది. తదుపరి 14వ రోజువరకూ రోజుకి 800 ఎంజీ చొప్పున రెండు పూటలా తీసుకోవలసి ఉంటుందని తెలియజేసింది. మొత్తం 34 ట్యాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ ధర రూ. 3500కు లభించనున్నట్లు వెల్లడించింది. డీజీసీఐ ఓకే మూడో దశ క్లినికల్ పరీక్షల డేటా ఆధారంగా ఫావిపిరవిర్ ఔషధాన్ని విక్రయించేందుకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ డీజీసీఏ నుంచి అత్యవసర ప్రాతిపదికన అనుమతి లభించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. తద్వారా కోవిడ్-19 సోకినవారి చికిత్సకు వీటిని వినయోగించేందుకు వీలు చిక్కినట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. ఈ ఔషధానికి క్లినికల్ పరీక్షలలో 88 శాతంవరకూ సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. నాలుగు రోజుల్లోనే వైరస్ లోడ్‌ను గణనీయంగా తగ్గించగలిగినట్లు వెల్లడించింది. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఇన్ఫ్లుయెంజా చికిత్సకు వినియోగిస్తున్న విషయం విదితమే. -
కోవిడ్ ఔషధం: ఒక్కో ట్యాబ్లెట్ రూ.103
న్యూఢిల్లీ: కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల యాంటీవైరల్ ఔషధం ఫావిపిరవిర్‌ను దేశీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికం కావడంతో రూ. 61.5 ఎగసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 103 రూపాయిలు ఫబిఫ్లూ బ్రాండుతో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా వెల్లడించింది. ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 103 రూపాయిలు కాగా.. తొలి రోజు 1800 ఎంజీ డోసేజీ రెండుసార్లు వేసుకోవలసి ఉంటుందని వివరించింది. తదుపరి 14వ రోజువరకూ రోజుకి 800 ఎంజీ చొప్పున రెండు పూటలా తీసుకోవలసి ఉంటుందని తెలిపింది. (కోవిడ్‌కు మరో ఔషధం.. ) మూడో దశ క్లినికల్ పరీక్షల డేటా ఆధారంగా ఫావిపిరవిర్ ఔషధాన్ని విక్రయించేందుకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ డీజీసీఏ నుంచి అత్యవసర ప్రాతిపదికన అనుమతి లభించినట్లు పేర్కొంది. తద్వారా కోవిడ్-19 సోకినవారి చికిత్సకు వీటిని వినియోగించేందుకు వీలు చిక్కినట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. ఈ ఔషధానికి క్లినికల్ పరీక్షలలో 88 శాతంవరకూ సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. నాలుగు రోజుల్లోనే వైరస్ లోడ్‌ను గణనీయంగా తగ్గించగలిగినట్లు వెల్లడించింది. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఇన్ఫ్లుయెంజా చికిత్సకు వినియోగిస్తున్న విషయం విదితమే. (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం) -
కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఔషధాన్ని విక్రయించేందుకు దేశీయ ఔషధ కంపెనీలు సిప్లా, హెటిరోకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఆదివారం ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పేర్కొంది. ఈ డ్రగ్ రాబోయే రెండో వారాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం) సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకు మందును అందుబాటులో తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు తెలిపారు. ఇంజక్షన్ రూపంలో ‘కోవిఫర్ 100 ఎంజీ’ మార్కెట్లోకి రానుందని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపింది. దీంతో కోవిడ్‌కు మందును కనిపెట్టిన ఘనత హైదరాబాద్ హెటిరోకి దక్కనుంది. ఇక కరోనా యాంటీ డ్రగ్ సిప్లా, హెటిరో సంస్థల ఆధ్వర్యంలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్!) -
కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటిం చింది. యాంటీ వైరల్ ఔషధం ‘ఫవిపిరవర్’ కోవిడ్ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ శనివారం వెల్లడించింది. తాము చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఫవిపిరవర్ మందు రోగులపై బాగా పనిచేస్తోందని కంపెనీ చైర్మన్, ఎండీ గ్లెన్ సల్దాన్హా తెలిపారు. (ప్రాణవాయువుకే ప్రాధాన్యం ) ఫాబీఫ్లూ టాబ్లెట్ 200ఎంజీ ఒక్కోటి రూ.103కి మార్కెట్లో లభిస్తుందన్నారు. 34 టాబ్లెట్లు ఉన్న స్ట్రిప్ రూ.3,500లకు మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. మొత్తం 14 రోజులు ఈ మందుని రోగులు వాడాల్సి ఉంటుంది. మొదటి రోజు 1800ఎంజీ పరిణామం కలిగిన ఫాబిఫ్లూని రెండుసార్లు, ఆ తర్వాత నుంచి 14 రోజుల వరకు రోజుకి 800ఎంజీ రోగులు తీసుకోవాలి. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఈ ఔషధాన్ని విక్రయిస్తారు. ప్రస్తుతానికి మొదటి నెలలో 82,500 మంది రోగులకి సరిపడా ఫాబిఫ్లూ టాబ్లెట్ల తయారీకి సన్నద్ధంగా ఉన్నామని, దేశంలో వైరస్ పరిస్థితిని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళతామని సల్దాన్హా అన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చునని గ్లెన్‌మార్క్ తెలిపింది. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది) -
కరోనా చికిత్స: మార్కెట్లోకి ఫబిఫ్లూ ఔషదం
న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న యాంటి వైరల్ ఔషదం ఫవిపిరవిర్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ శనివారం ప్రకటించింది. తమ ఔషదానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం మార్కెటింగ్ అనుమతులు ఇచ్చిందని తెలిపింది. ఫబిఫ్లూ పేరిట ఫవిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్టు వెల్లడించింది. కోవిడ్ బాధితుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వైరస్ తీవ్రత ఉన్నవారికి ఫబిప్లూతో చికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పింది. దేశీయంగా కరోనా రోగులకు చికిత్స అందించే మందుల్లో ఫబిఫ్లూ తొలి ఔషదమని కంపెనీ పేర్కొంది. ఇక భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ అప్రూవల్ రావడం శుభపరిణామమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా చెప్పారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఫబిఫ్లూతో ఉపశమనం లభించనుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం, మెడికల్ కమ్యునిటీతో కలిసి బాధితులకు సేవలందిస్తామన్నారు. (చదవండి: స్మార్ట్‌ఫోన్‌తో కరోనాను గుర్తించవచ్చు!) ఒక్కో టాబ్లెట్ ధర 103 రూపాయలుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 1800 ఎంజీ మాత్రలు రోజు ఒకటి చొప్పున, 800 ఎంజీ మాత్రలు రోజూ రెండు చొప్పున 14 రోజుల వరకు వైద్యుల సలహామేరకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. కాగా, జపాన్‌లో ఇన్ఫ్లుయంజా వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం తొలుత ఈ ఔషధాన్ని కనుగొన్నారు. కొవిడ్-19 వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో బాధితులకు ఫవిపిరవిర్ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇదిలాఉండగా.. శనివారం దేశవ్యాప్తంగా మరో 14,516 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరింది. తాజాగా 375 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 12,948 కి చేరాయి. (చదవండి: నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!) -
మూడవ దశలో క్లినికల్ ట్రయిల్స్: గ్లెన్‌మార్క్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ నిరోధానికి ఔషధ తయారీలో దేశీయ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మా మరో అడుగు ముందుకేసింది. ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మా స్యూటికల్స్ కరోనా వైరస్ సోకిన రోగులపై ఇప్పటికే మూడు దశల ట్రయల్స్ ను నిర్వహించింది. తాజాగా యాంటీవైరల్ ఫావిపిరావిర్, ఉమిఫెనోవిర్ మందులపై మూడవ దశలో కీలకమైన మరో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి పొందింది. భారతదేశంలో కోవిడ్-19 రోగులలో ఈ రెండు యాంటీవైరల్ మందుల కలయికలో 'ఫెయిత్ ట్రయల్' గా పిలిచే ట్రయిల్స్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుండి అనుమతి లభించిందని గ్లెన్‌మార్క్ తాజాగా ప్రకటించింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) ఫావిపిరవిర్, ఉమిఫెనోవిర్ యాంటీవైరల్ డ్రగ్స్ రెండూ వేర్వేరు చర్యలను కలిగి ఉంటాయి. వాటి కలయికతో వ్యాధి ప్రారంభ దశలో రోగులలో అధిక వైరల్ లోడ్లను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని, తద్వారా మెరుగైన చికిత్స సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత ప్రభావవంతమైన, సురక్షితమైన చికిత్సలను గుర్తించడంలో ఈ అధ్యయనం కీలకమైందిగా భావిస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా టాండన్ వ్యాఖ్యానించారు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు) ఈ అధ్యయనంలో కరోనావైరస్ మోడరేట్ లక్షణాలు ఉన్న 158 మంది పాల్గొంటారని తెలిపింది. వీరిని రెండు గ్రూపులుగా విడదీసి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రముఖ ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నామనీ, ఇప్పటివరకు, 30 మంది రోగులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు వుంటుందనీ, మొత్తం అధ్యయనం వ్యవధి గరిష్టంగా 28 రోజులు ఉంటుందని కంపెనీ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు జూలై, లేదా ఆగస్టులో వెలువడే అవకాశం వుందని అంచనా వేసింది. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్) కరోనా రోగులకు చికిత్సను ప్రారంభించాలన్న తమ ప్రయత్నంలో ఇది మరొక దశ అనీ, ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉత్పత్తి ప్రాప్యతను నిర్ధారించడానికి తాము చేయగిలిందంతా చేస్తామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇండియా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా బిజినెస్ అధ్యక్షుడు సుజేష్ వాసుదేవన్ అన్నారు. కరోనా సోకిన రోగులపై మూడవ దశలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన మొట్టమొదటి ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ కావడం విశేషం. -
మూడో దశకు కరోనా ఔషధ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ ఔషధ తయారీలో గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ కీలకదశకు చేరుకుంది. కరోనా యాంటివైరల్ ట్యాబ్లెట్ ఫావిపిరావిర్‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులను పొందింది. దీంతో మన దేశంలో ఫేజ్–3 అనుమతులు పొందిన తొలి కంపెనీగా గ్లెన్‌మార్క్ నిలిచింది. క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 10 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంది. జూలై– ఆగస్టు నెలలో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వస్తాయని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఫావిపిరావిర్ జనరిక్ వెర్షనే..: జపాన్‌కు చెందిన ఫ్యూజిఫిల్మ్ కార్పొరేషన్ అనుబంధ ఫార్మా కంపెనీ ఫ్యూజిఫిల్మ్ తొయోమా కెమికల్ కో లిమిటెడ్ అభివృద్ధి చేసిన అవిగాన్ మందుకు జనరిక్ వర్షనే ఈ ఫావిపిరావిర్ ట్యాబ్లెట్. గ్లెన్‌మార్క్‌కు తొలి దశ పరిశోధనలకు గత నెలలో డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గ్లెన్‌మార్క్ పరిశోధన మరియు అభివృద్ధి బృందం సొంతంగా ఫావిపిరావిర్ యాక్టివ్ ఫార్మాసూటికల్స్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఫార్ములేషన్స్‌ను అభివృద్ధి చేసింది. ఇన్‌ఫ్లూయోంజా వైరస్ల మీద ఫావిపిరావిర్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. నోవల్ ఇన్ఫ్లూ్యయెంజా వైరస్ ఇన్షెక్షన్స్ చికిత్స కోసం జపాన్‌లో అనుమతులు కూడా పొందింది. ఈ మాలిక్యూల్‌ను మన దేశంలో కమర్షియల్ చేస్తే గనక ఫ్యాబిఫ్లూ బ్రాండ్ పేరిట మార్కెట్ చేస్తామని కంపెనీ తెలిపింది. 150 మంది మీద పరిశోధనలు.. ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ 150 మంది కరోనా రోగుల మీద 1:1 నిష్పత్తిలో పరిశోధన ఉంటుంది. చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు, అధ్యయన వ్యవధి గరిష్టంగా 28 రోజులు ఉంటుంది. ‘‘దేశ, విదేశాల్లోని గ్లెన్‌మార్క్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు కరోనా రోగుల మీద ఫావిపిరావిర్ పనితీరును గమనిస్తున్నామని, మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ క్లినికల్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ డాక్టర్ మోనికా టండన్ తెలిపారు. ‘‘క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే.. వెంటనే దేశవ్యాప్తంగా ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తామని’’ గ్లెన్‌మార్క్ ఇండియా ఫార్ములేషన్స్ ప్రెసిడెంట్ సుజేష్ వాసుదేవన్ తెలిపారు. -
కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!
సాక్షి, ముంబై: భారతీయ ఔషధ దిగ్గజం గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ కరోనా వైరస్ నివారణ మందుల తయారీలో కీలక అభివృద్ధిని సాధించినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించే యాంటీ-రెట్రోవైరల్ (ఏఆర్వీ) ను అభివృద్ధి చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా కంపెనీ అవతరించనుంది. ఈ యాంటీ వైరల్ డ్రగ్ కు సంబంధించిన ఫావిపిరవిర్ కోసం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను (ఎపిఐ) కంపెనీ అభివృద్ధి చేయగలిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ట్రయల్స్ నిమిత్తం రెగ్యులేటరీ ఆమోదం కోసం దరఖాస్తు చేసింది. అంతేకాదు ఈ మందు మార్కెటింగ్ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా వెల్లడించాయి. మార్కెటింగ్ ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)ని ఆశ్రయించినట్టు సంస్థ ధృవీకరించింది. ఇది వాస్తవ రూపం దాలిస్తే భారతీయ ఔషధ కంపెనీల చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అని నిపుణులు భావిస్తున్నారు. (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు) ఏఆర్వీ ఔషధం కరోనా వైరస్ చికిత్సలో సానుకూల ఫలితాలను చూపించిందని అంచనాలు వెలువడ్డాయి. ఈ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ 14 రోజుల నుంచి 1 నెల వరకు ఉంటాయని తెలిపింది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే భారతీయ మార్కెట్లో ఈ డ్రగ్ లాంచ్ చేయనుందంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ బీసీ నివేదించింది. ఈ ఔషధం భారతదేశం కోసం మాత్రమే అభివృద్ధి చేయబడుతోందని ఇతర మార్కెట్లకు కాదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఫవిపిరవీర్ కు పేటెంట్ లేనందున ఇతర కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించవచ్చని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఫుజిఫిలిం సంస్థ ఫావిపిరవిర్ మందును తయారు చేస్తోంది. చైనా, జపాన్లలో కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఫుజిఫిలిం అమెరికాలో ఫావిపిరవిర్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ వార్తలతో గతరెండు సెషన్లుగా భారీగా లాభపడిన గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్లు గురువారం 7 శాతానికి పైగా ఎగిసాయి. (కోవిడ్ -19 : కంపెనీలకు ఊరట) -
గ్లెన్ మార్క్ ఫార్మా భారీ పతనం
గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ భారీగా పతనమవుతోంది. మార్చి క్వార్టర్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ కంపెనీ షేరు విలువ మార్నింగ్ ట్రేడింగ్ లో 16 శాతం మేర నష్టపోయి, 760 రూపాయల వద్ద నమోదైంది. గత ఏడేళ్లలో ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. కంపెనీ ప్రకటించిన మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాల్లో రూ.184 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. అయితే ఇవి విశ్లేషకులు అంచనావేసిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కంపెనీ రూ.548 కోట్ల మేర నికర లాభాలను ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. వారి అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కంపెనీ ఫలితాలను ప్రకటించింది. అంతకముందు 2009 ఫిబ్రవరి 19న కూడా కంపెనీ ఇంట్రాడే ట్రేడ్ లో 17.4 శాతం మేర నష్టపోయింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద పతనం. క్వార్టర్ రివ్యూలో నిర్వహణల నుంచి కంపెనీకి వచ్చిన రెవెన్యూలు సింగిల్ డిజిట్ మాత్రమే నమోదై, రూ.2,457 కోట్లగా ఉన్నాయి. ఈ రెవెన్యూలు కూడా రూ.2,713 కోట్లగా ఉంటాయని విశ్లేషకులు భావించారు. కంపెనీకి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికాలో విక్రయాలు 53.5 శాతం పెరిగి రూ.1000 కోట్లగా నమోదుకాగ, భారత్ లో అవి కేవలం 6.9 శాతం మాత్రమే పెరిగి రూ.577 కోట్లగా రికార్డయ్యాయి. మార్చి 31 వరకు గ్లెన్ మార్క్ నికర రుణాలు కూడా రూ.3667 కోట్లకు పెరిగాయి. గత నాలుగు నెలల్లో గ్లెన్ మార్క్ గోవా, బడీ తయారీ సంస్థల్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీగా దాడులు జరిపింది. -
మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ఔషధం
-
మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ఔషధం
- టెనెలిగ్లిప్టెన్ ట్యాబ్లెట్స్ను విడుదల చేసిన గ్లెన్‌మార్క్ - మిగిలిన వాటితో పోలిస్తే ఏడాదికి రూ. 9,000 మిగులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ట్యాబ్లెట్లను గ్లెన్‌మార్క్ ఫార్మా విడుదల చేసింది. టైప్-2 డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల కోసం ‘టెనెలిగ్లిప్టెన్’ పేరుతో రెండు రకాల ట్యాబ్లెట్లను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్లిప్టెన్ ట్యాబ్లెట్ల కంటే 55 శాతం తక్కువ ధరకే వీటిని అందిస్తున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా ప్రెసిడెంట్, హెడ్ (ఇండియా బిజినెస్) సుజేష్ వాసుదేవన్ తెలిపారు. ఇతర ట్యాబ్లెట్లు ధర రోజుకు రూ. 45 అవుతుంటే, కేవలం రూ. 19.90లకే వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఏడాదికి సగటున రూ. 9,000 వరకు ఆదా అవుతుందని అంచనా అన్నారు.. ఏటా ఇండియాలో రూ. 100 కోట్ల విలువైన డయాబెటిక్ ఔషధాలను విక్రయిస్తున్నామని, ఈ కొత్త ట్యాబ్లెట్ల వల్ల ఆదాయం మరిం త పెరుగుతుందని తెలిపారు. ఇండియా డయాబెటిక్ మార్కెట్ విలువ రూ. 6,610 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికా మార్కెట్లో 8 ఔషధాలకు అనుమతృులు వచ్చాయని, మిగిలిన ఆరు నెలల్లో కనీసం నాలుగు ఔషధాలకు అనుమతులు లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యాపార విస్తరణ కోసం రూ. 600 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.