న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటిం చింది. యాంటీ వైరల్ ఔషధం ‘ఫవిపిరవర్’ కోవిడ్ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ శనివారం వెల్లడించింది. తాము చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఫవిపిరవర్ మందు రోగులపై బాగా పనిచేస్తోందని కంపెనీ చైర్మన్, ఎండీ గ్లెన్ సల్దాన్హా తెలిపారు. (ప్రాణవాయువుకే ప్రాధాన్యం )
ఫాబీఫ్లూ టాబ్లెట్ 200ఎంజీ ఒక్కోటి రూ.103కి మార్కెట్‌లో లభిస్తుందన్నారు. 34 టాబ్లెట్లు ఉన్న స్ట్రిప్ రూ.3,500లకు మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. మొత్తం 14 రోజులు ఈ మందుని రోగులు వాడాల్సి ఉంటుంది. మొదటి రోజు 1800ఎంజీ పరిణామం కలిగిన ఫాబిఫ్లూని రెండుసార్లు, ఆ తర్వాత నుంచి 14 రోజుల వరకు రోజుకి 800ఎంజీ రోగులు తీసుకోవాలి. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఈ ఔషధాన్ని విక్రయిస్తారు. ప్రస్తుతానికి మొదటి నెలలో 82,500 మంది రోగులకి సరిపడా ఫాబిఫ్లూ టాబ్లెట్ల తయారీకి సన్నద్ధంగా ఉన్నామని, దేశంలో వైరస్ పరిస్థితిని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళతామని సల్దాన్హా అన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చునని గ్లెన్‌మార్క్ తెలిపింది. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది)
Comments
Please login to add a commentAdd a comment