Favipiravir
-
‘ఎన్ని పిటిషన్లు వేసినా.. వాటిని చేస్తూనే ఉంటా’
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇటీవల వేలాది మందికి ఫాబీఫ్లూ అనే మందులను కరోనా బాధితులకు ఉచితంగా అందజేశారు. అయితే దీంతో గంభీర్‌పై కోర్టులో వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది. తాజాగా ఈ అంశంపై గంభీర్ స్పందించారు. ఎన్ని పిటిషన్లు వేసినా...ప్రజా సేవను ఆపను గంభీర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని భావించాను, కనుక ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేను పంపిణీ చేసిన మందులు అత్యవసరమైనవని, నాపై వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు చేసినప్పటికీ తాను మాత్రం ప్రాణాలు రక్షించేందుకు ప్రజాసేవను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంపీ గౌతం గంభీర్ పెద్ద మొత్తంలో ఔషధాలను నిల్వ ఉంచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకే వ్యక్తి ఇలా ఔషధాలు నిల్వ చేయడం వల్ల ఇతర నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వ్యాజ్యంలో పేర్కొన్న విధంగా ఫావిపిరవిర్ ఔషధ పంపిణీ విషయంలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. గంభీర్‌కు ఇంతపెద్ద మొత్తంలో మందులు ఎలా లభించిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: Rajasthan Cm: కోటి వ్యాక్సిన్లు ఓ రోజుకి సరిపోవు -
Gautam Gambhir: ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా: హైకోర్టు
న్యూఢిల్లీ: ఫావిపిరవిర్ ఔషధ పంపిణీ విషయంలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. గంభీర్‌కు ఇంతపెద్ద మొత్తంలో ఫావిపిరవిర్ ఎలా లభించిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ పెద్ద మొత్తంలో ఔషధాలను నిల్వ ఉంచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకే వ్యక్తి ఇలా ఔషధాలు నిల్వ చేయడం వల్ల ఇతర నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ విషయంపై డీసీజీఐ విచారణ చేపడతుంది. ఆయన ఒక జాతీయ క్రీడాకారుడు. మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశారని భావిస్తున్నాం. ఆయన సంకల్పం మంచిదే అయినా, ఎంచుకున్న విధానం సరికాదు. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా సరే, ఇది సరికాదు. అసలు ఆయనకు అంతపెద్ద మొత్తంలో కెమిస్టు మందులు ఎలా ఇచ్చారు. ఏ ప్రిస్కిప్షన్ చూసి ఇచ్చారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టండి. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకోండి’’ అని ఆదేశించింది. కాగా గతంలో కూడా గంభీర్ ఫాబిఫ్లూ మెడిసిన్ పంపిణీ చేస్తున్న అంశంపై కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. చదవండి: Vaccination: తప్పించుకునేందుకు నదిలో దూకారు! -
యూఓహెచ్ ఘనత.. మరింత చౌకగా ఫావిపిరవిర్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్)లోని ఆస్పైర్ టీబీఐలో ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ ఆప్టస్ థెరప్యూటిక్స్ కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న మందు ఫావిపిరవిర్‌ను మరింత చౌకగా ఉత్పత్తి చేసేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించింది. కృత్రిమ రసాయన శాస్త్రం, కెమో ఎంజమాటిక్ రసాయన శాస్త్రాలపై పరిశోధనలు చేసే ఆప్టస్ థెరప్యూటిక్స్ ఫావిపిరవిర్తోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగించే ఓ మందును కూడా మరింత సమర్థంగా, చౌకగా, పర్యావరణ అనుకూల మార్గాల్లో ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ పద్ధతి ద్వారా ఫావిపిరవిర్‌ను కావాల్సినంత మోతాదులో సులువుగా తయారు చేసుకొనే అవకాశం ఏర్పడటం గమనార్హం. ఈ పద్ధతిలో తక్కువ రసాయనాలను వాడటం, కావాల్సిన అణువులను సులువుగా వేరు చేసే అవకాశం ఉండటం దీనికి కారణం. (33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్) హైదరాబాద్‌లోని ఫ్లెమింగ్ లేబొరేటరీస్ సహకారంతో వాణిజ్యస్థాయి ఉత్పత్తిపై కూడా ప్రయోగాలు పూర్తి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఫావిపిరవిర్‌ను భారీగా సరఫరా చేసేందుకు ఫ్లెమింగ్ లేబొరేటరీస్ ఇప్పటికే ఓ రష్యా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన ఆప్టస్ లేబొరేటరీస్ సాధించిన ఘనతను కొనియాడారు. వర్సిటీకి ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్టస్ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్ కోటిరెడ్డి, ఫ్లెమింగ్ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
కరోనాకు మరో శక్తివంతమైన ఫావిపిరావిర్ డ్రగ్
సాక్షి,హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ ఎఫ్డీసీ లిమిటెడ్ భారతదేశంలో కోవిడ్-19 తేలికపాటి లక్షణాలకు వినియోగించే మందులను లాంచ్ చేసింది. తాజాగా 800 ఎంజీ ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కరోనా చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ను పిఫ్లు ఫావెంజా బ్రాండ్లలో కంపెనీ విక్రయిస్తోంది.ఇకపై వీటి 800 ఎంజీ వెర్షన్ మందులు మరింత శక్తివంతంగా పనిచేస్తాయని కంపెని చెబుతోంది. 800 ఎంజీ ట్యాబ్లెట్లతో రోగులకు చికిత్స వ్యయం 30 శాతం తగ్గుతుందని ఎఫ్డీసీ ప్రతినిధి మయంక్ టిక్కా తెలిపారు. అలాగే రోగి తీసుకోవలసిన మాత్రల సంఖ్యను 75శాతం తగ్గించడానికి సహాయపడుతుందన్నారు. మందుల షాపులతోపాటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మాసీల్లోనూ నవంబరు 1 నుంచి ఇవి లభిస్తాయి. -
ఇండొకొ- సూర్య రోష్నీ.. మెరుపులు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 483 పాయింట్లు జంప్‌చేసి 37,872కు చేరింది. కాగా.. కోవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న ఫావిపిరవిర్ ఔషధాన్నిదేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో ఇండొకొరెమిడీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు పీఎస్‌యూ దిగ్గజాల నుంచి తాజాగా ఆర్డర్లు పొందినట్లు పేర్కొనడంతో స్టీల్, ఎలక్ట్రికల్ లైటింగ్ ప్రొడక్టుల కంపెనీ సూర్య రోష్నీ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండొకొ రెమిడీస్ ఫెవిండో 400 పేరుతో ఫావిపిరవిర్ ఔషధాన్ని 400 ఎంజీ డోసేజీలో దేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ ఇండొకొరెమిడీస్ వెల్లడించింది. ఇన్ఫ్లుయెంజా వైరస్ కట్టడికి ఆర్ఎన్ఏ ఆధారంగా పనిచేసే ఈ ఔషధానికి డీసీజీఐ అనుమతి లభించినట్లు పేర్కొంది. ఈ ఔషధంతోపాటు.. కోవిడ్-19 చికిత్సలో భాగంగా వినియోగించగల పోవిడోన్ లోడిన్ గార్గిల్, రోగ నిరోధక శక్తిని పెంచగల ట్యాబ్లెట్లనూ విడుదల చేసినట్లు ఇండొకొ తెలియజేసింది. ఈ ట్యాబ్లెట్లు జింక్, విటమిన్ సి, డిలను కలిగి ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇండొకొ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లింది. రూ. 284 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 5 శాతం ఎగసి రూ. 275 వద్ద ట్రేడవుతోంది. సూర్య రోష్నీ ఆయిల్, గ్యాస్ పీఎస్‌యూలు గెయిల్, ఐజీజీఎల్ నుంచి రూ. 273 కోట్ల విలువైన కాంట్రాక్టులు తాజాగా లభించినట్లు సూర్య రోష్నీ పేర్కొంది. ఆర్డర్లలో భాగంగా ఏపీఐ లైన్ పైపులను గెయిల్, ఐజీజీఎల్(ఇంద్రధనుష్ గ్యాస్ గ్రిడ్)లకు సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈశాన్య గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆర్డర్లు లభించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సూర్య రోష్నీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 10 శాతం జంప్‌చేసింది. రూ. 213ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 206 వద్ద ట్రేడవుతోంది. -
ఎఫ్డీసీ- బిర్లా టైర్స్.. హైజంప్
ఓ మాదిరి లక్షణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు వినియోగించగల ఫావిపిరవిర్ ఔషధాన్ని రెండు వేరియంట్లలో విడుదల చేసినట్లు వెల్లడించడంతో ఫార్మా రంగ కంపెనీ ఎఫ్డీసీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోవైపు విభిన్న మార్గాలలో నిధులను సమీకరించనున్నట్లు తెలియజేయడంతో ప్రయివేట్ రంగ కంపెనీ బిర్లా టైర్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎఫ్డీసీ లిమిటెడ్ కోవిడ్-19 కారణంగా స్వల్ప లక్షణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వినియోగించగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను రెండు వేరియంట్లలో విడుదల చేసినట్లు ఎఫ్డీసీ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఈ ఔషధానికి ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించడంతో తాజాగా పిఫ్లూ, ఫవెంజా బ్రాండ్లతో వీటిని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఒక్కో ట్యాబ్లెట్ ఖరీదు రూ. 55గా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్డీసీ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.6 శాతం ఎగసి రూ. 338ను తాకింది. ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 331 వద్ద ట్రేడవుతోంది. బిర్లా టైర్స్ లిమిటెడ్ ఈక్విటీ లేదా రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 1,100 కోట్లవరకూ నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు బిర్లా టైర్స్ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై శుక్రవారం(28న) నిర్వహించనున్న సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ షేర్లు లేదా మార్పిడిక వీలుకాని డిబెంచర్లు(ఎన్సీడీలు) తదితర సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బిర్లా టైర్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23.40 వద్ద ఫ్రీజయ్యింది. -
డా.రెడ్డీస్ కరోనా ఔషధం : హోం డెలివరీ కూడా
సాక్షి, హైదరాబాద్ : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కరోనా వైరస్ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మరో శుభవార్తను కూడా సంస్థ అందించింది. కరోనా బాధితులకు వేగంగా ఈ ఔషధాన్ని అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 42 నగరాల్లో ఉచిత హోమ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. జపనీస్ దిగ్గజం ఫుజిఫిల్మ్ టొయామా కెమికల్ కంపెనీతో గ్లోబల్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా వీటిని తీసుకొచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. అవిగాన్ రెండు సంవత్సరాల షెల్ఫ్ లైఫ్ తో 122 టాబ్లెట్ల పూర్తి థెరపీ ప్యాక్‌లో వస్తుందన్నారు. అలాగే వారమంతా (సోమవారం-శనివారం వరకు) ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేలా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతానికి వారు జపాన్ నుండి దీనిని దిగుమతి చేసుకుంటున్నారని, త్వరలో దేశీయంగా తయారు చేస్తామని రమణ తెలిపారు. అలాగే కరోనాకు సంబంధించి మరో ఔషధమైన రెమ్‌డెసివిర్‌ను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు అవిగాన్ (ఫావిపిరవిర్) ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
కోవిడ్-19కు డాక్టర్ రెడ్డీస్ నుంచి ట్యాబ్లెట్లు
కరోనా వైరస్ సోకి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించగల ఫావిపిరవిర్ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తాజాగా పేర్కొంది. అవిగాన్ బ్రాండుతో ఈ ఔషధ ట్యాబ్లెట్లను 200 ఎంజీ డోసేజీలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. రెండేళ్ల కాలావధి కలిగిన ఈ ఔషధ పూర్తి ప్యాక్ 122 ట్యాబ్లెట్లతో లభిస్తుందని తెలియజేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చే యోచనతో ఆన్లైన్ ద్వారా 42 పట్టణాలలో వీటిని హోమ్ డెలివరీ సైతం చేస్తున్నట్లు వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రం ద్వారా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో సెప్టెంబర్ మొదటి వారానికల్లా కోవిడ్-19 చికిత్సకు మరో ఔషధం రెమ్‌డెసివిర్‌ను సైతం మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఫుజిఫిల్మ్ టొయామా నుంచి జపనీస్ దిగ్గజం ఫుజిఫిల్మ్ టొయామా కెమికల్ కంపెనీ నుంచి పొందిన గ్లోబల్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా వీటిని విక్రయిస్తున్నట్లు కంపెనీ వర్ధమాన మార్కెట్ల బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ పేర్కొన్నారు. దేశీయంగా వీటి తయారీ, విక్రయం, పంపిణీలకు ప్రత్యేక హక్కులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ ట్యాబ్లెట్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో వీటి తయారీని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కోవిడ్-19 కారణంగా ఓమాదిరి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించేందుకుగాను ఈ ట్యాబ్లెకు డీసీజీఐ అనుమతి ఉన్నట్లు వివరించారు. -
33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని హైదరాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ తయారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అత్యంత చౌకగా విక్రయిస్తోంది. ఒక్కో ట్యాబ్లెట్ ధరను రూ.33గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్‌ను సొంత పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రూపొందించామని ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నాణ్యమైన మందులు అందరికీ చవకగా అందుబాటులో ఉండాలని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కంపెనీ కోవిడ్–19 చికిత్సలో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీ క్యాప్సూల్స్‌ను ప్రవేశపెట్టింది. (రెమ్‌డెసివిర్ : చౌక మందు లాంచ్) డిమాండ్‌కు తగ్గట్టుగా...: ఫావిలో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు ఎంఎస్ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘డిమాండ్‌కు తగ్గట్టుగా ఫావిలో సరఫరా చేయగలిగే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్రస్తుతం బొలారం ప్లాంటులో దీనిని తయారు చేస్తున్నాం. డిమాండ్ అధికమైతే కొత్తూరు యూనిట్లో కూడా ఉత్పత్తి చేస్తాం’ అని వివరించారు. 2003లో ప్రారంభమైన ఎంఎస్ఎన్ గ్రూప్‌నకు తెలంగాణలో 11 ఏపీఐ, మూడు ఫార్ములేషన్ యూనిట్లున్నాయి. యూఎస్‌లో ఒక ఫార్ములేషన్ కేంద్రం ఉంది. 11,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 560 డ్రగ్ మాస్టర్ ఫైల్స్, 370 ఏపీఐలు కంపెనీ ఖాతాలో ఉన్నాయి. (‘బయోఫోర్’ నుంచి కొవిడ్-19 ఔషధం) -
‘బయోఫోర్’ నుంచి కొవిడ్-19 ఔషధం
సాక్షి, హైదరాబాద్ : ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన జెనరా ఫార్మా.. కోవిడ్ చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్స్ తయారీకై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. ఫావిజెన్ పేరుతో ఈ ట్యాబ్లెట్లను కంపెనీ తయారు చేయనుంది. హైదరాబాద్‌లో యూఎస్ఎఫ్డీఏ అనుమతి పొందిన కంపెనీ ఫెసిలిటీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని జెనరా కో–ఫౌండర్, ఎండీ జగదీశ్ బాబు రంగిశెట్టి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. (కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్) ‘ధర విషయంలో ఆసుపత్రులు, పలు సంస్థలతో మాట్లాడుతున్నాం. రోగులకు అందుబాటులో ధర ఉండాలన్నదే మా ధ్యేయం. డబ్బులు వెచ్చించలేని వారికి తగ్గింపు ధరలో లేదా ఉచితంగా సరఫరా చేసేందుకూ మేం సిద్ధం. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్‌తయారీకి కావాల్సిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా ఉత్పత్తి చేశాం. మా వద్ద ఉన్న నిల్వలతో నాలుగు లక్షల మంది రోగులకు సరిపడ ట్యాబ్లెట్లను తయారు చేయవచ్చు’ అని వివరించారు. (ఫావిపిరవిర్‌కి ఆవ్రా ల్యాబ్‌కు అనుమతి) కొత్త విభాగాల్లోకి బయోఫోర్..: న్యూట్రాస్యూటికల్స్, ఇమ్యూన్ బూస్టర్స్ విభాగాల్లోకి బయోఫోర్ త్వరలో ఎంట్రీ ఇస్తోంది. తొలుత ఆరు రకాల ఉత్పత్తులను విడుదల చేయనున్నామని జగదీశ్ బాబు వెల్లడించారు. వీటి ధర రూ.100–200 శ్రేణిలో ఉంటుందని వివరించారు. బయోఫోర్‌కు చెందిన హైదరాబాద్ ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తామన్నారు. -
కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్
సాక్షి, ముంబై : ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ కరోనా వైరస్ నివారణకు ప్రయోగాత్మక ఔషధంగా భావిస్తున్నఫావిపిరవిర్ డ్రగ్ లాంచ్ చేసింది. కోవిహాల్ట్ పేరుతో ఈ ఔషదాన్ని బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బుధవారం ప్రకటించింది. 200 మి.గ్రా టాబ్లెట్ ధరను 49 రూపాయలుగా నిర్ణయించింది. (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త ) తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్-19 రోగుల్లో చికిత్స కోసం కోవిహాల్ట్ బ్రాండ్ పేరుతో భారతదేశంలో తన ఫావిపిరవిర్‌ను ప్రారంభించినట్లు లుపిన్ వెల్లడించింది. ఇది 10 టాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో లభిస్తుందని లుపిన్ ఇండియా రీజియన్ ఫార్ములేషన్స్ (ఐఆర్ఎఫ్) ప్రెసిడెంట్ రాజీవ్ సిబల్ తెలిపారు. తమ బలమైన నెట్ వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్నిఅందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.(కరోనాకు అతిచవక మందు వచ్చేసింది) అత్యవసర వినియోగానికి ఫావిపిరవిర్ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి అనుమతి పొందింది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా దీని తయారీ, విక్రయానికి గ్లెన్ మార్క్, హెటెరో, సిప్లా, సన్ ఫార్మ లాంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకుంది. -
కరోనాకు అతిచవక మందు వచ్చేసింది
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి అతి చవకైన ఔషధాన్నిలాంచ్ చేసింది. దేశంలో రోజుకు 50వేల కోవిడ్-19 కేసులు నమోదవుతున్న తరుణంలో ఊరటినిచ్చే వార్తను సన్ ఫార్మా అందించింది. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను ప్రారంభించినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది. ఈ ఔషధం ఒక్కో టాబ్లెట్ ధరను కేవలం 35 రూపాయలుగా నిర్ణయించింది. అతి తక్కువ ధరలో ఎక్కువమంది బాధితులకు తమ మందును అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫ్లూగార్డ్‌ను అవిష్కరించామని సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈఓ కీర్తి గానోర్కర్ తెలిపారు. తద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించాలనేది లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా రోగులకు ఫ్లూగార్డ్ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం, ఇతరులతో కలిసి పనిచచేయనున్నామని ప్రకటించారు. ఈ వారంలో ఫ్లూగార్డ్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందన్నారు. తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్-19 రోగులకు సంభావ్య చికిత్స కోసం భారతదేశంలో ఆమోదించబడిన ఏకైక నోటియాంటీ-వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ అని ఫార్మా సంస్థ తెలిపింది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఫావిపిరవిర్‌ను అభివృద్ధి చేస్తున్న లేదా విక్రయించే ఇతర భారతీయ ఫార్మా కంపెనీల్లో గ్లెన్‌మార్క్ ఫార్మా, సిప్లా, హెటెరో ల్యాబ్‌లు ఉన్న సంగతి విదితమే. -
కరోనా : మార్కెట్లోకి హెటిరో ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్
న్యూఢిల్లీ : కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటీరో బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫావిపిరవిర్ ఒక్క ట్యాబ్లెట్ ధర రూ. 59గా నిర్ణయించినట్టు తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదివరకే కరోనా చికిత్సలో వినియోగించే రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో తమ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఫావిపిరవిర్ ఔషధం క్లినికల్‌గా సానుకూల ఫలితాలు ఇచ్చిందని తెలిపింది. (కోవిడ్-19 వ్యాక్సిన్ల ధరల యుద్ధం?!) ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు సంబంధించి డీసీజీఐ నుంచి అన్ని అనుమతులను పొందినట్టు హెటిరో వెల్లడించింది. హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ ద్వారా ఫావిపిరవిర్ ఔషధం మార్కెటింగ్ చేయబడుతుందని.. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్ ఫార్మసీలలో.. ఈ ఔషధం నేటి నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పింది. డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే ఈ డ్రగ్‌ను విక్రయించడం జరుగుతుందని తెలిపింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న ఎక్కువ మంది కోవిడ్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ ఔషధం తోడ్పతుందని పేర్కొంది. దేశంలోని తమ కంపెనీ ఫార్ములేషన్ ఫెసిలిటీలో తయారవుతున్న ఈ డ్రగ్‌కు గ్లోబల్ రెగ్యులేటరీ అధికారులు కూడా ఆమోదించారని వెల్లడించింది.(హెటిరో ‘కోవిఫర్’ ధర రూ.5,400) -
ఫావిపిరవిర్‌కి ఆవ్రా ల్యాబ్‌కు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సకు ఉపయోగించే ఫావిపిరవిర్ తయారీకి అవసరమైన ఆక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్ (ఏపీఐ) రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తమకు అనుమతులిచ్చినట్లు హైదరాబాద్‌లోని ఆవ్రా ల్యాబ్ ఆదివారం ప్రకటించింది. దేశీయంగా అందుబాటులో ఉన్న రసాయనాలతోనే ఈ మందును సులువుగా తయారు చేసేందుకు తాము ఓ పద్ధతిని అభివృద్ధి చేశామని, తయారైన ఏపీఐను ఫార్మా కంపెనీ సిప్లాకు సరఫరా చేస్తున్నామని ఆవ్రా ల్యాబ్ చైర్మన్ డాక్టర్ ఎ.వి.రామారావు ఆ ప్రకటనలో వివరించారు. సిప్లా ఈ మందును సిప్లెంజా పేరుతో త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయవచ్చునని ఆయన చెప్పారు. ఇప్పటికే తాము రెండు బ్యాచ్‌లుగా 46 కిలోల ఏపీఐని సిప్లాకు అందించామని, త్వరలో ఇంకో బ్యాచ్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. సీఎస్ఐఆర్–ఐఐసీటీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో పనిచేస్తున్న సమయంలోనే తాను సిప్లా అధ్యక్షుడు డాక్టర్ యూసుఫ్ హమీద్‌తో కలసి పనిచేశానని, హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రయోగించే యాంటీ రెట్రోవైరల్ మందులను చౌకగా తయారు చేశామని ఆయన తెలిపారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి సిప్లాతో కలసి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. సీఎస్ఐఆర్–ఐఐసీటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ ఎ.వి.రామారావు ఆవ్రా ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. -
ఆప్టిమస్ కోవిడ్ ఔషధానికి అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్ల తయారీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని హైదరాబాద్ కంపెనీ ఆప్టిమస్ ఫార్మా వెల్లడించింది. ఫావిపిరావిర్ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్ తయారీకి తమ అనుబంధ కంపెనీ ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ లైసెన్సు దక్కించుకుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ట్యాబ్లెట్లను ఫావికోవిడ్ పేరుతో మార్కెట్ చేయనున్నారు. ట్యాబ్లెట్ల విక్రయ ధరను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయిస్తామని ఆప్టిమస్ డైరెక్టర్ పి.ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘అందుబాటులో ఉండే విధంగా ఈ ధర ఉంటుంది. ఇతర కంపెనీలకు కూడా ఈ ట్యాబ్లెట్లను తయారు చేసి సరఫరా చేస్తున్నాం. నెలకు ఒక కోటి ట్యాబ్లెట్లకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. ఔషధానికి కావాల్సిన స్టార్టింగ్ మెటీరియల్, కాంప్లెక్స్ ఇంటర్మీడియేట్స్ను సొంతంగా ఉత్పత్తి చేశాం. 2004లో కంపెనీ ప్రారంభమైంది. మూడు ఏపీఐ ప్లాంట్లు, ఒకటి ఫార్ములేషన్స్ తయారీ యూనిట్ ఉంది. ఏపీఐలు 10 దేశాలకు, ఫార్ములేషన్స్ 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.500 కోట్లకుపైగా పెట్టుబడి చేశాం. 1,100 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 2019–20లో రూ.700 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలోనే టర్నోవర్ ఆశిస్తున్నాం. మార్కెట్లో చాలా ఉత్పత్తుల వినియోగం పడిపోవడమే ఇందుకు కారణం’ అని వివరించారు. -
కోవిడ్-19 : మార్కెట్లోకి సిప్లా ఔషధం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధం ఫవిపిరవిర్‌ను ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ సిప్లా త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుందని శాస్ర్తీయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) పేర్కొంది. తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్ఐఆర్ ఈ మందును అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే కెమికల్స్‌తో ఈ మందును అభివృద్ధి చేసిన సీఎస్ఐఆర్ ఈ సాంకేతికతను సిప్లాకు బదలాయించింది. ఈ మందు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని సీఎస్ఐఆర్ పేర్కొంది. తాము అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత సమర్దవంతంగా పనిచేస్తుందని, తక్కువ వ్యవధిలోనే డ్రగ్ తయారీదారులు పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైనదని సీఎస్ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడి స్వల్ప, మధ్యస్థ లక్షణాతో బాధపడే రోగుల చికిత్సలో ఫవిపిరవిర్ మంచి ఫలితాలను అందిస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. చదవండి : పెళ్లింట కరోనా కలకలం.. -
కరోనా : మరో చౌక ఔషధానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు సంబంధించి యాంటీ వైరల్ డ్రగ్ 'ఫావిపిరవిర్' విక్రయాలకు అనుమతి లభించిందని పుణెకు చెందిన బ్రింటన్ ఫార్మా ప్రకటించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిందని బ్రిటన్ ఫార్మాస్యూటికల్స్ గురువారం వెల్లడించింది. 'ఫావిటన్' బ్రాండ్ పేరుతో 200 మి.గ్రా టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఈ టాబ్లెట్లను 59 రూపాయల చొప్పున విక్రయిస్తామని బ్రింటన్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్లెన్‌మార్క్‌కు చెందిన ఫాబిఫ్లూ తరువాత, చవకగా లభించనున్న డ్రగ్ ఇదే కావడం విశేషం. ఫావిటన్ టాబ్లెట్ ధర 59 రూపాయలు. కాగా ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ ధర 75 రూపాయలు. తేలికపాటి నుండి మధ్యస్థ లక్షణాలున్న కోవిడ్-19 రోగుల చికిత్సలో ఫావిపిరవిర్ సమర్థవంతమైన అనుకూలమైన ఫలితాలిస్తోందని, ఇందుకు క్లినికల్ సాక్ష్యాలున్నాయని బ్రింటన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందనీ వెల్లడించింది. తమ స్ట్రాటజీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఈ ఔషధ లభ్యతను మెరుగుపరచడమే తమ ఉద్దేశమనీ, అన్ని కోవిడ్ కేంద్రాల్లో ఫావిటన్ను అందుబాటులో ఉంచనున్నామని బ్రింటన్ ఫార్మా సీఎండీ రాహుల్ కుమార్ దర్దా చెప్పారు. అలాగే దీన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు. కాగా జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ఫుజిఫిల్మ్ టొయమా కెమికల్ కంపెనీ ఫావిపిరవిర్ ను ‘అవిగాన్’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. ఫావిటన్ అనేది అవిగాన్ జెనరిక్ వెర్షన్. -
కోవిడ్-19కు ట్యాబ్లెట్లు- జెన్‌బర్క్ జోరు
కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బీఎస్ఈకి వెల్లడించడంతో ప్రవేశపెట్టనున్నట్లు జెన్‌బర్క్ ఫార్మా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థలో వాటా విక్రయ వార్తలతో ఐటీ సేవల సంస్థ మజెస్కో లిమిటెడ్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జెన్‌బర్క్ ఫార్మా కరోనా వైరస్ సోకడంతో స్వల్ప లేదా మధ్యస్థాయి లక్షణాలతో ఇబ్బందిపడే రోగులకు ఉపశమనాన్ని ఇవ్వగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెన్‌బర్క్ ఫార్మాస్యూటికల్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా 200 ఎంజీ డోసేజీలో వీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జెన్‌బర్క్ ఫార్మా షేరు బీఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 470 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 420 వద్ద ట్రేడవుతోంది. మజెస్కో లిమిటెడ్ పీఈ సంస్థ థోమా బ్రావోకు యూఎస్ అనుబంధ సంస్థను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. యూఎస్ మజెస్కోలో మజెస్కో లిమిటెడ్‌కు 74 శాతం వాటా ఉంది. ఈ సంస్థను 59.4 కోట్ల డాలర్లకు(రూ. 4455 కోట్లు) విక్రయించేందుకు థోమా బ్రావోతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి మజెస్కో రూ. 3154 కోట్లను అందుకోనుంది. ఈ నేపథ్యంలో మజెస్కో లిమిటెడ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. 406 సమీపంలో ఫ్రీజయ్యింది. -
దేశంలో 500 కోవిడ్ మరణాలు
న్యూఢిల్లీ: ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 8,78,254కు, మరణాలు 23,174కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 5,53,470 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,01,609 మంది చికిత్స పొందుతున్నారు. అంటే 63.01 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,18,06,256 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 19 రాష్ట్రాల్లో అధిక రికవరీ రేటు దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం63.02 కాగా, 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటు కంటే అధికంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కరోనా మరణాల శాతం 2.64 కాగా, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 64.84 శాతమని వెల్లడించింది. ఫవిపిరవిర్ ధర 27% తగ్గింపు కోవిడ్ చికిత్సలో వాడే యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫవిపిరవిర్’ మాత్రల ధరను 27 శాతం తగ్గించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఒక్కో మాత్ర ఖరీదు రూ.103 కాగా, ఇకపై రూ.75కు అమ్ముతారు. మాత్రలు ఫాబీఫ్లూ అనే బ్రాండ్ నేమ్‌తో లభ్యమవుతున్నాయి. వీటిని గత నెలలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫవిపిరవిర్‌ను ఇప్పుడు భారత్‌లోనే తయారు చేస్తున్నామని, అందుకే ఖర్చు తగ్గిందని, ఆ ప్రయోజనాన్ని కరోనా బాధితులకు బదిలీ చేస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది. -
గ్లెన్‌మార్క్ ఫార్మా కొత్త రికార్డ్
కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల యాంటీవైరల్ ఔషధం ఫావిపిరవిర్‌ను దేశీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 30 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికం కావడంతో రూ. 123 ఎగసి రూ. 532 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.9 లక్షల షేర్లుకాగా.. తొలి గంటలోనే 11.46 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం! 200 ఎంజీ డోసేజీలో ఫబిఫ్లూ బ్రాండుతో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా వెల్లడించింది. ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. 200 ఎంజీ డోసేజీలో లభించే ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 103కాగా.. కరోనా బారినపడి స్వల్ప సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వీటిని వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలియజేసింది. తొలి రోజు 1800 ఎంజీ డోసేజీ రెండుసార్లు వేసుకోవలసి ఉంటుందని వివరించింది. తదుపరి 14వ రోజువరకూ రోజుకి 800 ఎంజీ చొప్పున రెండు పూటలా తీసుకోవలసి ఉంటుందని తెలియజేసింది. మొత్తం 34 ట్యాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ ధర రూ. 3500కు లభించనున్నట్లు వెల్లడించింది. డీజీసీఐ ఓకే మూడో దశ క్లినికల్ పరీక్షల డేటా ఆధారంగా ఫావిపిరవిర్ ఔషధాన్ని విక్రయించేందుకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ డీజీసీఏ నుంచి అత్యవసర ప్రాతిపదికన అనుమతి లభించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. తద్వారా కోవిడ్-19 సోకినవారి చికిత్సకు వీటిని వినయోగించేందుకు వీలు చిక్కినట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. ఈ ఔషధానికి క్లినికల్ పరీక్షలలో 88 శాతంవరకూ సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. నాలుగు రోజుల్లోనే వైరస్ లోడ్‌ను గణనీయంగా తగ్గించగలిగినట్లు వెల్లడించింది. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఇన్ఫ్లుయెంజా చికిత్సకు వినియోగిస్తున్న విషయం విదితమే. -
కోవిడ్ ఔషధం: ఒక్కో ట్యాబ్లెట్ రూ.103
న్యూఢిల్లీ: కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల యాంటీవైరల్ ఔషధం ఫావిపిరవిర్‌ను దేశీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికం కావడంతో రూ. 61.5 ఎగసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 103 రూపాయిలు ఫబిఫ్లూ బ్రాండుతో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా వెల్లడించింది. ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 103 రూపాయిలు కాగా.. తొలి రోజు 1800 ఎంజీ డోసేజీ రెండుసార్లు వేసుకోవలసి ఉంటుందని వివరించింది. తదుపరి 14వ రోజువరకూ రోజుకి 800 ఎంజీ చొప్పున రెండు పూటలా తీసుకోవలసి ఉంటుందని తెలిపింది. (కోవిడ్‌కు మరో ఔషధం.. ) మూడో దశ క్లినికల్ పరీక్షల డేటా ఆధారంగా ఫావిపిరవిర్ ఔషధాన్ని విక్రయించేందుకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ డీజీసీఏ నుంచి అత్యవసర ప్రాతిపదికన అనుమతి లభించినట్లు పేర్కొంది. తద్వారా కోవిడ్-19 సోకినవారి చికిత్సకు వీటిని వినియోగించేందుకు వీలు చిక్కినట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. ఈ ఔషధానికి క్లినికల్ పరీక్షలలో 88 శాతంవరకూ సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. నాలుగు రోజుల్లోనే వైరస్ లోడ్‌ను గణనీయంగా తగ్గించగలిగినట్లు వెల్లడించింది. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఇన్ఫ్లుయెంజా చికిత్సకు వినియోగిస్తున్న విషయం విదితమే. (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం) -
కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటిం చింది. యాంటీ వైరల్ ఔషధం ‘ఫవిపిరవర్’ కోవిడ్ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ శనివారం వెల్లడించింది. తాము చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఫవిపిరవర్ మందు రోగులపై బాగా పనిచేస్తోందని కంపెనీ చైర్మన్, ఎండీ గ్లెన్ సల్దాన్హా తెలిపారు. (ప్రాణవాయువుకే ప్రాధాన్యం ) ఫాబీఫ్లూ టాబ్లెట్ 200ఎంజీ ఒక్కోటి రూ.103కి మార్కెట్లో లభిస్తుందన్నారు. 34 టాబ్లెట్లు ఉన్న స్ట్రిప్ రూ.3,500లకు మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. మొత్తం 14 రోజులు ఈ మందుని రోగులు వాడాల్సి ఉంటుంది. మొదటి రోజు 1800ఎంజీ పరిణామం కలిగిన ఫాబిఫ్లూని రెండుసార్లు, ఆ తర్వాత నుంచి 14 రోజుల వరకు రోజుకి 800ఎంజీ రోగులు తీసుకోవాలి. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఈ ఔషధాన్ని విక్రయిస్తారు. ప్రస్తుతానికి మొదటి నెలలో 82,500 మంది రోగులకి సరిపడా ఫాబిఫ్లూ టాబ్లెట్ల తయారీకి సన్నద్ధంగా ఉన్నామని, దేశంలో వైరస్ పరిస్థితిని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళతామని సల్దాన్హా అన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చునని గ్లెన్‌మార్క్ తెలిపింది. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది)