కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బీఎస్ఈకి వెల్లడించడంతో ప్రవేశపెట్టనున్నట్లు జెన్‌బర్క్ ఫార్మా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థలో వాటా విక్రయ వార్తలతో ఐటీ సేవల సంస్థ మజెస్కో లిమిటెడ్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
జెన్‌బర్క్ ఫార్మా
కరోనా వైరస్ సోకడంతో స్వల్ప లేదా మధ్యస్థాయి లక్షణాలతో ఇబ్బందిపడే రోగులకు ఉపశమనాన్ని ఇవ్వగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెన్‌బర్క్ ఫార్మాస్యూటికల్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా 200 ఎంజీ డోసేజీలో వీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జెన్‌బర్క్ ఫార్మా షేరు బీఎస్‌ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 470 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 420 వద్ద ట్రేడవుతోంది.
మజెస్కో లిమిటెడ్
పీఈ సంస్థ థోమా బ్రావోకు యూఎస్ అనుబంధ సంస్థను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. యూఎస్ మజెస్కోలో మజెస్కో లిమిటెడ్‌కు 74 శాతం వాటా ఉంది. ఈ సంస్థను 59.4 కోట్ల డాలర్లకు(రూ. 4455 కోట్లు) విక్రయించేందుకు థోమా బ్రావోతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి మజెస్కో రూ. 3154 కోట్లను అందుకోనుంది. ఈ నేపథ్యంలో మజెస్కో లిమిటెడ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. 406 సమీపంలో ఫ్రీజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment