హైదరాబాద్: టైప్–2 మధుమేహానికి గ్లెన్ మార్క్ ఫార్మా తొలి ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్‌ను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టైప్–2 మధుమేహం చికిత్సలో వినియోగించే టెనేలిగ్‌లిప్టిన్, డాపాగ్లిఫ్లోజిన్, మెట్‌ఫారి్మన్ కలయికతో కూడిన ఫిక్స్‌డ్ డోసేజ్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాన్ని ‘జిటా’ పేరుతో విడుదల చేసింది.
మధుమేహంతోపాటు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచి్చంది. ఇందులో టెనేలిగ్‌లిప్టిన్ 20 ఎంజీ, డాపాగ్లిఫ్లోజిన్ 10ఎంజీ, మెట్‌ఫార్మిన్ ఎస్‌ఆర్ (500/1000ఎంజీ) రూపంలో ఉంటాయి. వైద్యుల సిఫారసు మేరకు ఈ ఔషధాన్ని రోజుకు ఒక్కసారి తీసుకోవాల్సి ఉంటుందని గ్లెన్‌మార్క్ ఫార్మా తెలిపింది. హెచ్‌బీఏ1సీ అధికంగా ఉండి, బరువు పెరగడం తదితర ఇతర సమస్యలతో బాధపడే వారిలో ఈ ఔషధం గ్లైసిమిక్ కంట్రోల్‌ను మెరుగుపరుస్తుందని గ్లెన్‌మార్క్ ఫార్మా ఇండియా ఫార్ములేషన్స్ హెడ్ అలోక్ మాలిక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment