మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ఔషధం
- టెనెలిగ్లిప్టెన్ ట్యాబ్లెట్స్‌ను విడుదల చేసిన గ్లెన్‌మార్క్
- మిగిలిన వాటితో పోలిస్తే ఏడాదికి రూ. 9,000 మిగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ట్యాబ్లెట్లను గ్లెన్‌మార్క్ ఫార్మా విడుదల చేసింది. టైప్-2 డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల కోసం ‘టెనెలిగ్లిప్టెన్’ పేరుతో రెండు రకాల ట్యాబ్లెట్లను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్లిప్టెన్ ట్యాబ్లెట్ల కంటే 55 శాతం తక్కువ ధరకే వీటిని అందిస్తున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా ప్రెసిడెంట్, హెడ్ (ఇండియా బిజినెస్) సుజేష్ వాసుదేవన్ తెలిపారు. ఇతర ట్యాబ్లెట్లు ధర రోజుకు రూ. 45 అవుతుంటే, కేవలం రూ. 19.90లకే వీటిని అందిస్తున్నట్లు తెలిపారు.
దీనివల్ల ఏడాదికి సగటున రూ. 9,000 వరకు ఆదా అవుతుందని అంచనా అన్నారు.. ఏటా ఇండియాలో రూ. 100 కోట్ల విలువైన డయాబెటిక్ ఔషధాలను విక్రయిస్తున్నామని, ఈ కొత్త ట్యాబ్లెట్ల వల్ల ఆదాయం మరిం త పెరుగుతుందని తెలిపారు. ఇండియా డయాబెటిక్ మార్కెట్ విలువ రూ. 6,610 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికా మార్కెట్లో 8 ఔషధాలకు అనుమతృులు వచ్చాయని, మిగిలిన ఆరు నెలల్లో కనీసం నాలుగు ఔషధాలకు అనుమతులు లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యాపార విస్తరణ కోసం రూ. 600 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.