Diabetic patients
-
డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్!
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ను ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేనివారికి ఇది కొంత ఇబ్బందికరమే. వాళ్ల విషయంలో దీనికి పరిష్కారమెలా? ఈ అంశంపైనే పరిశోధనలు చేసి ఓ కూలింగ్ క్యారియర్‌ను రూపొందించిన ఒడిశా అమ్మాయి కోమల్ పాండాకు జేమ్స్ డైసన్ అవార్డు వరించింది. స్థానికంగా లభ్యమయ్యే సులభమైన సాంకేతికతతో కొత్త ఉపకరణాలను రూపొందించేవారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. మన దేశం నుంచి కోమల్ పాండాకు ఈ అవార్డుతోపాటు రూ. 5 లక్షలు బహూకరిస్తారు. కోమల్ రూపొందించిన ‘నోవోక్యారీస్’ అనే ఈ ఉపకరణంతో ఇన్సులిన్‌ను చాలాసేపు చల్లదనంలో ఉంచవచ్చు. అంతేకాదు దూరప్రయాణాల్లో, విద్యుత్ సౌకర్యాలూ, బ్యాటరీ సౌలభ్యాలు లేనిచోట్ల కూడా ఇన్సులిన్‌తోపాటు చల్లదనంలోనే ఉంచాల్సిన చాలా రకాల మందుల్ని సుదీర్ఘకాలంపాటు నిల్వ చేయవచ్చు. ‘నోవోక్యారీస్’ రూపకల్పనకు తన తండ్రి నుంచే కోమల్‌కు స్ఫూర్తి లభించింది. ఆయన ఓ డయాబెటిస్ బాధితుడు. ఆఫీసులో ఫ్రిజ్ లేదు. దూరప్రయాణాలప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఆయన మాత్రమే కాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం దాదాపు 20 శాతం మందులు ఇలా దూర్రప్రాంతాలకు ప్రయాణం చేసేవారి విషయంలో, రిఫ్రిజిరేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల చెడిపోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది. ఇలాంటి వారికి ఇదెంతో ప్రయోజనం. (చదవండి: కమ్మటి కబుర్ల కమ్యూనిటీ కిచెన్..! వంటరికి విస్తరి.. ) -
మధుమేహం : ఈ సూపర్ ఫుడ్‌తో చెక్ చెప్పొచ్చు!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్‌ఫుడ్‌ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా... దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం ఫైబర్ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు. కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాంటి హైపోగ్లైసిమిక్ ప్రొటీన్. ఇది కణాలలోకి గ్లూకోజ్‌ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్‌ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్‌కు చాలా మంచిది. -
షుగర్ పేషెంట్లకు భారీ ఊరట: మూడు రెట్ల సమర్ధతతో కొత్త మాగ్నటిక్ జెల్
Magnetic gel చర్మంపై ఏర్పడే తీవ్రమైన పుండ్ల చికిత్సలో కీలక అధ్యయనం ఒకటి భారీ ఊరటనిస్తోంది. కాలిన గాయాలు, చర్మంపై మానని గాయాలు, ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో అల్సర్లు నెమ్మదిగా నయం అవుతాయి. ఒక్కోసారి శరీర భాగాలను తొలగించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మాగ్నటిక్ జెల్‌ను రూపొందించింది. ఇది మృత చర్మకణాల చికిత్సలో మూడు రెట్లు సమర్ధ వంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కాలిన గాయాలు,డయాబెటిక్, నాన్-డయాబెటిక్, తదితర దీర్ఘకాలిక అల్సర్ల చికిత్సలో మూడు రెట్లుగా మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయన వేత్తలు తేల్చారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో జెల్ చికిత్స స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్‌ల వృద్ధి రేటును సుమారు 240 శాతం పెంచింది అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి రేటును రెట్టింపు చేసింది. ఈ జెల్ కెరాటినోసైట్లు , ఇతర కణాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచిందని, తద్వారా గాయపడిన ప్రదేశంలో కొత్త రక్తనాళాల పెరుగుదలకు తోడ్పడిందని వెల్లడించింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సన్ యాట్-సేన్ యూనివర్శిటీ, వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. (గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!) "వైర్లెస్ మాగ్నెటిక్ -రెస్పాన్సివ్ హైడ్రోజెల్ చర్మపై గాయాల్ని నయం చేయడంలో ప్రాథమిక సవాళ్లను అధిగమించిదని పరిశోధన వేత్త డాక్టర్ షౌ యుఫెంగ్ తెలిపారు. ఈ మాగ్నటిక్ జెల్‌ను గాయానికి నేరుగా బ్యాండేజ్‌లో అమరుస్తారు. ఇందులో ఎఫ్‌డీఏ ఆమోదిత అతి చిన్న అయస్కాంత సెల్స్ కెరాటినోసైట్లు (చర్మాన్ని బాగు పర్చడంలో), ఫైబ్రోబ్లాస్ట్లు (చర్మంపై కణాల మధ్య సమన్వయం) కీలక పాత్ర పోషిస్తాయి. గాయంపై ఉంచిన మాగ్నటిక్ డివైస్ ద్వారా వెలువడిన అయస్కాంత కణాలు నెమ్మదిగా కదులుతూ, రోగి చర్మ కణాలతో మిళితమై కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి. ఈ అయస్కాంత స్టిమ్యులేషన్ పరికరంపై సంబంధిత అవయవాన్ని రెండు నుండి మూడు గంటల పాటు ఉంచితే సరిపోతుందని అధ్యయన వేత్తలు తెలిపారు. (‘‘ఇక్కడ క్లిక్ చేయండి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
మధుమేహం రాకుండా చేసుకోండి ఇలా..!
పడిశం పదిరోగాల పెట్టు అన్నట్లు ఒక్క మధుమేహం చాలు... రకరకాల జబ్బులున్నట్టే. ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తుంది. కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు, వ్యాయామం చేయని వారు, త్వరగా మధుమేహం బారిన పడతారు. మధుమేహం వచ్చాక బాధపడేకంటే రాకుండా చేసుకోవడం చాలా మేలు. అసలు మధుమేహం మన జీవన శైలిలో ఉన్న లోపాల వలన వస్తుంది. కాబట్టి జీవనశైలిని, మన ఆహారపుటలవాట్లను మార్చుకుంటే మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. అలాంటి చిట్కాలు చూద్దాం. ►పిండి పదార్థం ఎక్కువగా ఉన్న బియ్యం, గోధుమ లకు బదులు సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలు తీసుకుంటే చాలావరకు మధుమేహం తగ్గుతుంది. ►పంచదారకు బదులు బెల్లం లేదా తేనె తగు మోతాదులో వాడుకోవాలి. పంచదార పూర్తిగా నిషేధమే. ►ఉప్పును కూడా చాలా తక్కువ గా వాడుకోవాలి. ►పచ్చి కూరలైన కీరా, కారట్, బీట్రూట్, సొర, గుమ్మడి వంటి వాటిని తురిమి పెరుగులో వేసుకుని తింటే మధుమేహం చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. ►రోజూ 30–60 నిమిషాలు ప్రాణాయామం, ధ్యానం, నడక వంటివి చేయాలి. ►ఆహారంలో సరైన కార్బోహైడ్రేట్లు (పొట్టు తో కూడిన ఆహారం – తక్కువ పోలిష్ పట్టిన బియ్యం, ఓట్స్, పొట్టు తీయని పప్పులు, పచ్చి కూరగాయలు, ఎక్కువ తీపిలేని పండ్లు తీసుకుంటూ, వ్యాయామం చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. చదవండి: Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
ఫాస్టింగ్ కాస్తంత ఎక్కువగా... పోస్ట్ లంచ్ తక్కువగా ఉంటోందా?
డయాబెటిస్‌ను నిర్ధారణ చేసేందుకు సాధారణంగా పొద్దున్నే పరగడుపున (ఫాస్టింగ్) ఒకసారి రక్తపరీక్ష, తిన్న తర్వాత దాదాపు రెండు గంటలకు మళ్లీ మరోసారి రక్తపరీక్ష చేస్తారు. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అని పిలిచే ఆ పరీక్షల్లో... ఫాస్టింగ్‌లో 100 పోస్ట్ లంచ్‌లో 140 ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఫాస్టింగ్‌లో 126 వరకు వచ్చినా... అప్పుడే మందులు మొదలు పెట్టరు. కానీ... అలా వచ్చినవారికి వారు ‘బార్డర్‌లైన్’ అనే స్థితిలో ఉన్నారనీ... అంటే రక్తంలో చక్కెర అదుపు సరిగా లేని కారణంగా భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్లు హెచ్చరిస్తారు. ఫాస్టింగ్ విలువలు ఎక్కువగా... పోస్ట్ లంచ్ మరీ తక్కువగా ఉంటే...? కొందరిలో ఫాస్టింగ్ విలువలు 115 నుంచి 124 వరకు కనిపించవచ్చు. కానీ భోజనం తర్వాత చేసే పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా అంటే... 130, 135 రావచ్చు. ఇలా ఫాస్టింగ్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, పోస్ట్లంచ్లో మరీ తక్కువగా రావడాన్ని కూడా బార్డర్‌లైన్‌గానే పరిగణించాలి. పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా రావడాన్ని అంతా బాగున్నట్లుగా అనుకోడానికి వీల్లేదు. ఎందుకిలా జరుగుతుందంటే... రక్తంలో ఉన్న చక్కెర మోతాదును అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. కానీ రక్తంలో ఎంత చక్కెర ఉంది అన్న అంచనా ఒక్కోసారి ప్యాంక్రియాస్‌కు తెలియదు. అలాంటి సందర్భాల్లో అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెరపాళ్లు బాగా పడిపోతాయి. ఇలాంటి పరిణామం జరిగినప్పుడే పోస్ట్ లంచ్ విలువలు మరీ తక్కువగా వస్తుంటాయి. ముందస్తు సూచనగా పరిగణించాల్సిందే... డయాబెటిస్ వచ్చే ముందు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి... దీన్ని కూడా డయాబెటిస్‌కు ముందు దశగా అంటే ‘బార్డర్‌లైన్’గా పరిగణించవచ్చు. డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా చాలాకాలం పాటు నివారించేందుకు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, అన్ని రకాల పోషకాలు అందేలా కూరలు ఎక్కువగా కలుపుకుని తింటుండాలి. వీలైనంతవరకు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం బార్డర్‌లైన్ వారికి మాత్రమే కాకుండా డయాబెటిస్‌ను నివారించాలని కోరుకునే ఆరోగ్యవంతులకూ బాగానే ఉపయోగపడతాయి. -
Health Tips: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇలా చేస్తే..
వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారం జీర్ణం కావడానికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సీజన్లో డయాబెటిక్ రోగులు ఆహారంలో ఎక్కువ ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. నేరేడు పండ్లతో పాటు దాని గింజలు కూడా షుగర్ రోగులకు చాలా మేలు చేస్తాయి. చక్కెరను నియంత్రించడానికి, జామ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వేసవిలో, ఫైబర్ పుష్కలంగా ఉండే జామ పండు జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమైతే చక్కెర అదుపులో ఉంటుంది. ఇంకా బొప్పాయి, యాపిల్ కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. చదవండి: కీర దోసకాయలు తినేవారు ఈ విషయాలు తెలుసుకున్నారంటే! ►పిల్లల్లో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే చెవిలోపల సరిగా శుభ్రం చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం కావచ్చు. పిల్లల చెవిలో గులిమి గట్టిపడి శుభ్రం చేయడానికి సాధ్యం కాకుంటే డీ వ్యాక్స్ అనే చుక్కల మందును డ్రాపర్‌తో చెవిలో నాలుగు చుక్కలు వేసి కాటన్ పెట్టాలి. కాసేపటి తర్వాత నానిన గులిమి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చీర కొంగుతో లేదా దూదితో శుభ్రం చేయాలి. ►బరువు తగ్గాలనుకునేవాళ్లు కఠోర ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టటం కంటే సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారో తెలుసుకుని ఎంత బరువు తగ్గితే సరిపోతుంది? ఎంత సమయం తీసుకోవాలి.. అన్న విషయంపై స్పష్టత వచ్చాక నియమాలను పాటించటం మొదలు పెట్టడం ప్రయోజనకరం. -
Diabetes diet: ఏం తినాలో! ఎలా తినాలో..!!
వెయిట్ లాస్, డయబెటిస్ కంట్రోల్... ఈ రెండు పదాలు ఇప్పుడు ప్రపంచాన్ని చిటికెన వేలి మీద ఆడిస్తున్నాయి. వార్తా పత్రికలు, టెలివిజన్ కార్యక్రమాలు కూడా దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ రెండు అంశాల మీద ఫోకస్ పెడుతున్నాయి. ఇందుకోసం నిపుణుల సలహాల శీర్షికలు నిర్వహిస్తున్నాయి. ప్రధానస్రవంతి మీడియా కొంత పరిమితిని, ప్రమాణాలను పాటిస్తూ వస్తోంది. ఇటీవల స్వీయప్రకటిత ఆరోగ్యనిపుణులు సోషల్ మీడియాలో ఆరోగ్యసూత్రాలను చెప్తున్నారు. వారి ప్రసంగాలు బరువైన పదాలు, శాస్త్రీయనామాల ప్రస్తావన లేకుండా సాగుతుండడంతో వీక్షకులు కూడా ఆ ప్రోగ్రామ్‌లకు, పోస్ట్‌లకు త్వరగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ‘డైట్’ అనేది స్థూలంగా అందరికీ ఒకే ఫార్ములా పనికిరాదంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. ఎవరి డైట్ చార్ట్ వారికే! ఒక వ్యక్తికి కేవలం అధిక బరువు మాత్రమే ఉండి, ఇతర ఆరోగ్యసమస్యలేవీ లేకపోతే ఒక రకం డైట్ సూచించాల్సి ఉంటుంది. అది కూడా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, బరువు ఆధారంగా నిర్ణయించాలి. అలాగే సెంట్రల్ ఒబేసిటీ, ఓవరాల్ ఒబేసిటీ వంటి తేడాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒక వ్యక్తికి అధిక బరువుతోపాటు డయాబెటిస్, హైబీపీ, గుండె సమస్యల వంటి సమస్యలు ఉన్నట్లయితే డైట్ ప్లాన్ మరో రకంగా ఉండాలి. అలాగే పై రెండు కేటగిరీల్లో కూడా ఏ ఇద్దరికీ ఒకరకమైన డైట్ ప్లాన్ సరిపడదు. ప్రతి వ్యక్తికీ వారి వారి బాడీ మాస్ ఇండెక్స్‌ను బట్టి, హెల్త్ హిస్టరీని అనుసరించి, వారి డైలీ రొటీన్‌ను దృష్టిలో పెట్టుకుని మరీ డైట్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అది న్యూట్రిషన్ ఎక్స్పర్ట్లకు మాత్రమే సాధ్యమయ్యే పని. కాబట్టి సోషల్ మీడియా సమాచారాన్ని ఆధారం చేసుకుని డైట్ విషయంలో స్వీయ ప్రయోగాలకు పోవద్దని, ఆరోగ్యానికి హాని తెచ్చుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ఫ్యాషన్, ఫుడ్, డైట్లు ట్రెండింగ్ టాపిక్స్ గా ఉన్నాయి. ఫ్యాషన్ విషయంలో ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ ఉండదు, అలాగే వంటల విషయంలో కూడా సాధారణంగా ప్రమాదం ఉండబోదు. ఇక డైట్ విషయంలో మాత్రం ఎవరికి వారు స్వయంగా నిపుణులను సంప్రదించి, వారి సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! -
మధుమేహం ఉంటే అన్నం తినడం మానేయాలా?
అన్నం తినడం వల్లనే డయాబెటిస్ పెరుగుతుంది అనుకుంటూ ఉంటారు చాలామంది. తెలుగు రాష్ట్రాలలో వందల ఏళ్లుగా అన్నం తింటునే ఉన్నాం. కానీ డయాబెటిస్ మాత్రం ఇటీవలి కాలంలోనే పెరిగింది. కాబట్టి తినే అన్నానికీ, రక్తంలో ఉండే చక్కెరకూ పెద్దగా సంబంధం లేదు. అయితే అన్నంతో పాటు వేపుడు కూరలు, ఇతర పిండివంటలు కూడా బాగా లాగిస్తే మాత్రం కష్టమే. లో కార్బ్ డైట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. పైగా ఆహారంలో పిండి పదార్థాన్ని తగ్గిస్తే ఆటోమేటిగ్గా కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాం. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొవ్వు పదార్థాల వల్ల సమస్య గానీ పిండి పదార్థం వల్ల కాదు. అందుకే అన్నం మానడం అంత ప్రయోజనకరం ఏమీ కాదు. అపోహ షుగర్ రోగులు పండ్లు తినకూడదు వాస్తవం: ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు మామిడి, సీతాఫలం లాంటివైనా సరే వాటివల్ల మధుమేహం వస్తుందనడం సరికాదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా నోరు కట్టుకోనక్కరలేదు. కొద్ది మొత్తంలో తినొచ్చు. ఈ పండ్లలో ఉండే పిండిపదార్థం వేరు. చక్కెర వ్యాధిలో ఉండే చక్కెర వేరు. పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, క్యాన్సర్ రాకుండా నివారించే పదార్థాలూ ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నంత మాత్రాన పండ్లను దూరం పెట్టనక్కరలేదు. పండ్లు తినొచ్చు. అయితే మితమే హితమని గుర్తు పెట్టుకుని ఎక్కువగా తినరాదు. -
షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం!
తియ్యని ఆహారం ఎవరికైనా ఆనందదాయకమే. అయితే, తీపి పదార్ధాలుగా విరివిగా వాడుకలో ఉన్న చెరకు చక్కెర, చెరకు బెల్లంలను షుగర్ వ్యాధిగ్రస్తులు తినలేరు. వీటిలో అధిక మోతాదులో గ్లూకోజ్ ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే పరిస్థితి ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఫ్రక్టోజు ఎక్కువగా ఉండే తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్ల నీరాతో తయారు చేసే సంప్రదాయక బెల్లం అయితే ఎవరికైనా ఆరోగ్యదాయకం అంటున్నారు నిపుణులు. తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్లు అత్యంత ఆరోగ్యదాయకమైన, ఆల్కహాల్ రహిత పానీయాన్ని అందిస్తాయి. ఇదే నీరా. నీరాను తాజాగా సేవించటం ఆరోగ్యదాయకం (పులిస్తే కల్లుగా మారుతుంది). తాటి, ఈత, కొబ్బరి, జీలుగ నీరాతో తయారు చేసే బెల్లం చాలా ఆరోగ్యదాయకమైన తీపి పదార్థమని పూర్వకాలం నుంచే మనకు తెలుసు. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరుగుతున్న నేపథ్యంలో తాటి/ఈత నీరా, బెల్లం తదితర ఉత్ప త్తుల తయారీ, వాడకం పుంజుకుంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈత, తాటి(పామ్) ఉత్పత్తులకు ఆదరణ ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి అనంతపురంలో గీత కార్మికుల సహకార సంఘం శ్రీకారం షుగర్ వ్యాధిగ్రస్తులూ పరిమితంగా వాడొచ్చంటున్నారు నిపుణులు.. సహకార సంఘం ఆధ్వర్యంలో.. అనంతపురం జిల్లాలో ప్రకృతిసిద్ధమైన ఈత చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ, రైతుల భూముల్లో లక్షలాది ఈత చెట్లున్నాయి. వీటి నుంచి కల్లు తీసి విక్రయించటం రివాజు. అయితే, ఈత కల్లుకు బదులు నీరా తీసి విక్రయించడంతోపాటు.. నీరాతో బెల్లం తయారు చేసి ప్రజలకు అందించడం మేలని అనంతపురానికి చెందిన సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ యాక్షన్ (సెర) వ్యవస్థాపకులు ఎస్. కుళ్లాయస్వామి తలపెట్టారు. సిరిధాన్యాలతోపాటు తాటి/ఈత/జీలుగ నీరా, బెల్లం వాడకాన్ని ప్రోత్సహిస్తున్న స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి స్ఫూర్తితో కుళ్లాయస్వామి ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 500 మంది ఈడిగ గీత కార్మికులతో ‘సెర నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ’ని నెలకొల్పారు. పరిశుద్ధమైన ఆధునిక పద్ధతిలో నీరా బాట్లింగ్, స్టెయిన్లెస్ స్టీలు పరికరాలతో ఈత బెల్లం తయారీ యూనిట్‌ను నాలుగు నెలల క్రితం నెలకొల్పారు. రోజుకు 500 లీటర్ల నీరా సేకరణ 500 ఈత చెట్లను ఎంపిక చేసుకొని సభ్యుల ద్వారా రోజుకు దాదాపు 500 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. 250 చెట్ల నుంచి ఒక రోజు, మిగతా 250 చెట్ల నుంచి తర్వాత రోజు నీరా సేకరిస్తున్నారు. అక్టోబర్ నుంచి నాణ్యమైన నీరా వస్తుంది. వంద లీటర్ల నీరాను వడకట్టి బాటిల్స్‌లో నింపి అదే రోజు విక్రయిస్తున్నారు. మిగతా 400 లీటర్ల నీరాతో 40 కిలోల బెల్లం ఉత్పత్తి చేస్తున్నారు. చామలపల్లి నుంచి తాటి, ఈత ఉత్పత్తులు తెలంగాణ పామ్ నీరా అండ్ పామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చందూరు మండలంలోని చామలపల్లి కేంద్రంగా తాటి, ఈత నీరా, బెల్లం తదితర ఉత్పత్తుల తయారీ గతంలోనే ప్రారంభమైంది. చామలపల్లి పరిసర గ్రామాల నుంచి తాటి నీరాను, వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతం నుంచి ఈత నీరా సేకరిస్తున్నారు. నీరా, బెల్లంతో పాటు తాటి సిరప్, పామ్ షుగర్, పామ్ బూస్ట్ తదితర ఆరోగ్యదాయకమైన అనేక వినూత్న ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు వింజమూరు సత్యం(98498 28999), వేణు తెలిపారు. నవంబర్ నుంచి ఈత, డిసెంబర్ నుంచి తాటి నీరా సేకరణ తిరిగి ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఇందుకోసం ఎక్సయిజ్ శాఖ తోడ్పాటుతో అనంతపురంలోని పోలిస్ కాంప్లెక్స్‌లో నీరా స్టాల్ నెలకొల్పనున్నట్లు కుళ్లాయస్వామి తెలిపారు. ఈత నీరాలో ఆల్కహాల్ లేదని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. లాబ్ రిపోర్టులో తేలింది. చిత్తూరులోని ప్రభుత్వ లాబ్‌లో టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత నీరాను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఎక్సైజ్ అనుమతులు వస్తాయన్నారాయన. – పంతంగి రాంబాబు ఈత ఉత్పత్తులను అందరూ వాడొచ్చు ఈత చెట్టుకు ఏడాదికి రూ.150–200 వరకు రైతుకు చెల్లించి నిపుణులైన గీత కార్మికుల పర్యవేక్షణలో నీరా సేకరిస్తున్నాం. కిలో ఈత బెల్లం తయారీకి 10 లీటర్ల నీరా అవసరం. కిలో బెల్లం ఉత్పత్తికి రూ. 650 వరకు ఖర్చవుతున్నది. రూ. వెయ్యి రిటైల్ ధరకు విక్రయిస్తున్నాం. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ప్రజలందరూ, షుగర్ ఉన్న వారు సైతం వాడదగ్గ ఆరోగ్యదాయక ఉత్పత్తులు కావటంతో స్థానికంగానే కాకుండా అనేక నగరాల్లోనూ ఈత ఉత్పత్తులను విక్రయించే ప్రయత్నం చేస్తున్నాం. – ఎస్. కుళ్లాయస్వామి (92464 77103), సెరా నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ, అనంతపురం ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు ఈత, తాటి, కొబ్బరి, జీలుగ.. ఈ చెట్ల నుంచి తీసిన నీరా, దానితో తయారు చేసే బెల్లం ఆరోగ్యకరమైన దేవుడిచ్చిన తీపి పదార్థాలు. ఇవి మన సంస్కృతిలో ఉన్న ప్రకృతిసిద్ధమైన, పర్యావరణ హితమైన తీపి పదార్థాలు. వీటిలోని ప్రకృతికి దగ్గరగా ఉండే లవణాంశాలు మనిషికి రోగనిరోధక శక్తిని అందించి మేలు చేస్తాయి. ఈత నీరా, బెల్లంను హెబిఎ1సి 7–8 లోపు ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా రోజుకు 10–15 గ్రా. మించకుండా తీసుకోవచ్చు లేదా వారానికోసారి ఈత బెల్లంతో చేసిన తీపి పదార్ధాన్ని 50 గ్రా. వరకు తినొచ్చు. తీపి పదార్థాలను ఎవరైనా సరే రోజూ తినకూడదు. చెరకు ఎస్టేట్ల వల్ల ఏకపంటల (మోనోకల్చర్) సాగు ప్రబలి, 18% జీవవైవిధ్యం నాశనమైంది. గ్లూకోజ్ ఎక్కువగా ఉండే చెరకు బెల్లం, చక్కెర వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఈత, తాటి, కొబ్బరి, జీలుగ నీరా, బెల్లంలో ఫ్రక్టోజు ఎక్కువ ఉంటుంది. ఫ్రక్టోజు ఉన్న తీపి పదార్థం ఏ హానీ చేయదు. – డా. ఖాదర్‌వలి, స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త చదవండి: కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు! -
Jackfruit: ఆరోగ్యానికి కేరాఫ్ పనస
సాక్షి, అమరావతి: రోజువారీ ఆహారంలో పనసపొడిని కలుపుకుని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటు రక్తపోటునూ నివారించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు. పనస పొడిలో ప్రోటీన్ కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ‘తీపి’ కబురు. ప్రతి రోజూ 30 గ్రాములకు తగ్గకుండా పనస పొడిని ఆహారంలో కలిపి మూడు నెలల పాటు తీసుకుంటే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చునని ఇటీవల జరిగిన పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) మంచి ఆహారం జాబితాలో మన పనస (జాక్‌ఫ్రూట్)కు చోటు దక్కడమే ఇందుకు నిదర్శనం. పరిశోధనలు తేల్చిన నిజం.. కరోనా జనాన్ని హడలెత్తిస్తున్న నేపథ్యంలో చాలా మంది వాళ్లకు తెలియకుండానే షుగర్ పేషెంట్లు అయ్యారు. అంతకుముందే ఉన్న వాళకైతే మరింత పెరిగింది. ఏపీ, తెలంగాణలోనైతే ఈ బెడద మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఏపీకి చెందిన డాక్టర్లు కొందరు దీనిపై దృష్టి సారించారు. వారిలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాలరావు, మహారాష్ట్ర పుణెలోని చెల్లారామ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఏజీ ఉన్నికృష్ణన్ ఉన్నారు. షుగర్ బెడద తగ్గించడానికి ఏమైనా పండ్లు పనికి వస్తాయా? అని పరిశోధన చేశారు. అప్పుడు బయటపడిందే ఈ పనస ప్రయోజనం. వాళ్లు కనిపెట్టిన అంశాలన్నింటినీ ఇటీవల అంతర్జాతీయ సైన్స్ పత్రిక నేచర్ ప్రచురించింది. వారం పాటు క్రమం తప్పకుండా పసన పొడిని తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినట్టు కనుగొన్నారని నేచర్ పత్రిక వివరించింది. ఈ విషయాన్ని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) ధ్రువీకరించింది. ఎలా తీసుకోవాలంటే.. ఇటీవలి కాలంలో చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు బియ్యానికి బదులు చిరు ధాన్యాలను వాడుతున్నారు. వాటితో పాటు పనసపొడిని కలుపుకుని తింటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టైప్–2 డయాబెటిస్ ఉన్న వారిపై వరుసగా ఏడు రోజుల పాటు పనస పొడి ప్రయోగం చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ తగ్గినట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. పైగా పనస పొడి వాడకం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. పండిన పనస తొనలను తింటే షుగర్ పెరిగే అవకాశం ఉంది. అయితే పక్వానికి వచ్చిన కాయల నుంచి పనస పొడిని తయారు చేస్తారు కాబట్టి షుగర్ నియంత్రణలో ఉంటుంది. పనస గింజ ల్ని కూడా ఎండబెట్టి కూర వండుతారు. మొత్తంగా పనస కాయ చాలా రకాలుగా.. వ్యాధి నిరోధకశక్తిగా పనికి వస్తుంది. -
కోరలు చాస్తున్న బ్లాక్ ఫంగస్: 16 మంది మృతి
ఔరంగాబాద్: మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన వారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడి వారి ప్రాణాలను తీస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా కల్లోలం రేపుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్‌తో ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 201 మందికి ఆ ఫంగస్ రాగా వారిలో 16 మంది మృతి చెందడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ ఏడాదిలో కరోనా కేసులు పరిశీలించగా వారిలో 201 మందికి బ్లాక్ ఫంగస్ సోకిందని ఔరంగాబాద్ మున్సిపల్ అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని అధికారులు ఓ నివేదికలో వివరించారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ నీతా పడాల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించేందుకు కరోనా బాధితుల వివరాలు పరిశీలించాం. కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడిన వారు, మధుమేహులకు బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని మేం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం (ఈఎన్టీ, దంత, కంటి వైద్యులు) గుర్తించింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారికి కావాల్సిన మందులు కూడా అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు. -
బీపీ,షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు..
ఈ ఏడాది చలికాలంలోకి అడుగుపెట్టాం. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత వ్యాయమం చేయడంతో పాటు డైట్ పాటించడం కూడా చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో దొరికే కొన్ని పండ్లను మీ డైట్లో భాగంగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఈ కాలంలో దొరుకుతూ, ఆరోగ్యానికి, బీపీ, షుగర్ లెవల్స్ తగ్గించడానికి దోహదపడే ఐదు రకాల పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. కమల పండు: ఈ పండులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఫైబర్‌తో నిండి వుండే ఈ పండులో సీ విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది భోజనం తరువాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు దోహదపడుతోంది. ఇది షుగర్ లెవల్స్‌ను, కొలస్ట్రాల్‌ను, బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 2. పీర్స్: ఈ పండులో ఎక్కవ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ పోషకాలు, ఫైబర్ కలిగి ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఈ పండు జ్యూస్ తాగకుండా కొరికి తినడం ఉత్తమం. ఎందుకంటే జ్యూస్ తాగితే ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే ఫ్రూట్స్‌లో పీర్స్ ఒకటి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉండవు. 3.కివి: దీనిలో సీ విటమిన్ పుష్కలంగా ఉండటంతో పాటు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫ్రూట్‌గా చెప్పవచ్చు. ఇది కూడా గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే పండ్లలో ఒకటి. సంవత్సరం అంతా కివి అందుబాటులో ఉంటుంది.అందుకే మీ డైట్లో కచ్ఛితంగా దీనిని భాగంగా చేసుకోండి. 4. యాపిల్స్: దీని గురించి చెప్పాలంటే రోజు ఒక యాపిల్ తినడం ద్వారా డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు అనే నానుడి ఉండనే ఉంది. దీని ద్వారా యాపిల్‌లో ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఎన్ని పోషకాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనిలో చాలా తక్కువ కొలిస్ట్రాల్ ఉంటుంది. తక్కువ కాలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి. షుగర్ లెవల్స్ పెంచే కారకాలు దీనిలో చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎతో పాటు సోడియం లాంటి సూక్ష్మ పోషకాలు కూడ పుష్కలంగా ఉంటాయి. అందుకే యాపిల్‌ను మీ డైట్లో భాగంగా మార్చుకోండి. 5.బెర్రీస్: ఇక మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన ఫ్రూట్స్‌లో బెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. తీయగా ఎంతో రుచికరంగా ఉండే ఈ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుండి షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్చేస్తాయి. అయితే వీటిని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలతో కలిపి తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: షుగర్‌తో డిప్రెషన్.. జాగ్రత్త -
మధుమేహులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే..
న్యూయార్క్ : టైప్ టూ డయాబెటిస్తో బాధపడేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే మేలని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. వీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ రోజంతా నియంత్రణలో ఉండాలంటే మధుమేహులు అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం తీసుకుంటే మంచిదని పరిశోధకులు పేర్కొన్నారు. తృణధాన్యాలు, ఓట్స్, పండ్లు సహా పాశ్చాత్య బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో టైప్ 2 మధుమేహంతో బాధపడేవారికి ఉదయాన్నే బ్లడ్ షుగర్ అధికమవుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనంకి నేతృత్వం వహించిన జొనాథన్ లిటిల్ చెప్పారు. టైప్ టూ మధుమేహుల్లో అల్పాహారమే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచేస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైందని అన్నారు. వీరిలో షుగర్ లెవెల్స్‌ను భారీగా తగ్గించేందుకు తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వుతో కూడిన ఆహారంతో రోజును ప్రారంభించడం మేలని చెప్పారు. ఇది షుగర్‌తో వచ్చే అనుబంధ లక్షణాలను కూడా నియంత్రించేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. లంచ్, డిన్నర్లో కూడా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మధుమేహులే కాకుండా అందరూ ఈ తరహా ఆహారాన్ని అనుసరించడం ఆరోగ్యకరమని చెప్పారు. -
ఒబెసిటీతో కిడ్నీలకు ప్రమాదమే
మారుతున్న జీవన విధానం, ఫ్లోరైడ్ నీరు, రసాయన ఆహార పదార్థాలతో జన్యు సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రధానంగా కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 2 నుంచి 3 లక్షల మంది వరకు వివిధ రకాల కిడ్నీ వ్యాధులకు గురైన వారు ఉన్నారు. వీరిలో కిడ్నీ వ్యాధి ముదిరిపోయి చివరి దశలో డయాలసిస్ చేయించుకుంటున్న వారు నెలకు 1,500 నుంచి 2 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అధిక బరువుతో అనర్థాలు తప్పడం లేదు. ప్రధానంగా ఊబకాయం(అధిక బరువు)తో మూత్ర పిండాలకు చేటు తప్పదని వైద్యులు అంటున్నారు. శనివారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నెల్లూరు(బారకాసు): ఊబకాయం కిడ్నీ ఆర్యోగాన్ని దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చిన్నచిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. బీపీ, షుగర్ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు అధికంగా పెరగడం వల్ల కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కనిగిరి, వింజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు, కొండాపురం, పొదలకూరు, వెంకటగిరి, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో ఫ్లోరైడ్ నీరు లభ్యతతో ఆ నీటిని తాగినవారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నందున ఇతర చుట్టు పక్కల జిల్లాల కంటే జిల్లాలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - షుగర్ (డయాబెటీస్) ఉన్న వారిలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం. - మూత్రంలో ప్రొటీన్ పోతున్న కారణంగా కిడ్నీ సమస్య ఏర్పడుతుంది. - ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడతారు. - నొప్పుల మాత్రలు అధికంగా వాడటం వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. - వంశపారపర్యంగాను, జన్యు లోపం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. - కిడ్నీ వ్యాధులకు గురైన వారిలో మొదట్లో పాదాలు వాపు, ఆ తర్వాత కాళు మొత్తం వాపు రావడం, కళ్లు చుట్లూ వాపు, బీపీ అధికంగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో నురగ రావడం, రక్తహీనత (అనీమియా) ఏర్పడటం, చిన్నపనికి అలిసిపోవడం, ఎముకలు నొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. - షుగర (డయాబెటీస్) వచ్చిన వెంటనే ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. - వీలైనంత వరకు నొప్పుల మాత్రల వాడకం తగ్గించుకోవాలి. - ప్రతి రోజు 3లీటర్ల మంచి నీటిని తాగాలి. - అధిక బరువు అంటే ఒబెసిటి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి. - పొగతాగడం మానేయాలి. నిత్యం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్‌ను తగ్గించాలి. లేదా వీలైతే మానేయడం మంచిది. కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు లక్షణాలు – డాక్టర్ మాధవ్దేశాయి, చీఫ్ నెఫ్రాలజిస్ట్, సింహపురి హాస్పిటల్ ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు. కిడ్ని వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తిస్తే ఎంతో మేలు. లేకుంటే చాలా ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధి ముదిరితే గుండెపోటు లేక, పక్షవాతంతో మరణించే ప్రమాదం ఉంది. జిల్లాలోని 2 నుంచి 3లక్షల మందికి వివిధ రకాల కిడ్నీ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అయితే వీరిలో కేవలం 20 వేల మంది మాత్రమే ముందస్తుగా సంబంధిత వైద్యుడిని కలిసి తగిన వైద్యం పొందుతున్నారు. మిగిలిన వారంతా కిడ్నీ వ్యాధి ముదిరిన తర్వాత చివరి దశలో మాత్రమే వైద్యుడిని కలవడం జరుగుతోంది. -
మాత్రలతో మధుమేహానికి చెక్..!
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో సతమతమవుతున్నారు. తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాదు.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్లు తీసుకోవడం వంటి అంశాలు షుగర్ పేషంట్లకు మరింత కష్టతరంగా మారుతున్నాయి. అయితే ఇన్సులిన్ మాత్రలను అందుబాటులోకి తేవడం ద్వారా తరచూ ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించి.. వారి ఇబ్బందుల్ని కాస్తైనా దూరం చేయొచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో అందించేందుకు తాము జరిపిన పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హార్వర్డ్ జాన్ పాల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెన్ బయాలజీ ప్రొఫెసర్ సమీర్ మిత్రగొట్రి అంటున్నారు. అయితే కడుపులో ఉండే ఆమ్లాలు జీర్ణవ్యవస్థలోకి చేరకముందే ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం వల్ల మాత్రలు పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేవన్నారు. ‘ఇన్సులిన్ మాత్రను పేగు లోపలి పంపించవచ్చు. కానీ ప్రొటీన్ల రవాణాను అడ్డుకునే విధంగా పేగు నిర్మాణం రూపొంది ఉండటం వల్ల అది పేగు గోడలను దాటలేదన్నారు. పేగు గోడలపై ఉన్న శ్లేష్మ పొర గుండా ఇన్సులిన్‌ను పంపించి రక్తంలోకి ప్రవహించేలా చేయడం కూడా సవాలుతో కూడుకున్న పని’ అని ఆయన వివరించారు. అయితే ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇన్సులిన్ మాత్రలు చిన్న పేగులను చేరే వరకూ ఇన్సులిన్‌ను విడుదల చేసే అవకాశం ఉండదు గనుక రక్తంలోకి సులభంగా ప్రవేశపెట్టవచ్చన్నారు. ఇన్సులిన్ మాత్రల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆరు మధుమేహ రహిత ఎలుకలపై పరిశోధనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో మూడింటికి మాత్రల రూపంలో, మిగిలిన వాటికి ఇంజక్షన్ ద్వారా ఇన్సులిన్ అందించినట్లు తెలిపారు. అయితే మాత్రలు ఇచ్చిన ఎలుకల్లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి రెండు గంటల్లోపే 38 శాతానికి పడిపోయిందని.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ 10 గంటల్లో 45 శాతానికి చేరిందన్నారు. ఇంక్షన్ ఇచ్చిన ఎలుకల్లో గ్లూకోజ్ స్థాయి గంటలోపే 49 శాతానికి పడిపోయినట్లు గుర్తించామన్నారు. ఇన్సులిన్ మాత్రల ప్రభావ శీలతను అంచనా వేసేందుకు ఈ పరిశోధనలు సరిపోవని, వివిధ జంతువులపై పరిశోధనలు చేయడం ద్వారా పురోగతి సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజా జర్నల్‌లో సమీర్ మిత్రగొట్టి పొందుపరిచారు. అయితే మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్ అందించే ప్రక్రియలో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ ను రూపుమాపేందుకు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
శాకాహారంతో ఆ వ్యాధులకు చెక్
లండన్ : మధుమేహ వ్యాధిగ్రస్తులకు శాకాహారం మేలుచేస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. శాకాహారం తీసుకోవడం ద్వారా టైప్ టూ మధుమేహంతో బాధపడేవారు బరువు తగ్గడం, గుండె జబ్బులతో మరణించే ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు పేర్కన్నారు. మాంసానికి దూరంగా ఉండటం ద్వారా ఈ రోగులు ఇన్సులిన్, కొలెస్ర్టాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఫలితంగా గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును తగ్గించవచ్చని అథ్యయనం పేర్కొంది. టైప్ టూ మధుమేహంతో బాధపడే వారిలో 60 నుంచి 70 శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని అథ్యయన రచయిత, ఫిజిషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్‌కు చెందిన హనా కహ్లెవా చెప్పారు. కూరగాయలతో కూడిన ఆహారంతో గుండె సమస్యలను తగ్గించుకోవడంతో పాటు అదే సమయంలో టైప్ టూ డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. అధిక ఫైబర్, తక్కువ కొవ్వులతో కూడిన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలని సూచించారు. క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. -
డయాబెటిస్ పేషెంట్లకు శుభవార్త
సాక్షి, చెన్నై : డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి శుభవార్త. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చినప్పడు డయాబెటిస్తో బాధపడే వారిలో గాయాలు అంత తొందరగా మానవు. ఒక్కోసారి దీర్ఘకాలిక గాయాలు పెను ప్రమాదానికి కూడా దారి తీసే అవకాశం లేకపోలేదు. వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెందినా.. ఈ విషయంలో అనుకున్న ప్రగతి సాధించలేకపోయింది. తాజాగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన విద్యార్థులు దీనికి పరిష్కారానికి కనుగొన్నారు. డయాబెటిస్ పేషెంట్లకు అయిన గాయాలు త్వరగా నయం అయ్యేట్లు ప్రత్యేక డ్రెసింగ్ విధానాన్ని రూపొందించారు. గాయం ఏర్పడిన ప్రాంతంలో కొత్త కణాలు త్వరగా ఉత్పత్తి కావడానికి గ్రాఫిన్ ఆధారిత డ్రెసింగ్ విధానాన్ని కనుగొన్నారు. త్వరలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐఐటీ మద్రాస్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్ తెలిపారు. ‘సైలియం, గ్రాఫిన్ ఆక్సైడ్ నానో కంపోజిట్ మంచి ఫలితాలు ఇచ్చాయి. గ్రాఫిన్ ఆధారంగా అతి తక్కువ ధరలో ట్రీట్మెంట్ అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. సాధారణ వ్యక్తులకు గాయాలైనప్పుడు ఈ డ్రెసింగ్ విధానాన్ని ఉపయోగిస్తే 23 రోజుల్లో నయం కావాల్సిన గాయం.. కేవలం 16 రోజుల్లో నయమవుతుంది. అలాగే డయాబెటిస్ పెషెంట్లలో 26 రోజుల్లో నయమయ్యే గాయం 20 రోజుల్లోనే తగ్గిపోతుంది’ అని ఆయన వెల్లడించారు. డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
కేలరీలను ఇట్టే పట్టేస్తుంది
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డయాబెటిక్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. వీరిలో డైట్‌ను ఫాలో అయ్యేవారు, అవ్వాలనుకునేవారు చాలామందే ఉంటారు. ఇలాంటి వారందరికీ ఎంత తినాలో.. ఏం తినాలో సరైన ఐడియా ఉండదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ పెట్టే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో.. న్యూట్రిషనల్ వ్యాల్యూస్ ఏంటో తెలియక ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. వీరి కోసం కేలరీ, న్యూట్రిషనల్ క్యాలుక్యులేటర్లు ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక అంచనాకు మాత్రమే పనికొస్తాయి. అయితే ఈ ఫొటోలోని పానాసోనిక్ వారి కేలోరికో అనే కొత్త పరికరం ప్లేట్లో ఉండే ఆహారం ఎన్ని కేలరీలు ఉందో సెకన్లలోనే కచ్చితంగా లెక్కించగలదట.. మనలో చాలామంది ఇప్పటికే కేలరీ క్యాలుక్యులేటర్లను వినియోగించే ఉంటారు. కానీ అవన్నీ సాధారణంగా ప్రాథమిక సమాచారం మాత్రమే ఇస్తాయి. ఉదాహరణకి ఒక బర్గర్లో ఎన్ని కేలరీలు ఉండొచ్చో అంచనాగా చెబుతాయి. కానీ కేలరికో మాత్రం ప్లేట్లో ఉన్న బర్గర్ కచ్చితంగా ఎన్ని కేలరీలు ఉందో చెప్పగలదు. ఈ పరికరాన్ని సీటెక్–2017 టెక్నాలజీ సదస్సులో ప్రదర్శించారు. ఈ పరికరం లైట్ రిఫ్లెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ప్లేట్లో ఉన్న ఆహారంలోని పౌష్టికాల విలువను కచ్చితంగా చెబుతుంది. చేయాల్సిందల్లా ప్లేట్లోని ఆహారాన్ని ఈ పరికరంతో ఫొటోలో చూపిన విధంగా పది నుంచి 20 సెకన్లు ఉంచాలి. ఆహారాన్ని లెక్కించిన తర్వాత ఎన్ని కేలరీలు, పౌష్టిక గుణాలను ఎల్ఈడీ డిస్ప్లేలో ఇట్టే చూపెడుతుంది. అయితే ప్రస్తుతానికిది సూప్‌లు, ఇతర డార్క్ డిష్‌లు మినహా అన్ని రకాల ఆహార పదార్థాలను గుర్తిస్తుంది. ఈ పరికరాన్ని యాప్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని డయాబెటిక్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశామని పానాసోనిక్ కంపెనీ వారు చెబుతున్నారు. ఈ పరికరం మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇంకొన్నేళ్లు ఆగాలని చెబుతున్నారు. అలాగే దీని ధర ఎంత ఉండచ్చో కంపెనీ తెలపలేదు. -
భారత్‌లో పెరుగుతున్న డయాబెటీస్ మృతులు
న్యూఢిల్లీ: ఆధునిక జీవన విధానం వల్ల భారతీయులు ఎక్కువగా డయాబెటీస్ (మధుమేహం) బారిన పడుతున్నారు. ప్రపంచ డయాబెటీస్ రోగుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో 2015 సంవత్సరంలో 3,46,000 మంది డబాబెటీస్ కారణంగా మరణించారని ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్’ అనే సంస్థ వెల్లడించింది. 2005 నుంచి 2015 మధ్య భారత్‌లో డయాబెటీస్ రోగులు ఏకంగా 50 శాతం పెరగడం ఆందోళనకరమైన అంశమని వ్యాఖ్యానించింది. ఏయే వ్యాధుల కారణంగా భారతీయులు ఎక్కువగా మరణిస్తున్నారన్న విషయంలో డయాబెటీస్ జబ్బు 2005లో 11వ ర్యాంకులో ఉండగా, అది ఇప్పుడు ఏడవ ర్యాంకుకు చేరుకున్నది. భారత్‌లో ఎక్కువ మంది మరణిస్తున్నది గుండెపోటు కారణంగానే. ఆ తర్వాత కాలేయ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మెదడు రక్తనాళాల సమస్య, టీబీ, అతిసారం వ్యాధులు మొదటి ఆరు స్థానాల్లో ఉండగా ఏడవ స్థానానికి డయాబెటీస్ చేరుకుంది. హెచ్ఐవికన్నా డయాబెటీస్ కారణంగానే భారతీయులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. మున్ముందు టీబీ కారణంగా చనిపోతున్నవారికన్నా డయాబెటీస్ కారణంగానే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ సంస్థ హెచ్చరించింది. 10.90 కోట్ల మంది డయాబెటీస్ రోగులతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుండగా, 6.91 కోట్ల రోగులతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో డయాబెటీస్ బయటపడని రోగులు మరో మూడున్నర కోట్ల మంది ఉంటారని ‘ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్’ తాజా అట్లాస్‌లో అంచనావేసింది. 1990 దశకం నుంచి భారత్‌లో డయాబెటీస్ మృతులు ఏటేటా పెరుగుతున్నారు. 1990లో మొత్తం మృతుల్లో డయాబెటీస్ రోగులు 2.7 శాతం ఉండగా, అది 2015 సంవత్సరం నాటికి మొత్తం మృతుల్లో 3.3 శాతానికి చేరుకున్నారు. ప్రతి లక్ష మందిలో 26 మంది డయాబెటీస్‌తో మరణిస్తున్నారు. డయాబెటీస్ కారణంగా అంగవికలురు అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇతర దేశాల్లో 60 ఏళ్ల పైబడిన వారు డయాబెటీస్ బారిన పడుతుండగా, భారత్‌లో 40-50 ఏళ్ల మధ్యనున్న వారు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడడం ఆందోళనకరమైన అంశం. కొన్ని శతాబ్దాలుగా డయాబెటీస్ భారతీయులను పట్టి పీడిస్తోంది. ఇందుకు జన్యుపరమైన కారణాలతోపాటు సామాజిక కారణాలు ఉన్నాయి. ‘ఆసియన్ ఇండియన్ పెనోటైప్’గా వ్యవహరించే జన్యువుల కారణంగానే భారతీయులు ఎక్కువగా ఈ జబ్బు బారిన పడుతున్నారు. భారతీయులు బక్కగా ఉన్నప్పటికీ వారి అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్లనే వారిలో క్లోమ గ్రంధి సవ్యంగా పనిచేయదు. కండరాలు ఇన్యుసిలన్ను సవ్యంగా గ్రహించలేవు. పర్యవసానంగా మధుమేహం తప్పడంలేదు. సరైన శారీరక శ్రమలేని ఆధునిక జీవన విధానం కూడా జబ్బు విస్తరణకు కారణం అవుతోంది. డయాబెటీస్ కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్, మెదడు నరాలు చిట్లి పోవడం, కిడ్నీలు దెబ్బతినడం లాంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా నరాలు, కండరాలు దెబ్బతిని కొన్ని సందర్భాల్లో కాళ్లు తొలగించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ జబ్బు చికిత్స కోసం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి ఏటా పది వేల రూపాయలు ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి ఆరున్నర వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. -
మధుమేహరోగుల గాయాన్ని తగ్గించే బ్యాండేజీ
చికాగో: మధుమేహంతో బాధపడేవారికి చిన్న గాయమైనా సరే.. అంత తేలిగ్గా మానదు. అది తగ్గే వరకు వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారికోసమే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త బ్యాండేజీని తయారు చేశారు. ఎస్డీఎఫ్–1 ప్రొటీ తో కూడిన ఈ ప్లాస్టిక్ బ్యాండేజీ నుంచి ప్రోటీ నిదానంగా విడుదలవుతుంది. ఈ బ్యాండేజీని గాయమైన చోట అతికిస్తే అక్కడ కొత్త రక్తనాళాలు వేగంగా పెరిగేట్టు చేయడమే కాకుండా గాయాలను తొందరగా మానిపోయేందుకు సహకరించే మూలకణాలను ఆకర్షిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ పెరిగి గాయం త్వరగా మానిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడంవల్ల కొన్ని సార్లు గాయాల నొప్పి కూడా తెలియకపోవడంతో చికిత్స తీసుకోరు. ఫలితంగా ఈ గాయాలైన అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. పైగా రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి గాయం మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి సమస్యలన్నింటినీ ఈ బ్యాండేజీ పరిష్కరిస్తుందని చెబుతున్నారు. -
వీటి రేటే సపరేటు!
♦ అన్నీ జనరిక్‌లే కానీ బ్రాండ్ల పేరిట భారీ ధరలు ♦ సేల్స్ సిబ్బందికి భారీ ఖర్చు.. వైద్యులకూ బహుమతులు ♦ స్టాకిస్ట్ నుంచి మందుల షాపుల దాకా భారీగా కమీషన్లు ♦ ఈ ఖర్చులకు లాభం కూడా కలిపి బ్రాండెడ్ మందుల ధరల నిర్ణయం ♦ పలు చోట్ల మామూలు దుకాణాల్లోనూ జనరిక్స్కూ భారీ ధరలు ♦ కొనేవారిలో అవగాహనతోనే చెక్ పెట్టగలమంటున్న నిపుణులు సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి: మధుమేహ రోగులు ఎక్కువగా వాడే మెట్ఫార్మిన్ ఔషధంతో ఎన్నో మందులు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో కొన్ని టాబ్లెట్లు రూపాయికన్నా తక్కువ ధరకే దొరుకుతుండగా... కొన్ని ఒక్కొక్కటీ రూ.10కి పైనే ఉన్నాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు అత్యవసరంగా వాడే మెరోపెనెమ్ ఇంజక్షన్‌ను ఓ కంపెనీ రూ.1,500కు విక్రయిస్తుండగా... మరో కంపెనీ రూ.57కే అమ్ముతోంది. ఇవేకాదు కొన్ని వందల రకాల మందుల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదెలా సాధ్యం, ధరల్లో ఇంత తేడాలున్నా ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది, మందుల నాణ్యతను నిర్ధారించే డ్రగ్ కంట్రోలర్ గానీ, మరో సంస్థగానీ ధరలను ఎందుకు నియంత్రించటం లేదు..? ఈ ప్రశ్నలకు జవాబు.. మందుల కంపెనీలు, ఆసుపత్రులు, నియంత్రణ సంస్థల నుంచి ఒక్కో రకంగా వస్తుంది. ఎవరెలా సమాధానం చెప్పినా... అందులో సామాన్యుడి గోడు కనిపించదనేది పచ్చినిజం. ఇండియాలో తయారవుతున్నవన్నీ జనరిక్ మందులే అయితే ధరల్లో ఎందుకింత తేడాలున్నాయనేది ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహం. ఈ సందేహం తీరాలంటే... జనరిక్స్‌లో రకాల గురించి, కంపెనీల మార్కెటింగ్ వ్యూహాల గురించి తెలుసుకోవాలి. జనరిక్ రకాలను చూస్తే.. 1. బ్రాండ్ పేరు కాకుండా జనరిక్ సాల్ట్ (ఔషధం పేరు) మాత్రమే ఉండేవి: ఉదాహరణకు హైపర్‌టెన్షన్ చికిత్సలో వినియోగించడానికి డాక్టర్ రెడ్డీస్, జైడస్ క్యాడిలా సంస్థలు తయారుచేసే ఆమ్లోడిపిన్ బెసలైట్. ఇది రసాయనం పేరు మాత్రమే. ఈ కంపెనీలు వాటికి బ్రాండ్ పేరేమీ పెట్టకుండా జనరిక్ సాల్ట్ పేరుతోనే మార్కెట్లోకి తెచ్చాయి. బ్రాండ్ పేరు లేదు కనక వీటిని మార్కెట్ చేయడానిక్కూడా ప్రత్యేకంగా ఖర్చేమీ పెట్టరు. కాబట్టి తక్కువ ధరకే లభ్యమవుతాయి. నిపుణులు చెప్పేదేమంటే... డాక్టర్ రెడ్డీస్, జైడస్ అనే కంపెనీలే పెద్ద బ్రాండ్లు. కాబట్టి వీటినీ బ్రాండెడ్ జనరిక్స్గానే భావించాలి. ఏదో ఒక బ్రాండ్ పేరు పెట్టి విక్రయించే జనరిక్స్కన్నా ఇవి చౌకగానే లభిస్తాయి. 2. పాపులర్ కాని బ్రాండ్: కొన్ని కంపెనీలు వివిధ పేర్లతో బ్రాండింగ్ చేసి దీన్ని మార్కెట్ చేస్తుంటాయి. అయితే వీటిని పాపులర్ చేయటానికి మార్కెటింగ్‌పై ఎక్కువగా ఖర్చు పెట్టవు. సాధారణంగా వీటిని బల్క్‌గా ప్రభుత్వాలకు, ఆసుపత్రులకు సరఫరా చేయడానికి తయారుచేస్తారు. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అబాట్ వంటి పెద్ద కంపెనీల జనరిక్ సాల్ట్ మందుల కన్నా వీటి ధర కాస్త ఎక్కువగా.. పాపులర్ బ్రాండెడ్ కన్నా చౌకగా దొరుకుతాయి. 3. పాపులర్ బ్రాండ్: వీటిని పుష్కలంగా నిధులున్న బడా సంస్థలే తయారు చేస్తుంటాయి. అంటే ఒక బ్రాండ్ పేరుతో వీటిని ఉత్పత్తి చేసి ఊరుకోకుండా... దాని ప్రచారానికి నిధులను ఖర్చుచేస్తాయి. డాక్టర్ల సిఫారసులతో మందుల షాపుల్లో విక్రయించడానికే వీటిని తయారు చేస్తాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఒకే కంపెనీ ఒక ఔషధాన్ని జనరిక్ సాల్ట్గాను, పాపులర్ బ్రాండ్గాను, పాపులర్ కాని బ్రాండ్‌గా కూడా విడుదల చేస్తుంటుంది. అంటే తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు ఏ ధరలో మందు కొనాలన్నా ఆ కంపెనీయే అమ్ముతుంది. అనుబంధ విభాగాల పేరిట వీటిని మార్కెట్ చేస్తుంటారు. ధరల్లో తేడాలెందుకు? జనరిక్స్‌లో రకాల మాట పక్కనబెడితే అసలు ధరల్లో ఇన్ని తేడాలెందుకనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పేవారే లేరు. తమ పేరు బయటకు రావద్దనే షరతుమీద కొందరు కొన్ని నిజాలు చెబుతుంటారు. రాష్ట్రంలో అతి పెద్ద ఫార్మా కంపెనీని నిర్మించిన తొలితరం పారిశ్రామికవేత్త ఒకరు తన చివరి రోజుల్లో అనధికారికంగా కొన్ని విషయాలను చెబుతుం డేవారు. ఫార్మా అనేది విష వలయంలా మారి పోయిందని చెప్పేవారు. కొందరు పెద్ద పదవుల్లో ఉన్న వైద్యులు మందుల ధరలకు సం బంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నా... నిర్మాణాత్మకంగా అడుగులేసేవారు మాత్రం తక్కువ. (అసలు ఇండియాలో జనరిక్స్ పరిస్థితేంటి? చట్టాలేం చెబుతున్నాయి? అమెరికాలాంటి చోట్ల పరిస్థితేంటి? అక్కడివారికి మందుల్లో ఎందుకంత పొదుపవుతోంది? రేపటి సంచికలో..) ఏ కంపెనీ అయినా తయారీకయ్యే ఖర్చుల్ని బట్టే ధర నిర్ణయిస్తుంది. లాభాలనేవి అమ్మకాలపై ఆధారపడతాయి కాబట్టి.. అమ్మకాల్ని పెంచుకునేందుకు వివిధ మార్గాల్ని అనుసరిస్తుంటారు. అవి.. 1) నైతిక ప్రచారం (ఎథికల్ ప్రమోషన్): ఈ పద్ధతి పాటించే ఏ కంపెనీకైనా రాష్ట్రం మొత్తానికి సీ అండ్ ఎఫ్ ఏజెంట్ ఉంటారు. తన పరిధిలో 25-30 మంది డిస్ట్రిబ్యూటర్లకు, వారి నుంచి రిటైల్ షాపులకు మందులు సరఫరా అవుతాయి. సాధారణంగా సీ అండ్ ఎఫ్ ఏజెంట్‌కు 2 శాతం, డిస్ట్రిబ్యూటర్లకు 8-10 శాతం, రిటైలర్లకు 18-20 శాతం కమీషన్ ఉంటుంది. అంటే మొత్తమ్మీద 30-35 శాతం కమీషన్లే. ఇక కంపెనీలే రోగుల చేత వాటిని కొనిపించేందుకు తమ సేల్స్ సిబ్బందిని రంగంలోకి దించుతాయి. ఆ సిబ్బంది వైద్యులకు రకరకాల బహుమతులు ఇస్తారు. డాక్టర్ స్థాయిని బట్టి, వారి దగ్గరికొచ్చే రోగుల్ని బట్టి దేశీ, విదేశీ పర్యటనలు, ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు, కార్లు వంటివి ఇస్తారు. మొత్తంగా కమీషన్లు, సేల్స్ యంత్రాంగానికయ్యే ఖర్చు, బహుమతుల ఖర్చు, కంపెనీల లాభం, మందుల తయారీ ఖర్చు.. అన్నీ కలసి ధర తడిసిమోపెడు అవుతుంది. అందుకే బ్రాండెడ్ జనరిక్స్ ధర ఎక్కువగా ఉంటుంది. 2) నేరుగా విక్రయించే జనరిక్స్: పేరులేకుండా విక్రయించే జనరిక్ సాల్ట్‌లకు (ఔషధం పేరు) సేల్స్ యంత్రాంగం, డాక్టర్ సిఫారసు ఉండ వు. వీటి అమ్మకాల కోసం కంపెనీలు మెడికల్ షాపులపైనే ఆధారపడతాయి. వీటిపై ముద్రించే ధర కొంత ఎక్కువే ఉంటుంది. మెడికల్ షాపులకు 70-80% డిస్కౌంట్ ధరకే ఇస్తారు. షాపులు వీటిని 50- 60% తక్కువ ధరకు అమ్మవచ్చు. కానీ చాలా దుకాణాల వారు వాటిపై ముద్రించిన ధరనే వసూలు చేస్తారు. ప్రత్యేకంగా కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన జనఔషధి స్టోర్లు, నవభారత్ నిర్మాణ్ వంటి మందుల షాపులు జనరిక్స్‌ను తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి. 3) పీ అండ్ డీ... (ప్రాపగండా అండ్ డిస్ట్రిబ్యూషన్): కొన్ని కంపెనీలకు స్టాకి స్ట్లు సైతం ఉండరు. ఇవి తమ ఉత్పత్తుల్ని విక్రయించడానికి ప్రచారం, పంపిణీ మార్గాన్ని అనుసరిస్తాయి. అంటే సొంత మెడికల్ షాపులున్న వైద్యులను, ఆసుపత్రులను ఇవి ఉపయోగించుకుంటాయి. తమ ఉత్పత్తులను విక్రయించాల్సిందిగా నేరుగా వారికే ఇస్తాయి. ఆ డాక్టరు స్థాయిని బట్టి వారికి ముందే ఏక మొత్తంగా డబ్బు ముట్టజెబుతాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండదు గనుక అందుకు పెట్టే ఖర్చులో కొంత డాక్టరుకే ముడుపులిస్తాయన్న మాట. దీంతో సదరు వైద్యుడు తన దగ్గరకొచ్చే రోగులకు ఆ మందులే రాస్తారు. అవి ఆ షాపులోనే దొరుకుతాయి. దగ్గర్లోని మరో షాపులో వాటిని విక్రయించకూడదన్న షరతు మీదే వాటిని ఆ డాక్టరు విక్రయిస్తాడు. పైగా వీటి విక్రయాల్లో కమీషన్ కూడా ఎక్కువే. తక్కువకు విక్రయించకపోవటమే సమస్య సాధారణంగా అవసరమయ్యే చాలా మందులకు జనరిక్స్ ఉన్నాయి. అవి అన్ని షాపుల్లోనూ దొరుకుతాయి. కానీ జనఔషధి, నవభారత్ నిర్మాణ్ వంటివి మినహా చాలా దుకాణాలు జనరిక్స్‌ను కూడా వాటిపై ముద్రించి ఉన్న ధరకే విక్రయించటంతో సమస్య తలెత్తుతోంది. వినియోగదారుడు జనరిక్స్ కొనాలనుకున్నా అవి తక్కువ ధరకు అందే పరిస్థితి ఉండడం లేదు. డాక్టర్లకు సొంత మెడికల్ షాపులున్నచోట పరిస్థితి మరీ దారుణం. ఉదాహరణకు అత్యవసరంగా చేసే మెరోపెనెమ్ ఇంజెక్షన్ ధర రూ.2,800 వరకూ ఉంది. రోజుకు రెండు డోసులివ్వాలి. అత్యవసర మందు గనుక వైద్యులు తమ షాపులోని జనరిక్నే ఇస్తుంటారు. రూ.200-300కు దొరికే ఈ జనరిక్కూ రూ.2,800 వసూలు చేస్తుండడం దారుణం. అలాగే పైపరాసిల్లిన్ ప్లస్ టాజోబాక్టమ్ మందులు కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు వాడేవే. వీటి ధర రూ.250-300 వరకు ఉంటుంది. కానీ జనరిక్ రూ. 50కే దొరుకుతుంది. వైద్యులు వీటి విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు. జనరిక్స్‌కు సంబంధించి ఈ కథనాలపై మీ అనుభవాలు, అభిప్రాయాలను మాకు సాక్షిహెల్త్15@ జీమెయిల్ ద్వారా మెయిల్ చేయొచ్చు -
మధుమేహ రోగుల కోసం కొత్తరకం బియ్యం
రాయ్‌పూర్: మధుమేహ రోగులకు అన్నం ప్రధాన శత్రువుగా మారిన నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించేలా పరిశోధకులు గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే కొత్త వరి వంగడాన్ని కనిపెట్టారు. ఇది మధుమేహ రోగులకే కాకుండా సాధారణ ప్రజలకూ ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడుతుందన్నారు. రాయపూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు దీన్ని రూపొందించారు. వచ్చే నెల వీటిని వాణిజ్య ప్రాతిపదికన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సంప్రదాయంగా సాగుచేసే ‘చపాతీ గుర్మతీయ’ అనే వరి రకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని తయారు చేసినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన గిరీశ్ చందెల్ తెలిపారు. వరి ప్రధాన ఆహార వనరుగా ఉన్న మన దేశంలో ఈ కొత్త ఆవిష్కరణ ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. -
మలేసియా హాస్పిటల్స్‌తో అపోలో జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మలేిసియాలోని చక్కెర వ్యాధిగ్రస్తులకు సేవలను అందించడానికి అపోలో హాస్పిటల్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అపోలో గ్రూపు అనుబంధ కంపెనీ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్(ఏహెచ్‌ఎల్‌ఎల్) మలేసియాకు చెందిన రామ్సే సిమే డార్బీ హెల్త్‌కేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం రామ్సే హాస్పిటల్‌లోని రోగుల చికిత్సకు అపోలో తన అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా మలేసియా, ఇతర సరిహద్దు దేశాల్లో హాస్పిటల్స్ విస్తరణ కూడా చేపట్టనున్నారు. అపోలో 100 హాస్పిటల్స్ ద్వారా సుమారు రెండు లక్షల మంది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తోంది. -
డయాబెటిక్ రోగులకు బైద్యనాథ్ షుగర్-ఫ్రీ ‘చ్యవన్-విట్’
హైదరాబాద్: శ్రీ బైద్యనాథ్ ఆయుర్వేద్ భవన్ కంపెనీ తొలిసారిగా డయాబెటి క్ రోగుల కోసం షుగర్-ఫ్రీ ‘చ్యవన్-విట్’ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. బైద్యనాథ్ చ్యవన్-విట్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని, ఇతర బలహీనతలను తగ్గిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బైద్యనాథ్ రీసెర్చ్ పౌండేషన్ నిర్వహించిన పలు పరిశోధనల అనంతరం బలహీనతలను తగ్గించే బిల్వా, డాష్మూల్ వంటి ఫాస్పేట్ అధికంగా కలిగిన మూలికలను కలిపి ఈ చ్యవన్-విట్‌ను తయారుచేశామని పేర్కొంది. చ్యవన్-విట్లోని ఆశగంధ, సేఫ్డ్ ముసలి, కేశర్ వంటి మూలికలు నరాలను ఉత్తేజితం చేసి, తద్వారా శారీరక బలహీనతలను తగ్గిస్తాయని కంపెనీ వివరించింది. -
మార్కెట్లోకి అతి చౌక డయాబెటిక్ ఔషధం