ఈ ఏడాది చలికాలంలోకి అడుగుపెట్టాం. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత వ్యాయమం చేయడంతో పాటు డైట్ పాటించడం కూడా చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో దొరికే కొన్ని పండ్లను మీ డైట్‌లో భాగంగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఈ కాలంలో దొరుకుతూ, ఆరోగ్యానికి, బీపీ, షుగర్ లెవల్స్ తగ్గించడానికి దోహదపడే ఐదు రకాల పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కమల పండు: ఈ పండులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఫైబర్‌తో నిండి వుండే ఈ పండులో సీ విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది భోజనం తరువాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు దోహదపడుతోంది. ఇది షుగర్ లెవల్స్‌ను, కొలస్ట్రాల్‌ను, బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
2. పీర్స్: ఈ పండులో ఎక్కవ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ పోషకాలు, ఫైబర్ కలిగి ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అయితే ఈ పండు జ్యూస్ తాగకుండా కొరికి తినడం ఉత్తమం. ఎందుకంటే జ్యూస్ తాగితే ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే ఫ్రూట్స్‌లో పీర్స్ ఒకటి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉండవు.
3.కివి: దీనిలో సీ విటమిన్ పుష్కలంగా ఉండటంతో పాటు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫ్రూట్‌గా చెప్పవచ్చు. ఇది కూడా గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే పండ్లలో ఒకటి. సంవత్సరం అంతా కివి అందుబాటులో ఉంటుంది.అందుకే మీ డైట్‌లో కచ్ఛితంగా దీనిని భాగంగా చేసుకోండి.
4. యాపిల్స్: దీని గురించి చెప్పాలంటే రోజు ఒక యాపిల్ తినడం ద్వారా డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు అనే నానుడి ఉండనే ఉంది. దీని ద్వారా యాపిల్‌లో ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఎన్ని పోషకాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనిలో చాలా తక్కువ కొలిస్ట్రాల్ ఉంటుంది. తక్కువ కాలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి. షుగర్ లెవల్స్ పెంచే కారకాలు దీనిలో చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎతో పాటు సోడియం లాంటి సూక్ష్మ పోషకాలు కూడ పుష్కలంగా ఉంటాయి. అందుకే యాపిల్‌ను మీ డైట్‌లో భాగంగా మార్చుకోండి.
5.బెర్రీస్: ఇక మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన ఫ్రూట్స్‌లో బెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. తీయగా ఎంతో రుచికరంగా ఉండే ఈ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుండి షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్‌చేస్తాయి. అయితే వీటిని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలతో కలిపి తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: షుగర్‌తో డిప్రెషన్.. జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment