ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డయాబెటిక్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. వీరిలో డైట్‌ను ఫాలో అయ్యేవారు, అవ్వాలనుకునేవారు చాలామందే ఉంటారు. ఇలాంటి వారందరికీ ఎంత తినాలో.. ఏం తినాలో సరైన ఐడియా ఉండదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ పెట్టే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో.. న్యూట్రిషనల్ వ్యాల్యూస్ ఏంటో తెలియక ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు.
వీరి కోసం కేలరీ, న్యూట్రిషనల్ క్యాలుక్యులేటర్లు ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక అంచనాకు మాత్రమే పనికొస్తాయి. అయితే ఈ ఫొటోలోని పానాసోనిక్ వారి కేలోరికో అనే కొత్త పరికరం ప్లేట్‌లో ఉండే ఆహారం ఎన్ని కేలరీలు ఉందో సెకన్లలోనే కచ్చితంగా లెక్కించగలదట.. మనలో చాలామంది ఇప్పటికే కేలరీ క్యాలుక్యులేటర్లను వినియోగించే ఉంటారు. కానీ అవన్నీ సాధారణంగా ప్రాథమిక సమాచారం మాత్రమే ఇస్తాయి.
ఉదాహరణకి ఒక బర్గర్‌లో ఎన్ని కేలరీలు ఉండొచ్చో అంచనాగా చెబుతాయి. కానీ కేలరికో మాత్రం ప్లేట్‌లో ఉన్న బర్గర్ కచ్చితంగా ఎన్ని కేలరీలు ఉందో చెప్పగలదు. ఈ పరికరాన్ని సీటెక్–2017 టెక్నాలజీ సదస్సులో ప్రదర్శించారు. ఈ పరికరం లైట్ రిఫ్లెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ప్లేట్‌లో ఉన్న ఆహారంలోని పౌష్టికాల విలువను కచ్చితంగా చెబుతుంది. చేయాల్సిందల్లా ప్లేట్‌లోని ఆహారాన్ని ఈ పరికరంతో ఫొటోలో చూపిన విధంగా పది నుంచి 20 సెకన్లు ఉంచాలి. ఆహారాన్ని లెక్కించిన తర్వాత ఎన్ని కేలరీలు, పౌష్టిక గుణాలను ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో ఇట్టే చూపెడుతుంది.
అయితే ప్రస్తుతానికిది సూప్‌లు, ఇతర డార్క్ డిష్‌లు మినహా అన్ని రకాల ఆహార పదార్థాలను గుర్తిస్తుంది. ఈ పరికరాన్ని యాప్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని డయాబెటిక్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశామని పానాసోనిక్ కంపెనీ వారు చెబుతున్నారు. ఈ పరికరం మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఇంకొన్నేళ్లు ఆగాలని చెబుతున్నారు. అలాగే దీని ధర ఎంత ఉండచ్చో కంపెనీ తెలపలేదు.
కేలరీలను ఇట్టే పట్టేస్తుంది
Published Sun, Oct 15 2017 1:20 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment