సాక్షి, న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు బుల్‌జోష్‌లో సాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పడుతున్నాయి. తాజాగా శ్యామ్ మెటాలిక్స్ ఈ నెల 14 నుంచీ ఐపీవో చేపడుతుండగా.. మరో రెండు కంపెనీలు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్ కంపెనీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూకి అనుమతించమంటూ సెబీకి.. ఉత్కర్ష్ స్మాల్ బ్యాంక్ మార్చిలో ప్రాథమిక పత్రాలతో దరఖాస్తు చేయగా.. గ్లెన్‌మార్క్ లైఫ్ ఏప్రిల్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.
ఉత్కర్ష్ బ్యాక్‌గ్రౌండ్
ఐపీవోలో భాగంగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 600 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ఉత్కర్ష్ కోర్‌ఇన్వెస్ట్ విక్రయానికి ఉంచనుంది. వారణాసి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉత్కర్ష్ ఐపీవో(ఈక్విటీ జారీ) నిధులను టైర్-1 పెట్టుబడుల పటిష్టతకు, భవిష్యత్ పెట్టుబడులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 2009 నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థగా కార్యకలాపాలు కొనసాగించిన ఉత్కర్ష్ తదుపరి 2017లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్ నాటికి 528 బ్యాంకింగ్ ఔట్‌లెట్లతో 2.74 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. మైక్రోఫైనాన్స్ ద్వారానే అధిక మొత్తంలో రుణాలను విడుదల చేస్తోంది. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో కార్యకలాపాలు విస్తరించింది.
గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్
ఇష్యూ సైజ్: రూ. 1,160. 1,160 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను, రూ .2 చొప్పున 73.05 లక్షల షేర్లకు ఆఫర్ ఫర్ సేల్ జారీ చేయాలని గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ యోచిస్తోంది. వాటా విధానం ప్రకారం, ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సమిష్టిగా 13.15 కోట్ల షేర్లు ఉన్నాయి. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ .43 లక్షల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 313 కోట్ల రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment