భారత్‌లో కరోనావైరస్ చికిత్సకు తొలి నాజల్ స్ప్రే‘ ఫాబిస్ప్రే’ అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్, కెనడాకు చెందిన శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కంపెనీలు సంయుక్తంగా భారత్‌లో విడుదల చేశాయి.
పెద్దవారికి నాజల్‌స్ప్రే చికిత్స..!
పెద్దవారిలో కరోనా(Coronavirus)ను ట్రీట్ చేయడానికి ఈ నాజల్ స్ప్రే సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేను తయారుచేయడానికి, మార్కెటింగ్ చేయడానికి గ్లెన్‌మార్క్ ఫార్మా కంపెనీకి భారత డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ(DCGI) అనుమతులు ఇచ్చింది.మన దేశంలో ఫేజ్ 3 ట్రయల్ పరీక్షల్లో ఈ నాజల్ స్ప్రే అద్భుతంగా పని చేసినట్టు తేలిందని కంపెనీ అధికారిక ప్రకటన తెలిపింది. 24 గంటల్లో 94 శాతం వైరల్ లోడ్‌ను తగ్గిస్తుందని, 48 గంటల్లో 99 శాతం వైరల్ లోడ్‌ను ఈ నాజల్ స్ప్రే తగ్గిస్తున్నట్టు తేలిందని వివరించింది. నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే సేఫ్ అని, కొవిడ్ పేషెంట్లూ ఈ స్ప్రే ద్వారా ఇబ్బంది పడరని పేర్కొంది. గ్లెన్‌మార్క్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేను ఫాబిస్ప్రే బ్రాండ్ నేమ్‌తో భారత్‌లో విక్రయిస్తుందని వివరించింది.
రెండు నిమిషాల్లో నాశనం..!
క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ క్లినికల్ డెవలప్‌మెంట్ హెడ్, సీనియర్ వీపీ డాక్టర్ మోనికా టాండన్ మాట్లాడారు. పేషెంట్‌లోని వైరల్ లోడ్‌ను ఈ నాజల్ స్ప్రే గణనీయంగా తగ్గిస్తున్నదని వివరించారు. కొత్త వేరియంట్లతో కరోనా పంజా విసురుతున్న ఈ సమయంలో నాజల్ స్ప్రే భారత ప్రజలకు మరో ఉపయోగకరమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. అమెరికాలోని ఉటా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం, నాజల్ స్ప్రేలు 99.9 శాతం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ వేరియంట్‌లను రెండు నిమిషాల్లో నాశనం చేస్తాయని తేలిందని పేర్కొన్నారు.
చదవండి: కేవలం రూ. 197తో 150 రోజుల వ్యాలిడిటీ..! ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!
Comments
Please login to add a commentAdd a comment