ట్రయంఫ్‌ ‘స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఎస్‌’ @ రూ.8.5 లక్షలు | 2017 Triumph Street Triple S launched in India at Rs 8.5 lakh | Sakshi
Sakshi News home page

ట్రయంఫ్‌ ‘స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఎస్‌’ @ రూ.8.5 లక్షలు

Published Tue, Jun 13 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

ట్రయంఫ్‌ ‘స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఎస్‌’ @ రూ.8.5 లక్షలు

ట్రయంఫ్‌ ‘స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఎస్‌’ @ రూ.8.5 లక్షలు

దిగ్గజ సూపర్‌బైక్స్‌ తయారీ కంపెనీ ‘ట్రయంఫ్‌’ తాజాగా స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఎస్‌–2017 బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ). నలుపు, ఎరుపు రంగుల్లో లభ్యంకానున్న ఈ బైక్‌లో 765 సీసీ ఇంజిన్, 6–స్పీడ్‌ గేర్‌బాక్స్, స్విచబుల్‌ ట్రాక్షన్‌ కంట్రోల్, డీఆర్‌ఎల్‌ హెడ్‌లైట్స్, ఏబీఎస్, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రూమెంట్‌ ప్యాక్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది.

ఈ ఏడాది 250–300 బైక్స్‌ను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది. కంపెనీ ప్రసుత్తం 16 మోడళ్లను భారత్‌లో విక్రయిస్తోంది. 2018 నాటికి భారత్‌లో విక్రయించే ప్రొడక్ట్స్‌లో 90 శాతం వరకు దేశీయంగా తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ విమల్‌ సంబ్లీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement