
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ ప్రకటన రంగంలోకి కొత్త సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘డిజిటల్ కైట్స్’ పేరుతో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్‌లోకి అడుగు పెట్టింది. తద్వారా వెబ్‌సైట్లకు, బ్రాండ్లు లేదా ఏజెన్సీలకు తన సేవలను ఉచితంగా అందించనుంది. వివిధ బ్రాండ్లు, ప్రచురుణకర్తలు ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఒక కొత్త ఎకో సిస్టంను సృష్టిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్లాట్‌పాంలో ముఖ్యంగా గోప్యతకు బలమైన ప్రాధాన‍్యత ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆడియన్స్ ప్రైమ్ , ఆడియన్స్ ప్లే అనే రెండు ప్రధాన ఉత్పత్తులను డిజిటల్ కైట్స్ లాంచ్ చేసింది. 'ఆఫ్‌లైన్ కస్టమర్లు,' లేదా 'మల్టీ-ఛానల్ మార్కెటింగ్' తమ లక్ష్యమని పేర్కొంది. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, రీటైల్ అండ్ కన్సూయర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ట్రావెల్ అండ్ టూరిజం తదితర రంగాలకు తన సేవలను అందించనుంది.
డిజిటల్‌కైట్స్‌పై పనిచేయడం ప్రారంభించినప్పుడు, డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టంలో చాలామంది వాటాదారులను గమనించామనీ, ఆయా కంపెనీలు, వాటి రోడ్‌బ్లాక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి వ్యాపారాలకు గణనీమైన విలువను ఎలా అందించాలో పరిశీలించామని డిజిటల్ కైట్స్ సీఈవో దినేష్ గంటి తెలిపారు. గూగుల్ , ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వాల్స్ వెలుపల బ్రాండ్లు తమ మొదటి పార్టీ సీఆర్‌ఎం డేటాను ప్రభావితం చేయలేవు. ఇందుకు చాలా సాంకేతిక పరిష్కారాలు ఉన్నప్పటికీ, బహిరంగ గుర్తింపు తీర్మానం లేకపోవడం వల్ల అవి భారతదేశంలో పనిచేయవని తెలిపిన ఆయన తాము అతిపెద్ద యూజర్ రిజల్యూషన్ పరిష్కారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీని డిజిటల్ కైట్స్ ఉత్పత్తులతో మిళితం చేసి, తద్వారా బ్రాండ్‌లు, ప్రచురణకర్తలు అన్ని మార్కెటింగ్ ఛానెళ్లలో మొదటిసారిగా కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
చాలా పెద్ద ప్రచురణకర్త సంస్థలతో మాట్లాడుతున్నామనీ అతి త్వరలో కొన్ని పెద్ద భాగస్వామ్య ప్రకటనలు చేయబోతున్నామని డిజిటల్ కైట్స్ సీవోవో రఘు తెలిపారు. తమకు హైదరాబాద్, ముంబై , న్యూఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయన్నారు. యాభై మంది ఉద్యోగులు వివిధ ఉత్పత్తులు, కార్యక్రమాలపై పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే తమకు వే 2 ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మద్దతు ఉన్నట్టు ప్రకటించారు.
ఆడియన్స్ ప్లే : యాప్స్, వెబ్‌సైట్లకు ఉద్దేశించింది. ఇది ఆయా ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ యూజర్ టచ్ పాయింట్స్, సెగ్మెంట్ నుండి డేటాను ఏకీకృతం చేయడానికి, వారి ప్రేక్షకులను బ్రాండ్‌లతో మెరుగుపరచడానికి, ప్రైవేట్‌గా భాగస్వామ్యానికి అనుమతిస్తుంది.
ఆడియన్స్ ప్రైమ్ : బ్రాండ్‌లు, ఏజెన్సీలకుద్దేశించింది. మొదటి సీఆర్‌ఎం డేటాను ఆన్‌బోర్డ్ చేయడానికి, ప్రఖ్యాత ప్రచురణకర్తల నుండి సముచిత ప్రేక్షకుల విభాగాలతో పాటు ప్రోగ్రామాటిక్, సోషల్, ఇమెయిల్ మొదలైన బహుళ ఛానెల్‌లలో అనుమతికి వీలు కల్పిస్తుంది. ఇవి రెండూ డిజిటల్ కైట్స్ యూజర్ రిజల్యూషన్ టెక్నాలజీ ఆధారితంగా పనిచేస్తాయి. ఇవి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఐడెంటిఫైయర్‌లైన ఇమెయిల్, కుకీలు, అడ్వర్టైజింగ్ ఐడిలు, మొబైల్ నంబర్లు మొదలైన వాటి ద్వారా వినియోగదారులను గుర్తిస్తుంది. అందువల్ల బ్రాండ్‌లు, ప్రచురణకర్తలు తమ వినియోగదారులతో వివిధ డివైస్‌లు, ఛానెళ్లలో కమ్యూనికేట్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment