new models
-
ఓలా ఈ–బైక్ 501 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ తాజాగా రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌తో మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ మోడళ్లను ఆవిష్కరించింది. ధర రూ.74,999 నుంచి ప్రారంభమై రూ.1,54,999 వరకు ఉంది. వాహనం పరుగెడుతున్నప్పుడు కూడా చార్జింగ్ అవుతుంది. ఐపీ67 రేటెడ్ బ్యాటరీ, స్మార్ట్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల ఎల్సీడీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రివర్స్ మోడ్ వంటి ఏర్పాటు ఉంది. గరిష్ట పవర్ 7–11 కిలోవాట్ ఉంది. నిర్వహణ వ్యయం రూ.500.. రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌లో వేరియంట్‌నుబట్టి 2.5–4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 140–252 కిలోమీటర్లు పరిగెడుతుంది. గరిష్ట వేగం గంటకు 105–118 కిలోమీటర్లు. రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ సిరీస్‌లో 4.5–9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జింగ్‌తో 252–501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. నెలవారీ నిర్వహణ వ్యయం పెట్రోల్ బైక్‌కు రూ.4,000 అయితే రోడ్‌స్టర్ ఎక్స్‌తో రూ.500 మాత్రమేనని ఓలా తెలిపింది. మార్చిలో డెలివరీలు ఉంటాయి. మరో రెండు మోడల్స్.. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో మోడల్స్‌లో సైతం కంపెనీ పలు వేరియంట్లను రూపొందిస్తోంది. రోడ్‌స్టర్‌లో 3.5–6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 151–248 కి.మీ. ప్రయాణిస్తాయి. గరిష్ట వేగం గంటకు 116–126 కిలోమీటర్లు. ధర రూ.1,04,999 నుంచి రూ.1,39,999 వరకు ఉంది. అలాగే రోడ్‌స్టర్ ప్రో సిరీస్‌లో 8–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 316–579 కిలోమీటర్లు పరుగు తీస్తాయి. గరిష్ట వేగం గంటకు 154–194 కిలోమీటర్లు. ధర రూ.1,99,999 నుంచి రూ.2,49,999 వరకు ఉంది. డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలవుతాయి. -
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త కార్ల పండగ!
సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్‌తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు సేల్స్ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది. రాబోయే పండుగ సీజన్ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి. కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్యూవీ మోడల్స్ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్తో పాటు లగ్జరీ కార్ దిగ్గజాలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. సేల్స్ తగ్గినా.. నిల్వల పెంపు.. ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. సెపె్టంబర్‌తో షురూ... దక్షిణాదిన కేరళ ‘ఓనమ్’ తో పండుగ సేల్స్ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్‌లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. మహీంద్రా సక్సెస్ఫుల్ ఎస్యూవీ ‘థార్’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్ ‘రాక్స్’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్ కోసం మేము ముందుగా ప్లాన్ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్ జెజూరికర్ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.ఈవీలు, హైబ్రిడ్లు కూడా... కొత్తగా లైన్ కడుతున్న వాహన మోడల్స్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) హైబ్రిడ్ (సీఎన్జీ+పెట్రోల్ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ కూప్ ‘కర్వ్’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్–ట్రెయిల్ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. → టాటా మోటార్స్–కర్వ్ ఈవీ (18–25 లక్షలు), → కర్వ్ (రూ.10.5–20 లక్షలు), → మారుతీ–స్విఫ్ట్ హైబ్రిడ్ (10 లక్షలు), డిజైర్–2024 (7–10 లక్షలు) → మహీంద్రా–థార్ రాక్స్ (13–23 లక్షలు) → నిస్సాన్ – ఎక్స్ట్రెయిల్ (49 లక్షల నుంచి)→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) → మెర్సిడెజ్–బెంజ్ – ఈక్యూఎస్ ఎస్యూవీ (2 కోట్లు) → బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) → రెనో–కార్డియన్ (10–12 లక్షలు) → ఎంజీ–క్లౌడ్ ఈవీ (29–30 లక్షలు), → గ్లోస్టర్–2024 (40 లక్షలు) → స్కోడా–కొడియాక్–2024 (40–50 లక్షలు) → బీవైడీ–సీగల్ ఈవీ (10 లక్షలు) → కియా–ఈవీ9 (75–82 లక్షలు)→ ఆడి–క్యూ8 ఫేస్‌లిఫ్ట్ (రూ.1.17 కోట్లు) → సిట్రాన్ – సీ3ఎక్స్ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్ (రూ.8 లక్షలు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెర్సిడెస్ కొత్త మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో మరో రెండు టాప్ ఎండ్ మోడళ్లను గురువారం విడుదల చేసింది. వీటిలో ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే, సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ ఉన్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎక్స్‌షోరూంలో ప్రారంభ ధర రూ.1.10 కోట్లు. ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే మోడల్‌కు 1,991 సీసీ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, ఏఎంజీ స్పీడ్íÙఫ్ట్ ఎంసీటీ 9జీ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ మోడల్ 1,999 సీసీ ఇన్లైన్–4 టర్బోచార్జ్డ్ ఇంజన్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలో చేరుకుంటుంది. కాగా, 2023–24లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయంగా 18,123 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరి–జూన్‌లో 9 శాతం వృద్ధితో 9,262 యూనిట్లు రోడ్డెక్కాయి. 2024లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. మైబాహ్ ఎలక్ట్రిక్ కారు సెప్టెంబరులో భారత్‌లో అడుగు పెడుతుందని వెల్లడించారు. -
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో రాబోయే 6 సంవత్సరాల్లో ఏకంగా 16 కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2030 నాటికి 9 ఫ్యూయెల్ కార్లు, 7 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని సంస్థ యోచిస్తోంది.కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు తన వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి యోచిస్తోంది. దీనికోసం మహీంద్రా రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తూ దేశీయ విఫణిలో, గ్లోబల్ మార్కెట్లో కూడా దూసుకెళ్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL)లో కంపెనీ ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ 10000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంఖ్య FY2026 నాటికి 18000 చేరే అవకాశం ఉంది. కాగా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి FY2025 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
శామ్సంగ్ కొత్త ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శామ్సంగ్ భారత్‌లో గెలాక్సీ సిరీస్‌లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది. ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్ చేస్తాయని శామ్సంగ్ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. -
కొత్త కార్ల పరుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్‌యూవీలు ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. మెర్సిడెస్‌తో బోణీ.. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్ఎస్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్‌ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది. మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్యూవీ టైసర్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్‌లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్‌వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి. ఈవీలు సైతం మార్కెట్లోకి.. ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్‌లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్లో రానుందని సమాచారం. -
సామర్థ్యం పెంచుకోనున్న మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2.86 లక్షల యూనిట్ల ఆర్డర్ బుక్. 2024లో రానున్న కొత్త మోడళ్లు. వెరశి సామర్థ్యం పెంచుకోవడంపై వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దృష్టిసారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 55,000 యూనిట్ల స్థాయికి తయారీని చేర్చే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడి ప్రణాళికను 3–6 నెలల్లో మహీంద్రా ప్రకటించనుంది. ప్రధానంగా ఈవీ విభాగంలో ఈ పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మహీంద్రా ఇప్పటికే 2021–22 నుంచి 2023–24 మధ్య రూ.10,000 కోట్లు వెచి్చస్తోంది. 2024 మార్చి నాటికి నెలకు అన్ని విభాగాల్లో కలిపి 49,000 యూనిట్ల తయారీ సామర్థ్యానికి చేరుకోవాలి సంస్థ ఇప్పటికే లక్ష్యం విధించుకుంది. అయిదు డోర్ల థార్, కొత్త ఈవీ మోడళ్లు రానుండడంతో 49,000 యూనిట్ల స్థాయికి మించి తయారీ సామర్థ్యం ఉండాలన్నది కంపెనీ భావన. థార్, ఎక్స్‌యూవీ 700, స్కారి్పయో మోడళ్లకు బలమైన డిమాండ్‌తో గడిచిన అయిదేళ్లలో దాదాపు రెండింతలకుపైగా సామర్థ్యం పెంచుకుంది. రెండవ స్థానంలో మహీంద్రా.. ఇక వచ్చే 12 నెలల్లో ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు సైతం రానున్నాయి. బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొన్ని మాసాలుగా సగటున నెలకు 51,000 యూనిట్ల స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. నవంబర్ 1 నాటికి ఉన్న ఆర్డర్ బుక్ ప్రకారం ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 400 మోడళ్లకు 10,000 యూనిట్లు, ఎక్స్‌యూవీ 700 కోసం 70,000, థార్ 76,000, బొలెరో 11,000, క్లాసిక్ వేరియంట్‌తో కలిపి స్కారి్పయో–ఎన్ 1,19,000 యూనిట్లు కస్టమర్లకు చేరాల్సి ఉంది. 2023 జూలై–సెపె్టంబర్ మధ్య దేశవ్యాప్తంగా మహీంద్రా ఎస్‌యూవీలు 1,14,742 యూనిట్లు రోడ్డెక్కాయి. పరిమాణం పరంగా అయిదు త్రైమాసికాలుగా ఎస్‌యూవీల అమ్మకాల్లో మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది. -
రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వాహనాల మోడల్స్‌ను, ఉత్పత్తిని పెంచుకోనున్న నేపథ్యంలో 2030–31 నాటికి మూలధన వ్యయం రూ. 1.25 లక్షల కోట్ల మేర ఉంటుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం 17 మోడల్స్‌ను తయారు చేస్తుండగా వీటిని 28కి విస్తరించాలని భావిస్తోంది. అలాగే 2030–31 నాటికి మొత్తం ఉత్పత్తి సామరŠాధ్యన్ని ఏటా 40 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. ‘గురుగ్రామ్, మానెసర్, గుజరాత్‌లోని ప్రస్తుత ప్లాంట్లలో పెట్టుబడి ప్రణాళికలు యథాప్రకారం కొనసాగుతాయి. 2022–23లో మూలధన వ్యయం రూ. 7,500 కోట్లుగా ఉంది. 2030–31 నాటికి ఈ మొత్తం రూ. 1.25 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చు‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎంఎస్ఐ తెలియజేసింది. ప్రస్తుత ఖర్చులు, ధరల స్వల్ప పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించేందుకు రూ. 45,000 కోట్లు అవసరమవుతాయని కంపెనీ పేర్కొంది. అలాగే, పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాలను కూడా పటిష్టపర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. వివిధ ఇంధనాలపై పని చేసే 10–11 కొత్త మోడల్స్‌ను రూపొందించేందుకు మూలధన వ్యయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అటు ఎలక్ట్రిక్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ఉత్పత్తికి కూడా భారీగా నిధులు కావాలని ఎంఎస్ఐ తెలిపింది. అందుకే సుజుకీకి షేర్ల జారీ.. సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ)లో సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)కి ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించే బదులు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడాన్ని ఎంఎస్ఐ సమరి్ధంచుకుంది. ఎస్ఎంసీ వాటాల కోసం రూ. 12,500 కోట్లు చెల్లించడం వల్ల లాభాలు, డివిడెండ్ల చెల్లింపులు మొదలైనవి తగ్గడంతో పాటు నగదు కొరత కూడా ఏర్పడేదని పేర్కొంది. అలా కాకుండా షేర్లను జారీ చేయడం వల్ల చేతిలో మిగిలే నిధులను సేల్స్, సరీ్వస్, స్పేర్ పార్టులపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు వెచి్చంచడం ద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు వీలవుతుందని ఎంఎస్ఐ వివరించింది. సోమవారం బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేరు స్వల్పంగా అర శాతం మేర క్షీణించి రూ. 10,238 వద్ద ముగిసింది. -
మెర్సిడెస్ నుంచి మరో 4 మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో మరో 4 మోడళ్లను పరిచయం చేస్తోంది. 2023లో ఇప్పటికే ఆరు మోడళ్లు రోడ్డెక్కాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త జీఎల్‌సీని హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 10 మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. ‘వచ్చే 12–18 నెలల్లో 3–4 ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రవేశపెడతాం. కొత్త జీఎల్సీ దేశవ్యాప్తంగా 1,500 బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 200 ఉన్నాయి. జనవరి–జూన్‌లో అన్ని మోడళ్లు కలిపి 8,500 యూనిట్లు విక్రయించాం. జూలై–డిసెంబర్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. -
పికప్ వాహన విభాగంలో ఎంఅండ్ఎం 2 కొత్త మోడళ్లు
హైదరాబాద్: సరకు రవాణాకు సంబంధించిన (పికప్) వాహన విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. రూ.7.85 లక్షల నుంచి రూ.10.33 లక్షల శ్రేణిలో ధరలు ఉన్న ఈ బొలెరో మ్యాక్స్ సామర్థ్యం 2 టన్నుల వరకూ ఉందని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. రూ.24,999 చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చని కూడా ప్రకటన వెల్లడించింది. 1.3 నుంచి 2 టన్నుల వరకూ పేలోడ్ సామర్థ్యంతో ఈ కొత్త శ్రేణి వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు ప్రకటన వివరించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పరిజ్ఞానం, సదుపాయాలతో ఈ వాహన శ్రేణి ఉత్పత్తి జరిగినట్లు వివరించింది. హెచ్డీ సిరీస్ (హెచ్డీ 2.0, హెచ్డీ 1.7, హెచ్డీ 1.3 లీటర్లు) , సిటీ సిరీస్ (సిటీ 1.3, 1.4 సీఎస్జీ) సిరీస్‌లలో వాహనాలు లభ్యం కానున్నట్లు తెలిపింది. -
ఈవీ విక్రయాలపై ఎంజీ మోటార్ కన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టిపెట్టిన ఎంజీ మోటార్స్ ఈ ఏడాది ఈవీ విక్రయాల్లో 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వచ్చే నెలలో ఈవీ విభాగంలో మరో మోడల్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో జెడ్ఎస్ ఈవీని విక్రయిస్తున్న కంపెనీ రెండు డోర్ల ఈవీ మోడల్ కామెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మే నెల నుంచి దశలవారీగా దేశమంతటా వాహ నాలను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్ చాబా పేర్కొన్నారు. వెరసి ఈ ఏడాది రెండు ఈవీ మోడళ్ల ద్వారా 80, 000–90,000 యూనిట్ల విక్రయాలను సాధించగలమని విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. -
ఓజా బ్రాండ్ కింద 40 ట్రాక్టర్లు
న్యూఢిల్లీ: ఓజా బ్రాండ్ కింద కొత్తగా 40 ట్రాక్టర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఓజా ట్రాక్టర్లు దేశీ మార్కెట్‌తోపాటు అమెరికా, జపాన్, ఆగ్నేయ ఆసియా మార్కెట్లపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, స్మాల్ యుటిలిటీ, లార్జ్ యుటిలిటీ పేరుతో నాలుగు విభాగాల్లో 40 ఓజా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చరల్ మెషినరీ (జపాన్), భారత్‌లోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఆర్అండ్డీ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. ఓజా శ్రేణి ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ట్రాక్టర్ల ప్లాంట్‌లో తయారు చేయనుంది. -
స్మార్ట్ కీతో యాక్టివా 125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా ఆధునీకరించిన ఇంజన్‌తో యాక్టివా 125 స్కూటర్‌ను నాలుగు వర్షన్స్‌లో విడుదల చేసింది. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్–స్మార్ట్ వీటిలో ఉన్నాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.81,342 నుంచి రూ.90,515 వరకు ఉంది. అయిదు రంగుల్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: స్వర్గంలో ఉన్న నానాజీ, నానీ.. నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) స్టార్ట్/స్టాప్ ఫీచర్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్‌తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది. రియల్ టైమ్ మైలేజ్, ట్యాంకులో ఉన్న ఇంధనంతో ప్రయాణించే దూరం, ఇంధనం ఎంత ఉంది, సగటు మైలేజ్, సమయం వంటి వివరాలను చూపే చిన్న డిజిటల్ స్క్రీన్ పొందుపరిచారు. ఇంధన సమర్థవంతమైన టైర్లను జోడించారు. స్మార్ట్ ఫైండ్, సేఫ్, అన్‌లాక్, స్టార్ట్ ఫీచర్లు గల స్మార్ట్ కీతో టాప్ ఎండ్ వేరియంట్ లభిస్తుంది. వాహనాల మధ్య ఈ స్కూటర్ ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్...: టీం మొత్తానికి ఉద్వాసన) -
KISAN Agri Show: న్యూ హాలండ్ రెండు కొత్త ట్రాక్టర్లు
హైదరాబాద్: న్యూ హాలండ్ అగ్రికల్చర్ (సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్) రెండు నూతన ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన కిసాన్ అగ్రి షోలో భాగంగా ‘బ్లూ సిరీస్ సింబా 30’, ‘5620 పవర్ కింగ్’ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ వ్యవసాయ సదస్సులో ఆరు ట్రాక్టర్లు, మూడు సాగు ఎకిŠవ్ప్మెంట్లను ప్రదర్శించింది. ఇందులో సింబా 30 అనేది స్ప్రేయింగ్, రోటావేషన్, కల్టివేషన్, అంతర్గత కల్టివేషన్ పనులకు అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అధిక పవర్‌తో, ఇంధనం ఆధా సామర్థ్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఇక 5620 పవర్ కింగ్ అనేది రవాణాకు, సాగుకు సంబంధించి పనులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. -
హోండా కార్స్ నుంచి న్యూ సిటీ
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా తాజాగా న్యూ సిటీ (పెట్రోల్), న్యూ సిటీ ఈ:హెచ్ఈవీ పేరిట రెండు కొత్త మోడల్స్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. భద్రత, కనెక్టివిటీ, సౌకర్యాలకు సంబంధించి వీటిలో అదనపు ఫీచర్స్‌ను జోడించినట్లు కంపెనీ తెలిపింది. న్యూ సిటీ (ఐ–వీటెక్) ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 14.72 లక్షల వరకూ ఉంటుంది. న్యూ సిటీ (ఈ–హెచ్ఈవీ) ధర రూ. 18.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షల వరకూ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 17.8 నుంచి 18.4 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తాయి. న్యూ సిటీలో అధునాతన 20.3 సెం.మీ. టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఆడియో, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, అలాగే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హోండా లేన్ వాచ్, యాంటీ థెఫ్ట్ అలారం తదితర ఫీచర్లు ఉంటాయి. రెండు మోడల్స్‌లోనూ 3 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. కావాలంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వర కూ అదనంగా వారంటీ తీసుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వారంటీ 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ.గా (ఏది ముందైతే అది) ఉంటుంది. -
వివో నుంచి ఎక్స్80, ఎక్స్ 80ప్రో
హైదరాబాద్: వివో తన ఫ్లాగ్షిప్ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్80, ఎక్స్80 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. జీస్ కంపెనీ సహకారంతో ఈ ఫోన్లలో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని వివో అందిస్తోంది. జీస్ జింబెల్ పోట్రయిట్ కెమెరా, 50 మెగా పిక్సల్ అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్ 866 సెన్సార్ వీటిల్లో ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 చిప్సెట్తో నడిచే ఈ ఫోన్లలో ఎన్నో కొత్త ఫీచర్లను వివో ప్రవేశపెట్టింది. ఎక్స్ 80 ప్రో 12జీబీ, 256జీబీ కాంబినేషన్ ధర ధర రూ.79,999. ఎక్స్ 80 8జీబీ, 128జీబీ ధర రూ.54,999. 12జీబీ, 256జీబీ ధర రూ.59,999. ఈ నెల 25 నుంచి విక్రయాలు మొదలు కానున్నట్టు వివో ప్రకటించింది. -
టెస్లా.. సింగిల్ డేలో 100 బిలియన్ డాలర్లు ఢమాల్
ప్రపంచంలో ఆటోమేకర్ కింగ్‌గా ఉన్న విరజిల్లుతున్న టెస్లాకు ఘోరమైన దెబ్బ పడింది. ఒక్కరోజులో.. కేవలం ఒకేఒక్క రోజులో 100 బిలియన్ డాలర్ల మేర కంపెనీ మార్కెట్ వాల్యూ పడిపోయింది. స్టాక్ మార్కెట్లో గురువారం టెస్లా షేర్లు 12 శాతం పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని తెలుస్తోంది. 2022 ఆరంభంలోనే ఈమేర భారీ దెబ్బ పడగా.. చాలాకాలం తర్వాత ఈ మేర దిగజారిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అమెరికన్ ఆటో మేకర్ టెస్లా.. బుధవారం నాడు 2021 ఏడాదికి నాలుగో క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే కిందటి ఏడాది భారీ లాభాల్ని ఆర్జించిన ఏకైక ఈవీ ఆటోమేకర్‌గా టెస్లా నిలవడం విశేషం. అయితే ఇంత లాభాల్లో ఉన్నా చిప్ కొరతల కారణంగా.. 2022లో కొత్త మోడల్స్‌ను తీసుకురాలేమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించడం ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బ తీసింది. ముఖ్యంగా లేబర్ షార్టేజ్ ప్రస్తావనతో పాటు సైబర్‌ట్రక్ ఆలస్యం, కొత్త మోడల్స్ తేలేకపోతున్నట్లు(మోడల్ 3 కంటే చౌకైన ఈవీ మోడల్ తేబోతున్నట్లు ప్రకటించి.. కస్టమర్లు, ఇన్వెస్టర్లలో ఆశలు రేపాడు) ప్రకటించడంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్ల మీద ఆసక్తి కనబరచలేకపోయారు. పైగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్‌ను జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలతో షేర్ల అమ్మకానికే మొగ్గు చూపించగా.. గురువారం ఒక్కరోజే 100 బిలియన్ డాలర్ల మేర టెస్లా వాల్యూ పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ విలువ 1.2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ గణాంకాలు చెప్తున్నాయి. సంబంధిత వార్త: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే.. -
లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా?
గ్లోబల్ లెవల్లో ఆటోమొబైల్ రంగం.. అందునా ఈవీ కేటగిరీలో ఆ రేంజ్ లాభాలు మరేయితర కంపెనీ సాధించలేదు. పైగా గడిచిన ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాదిలో యాభై శాతం అధికంగా వాహన ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది కూడా. అయినప్పటికీ ఈ ఏడాదిలో కొత్త మోడల్ తేలేమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. టెస్లా 2023 మొదటి భాగం(Q1) వరకు ఎలాంటి కొత్త మోడళ్లను రిలీజ్ చేయబోదని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. ప్రపంచ ఆటో రంగం ఎదుర్కొంటున్న చిప్ షార్టేజ్ ఇందుకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. దీంతో కిందటి ఏడాది వస్తుందని భావించిన సైబర్‌ట్రక్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు 25 వేల డాలర్ల చిన్న సైజు ఎలక్ట్రిక్ కారు విషయంలో సైతం ప్రయత్నాలు ముందుకెళ్లట్లేదని, అయినప్పటికీ కారును మార్కెట్లోకి తెచ్చి తీరతామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం చెయిన్ సిస్టమ్ సప్లయ్ సమస్యను అధిగమించడం, ప్రపంచ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై టెస్లా తన దృష్టి సారిస్తుందని ఎలన్ మస్క్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు. రాడికల్ సైబర్‌ట్రక్ తో పాటు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారు సైతం ఆలస్యం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వాహనాలను ప్రవేశపెడితే.. మొత్తం ఉత్పత్తిపైనే ప్రభావం పడుతుందని ఎలన్ మస్క్ చెప్తున్నారు. కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి అదనపు వనరులను గనుక మళ్లిస్తే.. ఇతర మోడళ్లను ఉత్పత్తి చేసే సంస్థ సామర్థ్యం పరిమితం అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎలన్ మస్క్ తెలిపారు. అయితే సైబర్‌ట్రక్, రోడ్స్టర్ల ఉత్పత్తికి మద్దతు ఇచ్చే సాధనాలను 2022లోనే మొదలుపెట్టాలనుకుంటున్నామని, వచ్చే ఏడాది నుంచి వాటి ఉత్పత్తిని ఆశిస్తున్నామని మస్క్ వివరణ ఇచ్చుకున్నారు. చదవండి: బాబోయ్ బూతు వీడియోలు.. టెస్లాకు కొత్త చిక్కులు! -
పెట్రోలు ధరలకు పరిష్కారం.. సీఎన్జీ వైపు మారుతి చూపు
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇండియాలో నంబర్ వన్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి భిన్నమైన మార్గం ఎంచుకుంది. సీఎన్జీకే మొగ్గు సీఎన్జీ మోడళ్ల సంఖ్యను పెంచాలని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ మోడళ్లకు గిరాకీ రావడంతో కంపెనీ సీఎన్జీ వైపు మళ్లింది. మరిన్ని మోడల్స్ త్వరలో కొత్తగా మరో నాలుగు మోడళ్లకు సీఎన్జీ శ్రేణిని విస్తరించనున్నట్టు సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎనిమిది మోడళ్లకు సీఎన్జీ వేరియంట్స్ ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని సీఎన్జీ మోడల్స్ అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం పెండింగ్‌లో 2.8 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఇందులో 1.1 లక్షల యూనిట్లు సీఎన్జీ వేరియంట్లే. ఒక్కో కిలోమీటర్‌కు పెట్రోల్, డీజిల్ వాహనమైతే రూ.5 ఖర్చు అవుతోంది. అదే సీఎన్జీ అయితే రూ.1.7 మాత్రమే. దేశవ్యాప్తంగా 260 నగరాలు, పట్టణాల్లో 3,400 సీఎన్జీ స్టేషన్స్ ఉన్నాయి’ అని వివరించారు. -
స్కోడా ఎలక్ట్రిక్ కార్లు త్వరలోనే..!
ప్రముఖ దిగ్గజ కార్ల కంపెనీ స్కోడా రాబోయే దశాబ్దానికి తన సరికొత్త- స్కోడా ఆటో స్ట్రాటజీ 2030 ను ప్రకటించింది. ఈ వ్యూహంతో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు త్వరగా రావడానికి కీలక పాత్ర పోషించనుంది. చెక్ కార్ల తయారీదారు స్కోడా 2030 నాటికి కనీసం మూడు ఎలక్ట్రిక్ కారు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్లు స్కోడా ENYAQ iV సిరీస్‌కు తదనంతర కారు మోడళ్లగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది. స్కోడా తన కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు ENYAQ iVను గత సంవత్సరం సెప్టెంబర్‌లో కారు టీజర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం స్కోడా ENYAQ iV కార్ల ఉత్పత్తి వేగంగా జరుగుతుంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యూరోప్‌లో 50 నుంచి 70 శాతం మధ్య పూర్తి ఎలక్ట్రిక్ మోడళ్ల వాటాను స్కోడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లు సుమారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 340కి.మీ. నుంచి 510 కి.మీ వచ్చేలా బ్యాటరీలను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నఅగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులకు పోటీగా ప్రజలకు సరసమైన ధరలకే అందించాలని స్కోడా భావిస్తోంది. అంతేకాకుండా స్కోడా ఎలక్ట్రిక్ కార్ల కోసం సొంత ఛార్జింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఐరోపాలో 2030లోపు సుమారు 2,10,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. స్కోడా తొలుత ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశ పెట్టకూడదని భావించినా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆటోమోబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: మార్కెట్లోకి స్కోడా ఆక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు -
Samsung: కొత్త మోడల్స్ వస్తున్నాయ్.. మడత పెట్టేద్దాం
మొబైల్ ఫోన్ మార్కెట్లో ఏస్ బ్రాండ్‌గా ఉన్న సామ్సంగ్ కొత్త మార్కెట్‌పై దృష్టి పెట్టింది. మరోసారి ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్లతో మార్కెట్లో హల్చల్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఆగస్టులో సామ్సంగ్ ఫ్లిప్, సామ్సంగ్ ఫోల్డ్‌లో కొత్త మోడల్స్ రిలీజ్ చేయనుంది. అంతుకు ముందు ఈ సెగ్మెంట్లో వచ్చిన ఫోన్లతో పోల్చితే వీటిలో అధునాత ఫీచర్లు ఉండబోతుండగా ధర మాత్రం తగ్గనుంది. ఓల్డ్ మంత్ర గడిచిన రెండేళ్లుగా ఫోన్ ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు. ప్రాసెసర్, కెమెరా మెగా పిక్సెల్, డిస్ప్లే విషయంలో ఇంచుమించు ఒక సెగ్మెంట్లో ఒకే తరహాలో ఫోన్లు వస్తున్నాయి. పైగా కంపెనీలు పోటీ పడి డిస్ప్లే సైజు పెంచుకుంటూ పోయాయి. చేతిలో ఫోన్లు ఇమిడే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో క్రమంగా చేతిలో ఇమిడిపోయే ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తేవాలని సామ్సంగ్ నిర్ణయించింది. అందులో భాగంగానే సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 3, సామ్సంగ్ జడ్ ఫ్లిప్ 3 మోడళ్లు మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. ఆగష్టు మొదటి వారంలో లాంఛింగ్ ఈవెంట్ జరిపి... ఆగష్టు చివరి వారంలో మార్కెట్లోకి తేవడం సామ్సంగ్ ప్రణాళికలో ఓ భాగంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కొత్త వ్యూహం రెండేళ్ల క్రితం సామ్సంగ్ జడ్ ఫోల్డ్ మోడల్ని మార్కెట్లోకి సామ్సంగ్ తెచ్చింది. అయితే దీని ధర లక్షకు పైగా ఉండటంతో ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. దీంతో మొబైల్ వీడియో కంటెంట్‌కు ఇబ్బంది రాకుండా చేతిలో ఇమిడి పోయే ఫోల్డ్, ఫ్లిప్‌కు మార్కెట్ ఉంటుందని సామ్సంగ్ బలంగా విశ్వసిస్తోంది. అయితే ధర ఈ మోడళ్ల అమ్మకాకలు అడ్డంకిగా మారిన ప్రైస్ బ్యారియర్‌ని తొలగించే పనిలో ఉంది. అందులో భాగంగా రాబోయే కొత్త మోడళ్లు 20 శాతం తగ్గింపు ధరతో తెచ్చే అవకాశం ఉందని టెక్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుందనే నమ్మకంతోనే సామ్సంగ్ భారీ ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టింది. ఇప్పటికే ఐఫోన్ సైతం మినీ పేరుతో 5 అంగులాల తెర ఉన్న ఫోన్‌ని మార్కెట్లోకి తెచ్చింది. చదవండి : మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్ -
కియా నుంచి ఎలక్ట్రిక్ కారు ?
వెబ్‌డెస్క్: అతి తక్కువ కాలంలోనే ఇండియా కార్ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన కియా సంస్థ నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది. ముఖ్యంగా ఫ్యూచర్ కార్లుగా చెప్పుకుంటున్న ఎలక్ట్రిక్ కారును తెచ్చేందుకు కియా సన్నాహాలు చేస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కియా తన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మోడల్ సోల్ లేబుల్‌ని ఇండియాలో రిజిస్ట్రర్ చేసింది. సోల్ వస్తుందా ? కియా కంపెనీలో ఈవీ వెర్షన్లో సక్సెస్ ఫుల్ మోడల్‌గా సోల్‌కి పేరుంది. ఇప్పటికే రెండు మోడల్స్ విదేశీ మార్కెట్లో విడుదల అయ్యాయి. థర్డ్ జనరేషన్ మోడల్ విదేశాల్లో లాంఛింగ్‌కి సిద్ధంగా ఉంది. ఈ థర్డ్ మోడల్ పెట్రోల్, ఈవీ వెర్షన్లలో లభ్యం అవుతుందని ఇప్పటికే కియా ప్రకటించింది. ఈ క్రమంలో ఇండియాలో సైతం సోల్ పేరుతో కియా లేబుల్ రిజిస్ట్రర్ చేసింది. దీంతో సోల్ మోడల్ని ఇండియాలో కూడా లాంఛ్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కొత్త మోడల్ ఎంట్రీపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. లాంగ్రేంజ్. కియా సోల్ థర్డ్ జనరేషన్ ఈవీ మోడల్లో బ్యాటరీలకు సంబంధించి లాంగ్ రేంజ్, స్టాండర్డ్ రేంజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో లాంగ్రేంజ్లో 64కిలోవాట్ బ్యాటరీతో 452 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా... స్టాండర్డ్ రేంజ్లో 39.2 కిలోవాట్ బ్యాటరీతో 277 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కోనాకు పోటీగా ఇండియా కార్ల మార్కెట్లో 10 శాతానికి పైగా వాటా దక్కించుకుంది కియా. సెల్టోస్, సోనెట్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఇప్పటికే హుందాయ్ నుంచి కోనా మోడల్ అందుబాటులో ఉంది. దీనికి పోటీగా కియా సంస్థ సోల్‌ను మార్కెట్లోకి తెవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యూచర్ కార్స్ రాబోయే రోజుల్లో ఆటోమోబైల్ రంగంలో పెట్రోల్, డీజీల్ వాహనాల మార్కెట్‌కి ఎలక్ట్రిక్ వాహనాల నుంచి గట్టిపోటీ ఎదురు కానుంది. పర్యావరణ కాలుష్యం దృష్ట్యా భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీంతో అనేక కంపెనీలు క్రమంగా ఎలక్ట్రిక్ మోడల్‌లు తెచ్చేందుకు ఆర్ అండ్ డీ సెంటర్లలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. చదవండి : మహీంద్ర బంపర్ ఆఫర్ -
3.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం
ముంబై: బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ శుక్రవారం తన ఆర్ నైన్ టీ, ఆర్ నైన్ టీ స్కాంబ్లర్ మోడళ్ల కొత్త వెర్షన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలు వరుసగా రూ.18.5 లక్షలు, రూ.16.75 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉన్నాయి. బీఎస్–6 ప్రమాణాలను కలిగిన ఈ రెండు బైకుల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటిలో 1,170 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. గంటకు గరిష్టంగా 200 వేగంతో ప్రయాణించగలవు. బీఎండబ్ల్యూ మోటోరాడ్ షోరూముల్లో ఈ కొత్త బైక్‌లను బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ చార్జింగ్‌పై స్టెర్లింగ్ అండ్ విల్సన్ కన్ను న్యూఢిల్లీ: దేశీ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో ప్రవేశించేందుకు వీలుగా ఈనెల్ ఎక్స్‌తో చేతులు కలిపినట్లు స్టెర్లింగ్ అండ్ విల్సన్ పేర్కొంది. తద్వారా సమాన వాటా (50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా, క్విక్ ఎలక్ట్రిక్ చార్జర్ సౌకర్యాలతో దేశీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు స్టెర్లింగ్ జనరేటర్స్ సీఈవో సంజయ్ జాధవ్ అభిప్రాయపడ్డారు. -
ఆడిషన్స్ అదుర్స్..
-
వాయువేగంతో ప్రయాణించే కారు
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్, డిజిల్ కార్ల కన్నా, కాలుష్యానికి హాని కలిగించని ఎలక్ట్రిక్ కార్ల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మోటారు రేసింగ్ ఔత్సాహికుల కోసం కంపెనీలు సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో భాగంగానే గంటకు 305 కిలోమీటర్ల వాయు వేగంతో ప్రయాణించే ఏపీ-1 అనే ఎలక్ట్రిక్ సూపర్ కారును అపెక్స్ మోటార్స్ వారం రోజుల్లో ఆవిష్కరించనుంది. హాంకాంగ్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఈ సూపర్ కారును రూపకల్పన చేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏపీ 1 సూపర్ కారు 620కిలోగ్రాముల బరువు, కార్బన్ ఫైబర్‌తో కూడిన అత్యుధునిక డిజైన్లతో రూపిందించినట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాలలో కూడా ఏపీ-1 కారు వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఆవిష్కర్తలు చెబుతున్నారు. ఏపీ 1 ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జింగ్‌తో 515 కిలోమీటర్లు ప్రయాణించగలదని, ఫాస్ట్ చార్జర్‌తో 20 నిముషాల్లో 80శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగానే ఎలక్ట్రిక్ కారు రూపకల్పన చేశామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు -
సరికొత్త మోడళ్లతో ఆటో ఎక్స్పో సందడి
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2020 ఉత్సాహంగా ప్రారంభమయింది. ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు ఆటో ఎక్స్పో 2020 జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ప్రదర్శనతో అలరిస్తున్నారు. కార్లను ఇష్టపడేవారిని ఆకట్టుకునేందుకు కంపెనీలు సరికొత్త మోడళ్లను ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త క్రెటా కారును ఆటో ఎక్స్పో 2020లో ఆవిష్కరించారు. రెండవ తరం హ్యుందాయ్ క్రెటా 2020 మార్చిలో రానుంది. మొదటి తరం క్రెటాను 2015 దేశంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా కియా సెల్టోస్, ఎమ్ జీ హెక్టార్ కారణంగా క్రెటా వెనుకబడినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా పోటీని తట్టుకునే విధంగా సరికొత్త హ్యుందాయ్ క్రెటా మోడల్‌ను రూపొందించామని, కియాకు గట్టి పోటీనిచ్చి మార్కెట్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంటామని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2020 నుంచి కాలుష్య ఉద్గారాలను నియంత్రించే క్రమంలో అన్ని కంపెనీలు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త మోడళ్లను కంపెనీలు ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నాయి. కాగా వోక్స్వ్యాగన్, స్కోడా, ఫోర్స్ మోటార్స్ తదితర బ్రాండ్లు ప్రదర్శనలకు రానున్నట్లు మార్కెట్లు వర్గాలు తెలిపాయి. ఎమ్జీ మోటార్ ఇండియా ఎమ్‌పీవీ జీ10 ప్రీమియమ్ కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ ఏడాదిలో జీ10 కార్లు మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ సోనీ ‘వాక్‌మాన్’!
న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వాక్‌మాన్‌లను (పోర్టబుల్ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్‌స్క్రీన్ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్‌మాన్ ఎన్‌డబ్ల్యూ–ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై–ఫై ద్వారా పాటలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం, వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు టైప్–సీ పోర్టు, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్మాన్లు అందుబాటులోకి వస్తాయి. -
యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు
చెన్నై: యమహా మోటార్ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు– ఫ్యాసినో 125ఎఫ్ఐ, రేజర్125ఎఫ్‌ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్ ధరను రూ.67,430(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ గ్రూప్) రవీందర్ సింగ్ తెలిపారు. త్వరలో స్ట్రీట్ ర్యాలీ 125ఎఫ్ఐ మోడల్ స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. 110సీసీ స్కూటర్ మోడళ్లను దశలవారీగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో 125 సీసీ మోడళ్లను మాత్రమే విక్రయిస్తామని వివరించారు. ఈ ఏడాది 6.24 లక్షల టూవీలర్లను విక్రయిస్తామన్న అంచనాలున్నాయని సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది 6.50 లక్షల టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను 2025కల్లా పది శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్15, ఆర్ 15 బైక్ మోడళ్లలో బీఎస్–సిక్స్ వేరియంట్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుత మందగమనం తాత్కాలికమేని, వాహన విక్రయాలు పుంజుకుంటాయని సింగ్ అభిప్రాయపడ్డారు. -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్‌నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్‌ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్‌తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్‌ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్‌లైన్‌లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్‌లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్‌లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్‌ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్‌గ్రెడేషన్‌కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
కార్ల విక్రయాలు 8 శాతం డౌన్
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో ఫిబ్రవరిలో వాహనాల అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 15,79,349 యూనిట్లు అమ్ముడవగా గత నెలలో 8.06 శాతం క్షీణించి 14,52,078 యూనిట్లకు తగ్గాయి. ఇక కార్ల అమ్మకాలు..గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 యూనిట్లు అమ్ముడు కాగా ఈసారి 8.25 శాతం క్షీణించి 2,15,276 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 7.97 శాతం క్షీణించి 12,22,883 యూనిట్స్ నుంచి 11,25,405 యూనిట్స్‌కు తగ్గాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య ఎఫ్ఏడీఏ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘సంవత్సరాంతపు క్లియరెన్స్ సేల్, కొత్త మోడల్స్ లాంచింగ్‌తో జనవరిలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. కానీ నెల తిరిగేసరికి ఫిబ్రవరిలో మళ్లీ పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గతనెలలోనే విక్రయాలు గణనీయంగా తగ్గాయి‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలె తెలిపారు. సమీప భవిష్యత్‌లో ఆశావహ సూచనలేమీ కనిపించకపోతుండటంతో.. గత ఆరు నెలల నుంచి దేశీయంగా ఆటోమొబైల్స్ విక్రయాలు క్షీణ బాటలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో బీమాపరమైన వ్యయాలు భారీగా పెరిగిన దగ్గర్నుంచి ఒకదానితర్వాత మరొకటిగా అన్నీ ప్రతికూల పరిణామాలే చోటు చేసుకుంటూ ఉండటంతో వినియోగదారులు కార్ల కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారని ఆశిష్ చెప్పారు. మొత్తం మీద వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా మారిందని పేర్కొన్నారు. పేరుకుపోతున్న నిల్వలు.. దేశవ్యాప్తంగా డీలర్లందరి దగ్గర వాహనాల నిల్వలు గణనీయంగా పేరుకుపోయాయని ఆశిష్ చెప్పారు. గత రెండు నెలల్లో కొంత తగ్గినప్పటికీ.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘కొందరు ద్విచక్ర వాహనాల డీలర్ల దగ్గర ఆందోళనకర స్థాయిలో, కనీవినీ ఎరుగనంతగా ఏకంగా 100 రోజులకు సరిపడే స్టాక్ పేరుకుపోయింది. ఈ అంశం గురించి మేం పదే పదే చెబుతూనే ఉన్నాం. ఇక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైనవి పెరగడంతో డీలర్ల నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో డీలర్లు అర్జంటుగా నిల్వలను తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు‘ అని ఆశిష్ చెప్పారు. పరిశోధన సంస్థలకూ వాహనాల బల్క్ డేటా విక్రయం ఆటోపరిశ్రమ వృద్ధికి కొత్త విధానం ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీనితో ఇకపై అర్హత కలిగిన వ్యాపార సంస్థలు, వ్యక్తులు, పరిశోధకులు వాహన రిజిస్ట్రేషన్ డేటాను బల్క్‌గా కొనుగోలు చేసేందుకు వెసులుబాటు లభించనుంది. ఇందుకోసం ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘బల్క్ డేటా అవసరమైన వ్యాపార సంస్థలు, ఇతరత్రా వ్యక్తులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 కోట్లు కట్టాల్సి ఉంటుంది. పరిశోధన అవసరాల కోసం విద్యా సంస్థలు తీసుకునేట్లయితే రూ. 5 లక్షలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఆయా సంస్థలు ఈ డేటాను కచ్చితంగా అంతర్గతంగానే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది’ అని ‘బల్క్ డేటా షేరింగ్ విధానం, ప్రక్రియ’ నిబంధనల్లో పేర్కొన్నారు. డేటాను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవడంతో సర్వీసులు మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వెరైటీ పెళ్లి శుభలేఖలు
వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్‌పోర్టు, ఏటీఎం, కాఫీ కప్ తరహా ఇన్విటేషన్స్‌తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిది నగరంలో నడుస్తున్న ట్రెండ్. సాక్షి, హైదరాబాద్ : ‘తామెల్లరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి... మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయగలరని ప్రార్థన’.. ఇదంతా ఒకనాటి పెళ్లి పత్రికల సంగతి. ఇప్పుడింత చదివే ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సింపుల్, సూపర్బ్‌గా ఉండాలని విభిన్నంగా ఆలోచిస్తోంది యువత. ఒకప్పుడు శుభలేఖలు వేయించడం పెద్దల పని. కానీ ఇప్పుడు వధూవరులే తమకు నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. అవి సృజనాత్మకతంగా ఉండాలని యోచిస్తున్నారు. కొత్తకొత్తగా.. భారీ స్థాయిలో శ్లోకాలు, పద్యాలు, పెద్దల వివరాలు... ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి జాబితాలోకి చేరిపోయాయి. కేవలం పది లైన్లలో మొత్తం సమాచారం వచ్చేయాలి. శుభలేఖ డిజైన్ చూడగానే ఇట్టే ఆకట్టుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామి కోసం తాను కంటున్న కలలు, తమ మదిలో భాగస్వామికి ఇచ్చిన స్థానం, ప్రేమ వీటన్నింటినీ వ్యక్తపరుస్తూ.. భలే చూడముచ్చగా ఉంటున్నాయి శుభలేఖలు. ఇక ఫలానా తేదీన, ఫలానా సమయానికి వివాహ సుముహూర్తం అనే మాటకు కాలం చెల్లింది. ‘మీ వాచీ ఫలానా సమయాన్ని సూచించే సరికి, మనమంతా ఒక్కటిగా కలిసి, మన బంధంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించా’లంటూ సరికొత్త స్వాగతాలు పలుకుతున్నాయి. బాక్స్.. భలే కొంతమంది యువతీ యువకులు మరో అడుగు ముందుకేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన పాస్‌పోర్టు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్‌ఫోన్, కాఫీ కప్పు, మ్యాచ్ బాక్స్, పుస్తకం తరహాలో శుభలేఖల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బాక్స్ కార్డ్స్, కష్టమైజ్డ్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లి విందు గురించో, చేసిన ఏర్పాట్ల గురించో బంధువులు ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు వెరైటీ శుభలేఖలతో పెళ్లి ముచ్చట్లు, చర్చలు మొదలవుతున్నాయి. ఖర్చు తక్కువే.. సాధారణ శుభలేఖలకు అయ్యే ఖర్చులోనే ట్రెండీ ఇన్విటేషన్స్ అందిస్తున్నాం. ధరలు ఎక్కువేమీ లేవు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ తమ దగ్గరికి వచ్చి... ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కార్డులు తయారు చేసిస్తున్నాం. – టి.ప్రదీప్, గౌలిగూడ -
బజాజ్ డిస్కవర్ కొత్త బైక్స్ వచ్చేశాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ రెండవ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో రెండు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది. అంతర్జాతీయంగనూ దేశీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో తన పాపులర్ మోడల్ బజాజ డిస్కవర్ 2018 మోడల్స్‌ను విడుదల చేసింది. ఇందులో డిస్కవర్ 110 డిస్కవర్ 125 పేరుతో కొత్త మోడల్స్‌ను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.కొత్త ఇంజీన్, కొత్త ఫీచర్లు, కొత స్టయిల్‌గా సరికొత్తగా వీటిని రూపొందించింది. బజాజ్ డిస్కవర్ 110, డిస్కవర్ 125 ధరలను రూ. 50,176 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రూ. 53,171 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. బజాజ్ డిస్కవర్ 110 ఒకవేరియంట్లోనూ,బజాజ్ డిస్కవర్ 125 (డ్రమ్ బ్రేక్ , డిస్క్ బ్రేక్) రెండు వేరియంట్స్‌లోనూ అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 53,171, రూ. 55,994 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనున్నాయి. ట్విన్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లాంప్స్, పార్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫస్ట్ ఇన్కాస్ల్ పీచర్లను 2018 మెడల్ బైక్స్‌లో జోడించింది. బజాజ్ డిస్కవర్ 110: 110 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్, 8.5 బీహెచ్పీ వపర్, 9 ఎన్ఎం గరిష్ట టార్క్ బజాజ్ డిస్కవర్ 125: 125 సీసీ సింగిల్ సిలిండర్ , ఎయిర్ కూల్డ్ మోటార్,11 బీహెచ్పీ వపర్, 10.8 ఎంఎం గరిష్ట టార్క్ 5 స్పీడ్ ట్రాన్సిమిషన్ ప్రధాన ఫీచర్లు -
భారత్‌లోకి ‘స్కాట్ బాబర్’ మోడల్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్ బైక్స్ తయారీ కంపెనీ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తాజాగా ‘స్కాట్ బాబర్’ మోడల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలో దీని ప్రారంభ ధర రూ.12.99 లక్షలు. ఇందులో 1,133 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. పొలారిస్ ఇండియా కంట్రీ హెడ్, ఎండీ పంకజ్ దూబే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కాట్ బాబర్ చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అద్భుతమైన పనితీరుతో ఇండియన్ మోటార్‌సైకిల్ పేరును మరింత బలోపేతం చేస్తుందన్నారు. కాగా పొలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థే ఇండియన్ మోటార్ సైకిల్. ఇది అమెరికా తొలి మోటార్‌సైకిల్ కంపెనీ. -
కొత్త బెంజ్ కార్లు లాంచ్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్‌మేకర్ మెర్సిడెస్ బెంజ్ కొత్త హై ఎండ్మోడల్ కార్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఎంజీ సీఎల్ఏ- 45, జీఎల్ఏ-45 మోడళ్లను అప్‌గ్రేడ్ చేసి సరికొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు సిలిండర్ల ఇంజీన్‌తో ఏఎంపీ ఫెరఫామన్స్ మోడల్స్‌ను విడుదల చేసింది. వీటితోపాటు ఏఎంజీలో ఏరో ఎడిషన్‌లో రెండు మోడల్స్‌ను తీసుకొచ్చింది. సీఎల్ఏ 45 ఏరో ధరను రూ.77.69 లక్షలుగాను, జీఎల్ఏ-45 ఏరో ధరను రూ. 80.6 లక్షలు (ఎక్స్-షోరూము)గా నిర్ణయించింది. మెర్సిడెస్ ఏఎంజీసీఎల్- 45 సెడాన్, జీఎల్ఏ-45 ఎస్‌యూవీని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర (ఎక్స్-షోరూము) వరుసగా రూ.. 75.20 లక్షలు , రూ. 77.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు వాహనాలు గరిష్టంగా గంటలకు 250కి.మీ. వేగాన్ని అందుకుంటాయి. భారతదేశంల కార్ల విభాగం వేగంగా వృద్ధి చెందిందని, పరిశ్రమ వృద్ధికి కొత్త మోడల్స్ ఆవిష్కరణ కీలకమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రోలాండ్ ఫోల్గర్ వ్యాఖ్యానించాడు. అంతిమ డ్రైవింగ్ పనితీరుతో ఆకట్టుకునేలా తీసుకొస్తున్న రాడికల్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. -
భారత్‌లోకి మూడు ఆడి కొత్త కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారి ఆడి తన ఏ5 రేంజ్లో మూడు కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఏ5 స్పోర్ట్‌బ్యాక్, ఏ5 కాబ్రియోలెట్, ఎస్5 స్పోర్ట్ బ్యాక్ పేర్లతో వీటిని ఆడి తీసుకొచ్చింది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.54.02 లక్షలు, రూ.67.15 లక్షలు, రూ.70.60 లక్షలుగా ఉన్నాయి. మొదటి రెండు మోడల్స్ పూర్తిగా కొత్తవి కాగ, ఎస్5 ప్రస్తుతమున్న ప్రొడక్ట్‌కు అప్డేటడ్ మోడల్. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ కార్లను ఆడి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏ5 మోడల్2.0 లీటరు ఇంజిన్‌ను, 190బీహెచ్పీ పీక్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 235 కేఎంపీహెచ్. 7.9 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్‌ను సాధించగలదని కంపెనీ చెప్పింది. ఎస్5 మోడల్ చాలా పెద్దది, చాలా వేగవంతమైనది. 3 లీటరు ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ కారు 354కేహెచ్‌పీ పీక్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 250 కేఎంపీహెచ్. 4.7 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్‌ను ఇది చేరుకోగలదు. -
వంగడాలతోనూ ‘పట్టు’సాధించొచ్చు
మల్బరీ సాగులో నూతన వంగడాలతో అధిక దిగుబడులు - పట్టు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్‌కుమార్ కళ్యాణదుర్గం: మల్బరీ సాగులో నూతన వంగడాలతో రైతులు అధిగ దిగుబడి సాధించొచ్చని పట్టు పరిశోధన విస్తరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. మల్బరీలో నూతన వంగడాలు, వాటి ప్రాముఖ్యత, పంట కాలం తదితర విషయాలపై రైతులకు వివరించారు. పట్టుపురుగులు, పట్టుదారం ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాలు దాదాపుగా 70 శాతం మల్బరీ ఆకుల నుంచే లభిస్తాయన్నారు. మల్బరీ సాగు చేసే రైతులు మొక్కల రకాలు, వాటి ప్రాముఖ్యత, మొక్కల సామర్థ్యంపై అవగాహన పెంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. వీ1 వంగడం: ఈ వంగడం మొక్కను కత్తిరిస్తే వెంటనే చిగురుస్తుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 94 శాతం ఉంటుంది. ఆకులు చీలిక లేకుండా అండాకారంలో, వెడల్పుగా, మందంగా ఆకుపచ్చ రంగులో దాదాపు 5.2 సెం.మీ ఉండి తళతళలాడుతూ ఉంటాయి. కణువుల నిడివి 5.2 సెం.మీ ఉండి ఆకుమచ్చ, బూడిద తెగులును, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిఉంటుంది. ఆకులు 78 శాతం తేమాంశం, 27 శాతం ప్రొటీన్లు, 26 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. హెక్టారుకు ఏడాదికి 50–60 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. జీ4 వంగడం : ఈ వంగడం మొక్క ఆకులు వెడల్పుగా, చీలికలు లేకుండా హృదాయాకారంలో ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉపరితలము అలలుగా ఉంటాయి. ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే చిగురువస్తుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 92 శాతం ఉంటుంది. కణువుల మధ్య నిడివి 3.9 సెం.మీ వరకు ఉంటుంది. ఒక హెక్టారుకు ఏడాదికి 65 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. ఆకులు 75 శాతం తేమాంశం, 26 శాతం ప్రోటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. జీ2 వంగడము : వంగడం మొక్క ఆకులు వెడల్పుగా, చీలికలు లేకుండా ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉపరితలము అలలుగా ఉంటాయి. ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే చిగురువస్తుంది.ఆకులు 80 శాతం తేమాంశం, 27 శాతం ప్రొటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 94 శాతం ఉంటుంది. కణువుల మధ్య నిడివి 4.0 సెం.మీ. వరకు ఉంటుంది. ఒక హెక్టారుకు ఏడాదికి 36–38 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. యస్ 13 వంగడం : ఈ వంగడం అధిక వేరు ఉత్పత్తి 80 శాతం కలిగి ఉంటుంది. ఆకులు చిన్నవిగా అండాకారంలో ఉండి ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. కణువుల మధ్య దూరం 3.2 సెం.మీ ఉండి, ఆకుమచ్చతెగులు, బూడది రోగం, ఆకు తుప్పు రోగం తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. అలాగే తుక్రా రోగమును తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. ఇవి హెక్టారుకు 13–16 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఆకులు 78 శాతం తేమాంశం, 23 శాతం ప్రోటీన్లు, 27 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. యస్ 34 వంగడం : ఈ వంగడం ఆకులు చిన్నవిగా హృదయాకారంలో చీలికలు లేకుండా ఉంటాయి. వేరు ఉత్పత్తి 75 శాతం కలిగి ఉంటుంది. ఇవి ఆకుమచ్చతెగులు, బూడది రోగం, ఆకు తుప్పు రోగం తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. ఆకులు 75 శాతం తేమాంశం, 24 శాతం ప్రోటీన్లు, 26 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. ఇవి హెక్టారుకు 13–16 మెట్రిక్ టన్నులు ఉంటుంది. యస్ 36 వంగడం: ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే ఉత్పత్తి అవుతుంది. 48 శాతం వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు వెడల్పుగా చీలికలు లేకుండా హృదయాకారంలో లేత పసుపు రంగులో తళతళలాడుతూ ఉంటాయి. ఆకులు 78 శాతం తేమాంశం, 25 శాతం ప్రోటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. 3.53 సెం.మీల తక్కువ కణువుల నిడివి కలిగి ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 28 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. యస్.జీ2 వంగడం: ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే ఉత్పత్తి అవుతుంది. 89 శాతం వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు మధ్యమ వెడెల్పుతో హృదయాకారంలో నునుపుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కణువుల మధ్య నిడివి 4.2 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 22–23 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఆర్.సి.1 వంగడం: ఈ వంగడం ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో చీలికలు లేకుండా ముదురు ఆకుపచ్చరంగులో మృధువుగా ఉంటాయి. ఈ మొక్కలు కత్తిరించినా, ఆకుకోత వెంటనే ఉత్పత్తి అవుతుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 85 శాతం ఉంటుంది. కణువుల మధ్య దూరం 4.3 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 23– 25 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఆర్.సీ.2 వంగడం: ఈ వంగడం ఆకులు చిన్నవిగా, హృదయాకారంలో ముదురు ఆకుపచ్చరంగులో మృదువుగా ఉంటాయి. ఈ మొక్కలు కత్తిరించినా, ఆకుకోత వెంటనే ఉత్పత్తి అవుతుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 89 శాతం ఉంటుంది. కణువుల మధ్య దూరం 4.4 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 21– 23 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఏ ఆర్ 12 వంగడం: ఈ వంగడం అధిక వేరు ఉత్పత్తి సామర్థ్యం 90 శాతంగా ఉండి ఆకులు వెడల్పుగా, హృదయాకారంలో చీలికలు లేని ముదురు ఆకుపచ్చరంగులో మృధువుగా ఉంటాయి. కణువుల మధ్య దూరం 3.75 సెం.మీ కలిగి ఉంటుంది. ఆకుతుప్పు తట్టుకునే సామర్థ్యం మధ్యస్థంగా ఉంటుంది. ఈ వంగడం ఆకులు 74 శాతం తేమాంశం, 23 శాతం ప్రోటీన్లు, 21 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి ఏడాదికి 16–24 మెట్రిక్ టన్నుల వరకు ఇస్తుంది. సహన వంగడం: ఈ వంగడం ఆకులు వెడెల్పుగా, చీలిక లేకుండా హృదాయాకారంలో ముదురు ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. ఆకు దిగుబడి హెక్టారుకు ఏడాదికి 25–30 మెట్రిక్ టన్నులు ఇస్తుంది. అధిక వేరు ఉత్పత్తి సామర్థ్యం 80 శాతంగా ఉంటుంది. ఆకుమచ్చ తెగులు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఆకుతుప్పు, తూక్రా తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం మధ్యస్తంగా ఉంటుంది. ఆకుల పోషక విలువలు 73 శాతం తేమాంశం, 27 శాతం ప్రోటీన్లు, 22 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. నీటి వసతి గల కొబ్బరి తోటలలో అంతర పంటగా వేయిటకు సిఫారసు చేయబడింది. -
స్పీడు పెంచిన హ్యుందాయ్..8 కొత్త కార్లు లాంచ్
చెన్నై : దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ మరింత స్పీడు పెంచింది. కొత్తకొత్త మోడల్స్‌తో వినియోగదారులను అలరించేందుకు సిద్ధమైంది. వచ్చే నాలుగేళ్లలో ఎనిమిది కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు హ్యుందాయ్ మోటార్స్ టాప్ అధికారి చెప్పారు. 2017లో హ్యుందాయ్ ఇండియాలో రెండంకెల వృద్ధిని నమోదుచేయనుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కంపెనీ మొత్తం 10 ప్రొడక్ట్‌లను లాంచ్ చేయబోతుంది, దానిలో ఎనిమిది కొత్త మోడల్స్ అని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే కూ చెప్పారు. మిగతా రెండు మోడల్స్ అప్‌గ్రేడ్స్ చేసేవని తెలిపారు. లోనిక్యూ హైబ్రిడ్ మోడల్‌ను న్యూఢిల్లీలో జరుగబోతున్న ఆటోషో 2018లో కంపెనీ షోకేసు చేయబోతుందని తెలిపారు. మిగతావి భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నట్టు పేర్కొన్నారు. కాంపాక్ట్ కారు సెగ్మెంట్లో హ్యుందాయ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని, ఐ10, ఐ20 లాంటి మోడల్స్‌తో 51 శాతం ఇండియన్ కారు మార్కెట్‌ను హ్యుందాయ్ సొంతం చేసుకుందని చెప్పారు. మిడ్ సెగ్మెంట్ పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీ కృషిచేస్తుందని తెలిపారు. -
కార్తీకం కట్టు
కార్తీకంలో చీకటిని చీల్చడానికి దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుతురులో చలి ముసుగేసుకుంటుంది. పెళ్లి వేడుకలు కూడా ఈ కాలంలో ఎక్కువే. డిజైనర్ దుస్తులు సరే, చలిని తట్టుకోవాలంటే ఎలా? వాటి మీద స్వెటర్ వేసుకోవాలా! అనేవారికి మహత్తరమైన ఆలోచనలతో ప్రసిద్ధ డిజైనర్స్ కొత్త కొత్త మోడల్స్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కొత్త డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోండి. చలిని దూరంగా తరిమేయండి. వెచ్చగా వివాహ వేడకల్లో దీపాకాంతిలా వెలిగిపోండి. చలికాలం పెళ్లి వేడుకలు ఓ రమణీయకాంతిని కళ్లకు కడతాయి. దీపాల వెలుగుల్లో ఎంతో అందంగా మెరిసిపోవచ్చు అతివలంతా ముచ్చటపడిపోతుంటారు. అయితే వారి ఆనందాన్ని తగ్గించడానికా అన్నట్టు చలి వణికించేస్తుంటుంది. శాలూవాతో అందమైన డ్రెస్సులను కప్పేయకుండా డ్రెస్సులనే చలిని తరిమేసేలా డిజైన్ చేస్తే... చలికే వణుకుపుట్టడం ఖాయం. బ్రైట్ కలర్స్ చలికాలం మూడ్స్ కాస్త డల్‌గా ఉంటాయి. హుషారు తెప్పించాలంటే మాంచి కలర్‌ఫుల్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. పసుపు, ఎరుపు, పచ్చ, నీలం.. కాంతివంతమైన రంగులను ఎంచుకోవాలి. వేసవి కాలం హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులను ధరించి సౌకర్యంగా ఉండలేరు. కానీ, చలికాలం ఎంత హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులైనా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. లాంగ్ స్లీవ్స్ - హై నెక్స్... శారీ, అనార్కలీ సూట్, లెహంగా... సంప్రదాయ దుస్తులు ఏవైనా ఫుల్ స్లీవ్స్ ఈ కాలానికి మంచి ఎంపిక. ఇది ప్రస్తుత ట్రెండ్. భారతీయ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ, రోహిత్‌బాల్, మనీష్‌మల్హోత్రా... వింటర్ బ్రైడల్ వెడ్డింగ్ దుస్తులకు ఎక్కువగా ఫుల్ ఎంబ్రాయిడరీ స్లీవ్స్, అందంగా అలంకరించిన హై నెక్ డిజైన్స్‌పై ప్రధాన దృష్టి ఉంచుతారు. బెనారస్ టు వెల్వెట్స్... లెహంగాలకే కాదు బ్లౌజ్‌లకూ చలికాలం వెల్వెట్ మంచి ఎంపిక. చలికి వెచ్చదనాన్ని ఇచ్చే వెల్వెట్ క్లాత్ మీద చేసిన జరీ ఎంబ్రాయిడరీ వర్క్ చూపు తిప్పుకోనివ్వదు. లెహంగా, శారీ.. రెండింటిపైనా ఈ తరహా బ్లౌజ్‌లను వాడచ్చు. సెలబ్రిటీల శారీస్, వెడ్డింగ్ డ్రెస్ ఫొటోగ్రఫీని చూస్తే ఈ విషయం మీకే స్పష్టం అవుతుంది. పొరలు పొరలుగా... చలిని అందంగా తిప్పికొట్టాలంటే చక్కని ఐడియా లేయర్ దుస్తులఎంపిక. అమెరికాలో చలిని తట్టుకోవడానికి స్వెటర్, జాకెట్, షాల్, స్క్రార్ప్.. ఇలా ఒకదానిమీద ఒకటి ఎలా ధరిస్తారో.. ఇదే థీమ్‌తో మీ వెడ్డింగ్ వేర్‌ను డిజైన్ చేయించుకోవచ్చు. బాలీవుడ్ తారల వెడ్డింగ్ డ్రెస్, వింటర్ ఫ్యాషన్ షోలను చూస్తే మీకే అర్థమవుతుంది. పొరలు పొరలుగా ఉండేలా పట్టు, బెనారస్, వెల్వెట్, నెటెడ్, షిఫాన్... మిక్సింగ్‌లతో లెహంగాలను, అనార్కలీలను రూపుకట్టవచ్చు. షార్ట్ లెంగ్త్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ జాకెట్ వేసుకొని, దాని మీద మరో లాంగ్ లెంగ్త్ జాకెట్ ధరిస్తే స్టైల్‌గా మెరిసిపోవచ్చు. వింటర్లో వెచ్చగా ఉండచ్చు. ఇతర అలంకరణలోనూ... వివాహ వేడుకల్లో ఇతర అలంకరణ వస్తువుల్లోనూ ఎంబ్రాయిడరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవి మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తున్నాయి. అలాగే క్లచ్‌లు ధరించిన దుస్తుల డిజైన్లకు, రంగులకు సరిపోయేవి ఎంపిక చేసుకోవాలి. - ఎన్.ఆర్ -
ఫియట్ నుంచి రెండు కొత్త మోడళ్లు
* పుంటో అబర్త్, క్రాసోవర్ అబర్త్ అవెంచుర * ధర రూ. 9.95 లక్షలు న్యూఢిల్లీ: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ కంపెనీ రెండు కొత్త మోడళ్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం హ్యాచ్‌బాక్ పుంటో అబర్త్, క్రాసోవర్ అబర్త్ అవెంచుర మోడళ్లను అందిస్తున్నామని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కెవిన్ ఫ్లిన్ చెప్పారు. ఈ రెండు మోడళ్ల ధరనూ ఒకేస్థాయిలో రూ.9.95 లక్షలుగా నిర్ణయించారు. పండుగ సీజన్లో ఈ రెండు కార్లు మంచి అమ్మకాలు సాధిస్తాయన్న ఆశాభావాన్ని కెవిన్ వ్యక్తం చేశారు. కార్ల ప్రత్యేకతలు: ఈ రెండు కార్లలో 1.4 లీటర్ టి-జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 5 గేర్లు వంటి ఫీచర్లున్నాయని కెవిన్ పేర్కొన్నారు. ఫియట్ అబర్త్ పుంటోలో సెకండరీ ఎయిర్డ్రమ్స్, స్పోర్టీయర్ రియర్ బంపర్, 16 అంగుళాల డ్యుయల్-టోన్ అలాయ్ వీల్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.