న్యూఢిల్లీ: ఓజా బ్రాండ్ కింద కొత్తగా 40 ట్రాక్టర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఓజా ట్రాక్టర్లు దేశీ మార్కెట్‌తోపాటు అమెరికా, జపాన్, ఆగ్నేయ ఆసియా మార్కెట్లపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, స్మాల్ యుటిలిటీ, లార్జ్ యుటిలిటీ పేరుతో నాలుగు విభాగాల్లో 40 ఓజా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చరల్ మెషినరీ (జపాన్), భారత్లోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఆర్‌అండ్‌డీ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. ఓజా శ్రేణి ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ట్రాక్టర్ల ప్లాంట్‌లో తయారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment