Mitsubishi
-
భారత్‌కు జపాన్ కంపెనీ.. పక్కా ప్లాన్‌తో వచ్చేస్తోంది
ఒకప్పుడు భారతదేశంలో లాన్సర్, పజెరో వంటి మోడల్స్ విక్రయించిన మిత్సుబిషి 2016లో తమ ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది. ఆ తరువాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ కార్ డీలర్‌షిప్‌లను నిర్వహిస్తున్న టీవీఎస్ మొబిలిటీలో 30 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసినట్లు సమాచారం. మిత్సుబిషి కంపెనీ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి 33 మిలియన్ డాలర్ల నుంచి 66 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. టీవీఎస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని 30శాతం వాటాను కొనుగోలు చేయడంతో.. ప్రస్తుత నెట్‌వర్క్‌లో దాదాపు 150 అవుట్లెట్లను ఉపయోగించుకుని, ప్రతి కార్ బ్రాండ్‌కు ప్రత్యేక స్టోర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ పూర్తయిన తరువాత మిత్సుబిషి భారతదేశంలో అతిపెద్ద స్వతంత్ర కార్ డీలర్‌షిప్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కంపెనీ దేశీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వాహన విక్రయాలతో పాటు, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నిర్వహణ అపాయింట్మెంట్లు, ఇన్సూరెన్స్ వంటివి సులభతరం చేయడం వంటి వినూత్న సేవలను ప్రవేశపెట్టాలని మిత్సుబిషి యోచిస్తోంది. భారత ఆటోమోటివ్ మార్కెట్లో పోటీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమ్మకాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా సంస్థ యోచిస్తోంది. ఇదీ చదవండి: హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా? -
ఓజా బ్రాండ్ కింద 40 ట్రాక్టర్లు
న్యూఢిల్లీ: ఓజా బ్రాండ్ కింద కొత్తగా 40 ట్రాక్టర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఓజా ట్రాక్టర్లు దేశీ మార్కెట్‌తోపాటు అమెరికా, జపాన్, ఆగ్నేయ ఆసియా మార్కెట్లపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, స్మాల్ యుటిలిటీ, లార్జ్ యుటిలిటీ పేరుతో నాలుగు విభాగాల్లో 40 ఓజా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చరల్ మెషినరీ (జపాన్), భారత్‌లోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఆర్అండ్డీ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. ఓజా శ్రేణి ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ట్రాక్టర్ల ప్లాంట్‌లో తయారు చేయనుంది. -
ఆజాద్ ఇంజనీరింగ్ మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఆజాద్ ఇంజనీరింగ్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం హైదరాబాద్ సమీపంలోని తునికిబొల్లారం వద్ద రూ.165 కోట్లతో ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా స్థాపిస్తోంది. 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2024 మధ్యకాలంలో ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఇక డాక్టర్‌కు కాల్ చేసే డ్రైవర్‌లెస్ కార్లు..
న్యూఢిల్లీ : డ్రైవర్ అవసరం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకునే (డ్రైవర్‌లెస్ కార్స్) కార్లలో మున్ముందు మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయని ‘మిత్సుబిషి’ కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోషి హోనిషి తెలిపారు. ‘కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? గుండె పోటుకు గురయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు గమనించే సెన్సర్లతోపాటు వారి ఆరోగ్య పరిస్థితి గురించి వెంటనే వారి వైద్యులను సెల్‌ఫోన్ అనుసంధానం ద్వారా అప్రమత్తం చేసే సెన్సర్లు కలిగిన కార్లు 2030 నాటికి మనకు అందుబాటులోకి వస్తాయని హిరోషి తెలిపారు. జపాన్‌కు చెందిన ‘మిత్సుబిషి’ కంపెనీ ‘ఎమిరాయ్ ఎస్’ పేరిట డ్రైవర్‌లెస్ కారును తీసుకొస్తోంది. ఈ కారు మోడల్‌ను ఈరోజు టోక్యోల ప్రారంభమైన కార్ల ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టింది. ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతోంది. తాము ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ మోడల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారా, సుఖంగానే ప్రయాణిస్తున్నారా? అన్న అంశాలను పరిశీలించి ప్రయాణికులకు అనుగుణంగా డ్రైవింగ్ మోడ్‌ను మార్చే సెన్సర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు వాహనాలను నడుపుతుండడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎమర్జెన్సీకి హెచ్చరికలు చేసే సెన్సర్లు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దాన్నే మరింతగా అభివృద్ధి చేస్తే డాక్టర్లను అప్రమత్తం చేసేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం డ్రైవర్‌లెస్ కార్లలో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
జపాన్ టు ఇండియా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) ఎంట్రీ, సక్సెస్‌తో విదేశీ కంపెనీల్లో ఉత్సాహం నెలకొంది. వాణిజ్య స్థిరాస్తి రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు పలు విదేశీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే భారత స్థిరాస్తి రంగంలోకి అమెరికా, కెనడా దేశాల కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్‌కు చెందిన పలు రియల్టీ కంపెనీలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎంబసీతో మిట్సుబిషి చర్చలు.. జపాన్‌కు చెందిన మిట్సుబిషి కార్పొరేషన్, సుమిటోమో కార్పొరేషన్, మిట్సుయి గ్రూప్, మోరీ బిల్డింగ్స్ దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వహణ, పారిశ్రామిక పార్క్‌ల నిర్మాణానికి ఆసక్తి ఉన్నట్లు తెలిసింది. మిట్సుబిషీ నుంచి ముగ్గురు, సుమిటోమో నుంచి 810 మంది ఇండియన్ ప్రతినిధులు కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం పనిచేస్తున్నారు. మిట్సుబిషి, సుమిటోమో కార్పొరేషన్స్ దీర్ఘకాలం పాటు భారీ అద్దెలు వచ్చే కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కొనేందుకు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో కమర్షియల్ ప్రాపర్టీల నిర్మాణం కోసం మిట్సుబిషి కార్పొరేషన్ బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌తో చర్చలు జరుపుతుంది. ఎంబసీతో పాటూ స్థానికంగా ఉన్న మరిన్ని కంపెనీలతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మిట్సుబిషీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్ చెన్నై ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుమిటోమి ఎంట్రీ.. గత సెప్టెంబర్‌తో మిట్సుబిషీ, సింగపూర్ ప్రభుత్వ కంపెనీ టీమాసీక్ హోల్డింగ్ అనుబంధ సంస్థ సుర్బానా జురోంగ్ సంయుక్తంగా కలిసి ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో అర్బన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదేళ్లలో 2.5 బిలియన్ డాలర్లతో రైల్, రోడ్స్, హౌజింగ్, షాపింగ్ సెంటర్స్, ఆసుపత్రులు వంటి పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేసింది. ఇండియాతో పాటూ మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాల్లో ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తుంది. సుమిటోమో రియల్టీ అండ్ డెవలప్మెంట్ కంపెనీ స్థానికంగా ఇండియన్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్‌గా కమర్షియల్ ప్రాపర్టీల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తుంది. గతేడాది సుమిటోమో ఎన్సీఆర్లో మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధికి ఆటో పరికరాల తయారీ సంస్థ కృష్ణ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 90 శాతం పెట్టుబడులు విదేశీ కంపెనీలవే.. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ) కంపెనీలు భారత స్థిరాస్తి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్ కంపెనీలు వాణిజ్య రియల్టీ రంగంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి కూడా. 2018లో రియల్టీ రంగంలోకి సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 44 శాతం ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా, కెనడా, సింగపూర్ వంటి విదేశీ కంపెనీల నుంచి వచ్చినవే. 90 శాతం విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినవేనని కేపీఎంజీ తెలిపింది. రీట్స్, రెరా, జీఎస్టీలతో రెడ్ కార్పెట్.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రియల్టీ రంగంలో లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు కేంద్రం గత 34 ఏళ్లలో విప్లవాత్మక చట్టాలను తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ల అమలుతో రియల్టీ రంగంలో పారదర్శకత నెలకొందని.. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. భారత వాణిజ్య స్థిరాస్తి రంగం దీర్ఘకాల పె ట్టుబడులు, రిటర్న్స్‌కు సరైన ప్రాంతమని, అందుకే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని అనరాక్ క్యాపిటల్ ఎండీ శోభిత్ అగర్వాల్ తెలిపారు. ఇండియా జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం ఇలా... ► జపాన్‌కు చెందిన బహుళ జాతి కంపెనీ సుజుకీ మోటర్ కార్పొరేషన్ 1981లో తొలిసారిగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది. నాటి నుంచి 2016 అక్టోబర్ వరకు మన దేశంలో 1305 జపాన్ కంపెనీలు నమోదయ్యాయి. ప్రధానంగా ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి, హెల్త్‌కేర్ రంగాల్లో ఉన్నాయి. ► 2013లో 16.31 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ► దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో జపాన్ వాటా 7 శాతం. ► 2000 నుంచి 2018 మధ్య కాలంలో జపాన్ నుంచి 27.28 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష నిధులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. ► 2017–18లో జపాన్ నుంచి ఇండియాకు 10.97 బిలియన్ డాలర్ల దిగుమతులు, మన దేశం నుంచి జపాన్‌కు 4.73 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ► 2007–08లో 6.3 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. 2017–18 నాటికి 10.97 బి.డాలర్లకు పెరిగాయి. అంటే 11 ఏళ్లలో దిగు మతుల్లో 73% వృద్ధి నమోదైంది. జపాన్ నుం చి ప్రధానంగా ఎలక్ట్రికల్ మిషనరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అనుబంధ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు దిగుమతి అవుతుంటాయి. -
మిస్తుబిషీ, టయాటో కార్లకు ఏమైంది?
కాన్ బెరా: ఇంధన మైలేజీ పరీక్షల్లో అక్రమాల కారణంగా వివాదంలో ఇరుక్కున్న జపాన్ కు చెందిన కార్ల దిగ్గజ కంపెనీలు మిస్తుబిషీ, టోయాటో లకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో కార్లను వెనక్కి తీసుకుంటున్న ఈ జెయింట్స్ కు ఆస్ట్రేలియాలో తీవ్రమైన షాకే తగిలింది. దేశం అంతటా 8 లక్షల 24 వేల కార్లను రీకాల్ చేయాల్సిందిగా ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ఎసీసీసీ) ఆదేశించింది. వివిధ లోపాల కారణంగా జపనీస్ కార్లను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మిస్తుబిషి, టొయాటో ల పాపులర్ మోడళ్ల కార్ల లో తీవ్రమైన డ్రైవర్ భద్రత లోపాలు, ఎయిర్ బ్యాగ్ , హ్యాండ్ బ్రేక్ లో లోపాలపై విచారించిన ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ఎసీసీసీ) ఈ భారీ స్థాయిలో కార్ల రీకాల్ కు నోటిసులిచ్చింది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఈ కార్లను రీకాల్ చేయనున్నట్టు టొయాటో, మిస్తుబిషి ప్రకటించాయి. ఫ్యూయల్ ట్యాంక్ లో పగుళ్లు వచ్చే అవకాశం ఉందని, ఈ క్రాక్ మరింత విస్తరిస్తే లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని టయోటా అంగీకరించింది. ఫ్యూయల్, ఫ్యూయల్ వేపర్ లో లోపాలుంటే అగ్ని ప్రమాద తీవ్రత పెరుగుతుంది టయోటా చెప్పింది. టయోటా ఆస్ట్రేలియా కార్లలో లోపభూయిష్ట హెడ్లైట్లు, ఎయిర్ బ్యాగ్స్ , ఇంధన దోషాలతోపాటు 3లక్షల 24వేల వాహనాలను తిరిగి పిలిపించాలని ఎసీసీసీ ఆదేశించింది. మిత్సుబిషి మోటర్స్ ఆస్ట్రేలియా దాదాపు 5లక్షల వాహనాలకు రీకాల్ చేయాలని ఆదేశించిందని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. శుక్రవారం అందించిన నివేదిక ప్రకారం ఈ రికాల్ లో ట్రిటోన్ యుటే, లాన్సర్ సెడాన్, ఔట్ లాండర్, సహా మిత్సుబిషి కి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్లున్నాయి. అక్టోబర్ 2008, 2015 మధ్య తయారైన ఇరు కంపెనీ కార్లను రీకాల్ చేయనున్నాయి. మరోవైపుఈ రెండు కంపెనీలు చెందిన ఎనిమిది లక్షలమంది కార్ల యజమానులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయనున్నట్టు వెల్లడించాయి. -
పుజి, మిత్సుబిషిలతో చంద్రబాబు బృందం భేటీ
టోక్యో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బృందం పర్యటన రెండో రోజూ జపాన్‌లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం జపాన్ రాజధాని టోక్యోలో పుజి ఎలక్ట్రిక్ సంస్థ, మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థలను చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పుజి సంస్థ విజయవాడలో పైలట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ గ్రిడ్ నిర్మాణం చేపట్టింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ పుజి సంస్థ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇక మిత్సుబిషి కార్పొరేషన్ విశాఖలో సమాచార అధ్యయన కేంద్రం నెలకొల్పనుంది. కృష్ణపట్నం క్లస్టర్ ఏర్పాటుకు మిత్సుబిషి సానుకూలత వ్యక్తం చేసింది. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కార్యక్రమానికి సహకరించాలని చంద్రబాబు మిత్సుబిషి కంపెనీని కోరారు. సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, మున్సిపల్, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు ఎ.గిరిధర్, పీవీ రమేశ్, ఎస్.ఎస్.రావత్, పరిశ్రమల మౌలిక వసతుల కల్పనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ ఉన్నారు. 8వ తేదీ వరకు బాబు బృందం జపాన్‌లోనే పర్యటిస్తుంది. అనంతరం 9, 10 తేదీల్లో హాంకాంగ్‌లో పర్యటిస్తుంది. 10వ తేదీ రాత్రి అక్కడ్నుంచీ బయల్దేరి హైదరాబాద్‌కు తిరిగి రానుంది. -
భారత్‌కు క్యూ కట్టిన కార్ల దిగ్గజాల బాస్‌లు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్, హోండా కంపెనీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిశారు. జనరల్ మోటార్స్ చైర్మన్ టిమ్ సోల్సో, హోండా మోటార్ కంపెనీ చైర్మన్ ఫుమిహికో ఐకెలు విడివిడిగా ప్రధానిని కలిశారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. 2020 కల్లా ప్రపంచంలో మూడో అతి పెద్ద వాహన మార్కెట్‌గా భారత్ అవతరించనున్నదనే అంచనాలున్నాయని, అందుకే పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్‌పై దృష్టి సారిస్తున్నాయని నిపుణులంటున్నారు. అంతేకాకుండా భారత్ కేంద్రంగా కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పలు అంతర్జాతీయ వాహన దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని వారంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు కంపెనీల చైర్మన్లు మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 40 కొత్త మోడళ్లు: జీఎం సీఈఓ మేరీ బర్రా జీఎం చైర్మన్ టిమ్ సోల్సోతో పాటు ఆ కంపెనీ సీఈఓ మేరీ బర్రా కూడా మోడీతో సమావేశమయ్యారు. ప్రధానిగా విజయం సాధించినందుకు అభినందనలు తెలపడానికి మోడీని కలిశామని వివరించారు. ఆ తర్వాత పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా ఆమె కలిశారు. కంపెనీ అంతర్జాతీయ టర్న్ అరౌండ్ ప్రణాళికల్లో భాగంగా ఆమె భారత్‌లో పర్యటిస్తున్నారు. డీలర్లు, వాహన విడిభాగాల సరఫరాదారులతో సమావేశమవుతారు. భారత్‌తో సహా మొత్తం అంతర్జాతీయ మార్కెట్లలో 40 కొత్త మోడళ్లనందించనున్నామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అయితే ఎప్పటిలోగా ఈ మోడళ్లను అందించే గడువును ఆమె వెల్లడించలేదు. 2020 కల్లా మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందనే అంచనాలున్నాయని, అందుకే భారత్ మార్కెట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఇక్కడ తీవ్రమైన పోటీ ఉందని, అందుకే మంచి వాహనాన్ని అందిస్తే తప్ప విజయం సాధించలేమని పేర్కొన్నారు. 1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన జనరల్ మోటార్స్ సంస్థ ఇప్పటివరకూ రూ.2,740 కోట్ల నష్టాలను చవిచూసింది. -
టీసీఎస్ శిక్షణ అకాడమీ ప్రారంభం..
సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ జపాన్‌కు చెందిన శిక్షణ అకాడమీని మోడీ మంగళవారమిక్కడ ప్రారంభించారు. ఇరు దేశాల్లోని ఐటీ నిపుణులకు సాంకేతిక, సాంస్కృతికపరమైన నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ అకాడమీ కృషిచేస్తుంది. ఈ సందర్బంగా 48 మంది టీసీఎస్ జపాన్ ట్రైనీల తొలి బ్యాచ్ భారత్ పర్యటనను కూడా మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ‘21 శతాబ్దాన్ని నడిపిస్తున్నది సాంకేతికత, మేధోపరమైన పరిజ్ఞానమే. మీరంతా భారత్‌లో పర్యటించి తగిన విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటారని భావిస్తున్నా. టీసీఎస్‌లో మీరు ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు జపాన్‌కు తిరిగిరావాలని నేను ఆకాంక్షిస్తున్నా’ అని మోడీ పేర్కొన్నారు. ఈ రెండు గొప్ప దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో తాము కూడా పాలుపంచుకుంటుండటం తమకు గర్వకారణమని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు.