
ఒకప్పుడు భారతదేశంలో లాన్సర్, పజెరో వంటి మోడల్స్ విక్రయించిన మిత్సుబిషి 2016లో తమ ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది. ఆ తరువాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ కార్ డీలర్‌షిప్‌లను నిర్వహిస్తున్న టీవీఎస్ మొబిలిటీలో 30 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసినట్లు సమాచారం.
మిత్సుబిషి కంపెనీ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి 33 మిలియన్ డాలర్ల నుంచి 66 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. టీవీఎస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని 30శాతం వాటాను కొనుగోలు చేయడంతో.. ప్రస్తుత నెట్‌వర్క్‌లో దాదాపు 150 అవుట్‌లెట్‌లను ఉపయోగించుకుని, ప్రతి కార్ బ్రాండ్‌కు ప్రత్యేక స్టోర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
అనుకున్నవన్నీ పూర్తయిన తరువాత మిత్సుబిషి భారతదేశంలో అతిపెద్ద స్వతంత్ర కార్ డీలర్‌షిప్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కంపెనీ దేశీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
వాహన విక్రయాలతో పాటు, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నిర్వహణ అపాయింట్‌మెంట్‌లు, ఇన్సూరెన్స్ వంటివి సులభతరం చేయడం వంటి వినూత్న సేవలను ప్రవేశపెట్టాలని మిత్సుబిషి యోచిస్తోంది. భారత ఆటోమోటివ్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమ్మకాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా సంస్థ యోచిస్తోంది.
ఇదీ చదవండి: హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా?
Comments
Please login to add a commentAdd a comment