సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్సులు, సెలూన్లు వంటి స్టోర్లకోసం శాంసంగ్ ప్రత్యేకంగా అల్ట్రా హై డెఫినిషన్ (యూహెచ్‌డీ) బిజినెస్ టీవీలను భారత మార్కెట్లో శుక్రవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు 43, 50, 55, 70 అంగుళాల వేరియంట్లలో లభిస్తాయి. వీటి ధరలు 75,000 - 175,000 రూపాయల వరకు ఉంటాయనీ, మూడేళ్ల వారంటీతో వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (చైనాలో కాదు చెన్నైలో)
తమ కొత్త శాంసంగ్ బిజినెస్ టీవీల ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారాల అవసరాలను తీర్చాలని భావిస్తున్నామనీ, పని ప్రదేశంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సమర్థవంతంగా వినియోగించుకునేలా వీటిని తయారు చేశామని శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పునీత్ సేథీ వెల్లడించారు. సొంత కంటెంట్‌ను సృష్టించేందుకు వీలుగా 100 ఉచిత టెంప్లేట్‌లతో టీవీలు ప్రీలోడెడ్‌గా అందిస్తున్నట్టు చెప్పారు.
ఇన్‌స్టాల్ చేయడం సులభం
శాంసంగ్ బిజినెస్ టీవీలను సులభంగా ఇన్‌స్టాలేషన్ చేసేలా ఒక 3 దశల గైడ్‌తో వస్తుందనీ, తద్వారా ఇన్‌స్టాలేషన్‌కు అదనపు చార్జీల బెడద లేకుండానే టీవీని ఆన్ చేసినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభమవుతుందని శాంసంగ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment