TVS X Electric Scooter: చాలా రోజుల తరువాత టీవీఎస్ కంపెనీ ఎట్టకేలకు తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.50 లక్షలు కావడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్‌తో 140 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం (హోమ్ ర్యాపిడ్ ఛార్జర్), 4 గంటల 30 నిమిషాల్లో 950 వాల్స్ పోరాటబుల్ ఛార్జర్ సాయంతో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. పోర్టబుల్ ఛార్జర్ ధర రూ. 16,275.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) 11 kW పీక్ పవర్, 40 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ముందువైపు 220 మిమీ డిస్క్, వెనుకవైపు 195 మిమీ డిస్క్ ఉంటుంది. 12 ఇంచెస్ చక్రాలమీద 100 సెక్షన్ టైర్స్ ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది.
ఫీచర్స్..
టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ XLETON ప్లాట్‌ఫారమ్‌పై తయారై 770 మిమీ ఎత్తుగల సీట్ పొందుతుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో 40 కిమీ/గంట వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటాకు 105 కిమీ కావడం గమనార్హం. ఇందులో Xtealth, Xtride, Xonic అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంతే కాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఇందులో లభిస్తుంది.
ఇదీ చదవండి: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..
ఈ లేటెస్ట్ బైక్ 10.25 ఇంచెస్ TFT డ్యాష్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యూజిక్ ప్లేబ్యాక్ అండ్ నావిగేషన్ అలర్ట్‌లను ఎనేబుల్ చేసే ఫీచర్‌లను పొందుతుంది. వీటితో పాటు రివర్స్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ ఫంక్షన్ వంటివి ఉంటాయి. అండర్ సీట్ స్టోరేజ్19 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు రాత్రి నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే దీనిపైన ఎలాంటి ఫేమ్ 2 సబ్సిడీ లభించదు.డెలివరీలు నవంబర్ నెలలో (బెంగళూరులో) ప్రారంభమవుతాయి. 2024 మార్చి తరువాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుటాయి. కాగా మొదటి 2000 మంది కస్టమర్లకు స్మార్ట్‌వాచ్ అండ్ రూ. 18,000 విలువైన 'క్యూరేటెడ్ కన్సైర్జ్' ప్యాకేజీ ఉచితంగా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment