Scooter India
-
ఈ స్కూటర్ కొనే డబ్బుతో 'హిమాలయన్' బైక్ కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?
TVS X Electric Scooter: చాలా రోజుల తరువాత టీవీఎస్ కంపెనీ ఎట్టకేలకు తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.50 లక్షలు కావడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్‌తో 140 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం (హోమ్ ర్యాపిడ్ ఛార్జర్), 4 గంటల 30 నిమిషాల్లో 950 వాల్స్ పోరాటబుల్ ఛార్జర్ సాయంతో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. పోర్టబుల్ ఛార్జర్ ధర రూ. 16,275. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) 11 kW పీక్ పవర్, 40 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ముందువైపు 220 మిమీ డిస్క్, వెనుకవైపు 195 మిమీ డిస్క్ ఉంటుంది. 12 ఇంచెస్ చక్రాలమీద 100 సెక్షన్ టైర్స్ ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఫీచర్స్.. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ XLETON ప్లాట్‌ఫారమ్‌పై తయారై 770 మిమీ ఎత్తుగల సీట్ పొందుతుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో 40 కిమీ/గంట వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటాకు 105 కిమీ కావడం గమనార్హం. ఇందులో Xtealth, Xtride, Xonic అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంతే కాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఇందులో లభిస్తుంది. ఇదీ చదవండి: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు.. ఈ లేటెస్ట్ బైక్ 10.25 ఇంచెస్ TFT డ్యాష్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యూజిక్ ప్లేబ్యాక్ అండ్ నావిగేషన్ అలర్ట్‌లను ఎనేబుల్ చేసే ఫీచర్లను పొందుతుంది. వీటితో పాటు రివర్స్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ ఫంక్షన్ వంటివి ఉంటాయి. అండర్ సీట్ స్టోరేజ్19 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు రాత్రి నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే దీనిపైన ఎలాంటి ఫేమ్ 2 సబ్సిడీ లభించదు.డెలివరీలు నవంబర్ నెలలో (బెంగళూరులో) ప్రారంభమవుతాయి. 2024 మార్చి తరువాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుటాయి. కాగా మొదటి 2000 మంది కస్టమర్లకు స్మార్ట్‌వాచ్ అండ్ రూ. 18,000 విలువైన 'క్యూరేటెడ్ కన్సైర్జ్' ప్యాకేజీ ఉచితంగా లభిస్తుంది. -
మార్కెట్లోకి యమహా ఏరాక్స్ 155 కొత్త వెర్షన్ @ 1,42 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా తాజాగా ఏరాక్స్ 155 స్పోర్ట్స్ స్కూటర్ 2023 వెర్షన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1,42,800 ఉంది. ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా 155 సీసీ ఇంజన్ పొందుపరిచింది. ఎల్ఈడీ పొజిషనింగ్ ల్యాంప్స్‌తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, మొబైల్ చార్జింగ్ కోసం పవర్ సాకెట్, 24.5 లీటర్ల స్టోరేజ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, 14 అంగుళాల అలాయ్ వీల్స్, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్తోపాటు స్కూటర్లలో తొలిసారిగా ఈ మోడల్‌కు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్15ఎస్, ఎంటీ15 వీ2, ఆర్15 వీ4 మోడళ్లలో 2023 వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.63–1.86 లక్షల మధ్య ఉంది. కాఫీడే రూ.436 కోట్ల రుణాల ఎగవేత న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. -
ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.50వేలు లోపే .. అస్సలు మిస్ అవ్వొద్దు!
రద్దీగా ఉండే రోడ్లు, భారీ ట్రాఫిక్ జామ్ సమయాల్లో కార్లలో ప్రయాణించడం చాలా కష్టం. అందుకే అలాంటి క్లిష్ట సమయాల్లో ప్రయాణం సాఫిగా జరిగేలా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు మొగ్గు చూపుతుంటారు. మీరూ అలా తక్కువ బడ్జెట్లో అంటే రూ.50 వేలకే స్కూటర్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరల్లో స్కూటర్లను అందించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకే ఇప్పుడు మనం ధర తక్కువ, మైలేజ్, నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తూ ప్రయాణానికి సౌకర్యంగా ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ‘టీవీఎస్ ఎక్స్ఎల్ 100 (TVS XL100)’ పేరుతో 6 మోడళ్లు, 15 రకాల రంగులతో రూ.46,671 నుంచి రూ.57,790 ధరతో స్కూటర్లను అందిస్తుంది. 99పీపీ బీఎస్6 ఇంజిన్‌తో 4.4 హార్స్ పవర్, 6.5 ఎన్ఎం టారిక్ను ఉత్పత్తి చేస్తుంది. వెహికల్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని బరువు 89 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 4 లీటర్లు.సైలెంట్ స్టార్టర్, ఇంజిన్ కిల్‌స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (డీఆర్ఎల్)తో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన వెహికల్స్‌లో ఇదొకటి. కొమాకి ఎక్స్‌జీటీ కేఎం Komaki XGT KM ఎలక్ట్రిక్ స్కూటర్. ఢిల్లీ కేంద్రంగా 35ఏళ్ల నుంచి ఆటోమొబైల్ రంగంలో రాణిస్తున్న కేఐబీ కొమాకి సంస్థకు చెందిన ఈ స్కూటర్లో అండర్‌సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్, డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకునేందుకు వీలుగా స్థలం ఉంది. అదనంగా Komaki XGT KM డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ లాక్ ఇలా అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనపు భద్రత కోసం ముందు చక్రం డిస్క్ బ్రేకులు అమర్చబడ్డాయి. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, XGT KM 130-150కిమీల పరిధిని కవర్ చేయగలదు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 6-8 గంటలు పడుతుంది. అవాన్ ఇ లైట్ Avon E Lite దేశీయంగా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదికొటి. కేవలం రూ. 28,000కి కొనుగోలు చేయొచ్చు. పూర్తి ఛార్జ్ తర్వాత, E లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 50 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఫుల్ ఛార్జింగ్ చేసేందుకు 4-8 గంటలు పడుతుంది. లోహియా ఓమా స్టార్ Lohia Oma Star దేశీయంగా తయారు చేసింది. క్లచ్ తక్కువ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సీటు కింద స్టోరేజ్ బాక్స్‌ను కలిగి ఉంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 60 కిమీ/ఛార్జ్ వరకు ప్రయాణించగలదు. దీని ప్రారంభం ధర రూ.41,444 ఉండగా.. ఖరీదైన వేరియంట్ ధర రూ.51,750కే కొనుగోలు చేయొచ్చు. ఎవాన్ ఈ స్కూట్ Avon E Scoot 65 కిమీ/ఛార్జ్ పరిధితో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.45,000 నుంచి రూ. 50,000 లోపు అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. టెక్కో ఎలక్ట్రా నియో Techo Electra Neo భారత్‌లో తయారైంది. రూ. 41,919 ధరతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. నాలుగు విభిన్న రంగులలో లభిస్తుంది. టెక్కో ఎలెక్ట్రా నియో మోటారు 250 డబ్ల్యూ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ సుమారు 5-7 గంటలు పడుతుంది.సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్,విశాలమైన స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఇతర సదుపాయాలు ఉన్నాయి. -
లాంబ్రెటా కంపెనీ ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: లాంబ్రెటా.. విజయ్ సూపర్ .. కొన్ని దశాబ్దాల క్రితం స్కూటర్లకు పర్యాయపదంగా నిల్చాయీ బ్రాండ్లు. అప్పట్లో ఓ ఊపు ఊపిన లాంబ్రెటా స్కూటర్లంటే ఇప్పటికీ ఒక వింటేజ్ బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమేణా లాంబ్రెటా, విజయ్ సూపర్ ఇతర వాహనాల పోటీ దెబ్బకు కనుమరుగయ్యాయి. ఇప్పుడిక వీటిని తయారు చేసిన కంపెనీ స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) వంతు వచ్చింది. నష్టాల భారంతో కుదేలవుతున్న ఎస్ఐఎల్ను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో దీన్ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. మూసివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తదుపరి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదన ప్రకారం స్కూటర్స్ ఇండియా బ్రాండ్ పేరును విడిగా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ ముందు ఉంచిన ప్రణాళిక ప్రకారం కంపెనీ మూసివేతకు రూ. 65.12 కోట్లు అవసరమయ్యే నిధులను రుణం కింద కేంద్రం సమకూర్చాలి. తగు స్థాయిలో నిధులు సమకూరిన తర్వాత అదనంగా ఉన్న రెగ్యులర్ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును (వీఆర్ఎస్/వీఎస్ఎస్) ఆఫర్ చేయనున్నారు. లక్నో కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్కూటర్స్ ఇండియాలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన 147.49 ఎకరాల స్థలాన్ని పరస్పర ఆమోదయోగ్య రేటు ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి ప్రాధికార సంస్థకు అప్పజెబుతారు. ఇక, స్టాక్ ఎ క్సే్చంజీల నుంచి షేర్లను కూడా డీలిస్ట్ చేయాల్సి ఉంటుంది. 1972 నుంచి.. స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) 1972లో ఏర్పాటైంది. వివిధ రకాల ఇంధనాలతో పనిచేసే త్రిచక్ర వాహనాల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ కోసం దీన్ని నెలకొల్పారు. 1975లో దేశీ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్‌తోనూ, విదేశీ మార్కెట్ల కోసం లాంబ్రెటా పేరుతోనూ ఎస్ఐఎల్ స్కూటర్లను తయారు చేయడం మొదలు పెట్టింది. అటు పైన విక్రమ్/లాంబ్రో పేరిట త్రిచక్ర వాహనాలను కూడా ఉత్పత్తి చేసింది. 1997లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన ఎస్ఐఎల్ .. విక్రమ్ బ్రాండు కింద వివిధ త్రిచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుండటంతో కేంద్రం గతంలో దీన్ని విక్రయించే ప్రయత్నాలు చేసింది. యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు తనకున్న పూర్తి వాటాలను విక్రయించేందుకు 2018 లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. కానీ, విక్రయ యత్నాలు కుదరకపోవడంతో చివరికి మూసివేత నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
వ్యూహాత్మకంగా అమ్మేద్దాం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. వీటిలో ఓ 30 సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా ఖజానా నింపుకోవాలన్నది కేంద్రం వ్యూహం. ఈ కార్యక్రమాన్ని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) చూస్తోంది. ముఖ్యంగా వీటిలో ఐదు సంస్థల్లో వాటాలను ఈ ఆర్థిక సంవత్సరం ఎలాగైనా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవి పవన్ హన్స్, హెచ్ఎస్సీసీ, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా, స్కూటర్స్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్. 2018–19లో ఈ సంస్థల్లో వాటాల విక్రయాన్ని పూర్తి చేయడం పట్ల దీపమ్ నమ్మకంతో ఉంది. తీవ్ర రుణ భారం, నష్టాల్లో కునారిల్లుతోన్న ఎయిర్ ఇండియాలోనూ వ్యూహాత్మక వాటాలను విక్రయించాలనుకున్న కేంద్రం దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయిన విషయం తెలిసిందే. ఈ ఆరు కాకుండా మరో 24 ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినప్పటికీ, ప్రాథమిక దశలోనే నిలిచిపోయాయి. కొన్ని పీఎస్‌యూలకే ఈ ఆర్థిక సంవత్సరం వాటాలు విక్రయించదలిచిన వాటిలో హెచ్ఎస్సీసీ, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్)ను ప్రభుత్వరంగంలో ఇదే విధమైన వ్యాపారంతో కూడిన కంపెనీలకే విక్రయించనుండడం గమనార్హం. నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎన్బీసీసీ వీటిలో వాటాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన సంస్థలైన పవన్ హన్స్, స్కూటర్స్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో వాటాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించనుంది. వీటిలో వాటాల విక్రయ ప్రతిపాదనకు మంచి ఆసక్తి నెలకొన్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటిలో వాటాలను విక్రయించే విషయమై విశ్వాసంతో ఉన్నాం. ప్రైవేటీకరణ చేయాలనుకున్న వాటి కోసం తగిన ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయడమే మా ప్రాధాన్యం’’ అని ఆ అధికారి చెప్పారు. ఇక ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా కంపెనీలను విలీనం చేయనున్నామని, విలీనం తర్వాత ఏర్పడే సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్టు తెలిపారు. మూడు సంస్థల విలీనానికే ఏడాది సమయం పడుతుందని, ఆ తర్వాతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరింత సమయం తీసుకుంటుందన్నారు. మరికొన్ని సంస్థలు సైతం.. ఇక పవన్ హన్స్లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, ఓఎన్జీసీకి 49 శాతం వాటాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ వాటాలతో పాటు ఓఎన్జీసీ వాటాలను కలిపి ఒకే సారి ప్రైవేటు సంస్థకు అమ్మేయాలన్నది ప్రతిపాదన. నిజానికి గడిచిన పది నెలల్లో పవన్ హన్స్లో కేంద్ర ప్రభుత్వం వాటాలను రెండు సార్లు ఆఫర్ ఫర్ సేల్కు తీసుకురావడం జరిగింది. మొదటిగా గతేడాది అక్టోబర్‌లో ఆఫర్ ఫర్ సేల్‌ను ప్రకటించింది. కేవలం రెండే సంస్థలు గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, కాంటినెంటల్ హెలికాప్టర్స్ మాత్రమే ఆసక్తి చూపాయి. దీంతో ఆఫర్‌ను దీపమ్ ఉపసంహరించుకుంది. సవరించిన ఆఫర్‌ను ఏప్రిల్ చివర్లో తీసుకొచ్చింది. సుమారు 12 సంస్థల వరకు ఈ సారి తమ ఆసక్తి తెలిపాయి. తాజాగా ఓఎన్జీసీ కూడా తనకున్న మొత్తం వాటాలను అమ్మేయాలని నిర్ణయించడంతో పవన్ హన్స్ పూర్తిగా ప్రైవేటు పరం కానుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా నిధులను సమీకరించింది. వీటిలో భారత్ 22ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, రైట్స్ ఐపీవోలు ఉన్నాయి. మరో విడత భారత్ 22ఈటీఎఫ్, సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల ఫాలో ఆన్ ఆఫర్ల ద్వారా నిధులు సమీకరించే ఆలోచనను దీపమ్ చేస్తోంది. ఇంకా, ఐఆర్ఎఫ్సీ లిమిటెడ్, ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్, మజ్గాన్ డాక్ షిప్‌బిల్డర్స్, గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్, నీప్కో, ఎంఎస్టీసీ ఐపీవోలు కూడా రానున్నాయి. వీటి ద్వారా కేంద్ర ఖజానాకు ఆదాయం సమకూరనుంది. ఇంకా ఇప్పటికే లిస్ట్ అయి ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ల ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. వీటికి తోడు నగదు నిల్వలు దండిగా ఉన్న కంపెనీలు బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైబ్యాక్ ఆఫర్లలో కేంద్రం తన వాటాలను తగ్గించుకోవడం ద్వారా నిధుల్ని సమీకరించొచ్చు. పవన్‌హన్స్‌లో ఓఎన్జీసీ వాటా సైతం అమ్మకం ప్రైవేటు హెలికాప్టర్ సేవల కంపెనీ పవన్ హన్స్లో తనకున్న 49 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ ‘ఓఎన్జీసీ’ బోర్డు ఆమోదం తెలిపింది. రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు, ప్రధానమైన ఆయిల్, గ్యాస్ వ్యాపారంపైనే దృష్టి సారించేందుకు వీలుగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పవన్‌హన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాలను దీపమ్ ఇప్పటికే అమ్మకానికి (ఆఫర్ ఫర్ సేల్) పెట్టగా... దాంతోపాటే ఓఎన్జీసీ వాటాలను కూడా విక్రయించే అవకాశం ఉందని, సవరించిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. జాయింట్ వెంచర్ కంపెనీ పవన్‌హన్స్‌లో ప్రభుత్వం వైదొలుగుతున్నందున ఇక తాము కూడా కొనసాగదలుచుకోలేదని, ప్రభుత్వంతోపాటు తమ వాటాను కూడా విక్రయించాలని భావిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖకు ఓఎన్జీసీ లేక కూడా రాయడం గమనార్హం. పవన్ హన్స్ హెలికాప్టర్లను లీజుకిచ్చే వ్యాపారంలో ఉంది. మొత్తం 46 హెలికాప్టర్లను కలిగి ఉంటే, అందులో 22 లీజులో ఉన్నాయి. వీటిలో ఏడు వరకు ఓఎన్జీసీ అద్దెకు తీసుకున్నవే. తన ఆఫ్‌షోర్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకు సిబ్బందిని తరలించేందుకు వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ హన్స్లో తమ పెట్టుబడులు వ్యూహాత్మకం ఎంత మాత్రం కాదని ఓఎన్జీసీ అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఓఎన్జీసీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో గ్రూపు కంపెనీల వ్యాపార పునర్నిర్మాణ అవకాశాలను పరిశీలించేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది’’ అని ఆ అధికారి వెల్లడించారు. -
హోండా కొత్త స్కూటర్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్,స్కూటర్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 125సీసీ సామర్ధ్యంతో అడ్వాన్స్డ్ అర్బన్ స్కూటర్‌ను బుధవారం దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.‘గ్రాజియా’ పేరుతో తీసుకొన్తున్న ఈ స్కూటర్‌ను రూ. 57,897 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే విడుదల చేసింది. ఆటోమేటిక్ స్కూటర్ల సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న హోండా మోటార్స్ గ్రాజియో మరో అడుగు ముందుకు వేసిందని హోండా మోటార్స్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. కంపెనీ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరు స్కూటర్ మోడళ్లలో అతి పెద్ద పోర్ట్‌ఫోలియో హోండాదే. 125 సీసీ బీ-4 (హోండా ఎకో టెక్నాలజీ) ఇంజిన్, సీబీఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టం) తో వస్తోంది. ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ , త్రీ స్టెప్ ఎకో స్పీడ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లను కలిగి ఉంది. ఇది వాస్తవిక మైలేజ్ సమాచారాన్ని చూపించే మొట్టమొదటి ఆవిష్కరణ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
టూ వీలర్ల విపణిలో హోండా లక్ష్యం 30% వాటా..
కంపెనీ ప్రెసిడెంట్ కీట మురమత్సు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 2016-17లో 30% వాటా టార్గెట్ చేసుకుంది. భారత టూ వీలర్ మార్కెట్లో గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వాటా 27%గా ఉంది. ఈ ఏడాది పరిశ్రమ 3-5% వృద్ధి కనబరుస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. తాము 20% వృద్ధి ఆశిస్తున్నట్టు హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్ కీట మురమత్సు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ ఏర్పాటు చేసి ఏడాదైన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2015-16లో కంపెనీ 44.6 లక్షల యూనిట్లు విక్రయించింది. సంస్థ అమ్మకాల్లో స్కూటర్ల వాటా 56% ఉంది. మోటార్ సైకిళ్ల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నందున 2016-17లో ఈ విభాగం వాటా 50%నికి చేరుతుందన్నారు. రూ.600 కోట్లతో కర్నాటక ప్లాంటులో కొత్త లైన్‌ను జోడిస్తున్నట్టు చెప్పారు. తద్వారా ఉత్పత్తి 6 లక్షల యూనిట్లు పెరుగుతుంది.