టూ వీలర్ల విపణిలో హోండా లక్ష్యం 30% వాటా.. | honda target share is 30percent | Sakshi
Sakshi News home page

టూ వీలర్ల విపణిలో హోండా లక్ష్యం 30% వాటా..

Published Fri, May 6 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

టూ వీలర్ల విపణిలో హోండా లక్ష్యం 30% వాటా..

టూ వీలర్ల విపణిలో హోండా లక్ష్యం 30% వాటా..

కంపెనీ ప్రెసిడెంట్ కీట మురమత్సు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 2016-17లో 30% వాటా టార్గెట్ చేసుకుంది. భారత టూ వీలర్ మార్కెట్లో గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వాటా 27%గా ఉంది. ఈ ఏడాది పరిశ్రమ 3-5% వృద్ధి కనబరుస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. తాము 20% వృద్ధి ఆశిస్తున్నట్టు హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్ కీట మురమత్సు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ ఏర్పాటు చేసి ఏడాదైన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2015-16లో కంపెనీ 44.6 లక్షల యూనిట్లు విక్రయించింది. సంస్థ అమ్మకాల్లో స్కూటర్ల వాటా 56% ఉంది. మోటార్ సైకిళ్ల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నందున 2016-17లో ఈ విభాగం వాటా 50%నికి చేరుతుందన్నారు. రూ.600 కోట్లతో కర్నాటక ప్లాంటులో కొత్త లైన్‌ను జోడిస్తున్నట్టు చెప్పారు. తద్వారా ఉత్పత్తి 6 లక్షల యూనిట్లు పెరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement