సాక్షి, న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్,స్కూటర్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 125సీసీ సామర్ధ్యంతో అడ్వాన్స్‌డ్ అర్బన్ స్కూటర్‌ను బుధవారం దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.‘గ్రాజియా’ పేరుతో తీసుకొన్తున్న ఈ స్కూటర్‌ను రూ. 57,897 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే విడుదల చేసింది.
ఆటోమేటిక్ స్కూటర్ల సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న హోండా మోటార్స్ గ్రాజియో మరో అడుగు ముందుకు వేసిందని హోండా మోటార్స్ అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. కంపెనీ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరు స్కూటర్ మోడళ్లలో అతి పెద్ద పోర్ట్‌ఫోలియో హోండాదే. 125 సీసీ బీ-4 (హోండా ఎకో టెక్నాలజీ) ఇంజిన్, సీబీఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టం) తో వస్తోంది. ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ , త్రీ స్టెప్ ఎకో స్పీడ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లను కలిగి ఉంది. ఇది వాస్తవిక మైలేజ్ సమాచారాన్ని చూపించే మొట్టమొదటి ఆవిష్కరణ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment