
న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వాక్‌మాన్‌లను (పోర్టబుల్ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్‌స్క్రీన్ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్‌మాన్ ఎన్‌డబ్ల్యూ–ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై–ఫై ద్వారా పాటలు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం, వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు టైప్–సీ పోర్టు, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్‌మాన్‌లు అందుబాటులోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment