Touch Screen
-
బాబోయ్ అశ్లీల వీడియోలు! దుర్వినియోగం అవుతున్న కొత్త ఫీచర్? టెస్లా కారుకు కొత్త చిక్కులు
వరల్డ్ వైడ్‌గా గుర్తింపు పొందిన టెస్లాకారులోని లేటెస్ట్ ఫీచర్లని కొందరు దుర్వినియోగం చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఊహించని విధంగా తలెత్తిన ఈ కొత్త సమస్యకి ఎలన్ మస్క్ ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాజా ఘటన టెస్లా బ్రాండ్ ఇమేజ్‌ని ఎమైనా ఎఫెక్ట్ చేస్తుందా అనే చర్చ సైతం మొదలైంది. టెక్నాలజీలో దూసుకుపోవడం అంటే ఎలన్ మస్క్‌కి ఇష్టం. అందుకే డీజిల్ కార్లు రాజ్యమేలుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం ఆలోచించారు. అదే బాటలో ఇప్పుడు డ్రైవర్ లెస్ కారుని పరిచయం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇలా టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా నేవిగేషన్ మరింత సులువుగా ఉండేందుకు టెస్లా కార్లలో బిగ్ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు ఎలన్ మస్క్. కానీ కొందరు ప్రబుద్దులు ఈ స్క్రీన్లను దుర్వినియోగం చేస్తున్నారు. టెస్లా బ్రాండ్‌కి కొత్త చిక్కులు తెచ్చి పెట్టారు. టచ్ స్క్రీన్ ఉపయోగం టెస్లా కారులో డ్యాష్ బోర్డులో ఇన్ఫోంటైన్మెంట్ ఏరియాలో స్ట్రీరింగ్ పక్కనే టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్‌లో కారు ఎంత వేగంతో వెళుతుంది. ముందు, వెనుక భాగంలో వచ్చే వాహనాల వివరాలు, యాక్సిడెంట్ అలెర్ట్, మ్యాప్‌లతో నావిగేషన్, ఎయిర్ కండిషన్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు కారు ప్రయాణిస్తున్న ఏరియాకు సంబంధించిన ప్రత్యేకతలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వివరాలను అందిస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో భాగంగా ఆ టచ్ స్క్రీన్ తో డ్రైవింగ్‌ను కమ్యునికేట్ చేయడంతో పాటు ఇతర పనుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా ఈ టచ్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. దుర్వినియోగం ఇప్పుడు అదే స్క్రీన్‌ను కొందరు ప్రబుద్దులు అసాంఘీక కార్యకలాపాకు ఉపయోగించడంపై సరికొత్త చర్చకు దారి తీసింది. సౌత్ లండన్ ప్రాంతంలో ఓ వాహన దారుడు రూ.75లక్షల ఖరీదైన 'టెస్లా-ఎస్' ఎలక్ట్రిక్ కారు స్ట్రీరింగ్ పక్కనే ఉన్న టచ్ స్క్రీన్‌పై అశ్లీల వీడియోలు చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. డాన్ కిచెనర్ అనే మరో వాహనదారుడు టెస్లా కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి నీలిచిత్రాలు చూస్తుండడాన్ని గుర్తించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇలా అయితే ఎలా ? ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని డాన్ కిచెనర్ సోషల్ మీడియాలో వివరంగా తెలిపాడు... సౌత్ లండన్‌లో నేనుండే ఏరియా నుంచి నా కారులో ఆఫీస్‌కు వెళుతున్నా. అదే సమయంలో నా ముందున్న టెస్లా కారు టచ్ స్క్రీన్‌లో నీలిచిత్రాలు ప్లే అవ్వడాన్ని గమనించా. జాగ్రత్తగా చూస్తే డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి కారును నడుపుతూనే పక్కన ఉన్న స్క్రీన్‌ను జూమ్ చేసి నీలి చిత్రాలు చూస్తున్నాడు. ట్రాఫిక్‌ను గమనించకుండా మరో లోకంలో ఉండిపోయి ఆ వీడియోలు చూస్తున్నాడు. ఇలా డ్రైవింగ్‌పై దృష్టి పెట్టకుండా నడిపితే జరిగే నష్టానికి బాధ్యులంటూ ప్రశ్నించాడు. మస్క్ ఏంచేస్తారో కిచెనర్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. టెస్లా కారులో మిస్ యూజ్ అవుతున్న టచ్ స్క్కీన్‌పై ఎలన్ మస్క్ ఎలా స్పందిస్తారు ? ఏదైనా కొత్త పరిష్కారం చూపిస్తారా ? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు డ్రైవర్‌ను తిట్టి పోస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వివాదంపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. చదవండి: టెస్లా కంపెనీకి 19 ఏళ్ల కుర్రాడు సవాల్..! -
ఐఫోన్11 ఫోన్లకు స్క్రీన్ల రీప్లేస్మెంట్
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ తయారీ ఐఫోన్ 11 వినియోగదారులకు శుభవార్త. ఐఫోన్ 11 మోడల్ ఫోన్లకు స్ర్కీన్లను రీప్టేస్ చేయనున్నట్లు యాపిల్ ఇంక్ తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 11 మోడళ్లలో టచ్ స్ర్రీన్ సమస్యలు ఎదురవుతుండటంతో ఉచితంగా స్క్రీన్లను మార్పు చేయనున్నట్లు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 మే నెల మధ్యకాలంలో తయారైన ఐఫోన్ 11 మోడళ్లలో ఈ సమస్యలు ఎదురవుతున్నట్లు యాపిల్ ఇంక్ వెల్లడించింది. డిస్ప్లే మాడ్యూల్లో సమస్యల కారణంగా ఈ మోడల్ ఐఫోన్లు కొన్నింటిలో టచ్ సక్రమంగా పనిచేయడంలేదని వివరించింది. చెక్ చేసుకోవచ్చు ఐఫోన్ 11 మోడల్ వినియోగదారులు టచ్ స్క్రీన్ సమస్యలను పరిశీలించేందుకు వీలుగా యాపిల్ వివరాలు అందించింది. యూజర్లు ఫోన్ సీరియల్ నెంబర్ చెకర్ ద్వారా స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌కు అర్హమైనదీ లేనిదీ తెలుసుకోవచ్చని వెల్లడించింది. యాపిల్ వెబ్సైట్లో రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా సీరియల్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే వివరాలు కనిపించనున్నట్లు తెలియజేసింది. ఈ పరిధిలో మీ ఫోన్ ఉంటే యాపిల్ అధీకృత సర్వీసుల కేంద్రంలో ఉచితంగా స్క్రీన్‌ను రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది. ఒకవేళ ఇప్పటికే ఈ సమస్య కారణంగా సొంత ఖర్చులతో స్ర్రీన్ను మార్చుకున్నట్లయితే.. యాపిల్‌ను సంప్రదించడం ద్వారా రిఫండ్‌ను పొందవచ్చని తెలియజేసింది. -
మళ్లీ సోనీ ‘వాక్‌మాన్’!
న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వాక్‌మాన్‌లను (పోర్టబుల్ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్‌స్క్రీన్ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్‌మాన్ ఎన్‌డబ్ల్యూ–ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై–ఫై ద్వారా పాటలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం, వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు టైప్–సీ పోర్టు, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్మాన్లు అందుబాటులోకి వస్తాయి. -
ఈ ట్యాబ్‌ను చుట్టేయొచ్చు!
టొరంటో: పురాతన కాలంలో రాజులు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగించే వస్త్రపు రోల్స్ తరహాలో చుట్టేయడానికి వీలుగా ఉండే ఓ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్‌ను కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘మ్యాజిక్ స్క్రోల్’పేరిట దీనిని రూపొందించారు. సాధారణ ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉండటంతో పాటు, తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ తరహా ట్యాబ్లెట్‌ను తయారుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీనిలో త్రీడీ ప్రింటెడ్ సిలిండ్రికల్ బాడీతోపాటు రోల్ చేయడానికి వీలుగా ఉండే డిస్ప్లేను అమర్చారు. ఇక స్క్రీన్‌ను చుట్టేందుకు వీలుగా ఇరువైపులా రెండు రోటరీ చక్రాలను ఏర్పాటు చేశారు. ఈ చక్రాల్లో రోబోటిక్ యాక్యువేటర్స్ను అమర్చారు. వీటి సాయంతో స్క్రీన్‌ను ఆపరేట్ చేయవచ్చు. వీటితోపాటు ఈ ట్యాబ్‌లో కెమెరాను కూడా అమర్చారు. దీనిని మరింత చిన్నగా పెన్ను మాదిరి అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రోయల్ వెర్టిగాల్ తెలిపారు. -
పగిలిపోని టచ్స్క్రీన్లు త్వరలో..
లండన్: వేలు పోసి కొన్న స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పగిలిపోతే కలిగే ఆ బాధ వర్ణనాతీతం. త్వరలోనే ఈ బెంగ తీరనుంది. తక్కువ ధరలో.. ఫ్లెక్సిబుల్‌గా ఉండే స్మార్ట్‌ఫోన్స్ స్క్రీన్స్ అందుబాటులోకి రానున్నాయి. సిల్వర్, గ్రాఫీన్లతో పర్యావరణహిత స్క్రీన్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ స్క్రీన్లు తక్కువ విద్యుత్‌నే ఉపయోగించుకుంటాయని, ఇప్పుడున్న వాటికంటే వేగంగా స్పందిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న టచ్‌స్క్రీన్స్ తయారీలో వాడే ఇండియమ్ టిన్ ఆక్సైడ్ పెళుసుగా ఉండటంతోపాటు ధర కూడా ఎక్కువ. అలాగే ఇండియమ్ చాలా అరుదైన లోహం, దీనివల్ల పర్యావరణానికి కూడా హాని జరుగుతుందని తెలిపారు. సిల్వర్ కూడా అధిక ధరకే లభిస్తున్నా.. సిల్వర్ నానోవైర్లను గ్రాఫీన్‌కు జతచేయడం ద్వారా తక్కువ ధరకే ఈ నూతన స్క్రీన్‌ను తయారు చేసినట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. ఇంతకుముందే సిల్వర్ నానోవైర్లను టచ్‌స్క్రీన్స్‌లో ఉపయోగించినా.. ఎవరూ గ్రాఫీన్‌తో తయారు చేయలేదని వర్సిటీ పరిశోధకులు డాల్టన్ చెప్పారు. -
ఫోన్ కావాలా? నేను కావాలా?
మనిషిలో ఎన్ని సెల్లులు ఉంటాయి? ఓ.. లెక్కలేనన్ని! అన్నీ మురికైపోతున్నాయట.. టాక్సిన్లతో. అంటే.. అవో రకం విషాలు. బాడీ లోపల శుభ్రం చేసుకోడానికి సాత్విక భోజనం చేసినట్లు.. మైండ్‌ని క్లీన్ చేసుకోడానికి సాత్విక సమయం ఒకటి ఉండాలి. మరి ఆ సమయం ఎలా లభిస్తుంది? డిజిటల్ డీటాక్స్‌లో దొరుకుతుంది?! చెయ్యవలసిన పనులు కొన్ని చెప్పింది వేదం. చెయ్యకూడదని పనులు కూడా కొన్ని చెప్పింది. ‘ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వొక్కడివే మేల్కొని ఉండకు’ అని వేద వచనం. ‘నిద్ర రాకపోతే నేను మాత్రం ఏం చేసేది? అయినా ఏమౌతుంది నాకు?.. శిష్యుడు అడిగాడు. గురువుగారు నవ్వారు. ‘నీకే అవుతుందని నువ్వెందుకు అనుకుంటున్నావ్?’ అన్నాడు. శిష్యుడికి అర్థంకాలేదు. ‘నిద్రపోతున్న వాళ్లకు మాత్రం ఏమౌతుంది?’ అని గురువుగారిని అడిగాడు. ‘కొన్ని ప్రశ్నలకు సమాధానం గురువు చెబుతాడు. కొన్ని ప్రశ్నలకు అనుభవం చెప్తుంది’ అన్నారు గురువుగారు. ఈ శిష్యుడు 2017 నాటి వాడు. యువకుడు. అతడు విన్న గురువేదం అతి ప్రాచీనమైనది. 1997కు ముందు నాటిది. స్మార్ట్ఫోన్లు రాని యుగంలోనిది. కనుక ‘ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వొక్కడివే మేల్కొని ఉండకు’ అని వేదం ఎందుకు చెప్పిందో అతడు ఈ జన్మకు అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం లేదు. స్మార్ట్ఫోన్లు వచ్చాక రాత్రిళ్లు ఎవరూ నిద్రపోవడం లేదు. పగళ్లు ఎవరూ మెలకువగా ఉండటం లేదు! మరెలా శిష్యుడి సందేహానికి సమాధానం లభించడం?అన్నీ అనుభవాలే చెప్తాయనేముందీ.. అవమానాలూ చెప్తాయి. పనిగట్టుకుని అవమానాలు పడటం కోసం ఉన్నపళంగా ఎక్కడికి బయల్దేరాలి? ఎక్కడికీ అక్కర్లేదు. మీ పక్కనే అవమానం పొంచి ఉంది! మీ చుట్టూ ఉన్నవాళ్లను చూడండి. వాళ్లంతా ఈ క్షణంలో ఏం చేస్తూ ఉన్నారు? తలలు వంచుకుని ఈ ప్రపంచంతో పని లేకుండా తమ స్మార్ట్ ఫోన్ టచ్స్క్రీన్లను కదిలిస్తూ ఉన్నారు కదా. కాసేపు వాళ్లందరినీ మీ కుటుంబ సభ్యులు అనుకోండి. అది రాత్రివేళ అనుకోండి. టచ్ స్క్రీన్లకు అంటుకుపోయిన వాళ్లందరినీ నిద్రపోతున్నవాళ్లు అనుకోండి. ఇప్పుడు మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ జేబులోంచి బయటికి తీసే ప్రయత్నాన్ని మానుకోండి. అంటే.. మీ కుటుంబ సభ్యులలో మీరొక్కరే మేల్కొని ఉన్నారన్నమాట. కాసేపలా.. నిలబడి ఉంటే నిలబడేఉండండి. కూర్చొని ఉంటే కూర్చొనే ఉండండి.. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా, స్మార్ట్‌ఫోన్‌లో లీనమైపోయి ఉన్నవాళ్లను డిస్టర్బ్ చేయకుండా. మీరేం చెయ్యకుండానే, మీ వల్ల.. వాళ్ల ‘నిద్ర’కు భంగం కలుగుతుంది! చికాగ్గా తలతిప్పి మీ వైపు చూస్తారు.. మీరు గానీ వాళ్లు చేస్తున్న టెక్స్టింగ్ని చూడ్డం లేదు కదా అని! దీనికి విరుగుడు.. మీ చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంచుకోవడం. అంటే మీరు కూడా ‘నిద్ర’పోవడం. అప్పుడు మీరు మీలోకంలో ఉన్నారన్న నిశ్చింతతో వాళ్లు వాళ్ల లోకంలో స్వేచ్ఛగా ‘నిద్ర’పోగలుగుతారు. పబ్లిక్‌గా పర్సనల్ విషయాలను మాట్లాడుకుంటూ, పర్సనల్ టెక్స్టింగ్ చేసుకుంటూ, పర్సనల్ ఫొటోలు, వీడియోలు చూసుకుంటూ.. ప్రైవసీని పాడుచేస్తున్నారని పక్కనున్నవాళ్లను శంకించడం ఎంత అనాగరికమో చూడండి. నిజానికి ఫ్రీడమ్‌ని కోల్పోతున్నది మనం. స్వేచ్ఛగా తల తిప్పడానికి లేకుండా! మనవైపు డిజ్గస్టింగ్ లుక్ ఇచ్చేది మాత్రం వాళ్లు. ఇలాంటి అవమానాలకు మీరేమీ చేయలేరు. ఒకవేళ మీరే ఇలా మీ పక్కవాళ్లను అవమానిస్తూ ఉంటే మాత్రం వెంటనే మీకొక డోస్ ‘డిజిటల్ డీటాక్సిఫికేషన్’ అవసరం. అది మీకు ఏ డాక్టరో ఇచ్చేది కాదు. మీకై మీరు ఇచ్చుకునేది. సింగిల్ షాట్‌తో మైండ్ క్లియర్ అయిపోతుంది. ఇంగితం వచ్చేస్తుంది. డిజిటల్ డీటాక్స్ విషరసాయనాల్ని తొలగించడం డీటాక్సిఫికేషన్. బాడీలో ఉంటే బాడీలోంచి. మైండ్‌లో ఉంటే మైండ్లోంచి! తిండి వల్ల శరీరం చెత్తకుండీగా మారినప్పుడు డీటాక్స్ చేస్తే మొత్తం శుభ్రమౌతుంది. స్మార్ట్ టెక్నాలజీవల్ల మైండ్ గందరగోళం అవుతున్నప్పుడు క్లీన్ చేసుకోడానికి కూడా ఇలాగే డీటాక్స్ అవసరం. దీన్నే డిజిటల్ డీటాక్సిఫికేషన్ అంటారు. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి కొన్ని రోజులు తిండి మానేయాలి. డిజిటల్లీ డీటాక్స్ అవడానికి కొన్నాళ్లు స్మార్ట్ ఫోన్‌ని, మిగతా స్మార్ట్ గాడ్జెట్స్‌ని పక్కన పడేయాలి. టచ్ చేస్తున్నది ఎవరు? మనుషులు ఫోన్‌ని టచ్ చేస్తున్నారో, ఫోన్లే మనుషుల్ని టచ్ చేస్తున్నాయో తెలియనంతగా డిజిటలైజ్ అయింది ప్రపంచం.We shape our tools, and thereafter our tools shape us అని అంటుండేవారట మార్షల్ మెక్లుహాన్. ఈ కెనడా ప్రొఫెసర్.. ఫిలాసఫర్, పబ్లిక్ ఇంటలెక్చువల్ కూడా. మనుషుల ప్రవర్తనల మీద పరిశోధనలు చేశారు. 1980లో చనిపోయారు. ముప్పై ఏడేళ్ల క్రితం ఏ టెక్నాలజీ లేని కాలంలోనే ‘పరికరాలను మనం మలుచుకుంటాం. తర్వాత అవి మనల్ని మలుచుకుంటాయి’ అని అన్నారంటే.. ఇప్పటి ‘స్మార్ట్’ శతాబ్దంలో ఆయన ప్రాణాలు ఎంత విలవిల్లాడేవో! ఒక్క క్షణం మీ స్మార్ట్‌ఫోన్‌ని చూడండి. డిజిటల్ టెక్నాలజీకి అది విశ్వరూపం మాత్రమే కాదు, వికృత రూపం కూడా! మనిషిదో ప్రపంచం స్మార్ట్ఫోన్లు వచ్చాక దూరంగా ఉన్న మనుషులు దగ్గరయ్యారు. దగ్గరివాళ్లు దూరమయ్యారు. ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురివీ నాలుగు ప్రపంచాలు. అబ్బాయి టెక్స్టింగ్లో ఉంటాడు. అమ్మాయి ఫేస్బుక్లో ఉంటుంది. నాన్న వాట్సాప్‌లో ఉంటాడు. అమ్మ యూట్యూబ్‌లో ఉంటుంది. నేరుగా ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా.. పెద్ద యాత్రకు సిద్ధమైనట్లే. ఇల్లు మాత్రమే ఇలా ఉందా? లోకమంతా ఇల్లులానే ఉంటోంది! పేషెంట్ బీపీ చూస్తూ, స్మార్ట్ ఫోన్ బీప్‌ల కోసం ఎదురుచూస్తుంటాడు డాక్టర్. గవర్నమెంట్ ఆఫీస్‌లలో చూడండి. పని మీద వచ్చిన మనిషిని ఎదురుగా పెట్టుకుని, ఎక్కడో ఉన్న పనిలేని మనిషి పనులన్నీ ఫోన్లోనే చేసిపెడుతుంటాడు ఆ ఎంప్లాయీ. స్మార్ట్ ఫోన్‌కు వ్యాల్యూ పెరిగాక, ఎదుటి మనిషి వాల్యూ పడిపోయింది. ఫోన్లోకి చూసుకుంటూ మనుషులతో మాట్లాడ్డం అనే ధోరణి ఎక్కువైంది. ‘ఫబింగ్’ అంటారు ఈ అవలక్షణాన్ని. మీతో మాట్లాడ్డానికి వస్తారు. ఫోన్ చూసుకుంటూనే వస్తారు. ఫోన్ చూసుకుంటూనే మాట్లాడతారు. ఫోన్ చూసుకుంటూనే వెళ్లిపోతారు. మనిషిని డిజ్రెస్పెక్ట్ చెయ్యడం ఇది. రింగ్.. వైబ్రేషన్.. టోన్ స్మార్ట్‌ఫోన్ తెచ్చిపెట్టే అష్టావక్ర లక్షణాలపై పెద్దగా పుస్తకాలేమీ రాలేదు. రాబర్ట్ సట్టన్ అనే ‘స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ ప్రొఫెసర్ ఈ మధ్య The Asshole Survival Guide: How to Deal with People Who Treat You Like Dirt అనే పుస్తకం రాశారు. అందులో ‘ఫబింగ్’పై ఓ చాప్టరే ఉంది. ఎవరి లోకంలో వాళ్లు ఉండటం మంచి విషయమే కదా.. అనే సందేహం స్మార్ట్ పర్సన్స్‌కి రావచ్చు. మంచిదే. అయితే చుట్టూ ఉన్న ప్రపంచాల మాట ఏమిటి? పని చేయవలసిన ప్రపంచం, ప్రొడక్టివిటీని సాధించవలసిన ప్రపంచం, బరువు బాధ్యతల ప్రపంచం, మానవ సంబంధాల ప్రపంచం.. వీటన్నిటినీ వదిలేసి.. కనీస మర్యాదల్ని వదిలేసి మన ప్రపంచంలో మనం ఉండిపోతే... చివరికి ఏదీ మిగలదు. ఎవరూ మిగలరు.. మానసిక అనారోగ్యాలు తప్ప. జీవితం స్మార్ట్‌గా ఉండాల్సిందే. స్మార్ట్‌గా ఉండటమే జీవితం కాకూడదు. రాని రింగ్ కోసం, రాని వైబ్రేషన్ కోసం, రాని టోన్ కోసం... మైండ్ రెండు నిమిషాలకొకసారి ఫోన్‌ని చెక్ చేసుకుంటోం దంటే డిజిటల్ డీటాక్సిఫికేషన్కి టైమ్ దగ్గరపడిందనే. కనెక్షన్ ఉన్నంతసేపూ స్మార్ట్ వరల్డ్ వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. వింత వింత లోకాల విహారం చేయిస్తుంటుంది. కనెక్షన్ కట్ అయితే అన్నీ ఒక్కసారిగా మాయమైపోయి చీకటి మాత్రమే మిగులుతుంది. ఆ చీకట్లో టెక్నాలజీ మాట్లాడలేదు. పక్కనున్న మనుషులు మాట్లాడగలరు. వెలుగు కన్నా చీకటే నయం అని చెప్పడం కాదిది. వెలుగు ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్న మనుషులు మాట్లాడుతుంటే వినడం మానొద్దని చెప్పడం. డిజిటల్ డీటాక్స్ ట్రూ అండీ! ►మనసు ప్రశాంతంగా, అలజడి లేకుండా ఉంటుంది. ►మంచి మంచి ఆలోచనలకు టైమ్ దొరుకుతుంది. ►చుట్టుపక్కల వాళ్లతో చక్కటి పరిచయాలు ఏర్పడతాయి. ►ఒకేసారి పది పనులు మీద వేసుకోవడం మానేస్తాం. ►మన ప్లానింగ్ ప్రకారం మన స్కెడ్యూల్ నడుస్తుంది. ట్రై చెయ్యండి ►తినేటప్పుడు ఫోన్‌ని దగ్గర ఉంచుకోకండి. ►‘టచ్’ ప్రపంచంలోంచి బయటికి వచ్చి, రియల్ వరల్డ్‌కి టచ్‌లో ఉండండి. ►ఎవరైనా మీ అటెన్షన్ కోరుకుంటున్నప్పుడు మీరు అటెన్షన్‌ని ఫోన్‌కి ఇవ్వకండి. ►మీలాగే డిజిటల్ డీటాక్స్లోకి వచ్చినవాళ్లను జత చేసుకోండి. ►మీ ఫోన్‌కి ఒక రోజు సెలవు ప్రకటించండి. (వ్రతభంగం జరిగినా పర్వాలేదు) -
నాటీ శ్రీవారు... ‘స్మార్టు’ జోకులు!
మొన్నటి వరకూ నా దగ్గర ఏదో మామూలు మొబైల్ ఉండేది. కానీ నా పుట్టిన రోజున మా అమ్మాయి తన సేవింగ్స్ డబ్బుతో అదేదో ‘స్మార్ట్’ ఫోనట, టచ్ స్క్రీన్ అట... కొనిచ్చింది. దాంట్లో కంప్యూటర్ అప్లికేషన్లూ, రకరకాల ఆప్స్, ఇంటర్నెట్టూ గట్రా గట్రా ఎట్సెట్రా ఉన్నాయట. కొంచెం కొత్తగా ఉన్నాయి కాబట్టి ఆ అప్లికేషన్స్ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నా. ఈలోపు మా శ్రీవారు జోకులతో తయారు. ‘‘ఏవోయ్... నీ కూతురు ఇచ్చింది కాబట్టి నువ్వంటే అన్నింటినీ వెదికి పెట్టే గూగుల్ ఉన్న కంప్యూటర్‌లాంటి మొబైల్ వాడుతున్నావ్. కానీ నాకది అక్కర్లేదు తెలుసా?’’ అన్నారు శ్రీవారు. ‘‘ఎందుకూ... మీ ప్రియమైన కొడుకు అలాందేమీ మీ బర్త్‌డేకు ఇవ్వలేదనా?’’ అంటూ ఆయన ధోరణిలోనే జవాబిచ్చా. ‘‘కాదు... పెళ్లాం అంటేనే సర్వజ్ఞురాలు. ఆమెకు ఈ లోకంలో తెలియనిదేదీ ఉండదు కదా. మొగుళ్లంటే ఏదీ తెలియని దేభ్యం గాళ్లు కాబట్టి పెళ్లాలు గూగుల్ ఉన్న ఫోన్ వాడతారు. కానీ గూగుల్ ఉన్న పెళ్లాం ఉన్న తర్వాత ఇక మొగుడికి అదెందుకు చెప్పు’’ అంటూ కొంటెగా నా మీద ఒక సెటైర్ వేశారు. అది ఆయన సొంత జోకేమీ కాదు. ఏదో మ్యాగజైన్లో చదివిందే. నన్ను ఉడికించడానికి చెప్పిన జోకే మళ్లీ చెప్పారాయన. ఉపయోగించడం కొత్త కదా. అందుకే సరిగా ఏ బటన్ నొక్కాలో తెలియక... ‘‘ఇదేమిటో స్వామీ కాస్త ఇబ్బంది పెడుతోంది. కొన్ని కమాండ్స్ సరిగా తీసుకోవడం లేదు’’ అంటూ అమాయకంగా అన్నా. మళ్లీ ఆయన దీని అడ్వాంటేజీ కూడా తీసుకున్నారు. ‘‘అదేమన్నా నీ మొగుడా... నువ్వు ఇచ్చిన కమాండ్ ఏదైనా... నీ మనసెరిగి నడుచుకోడానికి. అది కంప్యూటర్ బేస్డ్ మొబైల్. పేరుకు మొబైల్ అయినా అది నడవదు కదా. అలాగే... నీ మట్టుకు నువ్వు నీకు ఇష్టమైన కమాండ్స్ ఇచ్చినా, అదేమీ నీ సొంత మొగుడు కాదు కాబట్టీ... నీ మాట వినాల్సిన అవసరం లేదు కాబట్టీ... అదలాగే ప్రవర్తిస్తుంటుంది. అదృష్టవంతురాలు’’ అంటూ మళ్లీ ఇంకో విసురు విసిరారు. సరే... ఇలా జోకులేస్తుంటే కాసేపు చూశాను. మరికాసేపు భరించాను. ఇక అప్లికేషన్లూ, అవీ వద్దని నిర్ణయించుకుని నాకు తెలిసిన విద్యే కాబట్టీ... ఠక్కున బటన్ నొక్కేస్తే ఫొటో వచ్చేస్తుంది కాబట్టి కొన్ని సెల్ఫీలూ, కొన్ని ఫొటోలూ తీయడం మొదలుపెట్టా. ఒకటో రెండో మా ఆయనవీ తీద్దామని ప్రయత్నిస్తుండగా మళ్లీ శ్రీవారు నోరు చేసుకున్నారు. ‘‘ఏవోయ్... నా ఫొటోలు తీస్తున్నావ్... నేనంటే ఏవన్నా బోరు కొట్టిందా? పొరబాటున ఏ ‘క్వికర్’లోనో, ఏ ‘ఓఎల్ఎక్స్’లోనో నా ఫొటో పెట్టి, నన్ను అమ్మేయాలని ప్లాన్లూ గట్రా వేయడం లేదు కదా?’’ అన్నారు అల్లరి పట్టించే స్వరంతో. ‘‘అయినా ఏదో మీ ఆశ, అతి విశ్వాసమేగానీ... కొనేవారెవరైనా ఉంటారంటారా?’’ అన్నాను. అంతే... ఆ రోజు మా ఇంట మండినవి రెండు! ఒకటి గిన్నె కింది పొయ్యి, రెండోది ఆయన ఛాతీ కింది గుండె! చిత్రమేమిటంటే... వంట మాడలేదు. కానీ... ఆయన మనసు ఉడుకున్న మాడు వాసన మాత్రం నా మనసు నాసికకు తెలిసింది. - వై! -
ఫోన్ టచ్‌స్క్రీన్ మనిషిని గుర్తుపడుతుందా?
అధునాతన ఫోన్లలో టచ్ స్క్రీన్ సదుపాయాన్ని అందరం వినియోగిస్తున్నాం. అయితే ఇలాంటి స్పర్శతెరలకు సరికొత్త సదుపాయాలను అద్దుతున్నారు శాస్త్రవేత్తలు. అందులో భాగంగా ఒక స్పర్శకు మాత్రమే స్పందించే టెక్నాలజీని అభివృద్ధి పరిచారు. అంటే టచ్ చేయడాన్ని బట్టి ఆ స్పర్శతెరలు మనిషిని గుర్తిస్తాయి. ప్రతిమనిషి స్పర్శ భిన్నంగా ఉంటుంది. ఎముకల సాంద్రత, రక్తంలోని ద్రవణ స్థాయి, కండరాల బలం భిన్నస్థాయిలో ఉంటాయి. ఇవన్నీ ఒక వ్యక్తి స్పర్శను ప్రభావితం చేస్తాయి. ‘ టచీ’గా పిలిచే తెరను భిన్నమైన స్పర్శలకు అనుగుణంగా స్పందించేలా తీర్చిదిద్దుతారు. మామూలు టచీ ఏ స్పర్శకైనా స్పందించేలా తీర్చిదిద్దినది అయితే అధునాతన టచీలను ఒక సాంద్రతకే పరిమితం చేస్తారు. ఆ స్థాయిలోని స్పర్శ తగిలినప్పుడే టచీ స్పందిస్తుంది. లేకపోతే స్పందించదు. ఇలా మనిషి స్పర్శకు సెట్ అయ్యేలా స్క్రీన్ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తారు. అయితే ఈ తరహా టచ్స్క్రీన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు