ఈ ట్యాబ్‌ను చుట్టేయొచ్చు! | Scientists make a touch tablet that rolls and scrolls | Sakshi
Sakshi News home page

ఈ ట్యాబ్‌ను చుట్టేయొచ్చు!

Published Mon, Sep 3 2018 4:02 AM | Last Updated on Mon, Sep 3 2018 4:02 AM

Scientists make a touch tablet that rolls and scrolls - Sakshi

టొరంటో: పురాతన కాలంలో రాజులు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగించే వస్త్రపు రోల్స్‌ తరహాలో చుట్టేయడానికి వీలుగా ఉండే ఓ టచ్‌ స్క్రీన్‌ ట్యాబ్లెట్‌ను కెనడాలోని క్వీన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘మ్యాజిక్‌ స్క్రోల్‌’పేరిట దీనిని రూపొందించారు. సాధారణ ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉండటంతో పాటు, తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ తరహా ట్యాబ్లెట్‌ను తయారుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీనిలో త్రీడీ ప్రింటెడ్‌ సిలిండ్రికల్‌ బాడీతోపాటు రోల్‌ చేయడానికి వీలుగా ఉండే డిస్‌ప్లేను అమర్చారు. ఇక స్క్రీన్‌ను చుట్టేందుకు వీలుగా ఇరువైపులా రెండు రోటరీ చక్రాలను ఏర్పాటు చేశారు. ఈ చక్రాల్లో రోబోటిక్‌ యాక్యువేటర్స్‌ను అమర్చారు. వీటి సాయంతో స్క్రీన్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. వీటితోపాటు ఈ ట్యాబ్‌లో కెమెరాను కూడా అమర్చారు. దీనిని మరింత చిన్నగా పెన్ను మాదిరి అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రోయల్‌ వెర్టిగాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement