tablet pc
-
భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 18.4 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెండింతలకుపైగా పెరిగి 129 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. క్యూ2లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్యాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయడం, అలాగే గతేడాది ఏప్రిల్–జూన్‌లో అమ్మకాలు తక్కువగా ఉండడం 2024 జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటుకు కారణం అయింది. 2023 ఏప్రిల్–జూన్‌లో 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడయ్యాయి. ముందంజలో సామ్సంగ్..ట్యాబ్లెట్ పీసీల విపణిలో జూన్ క్వార్టర్లో 48.7 శాతం వాటాతో సామ్సంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ సెగ్మెంట్లో 54.1, కంజ్యూమర్ విభాగంలో 38 శాతం వాటాను సామ్సంగ్ సాధించింది. ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా మూడింతలై 9,01,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఏసర్ 23.6 శాతం, యాపిల్ 9.5, లెనోవో 6.9, షావొమీ 4.7 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఏసర్ అమ్మకాలు 27,000 నుంచి 4,37,000 యూనిట్లకు ఎగశాయి. యాపిల్ 12.3 శాతం వృద్ధితో 1,76,000 యూనిట్ల సేల్స్ సాధించింది. లెనోవో విక్రయాలు 2.8 శాతం క్షీణించగా, షావొమీ 85.8 శాతం దూసుకెళ్లింది. స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గతేడాదితో పోలిస్తే 178.1 శాతం పెరిగింది. డిటాచేబుల్ ట్యాబ్లెట్స్ సెగ్మెంట్ 23.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: దేశీ స్టార్టప్ పిక్సెల్కు నాసా కాంట్రాక్టు ఈ ఏడాది 20 శాతం వృద్ధి..భారత ట్యాబ్లెట్స్ మార్కెట్ 2023తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 20 శాతం వృద్ధితో 50,76,000 యూనిట్లు నమోదు చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ కంపెనీ కెనాలిస్ అంచనా వేస్తోంది. 2025లో వృద్ధి 8 శాతానికి పరిమితం అవుతుందని జోస్యం చెబుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్స్ విక్రయాలు 54,79,000 యూనిట్లను తాకుతుందని ధీమాగా ఉంది. 2024 జనవరి–మార్చిలో 13,47,000 యూనిట్ల ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయని కెనాలిస్ వెల్లడించింది. 2023 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది భారత్‌లో 11 శాతం, 2025లో 15 శాతం దూసుకెళుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, ట్యాబ్లెట్ పీసీలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–మార్చిలో 43 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. -
ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ జోరు: అదరగొట్టిన శాంసంగ్
న్యూఢిల్లీ: దేశంలో ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్‌లో 22 శాతం వృద్ధి చెందింది. 5జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి నమోదైందని సైబర్‌మీడియా రిసర్చ్ తెలిపింది.(Vu GloLED TV: క్రికెట్, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!) ‘సెప్టెంబర్ త్రైమాసికంలో శాంసంగ్ 28 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. లెనోవో 26, యాపిల్ 19 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం విక్రయాల్లో 8 అంగుళాల శ్రేణి మోడళ్ల వాటా ఏకంగా 43 శాతముంది. శామ్సంగ్ అమ్మకాలు 83 శాతం, యాపిల్ ఐప్యాడ్ 26 శాతం దూసుకెళ్లాయి. ట్యాబ్లెట్ పీసీ విపణి 2022లో 10-15 శాతం వృద్ధి సాధిస్తుంది’ అని సీఎంఆర్ వివరించింది. (భారత్ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు) -
ఈ ట్యాబ్‌ను చుట్టేయొచ్చు!
టొరంటో: పురాతన కాలంలో రాజులు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగించే వస్త్రపు రోల్స్ తరహాలో చుట్టేయడానికి వీలుగా ఉండే ఓ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్‌ను కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘మ్యాజిక్ స్క్రోల్’పేరిట దీనిని రూపొందించారు. సాధారణ ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉండటంతో పాటు, తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ తరహా ట్యాబ్లెట్‌ను తయారుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీనిలో త్రీడీ ప్రింటెడ్ సిలిండ్రికల్ బాడీతోపాటు రోల్ చేయడానికి వీలుగా ఉండే డిస్ప్లేను అమర్చారు. ఇక స్క్రీన్‌ను చుట్టేందుకు వీలుగా ఇరువైపులా రెండు రోటరీ చక్రాలను ఏర్పాటు చేశారు. ఈ చక్రాల్లో రోబోటిక్ యాక్యువేటర్స్ను అమర్చారు. వీటి సాయంతో స్క్రీన్‌ను ఆపరేట్ చేయవచ్చు. వీటితోపాటు ఈ ట్యాబ్‌లో కెమెరాను కూడా అమర్చారు. దీనిని మరింత చిన్నగా పెన్ను మాదిరి అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రోయల్ వెర్టిగాల్ తెలిపారు. -
డేటావిండ్‌కు కొత్త కష్టాలు
♦ కొన్ని నెలలుగా భారీగా తగ్గిన ఆర్డర్లు ♦ హైదరాబాద్ ప్లాంటులో పడిపోయిన ఉత్పత్తి ♦ కంపెనీని వీడిన వందలాది కార్మికులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చవక ట్యాబ్లెట్ పీసీల తయారీలో ఉన్న డేటావిండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అమ్మకాలు లేకపోవడంతో హైదరాబాద్ ఫెసిలిటీలో ఉత్పత్తిని సగానికి తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. విశ్వసనీయ సమాచారం మేరకు... తయారీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. తాజా పరిస్థితులతో కంపెనీ పెద్ద ఎత్తున కార్మికులకు ఉద్వాసన పలికింది. హైదరాబాద్‌కు విడిభాగాలు రావాల్సి ఉందని, వాటి కోసం చూస్తున్నామని, అమృత్సర్ ప్లాంటులో యధావిధిగా ఉత్పత్తి కొనసాగుతోందని కంపెనీ వెల్లడించింది. అయితే ఆర్డర్లు లేక కంపెనీ సమస్యల్లో చిక్కుకుందని, ఆరు నెలల కిందటి నుంచే హైదరాబాద్ ప్లాంటు కార్మికులు ఒక్కొక్కరుగా కంపెనీని వీడుతున్నారని తెలియవచ్చింది. గత రెండు త్రైమాసికాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి స్వయంగా వెల్లడించారు. వర్కింగ్ క్యాపిటల్పైనా దీని ప్రభావం ఉందన్నారు. అయితే ఉద్వాసనకు గురైన 200 మందికిపైగా కార్మికులు తెలంగాణ కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆర్.చంద్రశేఖరంను కలిసి న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతానని కమిషనర్ వారికి తెలిపారు. మరోవంక డేటావిండ్ మాత్రం ‘‘ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా శంషాబాద్ ప్లాంటు స్థలాన్ని ఖాళీ చేయాలని జీఎంఆర్ యాజమాన్యం మమ్మల్ని కోరింది. దీంతో ప్లాంటును సికింద్రాబాద్‌కు మార్చాలనుకుని, ఆ విషయాన్ని కార్మికులకు చెప్పాం. కార్మికుల్లో అత్యధికులు శంషాబాద్ చుట్టుపక్కల వారు కావటంతో మారటం ఇష్టం లేక విధ్వంసం సృష్టించారు. వారిని తొలగించాం. వారే సమస్యను సృష్టించారు’’ అని వివరించింది. కాగా ఒకదశలో 400 మంది వరకు పనిచేసిన ఈ ప్లాంటులో ప్రస్తుతం 15 మందిలోపే ఉన్నారు. -
స్వైప్ టెక్నాలజీ ‘మేకిన్ ఇండియా’
జనవరిలో తొలి ఉత్పాదన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టెక్నాలజీ కంపెనీ స్వైప్ టెక్నాలజీస్ పుణే సమీపంలో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది. ఆరు అసెంబ్లింగ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రంలో ట్యాబ్లెట్ పీసీలతోపాటు స్మార్ట్ఫోన్లను రూపొందిస్తారు. తయారీ, మార్కెటింగ్‌కుగాను వచ్చే రెండేళ్లలో కంపెనీ రూ.130 కోట్లు ఖర్చు చేస్తోంది. మేకిన్ ఇండియా తొలి ఉత్పాదన జనవరి 1న ఆవిష్కరిస్తామని స్వైప్ వ్యవస్థాపకులు శ్రీపాల్ గాంధీ తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఎలీట్-2 మోడల్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాగా4జీ స్మార్ట్‌ఫోన్ ఎలీట్-2 ధర రూ.4,666. ఫ్లిప్‌కార్ట్‌లో నవంబరు 8 నుంచి లభిస్తుంది. -
మాస్టార్ల మేలుకొలుపు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయనేది బహిరంగ రహస్యమే. రూ.ఐదు వేల నగదు, వెండి గ్లాసులు, బంగారు ఉంగరాలు, టాబ్లెట్ పీసీలు, సెల్ఫోన్లు, వగైరాలతో కొందరి మాస్టార్ల ఓట్లు అంగట్లో సరుకులుగా మారిపోయాయి. బహిరంగ మార్కెట్లో వేలం మాదిరిగా ఉపాధ్యాయుల ఓట్ల విక్రయాలు బాహాటంగానే జరిగిపోతున్నాయి. అయితే, ఎన్ని తాయిలాలు ఇచ్చినా.. ఎంత డబ్బు పంచినా గెలుపు మీద నమ్మకం లేని కార్పొరేట్ శక్తులు చివరకు ఉపాధ్యాయులను బెదిరింపులకు గురి చేస్తున్నాయట. అధికార పార్టీ బహిరంగ మద్దతుతో హల్చల్ చేస్తున్న ఓ అభ్యర్థి తరఫు అనుచరులు ప్రచారంలో చివరి అంకంగా దాదాగిరీని ఎంచుకున్నారట. ముందు నోట్లకట్టలు విచ్చలవిడిగా పంచిన సదరు అభ్యర్థి అనుచరులు చివర్లో ‘మీరు ఓట్లు వేయకుంటే అంతే సంగతులు’ అని మాస్టార్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంటున్నారు. ‘ప్రభుత్వం మాదే. పొరపాటున మేం కాకుండా ఎవరైనా గెలిచారా. మీ అందరి జాతకాలు మావద్ద ఉన్నాయి. ఒక్కొక్కరి అంతు తేలుస్తాం’ అని రెండురోజుల నుంచి నేరుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సొమ్ములు పంచుతున్నారన్న మరక తమతోపాటు బరిలో ఉన్న అందరికీ అంటించాలన్న దురుద్దేశంతో ప్రత్యర్ధుల తరఫు కూడా కొంతమందికి సదరు అభ్యర్థి నోట్లు పంచారట. ‘పోటీ లో ఉన్న ఫలానా మాస్టారు పంపించా రు. ఇతరుల మాదిరి ఎక్కువ ఇచ్చుకోలేక వెయ్యితో సర్దుకోమన్నారు’ అంటూ కొంతమందికి రూ.వెయ్యి నోట్లు పంచారట. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇన్ని జిమ్మిక్కులు.. ఇన్ని చిల్లర వేషాలు చూడలేదని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారంటే ప్రలోభాలు, బెదిరింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రభు త్వ విద్యారంగాన్ని కాపాడటం కోసం కార్పొరేట్ శక్తులు రూ.కోట్లు ఖర్చుచేసి ఓట్లు దండుకోవాల్సిన అవసరం ఏముం ది? ఈ రోజు ఓటు హక్కు వినియోగించే ఉపాధ్యాయుల్లో ఈ ఒక్క ప్రశ్న ఉదయిస్తే చాలు. డబ్బుతో గెలుపు గుర్రం మీద స్వారీ చేయొచ్చని విర్రవీగుతున్న కార్పొరేట్ శక్తుల ఆశలు తలకిందులవుతాయి. మరి మాస్టార్లు ఏ మేరకు విజ్ఞత చూపిస్తారో చూడాల్సిందే.! ‘అంబికా’ కథ అంతేనా ఎమ్మెల్సీ ఆశలు గల్లంతు అంబికా కృష్ణ రాజకీయ భవితవ్యం ఓ విధంగా ప్రశ్నార్థకంగానే తయారైంది. వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఆయన ముద్ర ఏలూరు నగరం మీద ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే పవర్లో ఉంటేనే ఎవరికైనా విలువ. కానీ ఇప్పుడు ఆ ‘పవర్’ ఆయనతో దోబూచులాడుతోంది. గత ఎన్నికల సమయాన సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో బడేటి బుజ్జికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో టీడీపీ వాణిజ్య సెల్ నాయకుడి హోదాలో రాష్ట్రమంతటా పర్యటించి తన సామాజికవర్గ ఓటర్లను టీడీపీ వైపు మళ్లించేందుకు ఆయన శక్తిమేర ప్రయత్నించారు. నందమూరి బాలకృష్ణ ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో కూడా వీరభద్ర వంటి భారీ సిని మా తీసిన నేపథ్యం ఉండటంతో బాలయ్య మద్దతు అంబికా కృష్ణకే ఉంటుందని ఆశిం చారు. అటు పార్టీకి చేసిన సేవ.. ఇటు బాలయ్య మద్దతు నేపథ్యంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానంతనదేనని అంబికా కృష్ణ ధీ మాగా ఉన్నారు. కానీ సరిగ్గా ఎమ్మె ల్సీ కేటాయింపుల వేళ ఈయనకు ఆశాభంగమే మిగిలింది. నమ్మిన వారికి మేలు చేయని, ఆశించిన వారి కి అందలం ఎక్కించని బాబు వ్యవహార శైలితో అంబికా కృష్ణ కంగుతిన్నారు. అసంతృప్తి ఉన్నా ఇప్పటికిప్పుడు బయటపడితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు. కార్పొరేషన్ పదవుల పందేరంలోనైనా తనకు సముచిత స్థానం దక్కుతుందన్న ఆశతో చివరకు తనను తానే ఊరడించుకున్నారని అంటున్నారు. అంటే అప్పటివరకు అంబికా కృష్ణ ముందున్న కర్తవ్యం.. వేచి వేచి.. చూసి చూసి...! పచ్చచొక్కాల సేవలో పౌర సంబంధాల శాఖ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అధికారుల పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలియజేయడం.. వెరసి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమాచార వారధిగా పనిచేయడం పౌర సంబంధాల శాఖ అధికారుల విధి. కానీ జిల్లా పౌర సంబంధాల శాఖలోని కొందరు మాత్రం టీడీపీ కార్యకర్తల మాదిరి పనిచేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన ఓ ఘటనే. ఈ మధ్యనే జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమ కవరేజీని భుజానకెత్తుకున్న సమాచార శాఖ అధికారి ఒకరు పత్రికల వారికి ఫోన్‌చేసి ‘ఫలానా నాయకుడి ఇంట్లో శుభకార్యం జరిగింది. ఫొటోలు పంపిస్తున్నాం. బాగా కవర్ చేయండి’ అని సిఫార్సు చేశారు. ‘అదేంటి.. ఆ కార్యక్రమ కవరేజికి మీకు ఏం సంబం ధం. వాళ్ల ఫొటోగ్రాఫర్లు, వ్యక్తిగత సిబ్బంది ఉంటారు కదా’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే.. ‘అబ్బే ఊరకే ఫోన్ చేశాను. మీ ఇష్టం’ అంటూ ఫోన్ పెట్టేశారు. ఇదండీ మన పశ్చిమ పౌర సంబంధాల శాఖ అధికారుల పనితనం. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
ట్యాబ్లెట్స్‌కి స్మార్ట్ఫోన్ల దెబ్బ
న్యూఢిల్లీ: పెద్ద స్క్రీన్లతో వస్తున్న స్మార్ట్ఫోన్లు (ఫాబ్లెట్స్) .. ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లు, టూ ఇన్ వన్ల అమ్మకాలు 3.9 శాతం మాత్రమే పెరిగాయి. 5.04 కోట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రీసెర్చ్ సంస్థ ఐడీసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్రితం త్రైమాసికంతో పోలిస్తే ట్యాబ్లెట్లు, టూ ఇన్ వన్ల (డిటాచబుల్ కీబోర్డులతో కూడిన ట్యాబ్లెట్స్) విక్రయాలు 35.7 శాతం క్షీణించాయి. 2013 క్యూ1తో పోలిస్తే 3.9 శాతం మాత్రమే పెరిగాయి. అప్పట్లో ట్యాబ్లెట్స్ అమ్మకాలు 4.86 కోట్లు. ఆపరేటింగ్ సిస్టమ్‌లు, స్క్రీన్ సైజులు అంటూ తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ విక్రయాలు మందగించాయని, రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని ఐడీసీ తెలిపింది. యాపిల్, అసూస్, అమెజాన్ వంటి కంపెనీల అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది. ఫ్యాబ్లెట్లు 5-7 అంగుళాల స్క్రీన్‌తో ఉంటున్నాయి. పెద్ద స్క్రీన్ ఫోన్ల అమ్మకాలు పెరుగుతుండటం, ఇప్పటికే ట్యాబ్లెట్స్ తీసుకున్న వారు మళ్లీ కొత్తవి తీసుకోకుండా పాతవాటితోనే సర్దుకుపోతుండటం కూడా ట్యాబ్లెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయని ఐడీసీ ప్రోగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ (డివెజైస్ అండ్ డిస్ప్లేస్) టామ్ మైనెలి తెలిపారు. మిగతా కంపెనీలతో పోలిస్తే యాపిల్ అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ.. కంపెనీ ట్యాబ్లెట్ల అమ్మకాలు 1.95 కోట్ల నుంచి 1.64 కోట్లకు తగ్గిపోయాయి. మార్కెట్ వాటా కూడా 40.2 శాతం నుంచి 32.5 శాతానికి పడిపోయింది. మరోవైపు, శాంసంగ్ మాత్రం తన వాటాను 17.5% నుంచి 22.3%కి పెంచుకోగలిగింది. అమ్మకాలు 85 లక్షల నుంచి 1.12 కోట్లకు పెరిగాయి. దాదాపు మూడింట రెండొంతల వాటాతో ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆండ్రాయిడ్ ఆధిపత్యం కొనసాగుతుండగా, విండోస్ డివైజ్‌లు కూడా పుంజుకుంటున్నాయని ఐడీసీ రీసెర్చ్ అనలిస్ట్ జితేష్ ఉబ్రాని తెలిపారు. -
వాట్స్‌యాప్ యూజర్లు @ 50 కోట్లు
న్యూఢిలీ: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్(యాప్) యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అధిగమించింది. ముఖ్యంగా భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్సా వంటి వర్ధమాన దేశాల నుంచి గత కొద్ది నెలలుగా వినియోగదారుల్లో పటిష్టమైన వృద్ధి ఇందుకు దోహదం చేసినట్లు వాట్స్‌యాప్ పేర్కొంది. ఉక్రెయిన్‌కు చెందిన జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ అనే అమెరికన్ కలిసి 2009లో ఈ యాప్ సేవలను ఆరంభించారు. మొబైల్స్, ట్యాబ్లెట్ పీసీలద్వారా సులువుగా మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న వాట్స్యాప్కు అనతికాలంలో విశేష ప్రాచుర్యం లభించింది. దీంతో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 19 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.1.15 లక్షల కోట్లు) భారీ మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రతిరోజూ యూజర్లు 70 కోట్ల ఫొటోలు, 10 కోట్ల వీడియోలను షేర్ చేసుకుంటున్నట్లు వాట్స్‌యాప్ తెలిపింది. -
క్లౌడ్, మొబైల్స్... నాణేనికి చెరోవైపు
న్యూయార్క్: మొబైల్, క్లౌడ్ టెక్నాలజీ అనేవి నాణేనికి రెండు పార్శ్వాల్లాంటివని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తద్వారా కంపెనీ భవిష్యత్తులో దేనిపై అత్యధికంగా దృష్టిసారించనుందనే సంకేతాలిచ్చారు. భారత్‌కు చెందిన సత్య... మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చేసిన బహిరంగ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘క్లౌడ్, మొబైల్ అనేవి రెండూ విభిన్నమైనవని నేను భావించడం లేదు. ఒకే నాణేనికి ఇవి రెండు పార్శ్వాలు. మనం ఎక్కడున్నా సమాచారాన్ని(డేటా) తగినట్లుగా వాడుకోవడానికి క్లౌడ్ ఆవిర్భవించింది. క్లౌడ్ సదుపాయం లేని మొబైల్స్ కచ్చితంగా ఆనాసక్తికరంగానే ఉంటాయి. మొబైల్స్‌లో క్లౌడ్ లేకపోవడం అంటే కొంత పరిమితి కిందకు వస్తుంది. అదే మొబల్స్ లేకుండా క్లౌడ్ అనేది సామర్థ్యాన్ని వినియోగించుకోకపోవడం కిందే లెక్క. అందుకే ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందనేది నా అభిప్రాయం’ అని సత్య వ్యాఖ్యానించారు. ఒకచోట నిక్షిప్తంచేసిన సర్వర్లలోని ఫొటోలు, ఇతరత్రా డేటాను మనం ఎక్కడున్నాసరే మొబైల్స్, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను ఉపయోగించుకొని వాడుకునేలా(యాక్సెస్) వీలుకల్పించేదే క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీ. ప్రతి డివైజ్‌లో కూడా అత్యుత్తమ క్లౌడ్ కనెక్టివిటీని అందించడంపై మేం పూర్తిగా దృష్టికేంద్రీకరించామని కూడా నాదెళ్ల పేర్కొన్నారు. మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ ఇలా డివైజ్‌లు ఏవైనా సరే అవలీలగా కనెక్ట్ అయ్యేందుకు, సమాచారాన్ని పంచుకునేందుకు క్లౌడ్ దోహదం చేస్తుందని హైదరాబాదీ సత్య నాదెళ్ల వివరించారు. కౌడ్ ద్వారా ఈ డివైజ్‌లన్నీ జీవితంలో భాగమవుతున్నాయని, ప్రజలను అనుసంధానం చేస్తోందన్నారు. ట్యాబ్లెట్లు మరింత ఉపయోగకర, శక్తిమంతమైన డివైజ్‌లుగా మారేందుకు కూడా క్లౌడే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. యాపిల్ ట్యాబ్లెట్లకు ఆఫీస్ సూట్... యాపిల్ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీల కోసం రూపొందించిన ఆఫీస్ సూట్‌ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఆఫీస్ 375 సాఫ్ట్వేర్ సబ్స్క్రయిబర్లు తమ యాపిల్ ఐప్యాడ్లలో కూడా ఇకపై వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్‌లను వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మొబైల్ యాప్స్‌పై మైక్రోసాఫ్ట్ మరింత దృష్టిసారిస్తోందనడానికి ఇదే నిదర్శనం. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఆఫీస్ యాప్స్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా, సీఈఓగా సత్య నాదెళ్ల ప్రవేశపెట్టిన తొలి ప్రధాన ప్రొడక్ట్‌గా ఇది నిలిచింది. అదేవిధంగా ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం ఉచిత ఆఫీస్ మొబైల్‌ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. -
డిసెంబరుకల్లా స్పైస్ బడ్డీప్యాడ్ ట్యాబ్లెట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీరంగ కంపెనీ ఎస్ మొబిలిటీ డిసెంబరుకల్లా స్పైస్ బడ్డీప్యాడ్(మీ-721) ట్యాబ్లెట్ పీసీని ఆవిష్కరించనుంది. ధర రూ.10 వేల లోపు ఉండే అవకాశం ఉంది. స్పైస్ క్లౌడ్ అప్లికేషన్‌ను ఇందులో పొందుపరిచారు. ఈ అప్లికేషన్ కలిగిన ఉపకరణంలో ఉన్న సమాచారాన్ని మరో ఉపకరణం నుంచి స్వీకరించవచ్చు. నియంత్రించవచ్చు కూడా. కాల్స్ వివరాలను చూడవచ్చు. 2జీబీ వరకు సమాచారాన్ని క్లౌడ్‌లో పొందుపర్చవచ్చు. ఉపకరణం దొంగతనానికి గురైతే అందులో ఉన్న సమాచారాన్ని తొలగించవచ్చు. ఈ సేవల కోసం స్పైస్‌క్లౌడ్.ఇన్ వెబ్సైట్లో కస్టమర్లు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. స్పైస్ క్లౌడ్ ఫీచర్‌ను స్మార్ట్ఫోన్లలోనూ కంపెనీ అందిస్తోంది. కాగా, మీ-721 ఆన్‌డ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 17.78 సెంటీమీటర్ల స్క్రీన్, 1.2 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ రామ్, 512 ఎంబీ ర్యామ్, 2జీ కాలింగ్, వైఫై తదితర ఫీచర్లున్నాయి. 3జీ డాంగిల్ సపోర్ట్ చేస్తుంది. తొలి ప్రాధాన్యత.. దేశంలో మొత్తం సెల్ఫోన్ల అమ్మకాల్లో స్మార్ట్ఫోన్ల వాటా ప్రస్తుతం 10 శాతం ఉంది. అందుబాటు ధరలో ఎక్కువ ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లను అందించాలన్నదే తమ లక్ష్యమని ఎస్ మొబిలిటీ స్మార్ట్‌ఫోన్స్ విభాగం హెడ్ రోహన్ కురియన్ అన్నారు. స్మార్ట్ ఫ్లో ఎడ్జ్ మోడల్‌ను మంగళవారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో స్మార్ట్ఫోన్లే తమ తొలి ప్రాధాన్యత అని అన్నారు. -
ఇంటికో మొబైల్ విద్యార్థికో ట్యాబ్లెట్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఊపిరి సలపని రీతిలో వరా లు గుప్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గ్రా మాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు ఇటీవలే ఆహార భద్రత బిల్లు తెచ్చిన ప్రభుత్వం... మరింత మంది గ్రామీణులకు గాలం వేసేందుకు ‘ఇంటికో మొబైల్ ఫోన్, విద్యార్థికో ట్యాబ్లెట్ పీసీ’ నినాదాన్ని ముం దుకు తెస్తోంది. గ్రామాల్లో నివసిస్తున్న 2.5 కోట్ల మందికి మొబైల్ ఫోన్లను, ప్రభుత్వ స్కూళ్లలో 11, 12 తరగతులు చదువుతున్న 90 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లెట్ పీసీలను ఉచితంగా అందించే పథకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు టెలికామ్ విభాగంలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థయిన టెలికామ్ కమిషన్‌కు ఒక నోట్‌ను పంపింది. ఇది టెలికామ్ కమిషన్ ఆమోదం పొందితే కేబినెట్‌కు వెళ్తుంది. అక్కడ ఆమోదిస్తే... 2014 మార్చి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అంటే...సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు! ఈ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ల పథకానికయ్యే మొత్తం ఖర్చు రూ.10వేల కోట్లు. మొబైల్ ఫోన్లతో పాటు వాటికి సిమ్ కార్డులు, ఏటా రూ.360 చొప్పున రెండేళ్ల పాటు ఉచిత రీఛార్జి కూడా అందించాలన్నది ప్రతిపాదన. ఈ ప్యాకేజీలో 30 నిమిషాల టాక్‌టైమ్, 30 ఎస్ఎంఎస్లు, 30 మెగాబైట్ల వరకూ ఇంటర్నెట్ కూడా కలిసి ఉంటుంది. ట్యాబ్లెట్లతో పాటు కూడా సిమ్ అందజేస్తారు. కొన్నాళ్లపాటు 500 మెగాబైట్ల ఇంటర్నెట్, రూ.75 విలువైన టాక్‌టైమ్, 75 ఎస్ఎంఎస్లు ఉచితంగా అందజేస్తారు. బీఎస్ఎన్ఎల్ ద్వారా అమలు: భారత్‌లో మొబైల్ వాడకందార్ల సంఖ్య 90 కోట్ల పైనే. చైనా తరవాత ఇక్కడే ఎక్కువ. ప్రభుత్వ వర్గాల సమాచారం మేర కు... ఈ ట్యాబ్లెట్ పీసీ పథకానికయ్యే 4,972 కోట్లను టెలికాం విభాగం, యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) కలిసి 40:60 నిష్పత్తిలో భరిస్తాయి. ఇక మొబైల్ ఫోన్ల పథకానికొస్తే వీటిని ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులకు అందజేస్తారని, దీనివల్ల ప్రభుత్వంపై రూ.4,850 కోట్ల భారం పడుతుందని సమాచారం. పథకాన్ని మొదలుపెట్టేది 2014 మార్చిలోనే అయి నా... ఫోన్ల కేటాయింపు పూర్తి చేయడానికి మాత్రం ఆరేళ్లు పడుతుంది. తుది వ్యయమనేది బిడ్డింగ్ ప్రకియపై ఆధారపడి ఉంటుంది. ‘ఈ పథకాన్ని ప్రభుత్వ నిర్వహణలోని బీఎస్ఎన్ఎల్ అమలు చేస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్ల కోం బిడ్డింగ్ ప్రక్రియను అదే నిర్వహిస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్లను మూడేళ్ల వారెంటీతో సహా అందజేస్తాం. ట్యాబ్లెట్లను తొలి దశలో 15 లక్షలు, రెండో దశలో 35 లక్షలు, మూడో దశలో 45 లక్షల చొప్పున మూడు దశల్లో అందజేస్తాం. ఫోన్లను మాత్రం 25 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు, కోటి చొప్పున నాలుగు దశల్లో అందజేస్తాం’ అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.