డిసెంబరుకల్లా స్పైస్ బడ్డీప్యాడ్ ట్యాబ్లెట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీరంగ కంపెనీ ఎస్ మొబిలిటీ డిసెంబరుకల్లా స్పైస్ బడ్డీప్యాడ్(మీ-721) ట్యాబ్లెట్ పీసీని ఆవిష్కరించనుంది. ధర రూ.10 వేల లోపు ఉండే అవకాశం ఉంది. స్పైస్ క్లౌడ్ అప్లికేషన్‌ను ఇందులో పొందుపరిచారు. ఈ అప్లికేషన్ కలిగిన ఉపకరణంలో ఉన్న సమాచారాన్ని మరో ఉపకరణం నుంచి స్వీకరించవచ్చు. నియంత్రించవచ్చు కూడా. కాల్స్ వివరాలను చూడవచ్చు. 2జీబీ వరకు సమాచారాన్ని క్లౌడ్‌లో పొందుపర్చవచ్చు. ఉపకరణం దొంగతనానికి గురైతే అందులో ఉన్న సమాచారాన్ని తొలగించవచ్చు. ఈ సేవల కోసం స్పైస్‌క్లౌడ్.ఇన్ వెబ్‌సైట్‌లో కస్టమర్లు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. స్పైస్ క్లౌడ్ ఫీచర్‌ను స్మార్ట్‌ఫోన్లలోనూ కంపెనీ అందిస్తోంది. కాగా, మీ-721 ఆన్‌డ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 17.78 సెంటీమీటర్ల స్క్రీన్, 1.2 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ రామ్, 512 ఎంబీ ర్యామ్, 2జీ కాలింగ్, వైఫై తదితర ఫీచర్లున్నాయి. 3జీ డాంగిల్ సపోర్ట్ చేస్తుంది.
తొలి ప్రాధాన్యత..
దేశంలో మొత్తం సెల్‌ఫోన్ల అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్ల వాటా ప్రస్తుతం 10 శాతం ఉంది. అందుబాటు ధరలో ఎక్కువ ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్లను అందించాలన్నదే తమ లక్ష్యమని ఎస్ మొబిలిటీ స్మార్ట్‌ఫోన్స్ విభాగం హెడ్ రోహన్ కురియన్ అన్నారు. స్మార్ట్ ఫ్లో ఎడ్జ్ మోడల్‌ను మంగళవారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్లే తమ తొలి ప్రాధాన్యత అని అన్నారు.