rolls
-
ఆ రైళ్లలో బెడ్‌రోల్స్ లేవు...
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు నడిపే స్పెషల్ రైళ్లలో బెడ్‌రోల్స్‌కు కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉన్న బెడ్ రోల్స్ సంఖ్య, వాటిని శుభ్రపరిచి తిరిగి అందించే లాండ్రీల సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడటమే దీనికి కారణం. రెగ్యులర్ రైళ్లు, సంవత్సరం పొడవునా నిర్వహించే సాధారణ స్పెషల్ రైళ్లకు ఇవి సరిపోతుండగా, ఉన్నట్టుండి వచ్చే రద్దీ ఆధారంగా నడిపే స్పెషల్ రైళ్లకు ఈ సమస్య ఏర్పడుతోంది. ఐదు రోజుల వరుస సెలవులతో.. పంద్రాగస్టు నేపథ్యంలో గురువారం దేశవ్యాప్త సెలవు ఉంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దీంతో రాకపోకలు బాగా పెరుగుతాయి. శనివారం వారాంతం కావటంతోపాటు ఆదివారం పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో శనివారం ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉండనుంది. ఆదివారం ఎలాగూ సెలవు, ఆ రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి. సోమవారం రాఖీ పౌర్ణమి.. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో.. మరిన్ని స్పెషల్ రైళ్లు నడపాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 15 మంది పార్లమెంటు సభ్యులు విన్నప లేఖలు పంపారు. ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ వచ్చి0ది. దీంతో అందుబాటులో రేక్స్ తక్కువగా ఉండటంతో.. కొన్ని స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. స్పెషల్ రైళ్లు ఇవే.. 18న నర్సాపూర్–సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్–నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ–తిరుపతి మధ్య వీటిని నడుపుతున్నారు. వీటన్నింటిలో ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వాటిల్లోని ప్రయాణికులకు బెడ్‌రోల్స్‌ను సర్దుబాటు చేయలేమని నిర్ణయించుకున్న దక్షిణ మధ్య రైల్వే, బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లలో బెడ్ రోల్స్‌ను సరఫరా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రయాణికులే సొంత ఏర్పాట్లతో రావాలన్నది దాని పరోక్ష సారాంశం. -
టేస్టీగా పొటాటో స్టఫ్ చపాతీలు చేసుకోండిలా..!
కావలసినవి: బంగాళదుంపలు – 2 (తొక్క తీసి, తురుముకోవాలి) గోధుమ పిండి – 2 కప్పులు (కొద్దిగా నూనె ఉప్పు వేసుకుని.. గోరువెచ్చని నీళ్లతో చపాతీ ముద్దలా చేసుకుని.. మూత పెట్టుకుని, 15 నిమిషాలు పక్కన పెట్టుకుని, కాస్త పెద్దగా, చతురస్రాకారంలో చపాతీల్లా ఒత్తుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు కారం, ఉప్పు, పసుపు – తగినంత నూనె – సరిపడా తయారీ విధానం: బంగాళదుంప తురుమును, మూడు లేదా నాలుగు కప్పుల నీళ్లల్లో 3 నిమిషాల పాటు ఉడికించి.. నీళ్లన్నీ పోయేవరకు వడకట్టులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి.. అందులో బంగాళదుంప తురుము వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత.. కారం, ఉప్పు, పసుపు కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక చపాతీపై కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని.. మరో చపాతీతో కప్పి.. గుండ్రటి చిన్న ప్లేట్‌ని దానిపై వేసి గట్టిగా ఒత్తాలి. అనంతరం ప్లేట్ చుట్టూ ఉన్న చపాతీని తొలిగించి.. ఆ గుండ్రటి చపాతీలను నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి ఈ చపాతీలు. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
ఎంతో టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ రోల్స్ చేసుకోండి ఇలా!
మీల్ మేకర్ రోల్స్ కావలసినవి: చపాతీలు– 5 (గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీలు చేసుకుని, వేయించి పక్కన పెట్టుకోవాలి) మీల్ మేకర్ – 2 కప్పులు (ముందుగా వేడినీళ్లలో వేసుకుని కాసేపు ఉంచి.. నీళ్లు వాడిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 నిమిషం పాటు అటూ ఇటూగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి) క్యాప్సికమ్, టొమాటో– 2 చొప్పున (ముక్కలు కట్ చేసుకోవాలి) ఉల్లిపాయలు– 2 (సగం గార్నిష్‌కి), పచ్చిమిర్చి– 4 (చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి) బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున, పసుపు – చిటికెడు, టొమాటో కెచప్ – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా నూనెలో సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేగించి.. అందులో పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, మీల్ మేకర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుని కూరలా దగ్గరపడే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, టొమాటో కెచప్ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా కాల్చిన చపాతీలలో.. ఓవైపు ఈ కర్రీ వేసుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలతో వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. (చదవండి: వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!) -
బ్రెడ్డులో పిసరంత షుగర్.. కోర్టు వద్దంది
డబ్లిన్: మనిషికి ఎల్లవేళలా రుచికరమైన ఆహారమే ప్రీతికరమైంది. తర్వాతే మిగతా పనీ పాట. ‘ఏం చేసినా దీని కోసమే కదా గురూ’ అని టైమ్‌కి క్యారేజ్‌ను ఓపెన్ చేసే పని సంస్కృతి బహుశా ఒక్క ఇండియాదే కాకపోవచ్చు. క్యారేజ్‌లు లేనివాళ్లకు నడిచి వెళ్తే ‘సబ్ వే’లు, నడవడం చేతకాకపోతే స్విగ్గీలు ఎలాగూ ఉంటాయి. ఏమైనా ప్రపంచ ప్రజలకు వేళకు తిండిపై ధ్యాస పెరిగి, ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతోంది! పౌరులపై పౌరులకు శ్రద్ధ తగ్గినప్పుడు ఆ శ్రద్ధ బాధ్యతను కూడా ప్రభుత్వాలే కదా తిండి మానేసైనా తీసుకోవలసింది. మన దేశంలోనే చూడండి.. తినే వాటి విషయంలో ముఖ్యమైనవేమీ మనం పట్టించుకోము కదా.. ప్రభుత్వం పట్టించుకుంది. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ లేకుండా చిన్న స్వీట్ ముక్కను కూడా అమ్మడానికి లేదని ఈ ఫస్ట్ నుంచి చట్టాన్ని తెచ్చింది. అలా ప్రజల ఆరోగ్య భద్రతను తన మీద కొంత ఉంచుకుని, మిగతా కొంత అమ్మేవాళ్ల మీద పెట్టింది. పౌరుల షుగర్ విషయంలో ఐర్లాండ్ ప్రభుత్వం మనకన్నా మరికాస్త శ్రద్ధగా ఉంది. అమెరికన్ తినుబండారాల గొలుసు కంపెనీ ‘సబ్ వే’ విక్రయిస్తున్న బ్రెడ్డులో పిసరంత షుగర్ ఎక్కువైందని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కోర్టు తక్కిన కేసులన్నీ పక్కకు నెట్టేసి సబ్ వే బ్రెడ్డు కేసును విచారించింది. పిసరంతే కదా అని తినేవాళ్లు అనుకోవచ్చు. సుప్రీంకోర్టుకు ఆ పిసరంత టూ మచ్ అనిపించింది. ‘చక్కెర పాళ్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది ముఖ్య ఆహారం (స్టేపుల్ ఫుడ్) అవదు. ముఖ్య ఆహారం కాదు కనుక దీనికి జీరో పర్సెంట్ వ్యాట్ వర్తించదు’ అని తీర్పు ఇచ్చింది. దీనర్థం ఏమిటి? ఆ బ్రెడ్డు తినకపోయినా ఆత్మారాముడు ఏమీ హర్ట్ అవడు, తిని షుగర్ తెచ్చుకుని తిప్పలు పడకండి అని చెప్పడం. చెబితే పౌరులు వినడం లేదు కాబట్టి.. షుగర్ తగ్గించకపోతే వ్యాట్ పడుతుంది జాగ్రత్త అని ‘సబ్ వే’ ను కోర్టు వారి ద్వారా లైన్లో పెట్టించింది ఐర్లాండ్ ప్రభుత్వం. -
ఈ ట్యాబ్‌ను చుట్టేయొచ్చు!
టొరంటో: పురాతన కాలంలో రాజులు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగించే వస్త్రపు రోల్స్ తరహాలో చుట్టేయడానికి వీలుగా ఉండే ఓ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్‌ను కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘మ్యాజిక్ స్క్రోల్’పేరిట దీనిని రూపొందించారు. సాధారణ ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉండటంతో పాటు, తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ తరహా ట్యాబ్లెట్‌ను తయారుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీనిలో త్రీడీ ప్రింటెడ్ సిలిండ్రికల్ బాడీతోపాటు రోల్ చేయడానికి వీలుగా ఉండే డిస్ప్లేను అమర్చారు. ఇక స్క్రీన్‌ను చుట్టేందుకు వీలుగా ఇరువైపులా రెండు రోటరీ చక్రాలను ఏర్పాటు చేశారు. ఈ చక్రాల్లో రోబోటిక్ యాక్యువేటర్స్ను అమర్చారు. వీటి సాయంతో స్క్రీన్‌ను ఆపరేట్ చేయవచ్చు. వీటితోపాటు ఈ ట్యాబ్‌లో కెమెరాను కూడా అమర్చారు. దీనిని మరింత చిన్నగా పెన్ను మాదిరి అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రోయల్ వెర్టిగాల్ తెలిపారు. -
నీటి ట్యాంకర్ బోల్తా
హిందూపురం అర్బన్ : పట్టణంలోని పులమతి రోడ్డు గంగమ్మ గుడి వెనుక 10వ వార్డులో ఆదివారం నీటి ట్యాంకర్ బోల్తా పడింది. వార్డులో రోడ్డు, డ్రైన్లు లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తమై ఒక్కసారిగా పక్కకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం జేసీబీ యంత్రాన్ని తీసుకువచ్చి ట్యాంకర్‌ను సరి చేసి రోడ్డుపైకి తీసుకువచ్చారు. రోడ్లు సరిగా వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
బీరు లారీ బోల్తా..మందు బాబులు పండుగ
హైదరాబాద్: నగరంలోని మందు బాబులు పండుగ చేసుకున్నారు. మండుటెండలతో అల్లాడుతున్న మందుప్రియులు ఫ్రీగా బీరు బాటిల్స్‌ను ఎత్తుకుపోయి ఎంజాయ్ చేసిన ఘటన మూసాపేటలో చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మూసాపేట ఫ్లైఓవర్‌పై బీరు లోడుతో వెళ్తున లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. డ్రైవర్ రాంగ్రూట్లో రివర్స్ చూస్తుండగా అదుపుతప్పి లారీ కింద పడింది. దీంతో లారీలోని బీరు బాటిల్స్ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. ఇదే అదునుగా భావించిన మందు బాబులు లారీలోని బీరు బాటిల్స్‌ను భారీగా ఎత్తుకుపోయారు. ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఫ్లై ఓవర్‌పై లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. నలుగురికి గాయాలు
ఇబ్రహీంపట్నం రూరల్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జాతీయ రహదారిపై తుమ్మలపాలెం వద్ద అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. నలుగురు స్వల్పంగా గాయపడగా, మిగతవారు సురక్షితంగా బయటపడ్డారు. -
అయ్యో ‘రామా’
రామయ్య దర్శనం కోసం కొందరు.. పీజీ పరీక్ష కోసం మరికొందరు.. పొట్టచేత పట్టుకొని ఇంకొందరు..ఇలా వేర్వేరు పనుల నిమిత్తం భద్రాచలం బయలుదేరారు. ‘రామబాణం’ ఎక్కితే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న ఉద్దేశంతో ఆ బస్సునే ఎక్కారు. అదే బస్సు తమ మృత్యువుకు కారణమవుతుందని ఊహించలేకపోయూరు. మరో మూడు నిమిషాల్లో భద్రాద్రి చేరుకుంటామనగా లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు..‘రామబాణం’ దిశను మార్చేసింది. అంతే గోదావరి అప్రోచ్‌రోడ్డు పైనుంచి మూడు పల్టీలు కొట్టి సుమారు 40 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. 46 మంది ప్రయూణిస్తున్న బస్సులో ఇద్దరు మృతిచెందగా 26 మంది తీవ్రగాయూలపాలయ్యూరు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, రక్తపు మరకలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది. ♦ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా ♦ గోదావరి అప్రోచ్‌రోడ్డుపై నుంచి పల్టీలు ♦ ఇద్దరు మృతి.. 26 మందికి తీవ్రగాయాలు ♦ ఆరుగురి పరిస్థితి విషమం.. ♦ సారపాక వద్ద భద్రాచలం రోడ్డుపై ఘటన ♦ ఘటనాస్థలికి హుటాహుటిన మంత్రులు, ఖమ్మం ఎంపీ బూర్గంపాడు: ఖమ్మం నుంచి గురువారం ఉదయం భద్రాచలం బయలుదేరిన ‘రామబాణం’ బస్సు మరో మూడునిమిషాల్లో గమ్యంస్థానం చేరుకుంటుందనగా ప్రమాదం ముంచుకొచ్చింది. అందులోని ప్రయూణికులను భయకంపితులను చేసింది. బస్సు పల్టీలు కొడుతూ గోదావరి అప్రోచ్‌రోడ్ పైనుంచి 40 అడుగుల లోతులో పడిపోయింది. ఏమి జరిగిందో తెలుసుకునేలోపే బస్సులో ఉన్నవారంతా చావుబతుకుల మధ్య రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్రగాయూలతో వారు చేసిన ఆర్తనాదాలు గోదారి తీరాన్ని దుఃఖసాగరంలో ముంచేశాయి. భద్రాచలం నుంచి సారపాక వైపునకు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి సిమెంట్ పోల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. మృతులు..క్షతగాత్రులు ఈ ఘటనలో దుమ్ముగూడెం మండలం సింగారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రావణి (30) బస్సులోనే మృతిచెందింది. ఆమెతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ఆమె భర్త లక్ష్మీనారాయణ, పిల్లలు శ్రావణ్‌కుమార్, గాయత్రికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో గాయత్రి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంకు రిఫర్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన శ్రావణి ఆమె భర్త లక్ష్మీనారాయణ దుమ్ముగూడెం మండలం సింగారం వచ్చి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. కళ్లముందే భార్య మృతిచెందటంతో లక్ష్మీనారాయణ కన్నీరుమున్నీరయ్యూడు. పిల్లలిద్దరికీ తీవ్రగాయాలు కావటంతో వారిని వెంటనే 108 వాహనంలో భద్రాచలం తరలించారు. లక్ష్మీనారాయణ మాత్రం భార్య మృతదేహాన్ని బస్సులోంచి వెలికి తీసేంత వరకు అక్కడే రోదిస్తూ కూర్చున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బస్సుడ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లు(45) కూడా మృతిచెందాడు. తీవ్రగాయాలైన డ్రైవర్ వెంకటేశ్వర్లును భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమచికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. గుంటూరుకు చెందిన గడియారం గంగాధర్, తోట చందు, కొత్తగూడెంకు చెందిన సబీరా, బత్తుల విజయలక్ష్మి, రవి, వాణి, దమ్మపేటకు చెందిన తాటి తిరుపతమ్మ, కోదాడ వాసి మాజేటి అనురాధ, జశ్వంత్, సాయిసుమంత్, నల్లగొండ జిల్లా మోతెకు చెందిన వృద్ధురాలు సక్కుబాయమ్మ, వరంగల్ జిల్లా కొరవి మండలానికి చెందిన మాలోతు కిషన్, గుంటూరుకు చెందిన హర్షిత, సాహిత్య, టేకులపల్లి మండలవాసి జె. అరుణ, కొత్తగూడెంకు సమీపంలోని నెల్లిపాకకు చెందిన మందా పద్మ, టేకులపల్లికి చెందిన ధరావత్ హర్యా, భద్రాచలానికి చెందిన ముత్యాల సుబ్రహ్మణ్యం, కొత్తగూడెం మండలం అంజనాపురం వాసి భూక్యా దివ్యభారతి, ఆమె భర్త మోహన్‌రావు, పిల్లలు ప్రణవి, రాజా, సీతంపేట బంజర గ్రామానికి చెందిన లావుడ్యా రాజు, శేఖరంబంజరకు చెందిన ఇస్లావత్ రమేష్ (బస్సు కండక్టర్) తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. వీరిలో రవి, వాణి, పద్మ, డి.హస్లీ, గాయత్రిలను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, హైదరాబాద్‌కు తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రులు, ఎంపీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రవాణశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత పరిశీలించారు. భద్రాచలం ఏరియూ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. తక్షణమే స్పందించిన పోలీసుశాఖ భద్రాచలం, కొత్తగూడెం పోలీస్ డివిజన్ అధికారులంతా హుటాహుటిన ఘటనాప్రాంతానికి చేరుకున్నారు. సమీపంలోని ఇసుకక్వారీలో పనిచేస్తున్న కూలీలు కూడా అక్కడకు చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. కొత్తగూడెం ఓఎస్డీ జోయల్ డేవిస్, భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, ట్రైనీ ఐపీఎస్ అధికారి విష్ణు ఎస్ వారియర్, కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు, భద్రాచలం సీఐ సారంగపాణి, ఎస్ఐలు మురళి, ఎంవీ రామారావు క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హర్ష సేఫ్... బస్సు బోల్తాపడిన ఘటనలో రాధారపు హర్షవర్ధన్ అనే చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఇదే బస్సులో ఉన్న అతని తల్లిదండ్రులు స్వల్ప గాయూలతో బయటపడ్డారు. క్షతగాత్రులందర్నీ స్థానికులు, పోలీసుసిబ్బంది బయటకు తీశారు. హర్షవర్దన్మాత్రం బస్సులో ఇరుక్కుపోయి ఏడుస్తున్నాడు. అతనికి ఏమి జరిగిందోనని బయట తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు. ఇనుపరాడ్ల సహాయంతో బస్సురేకులను తొలగించి క్షేమంగా హర్షవర్దన్‌ను బయటకు తీయడంతో బాలుడితో పాటు అతని తల్లిదండ్రులు రాజేశ్వరి, యూలాద్రి ఊపిరిపీల్చుకున్నారు. - బూర్గంపాడు -
ఆర్టీసీ బస్సు బోల్తా
ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదం 3 పల్టీలు కొట్టి 40 అడుగుల లోతులో పడిన బస్సు బూర్గంపాడు: ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు(రామబాణం) బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు వద్ద గురువారం అదుపుతప్పి బోల్తా పడింది. అప్రోచ్‌రోడ్ పైనుంచి మూడు పల్టీలు కొట్టి సుమారు 40 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తోపాటు ఓ మహిళ మృతి చెందగా 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. భద్రాచలం నుంచి సారపాక వైపునకు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి ఓ ఫెన్సింగ్ పోల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఘటనాస్థలం క్షతగాత్రుల రోదనలతో విషాదమయమైంది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో దుమ్ముగూడెం మండలం సింగారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రావణి బస్సులోనే మృతి చెందింది. ఆమె భర్త లక్ష్మీనారాయణ, పిల్లలు శ్రావణ్‌కుమార్, గాయత్రికి కూడా తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. క్షతగాత్రుల్లో రవి, వాణి, పద్మ, డి.హస్లీ, గాయత్రి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, హైదరాబాద్‌లకు తరలించారు. ఘటనా స్థలిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించారు. అంతకుముందుగా భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు కూడా బాధితులను పరామర్శించడంతో పాటు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా
తల్లి, కుమార్తె మృతి, 10 మందికి గాయాలు కోస్గీ(కర్నూలు జిల్లా): పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్‌ను డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో బోల్తాపడింది. ఈఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా కోస్గీ మండలం దొడ్డ బెడగల్ గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా వలకలదిన్నెకు చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్లో వస్తుండగా బోల్తాపడింది. ఈ ఘటనలో తల్లి కూతురు వెంకమ్మ(40), దుల్లమ్మ(10) అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా ట్రాక్టర్లో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన స్థానికులు గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు.