కావలసినవి:
బంగాళదుంపలు – 2 (తొక్క తీసి, తురుముకోవాలి)
గోధుమ పిండి – 2 కప్పులు (కొద్దిగా నూనె ఉప్పు వేసుకుని.. గోరువెచ్చని నీళ్లతో చపాతీ ముద్దలా చేసుకుని.. మూత పెట్టుకుని, 15 నిమిషాలు పక్కన పెట్టుకుని, కాస్త పెద్దగా, చతురస్రాకారంలో చపాతీల్లా ఒత్తుకోవాలి)
ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు
కారం, ఉప్పు, పసుపు – తగినంత
నూనె – సరిపడా
తయారీ విధానం: బంగాళదుంప తురుమును, మూడు లేదా నాలుగు కప్పుల నీళ్లల్లో 3 నిమిషాల పాటు ఉడికించి.. నీళ్లన్నీ పోయేవరకు వడకట్టులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి.. అందులో బంగాళదుంప తురుము వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత.. కారం, ఉప్పు, పసుపు కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక చపాతీపై కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని.. మరో చపాతీతో కప్పి.. గుండ్రటి చిన్న ప్లేట్‌ని దానిపై వేసి గట్టిగా ఒత్తాలి. అనంతరం ప్లేట్ చుట్టూ ఉన్న చపాతీని తొలిగించి.. ఆ గుండ్రటి చపాతీలను నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి ఈ చపాతీలు.
(చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!)
Comments
Please login to add a commentAdd a comment