కావలసినవి: చికెన్ – అర కిలో ; నిమ్మకాయ– ఒకటి ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; ఉప్పు – రెండు టీ స్పూన్‌లు లేదా రుచికి తగినట్లు.
మసాలా కోసం: బాదం – పది ; పిస్తా – పది ; చిరోంజి– 2 టీ స్పూన్‌లు ; పచ్చిమిర్చి– 3 ; దాల్చిన చెక్క– అర అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఏలకులు –4 ; మిరియాలు – అర టీ స్పూన్.
గ్రేవీ కోసం: నూనె– 3 టేబుల్ స్పూన్‌లు ; నెయ్యి – 2 టీ స్పూన్‌లు ; పెరుగు– పావు కప్పు ; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (వేయించాలి) ; టొమాటో పేస్ట్ – అర కప్పు ; రెడ్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్‌లు ; గ్రీన్ చిల్లీ సాస్ – టేబుల్ స్పూన్; షాజీరా– టీ స్పూన్ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; వేయించిన జీలకర్ర పొడి – టీ స్పూన్ ; కశ్మీర్‌మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; కొత్తిమీర తరుగు – కప్పు ; తాజా మీగడ– 2 టేబుల్ స్పూన్‌లు.
తయారీ:
► చికెన్‌ను శుభ్రం చేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలపాలి.
► మందపాటి బాణలిలో మసాలా దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీలో తగినంత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.
► ఈ మసాలా పేస్టును చికెన్‌కు పట్టించాలి. అందులో నూనె, నెయ్యి, మీగడ మినహా గ్రేవీ కోసం తీసుకున్న అన్నింటినీ వేసి కలిపి రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.
► బాణలిలో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఫ్రిజ్‌లో నుంచి తీసిన చికెన్‌ను వేసి మీడియం మంట మీద అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల సేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మీగడ వేసి దించేయాలి. గ్రేవీ చిక్కదనం చూసుకుని అవసరమనిపిస్తే మరిగించిన నీటిని తగినన్ని పోసి కలుపుకోవాలి. నోరూరించే తెలంగాణ రెడ్ చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, బగారా రైస్‌లకు మంచి కాంబినేషన్. (క్లిక్ చేయండి: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..)
Comments
Please login to add a commentAdd a comment